Saturday, 2 September 2023

ఏడుపాయల సొమ్ము తరలింపుపై విచారణ చేయాలిజిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసిన పీసీసీ నేతలు సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణ*

 *ఏడుపాయల సొమ్ము తరలింపుపై విచారణ చేయాలి*

*జిల్లాలోని ఒక పెద్ద మనిషి అండదండలతోనే ఈ చౌర్యం*

*మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలి*

*జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసిన పీసీసీ నేతలు సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణ*



మెదక్

ఏడుపాయల వనదుర్గామాతా ఆలయానికి సంబంధించిన మూడు కిలోల పైగా బంగారం, నగదును ఈఓ శ్రీనివాస్ అక్రమంగా తరలించడం వెనుక అధికార పార్టీ పెద్ద మనుషుల ప్రమేయముందని పీసీసీ నేతలు చౌదరి సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణ ఆరోపించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రోహిణీ ప్రియదర్శినికి వినతి పత్రం సమర్పించి సమగ్రమైన విచారణ జరిపించాలని కోరారు. అనంతరం వారు విలేఖర్లతో మాట్లాడుతూ ఏడుపాయలలో ఎమ్మెల్యే మనుషుల పెత్తనం పెరిగిపోయిందని ఆరోపించారు. కాంట్రాక్టుల విషయం దాటి ఏకంగా ఏడుపాయల బంగారం, నగదును ఒక చోటు నుండి మరో చోటుకు రాత్రి వేళ తరలిస్తూ కనిపించడం చాలా అనుమానాలకు తావిస్తోందన్నారు. స్వయంగా ఏడుపాయల ఈఓ శ్రీనివాస్ మాటల్లో దేవన్న అనే సంబోధన ఉందని, దేవన్న అంటే ఎవరో మంత్రి హరీష్ రావు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. మంత్రి హరీష్ రావు పెత్తనంతో మెదక్ లో అభివృద్ది కుంటుపడి, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఎమ్మెల్యే ఆస్తులు ఇలా దొంగదారిన పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో సరైన విచారణ జరిపించి ఏడుపాయల ఆస్తులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా St సెల్ అధ్యక్షులు గోవర్ధన్, జిల్లా Sc అధ్యక్షులు అశోక్ నాయక్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, డాకి స్వామి, అక్బర్ భాయ్,  నాగిరెడ్డి, మెదక్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు భరత్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ సల్మాన్, కొండా సంజీవ్, విక్కీ, బచారం క్రిష్ణ, విట్టల్ నాయక్, చందర్ నాయక్, నవీన్ చౌదరి, జాకీర్, నవీన్ మాడూర్, రాంచంధర్, చందు, రవి, నాగేందర్, సంపత్, జయంత్ రవితేజ, చింటూ, ప్రకాష్, జాకార్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment