Wednesday, 27 September 2023

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!


 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!



 నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.


Comments

vn బుక్కా శ్రీనివాస్ (ప్రియ గోల్డ్ అయిల్ ) వారి సహకారముతో తిరుపతి రైల్వే స్టేషన్ లో వికలాంగుల మరియు వృద్దుల సౌకర్యార్ధమై ఎనిమిది వీల్ చైర్స్

 *వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యములో మన IEC ఆఫీసర్  vn బుక్కా శ్రీనివాస్ (ప్రియ గోల్డ్ అయిల్ ) వారి సహకారముతో తిరుపతి రైల్వే స్టేషన్ లో వికలాంగుల మరియు వృద్దుల సౌకర్యార్ధమై  ఎనిమిది వీల్ చైర్స్


 వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ vn  ఇరుకుల్ల రామకృష్ణ గారు గుంతకల్లు డివిజన్ రైల్వే డైరెక్టర్ సత్యనారాయణ  గారి ద్వార తిరుపతి రైల్వే స్టేషన్ కు అందించడమైనది*

ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలో కాంగ్రెస్ గెలుపు టి పి సి సి కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి



 కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరు

* రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం

* ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలో కాంగ్రెస్ గెలుపు


టి పి సి సి కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి


పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఇక కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టిపిసిసి కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ మండల పరిధిలోని ఆయా గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక రాజీవ్ భవన్ లో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్ గ్రాఫ్ పడిపోతుందని తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మటం లేదన్నారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని మోసపూరిత వాగ్దానాలు ప్రకటించిన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించి బుద్ధి చెప్తారని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు పథకాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిందని ప్రజలందరూ కాంగ్రెస్ వైఫై ఉన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 70 నుంచి 80 స్థానాలు గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఉందని ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్ మరిన్ని స్థానానికి గెలిచే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన అవుతుందని మిర్యాలగూడ టికెట్ ఎవరికీ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రాష్ట్రస్థాయిలో సర్వేలు, అభ్యర్థి బలాబలాలు, పార్టీకి విధేయత, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అయిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు  సైనికులుగా పని చేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పొదిలా వెంకన్న, ఎండి సలీం, మెడ సురేందర్ రెడ్డి, బక్కా రెడ్డి, తలకొప్పుల సైదులు, హరి ప్రసాద్, ఎం ఏ అరిఫ్, బసవయ్య గౌడ్, ఎండి ఇమ్రాన్, మెరుగు శ్రీనివాస్, నర్సింగ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం బజార్ విగ్నేశ్వరుడికి *నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు 30000 రూపాయలు* విరాళము ఇచ్చినారు




శ్రీ శ్రీ శ్రీ గణేష్ వినాయక నవరాత్రోత్సవాల  సందర్భంగా డాక్టర్స్ లైన్స్ ప్రకాశం బజార్  విగ్నేశ్వరుడికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు 30000 రూపాయలు చందా ఇచ్చినారుఇట్టి చందాను ప్రకాశం బజార్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గడాలే జయప్రకాష్, మిర్యాల మహేష్ ,ఆంజనేయులు గారు కమిటీ సభ్యులు బి.జయప్రకాష్ ,మిర్యాల దేవేందర్,  బిక్షం, అశోక్, దేవేందర్,సాయి గారికీ అందజేసినారు. ఇంతకుముందు  ఇదే గణేష్ కి 1 లక్ష రూపాయలు  విరాళం ఇచ్చినారు.



Tuesday, 26 September 2023

ప్రకాశం బజార్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం





 నల్లగొండ పట్టణం ప్రకాశం బజార్ లోని గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగినది ఇట్టి కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ సమితి సభ్యుడు జయప్రకాశ్ మిర్యాల మహేష్ వారిని సత్కరించినారు తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన భూపాల్ రెడ్డి సమితి సభ్యులు పాల్గొన్నారు

Monday, 25 September 2023

వైశ్య ఘర్జన ఆహ్వానించిన కాచం సత్యనారాయణ

 తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మాజీ చైర్మన్ , రెండు తెలుగు రాష్ట్రాల IVF అద్యక్షులు  శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారిని  మహాసభ కార్యదర్శి , వైశ్య ఘర్జన నిర్హకులు  కాచం సత్యనారాయణగారుఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి  అధ్యక్షులు ఫ్రేం గాంధీ గారు కలిసి  వైశ్య ఘర్జన కు ఆహ్వానించనైనది


.

  వికాస వేదిక ప్రధాన కార్యదర్శి నంగునూరి రమేశ్ గారు వికాస వేదిక గౌ : సలహాదారులు బుక్కా ఈశ్వరయ్య గారు, వికాస వేదిక సభ్యులు కొదుమూరి  దయాకర్ గారు గజవాడి సతీష్ గారు ఉన్నారు.

Sunday, 24 September 2023

చిన్న పత్రికల బిల్లుల విడుదలకు మంత్రి హరీష్ రావు అంగీకారం

 చిన్న పత్రికల బిల్లుల విడుదలకు మంత్రి హరీష్ రావు అంగీకారం





హైదరాబాద్ : ఏడాది కాలంగా 

చిన్న పత్రికల బిల్లుల విడుదలలో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ చిన్న, మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం ఆధ్వర్యంలో 

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తేగా అందుకు స్పందించారు. సోమవారం నానక్ రాంగూడలోని మంత్రి క్యాoపు కార్యాలయoలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బిల్లుల విడుదలలో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో చిన్న పత్రికల నిర్వహణ కష్టతరంగా మారిందని తెలంగాణ చిన్న, మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి దాస్, గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్ అలీ, ప్రజాస్వామ్యం ఎడిటర్, సీనియర్ నాయకులు వెన్నమళ్ల రమేష్ బాబులు మంత్రి హరీష్ రావు దృష్టికి తెచ్చారు. అందుకు స్పందించిన మంత్రి హరీష్ రావు చిన్న పత్రికల బిల్లులన్నింటిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. గత ఏడాది జూన్ నెల నుంచి ఇప్పటి వరకు గల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొమర్రాజు శ్రీనివాస్, నల్లగొండ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కోటగిరి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మక్సూద్ అహ్మద్, సభ్యులు వీరెల్లి వెంకటరమణ  తదితరులు పాల్గొన్నారు.

Saturday, 23 September 2023

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు ఏర్పాట్లు - సీఈఓ వికాస్ రాజ్


        తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. వచ్చే నెల 3, 4, 5 తేదీలలో తెలంగాణ జిల్లాల్లో ఈసీ టీమ్ పర్యటిస్తుందని చెప్పారు. జనవరి నుంచి ఇప్పటివరకూ కొత్తగా 15 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చామని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. ఎన్నికలకు తాము ఏర్పాటు చేస్తున్నామని, అయితే ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ఖరారు చేస్తుందన్నారు.

            రాష్ట్రంలో కొత్త ఓటర్లలో 18, 19 వయసు ఉన్న యువ ఓటర్లు 6.99 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చామన్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల నమోదుపై ఫోకస్ చేశామన్నారు. థర్డ్ జెండర్ లను, 80 ఏళ్లు పైబడిన వృద్ధులను, పీడబ్ల్యూడీలను గుర్తిస్తున్నామని చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు పీడబ్ల్యూడీలను లక్ష మందికి పైగా ఇటీవల గుర్తించినట్లు తెలిపారు. ఇంటి నుంచి ఓటింగ్ వేసే వారిని గుర్తించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈసీ అధికారులు, పరిశీలకులు త్వరలో జిల్లాల్లో పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో, కలెక్టర్లు, ఎస్పీలతో, సీఎస్ తో ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. 

                తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే నిర్ణీత సమయానికి ఎన్నికల షెడ్యూల్ రాకపోతే, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు ఇదివరకే మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు అక్టోబర్ 3 తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈసీ టీమ్ రాష్ట్రానికి రానుంది. త్వరలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఇందులో భాగంగానే సీఈసీ తెలంగాణలో తాత్కాలిక పర్యటన తేదీలను రాష్ట్ర అధికారులకు పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా నుంచి పోలింగ్ కేంద్రాలు, పోలీసు బందోబస్తు, బోగస్‌ ఓటర్ల ఏరివేతపై పనిచేస్తున్నారు. జనవరి నుంచి కొత్తగా 15 లక్షల ఓటర్లు నమోదు కాగా, 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ శనివారం తెలిపారు. 

                రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ సిరీస్ తో 13 నుంచి 14 అంకెలతో ఉన్న ఓటరు గుర్తింపు కార్డులను అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఓటరు కార్డు  సంఖ్య 10 అంకెలకు తగ్గించడం తెలిసిందే. రాష్ట్రంలోని 47 లక్షల 22 వేల మంది ఓటర్ల కార్డు నంబర్లు మారగా, నూతన ఫొటో ఓటరు కార్డులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని కొత్త కార్డులను పొందవచ్చు అని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. కోటి మందికి ప్రయోజనం

    : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి ముందే భారీ గిఫ్ట్ రానుంది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి డీఏ పెంపు 3 శాతం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు.  

         ఈ ఏడాది రెండో డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న తరుణంలో గుడ్‌న్యూస్ తెరపైకి వస్తోంది. దీపావళి గిఫ్ట్‌గా డీఏ పెంపు ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. దీపావళికి ముందుకు డీఏ పెంపు ఉంటుందని చెబుతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. 47.58 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, సుమారు 69.76 లక్షల మంది పెన్షనర్లు సహా కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.

        కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏను సవరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరంలో మొదటి సవరణ మార్చి 24న జరిగింది. 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది.  ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చేలా జనవరి 1 నుంచి అమలులోకి  తీసుకువచ్చింది. ఈసారి కూడా 4 శాతం డీఏను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈసారి 3 శాతం డీఏ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వెలువడినా.. జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. 

        డీఏ పెంపుదలలు ద్రవ్యోల్బణం రేట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే.. ఉద్యోగులు డీఏ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) డేటా ఆధారంగా ప్రతి జనవరి 1, జూలై 1న కేంద్ర ఉద్యోగులకు డీఏను సవరిస్తారు. జూలై 2023లో CPI-IW 3.3 పాయింట్లు పెరిగి 139.7కి చేరుకుంది. ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 0.90 శాతం ఎక్కువ పెరిగింది.

            నివేదిక ప్రకారం కేం


ద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంచితే.. అది 45 శాతానికి చేరుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.18 వేలు అనుకుంటే.. ప్రస్తుతం 42 శాతం డీఏ ప్రకారం అది రూ.7,560. మూడు శాతం పెంపుతో అది రూ.8,100 అవుతుంది. ఫలితంగా జీతం రూ.540 పెరుగుతుంది. గరిష్టంగా రూ. 56,900 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ప్రస్తుత డీఏ రూ.23,898 కాగా.. అది 3 శాతంతో రూ. 25,605కి పెరుగుతుంది.

వైశ్య గర్జనకు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మినారాయణ ఆహ్వానం కాచం సత్యనారాయణ

 అక్టోబర్ 1 న జరుగబోయే వైశ్య గర్జనకు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు  అమరవాది లక్ష్మినారాయణ గారికి   ఆహ్వానం అందిస్తున్నా  రాష్ట్ర మహాసభ   కార్యదర్శి, వికాస వేదిక చైర్మన్, వైశ్య ఘర్జన నిర్వాహకులు కాచం సత్యనారాయణ


గారు... మరియు వికాస వేదిక సభ్యులు......

Friday, 22 September 2023

బి అర్ ఎస్ పార్టీకి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

 బి అర్ ఎస్ పార్టీకి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా


భారత రాష్ట్ర సమితి పార్టీకి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా భారత రాష్ట్ర సమితి పార్టీకి దూరంగా ఉంటున్న మైనంపల్లి హనుమంతరావు… ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు.

తాను భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నానని… కార్యకర్తలు మరియు సన్నిహితుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు మైనంపల్లి హనుమంతరావు.త్వరలోనే మరో పార్టీలో చేరుతానని… ఆ పార్టీని త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

            కాగా మల్కాజ్గిరి టికెట్ ను మైనంపల్లి హనుమంతరావు కు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి కూడా మెదక్ టికెట్ కావాలని మైనంపల్లి హనుమంతరావు డిమాండ్ చేశారు.కానీ భారత రాష్ట్ర సమితి అధిష్టానం… మైనoపల్లి హనుమంతరావుకు మాత్రమే టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి హనుమంతరావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక తాజాగా భారత రాష్ట్ర సమితి పార్టీకి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు

Thursday, 21 September 2023

*ఏసీబీ జడ్జి* : గారి పేరు బొక్కా సత్య వెంకట హిమబిందు

 *ఏసీబీ జడ్జి* :  గారి పేరు బొక్కా సత్య వెంకట హిమబిందు గారు


, వయస్సు 50 సంవత్సరాలు. సొంత ఊరు బొక్కా వారి పాలెం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా. Cast: గౌడ సామాజిక వర్గం, Sub Cast: శెట్టి బలిజ(కల్లు గీత కార్మిక కులం). తండ్రి చంద్రశేఖర్ Lawer వృత్తి. న్యాయవాద వృత్తిలో కంటే కూడా Notary Work లో చాలా Busy గా ఉంటాడు.

ఈ కుటుంబం రాజకీయాలకు చాలా ఆమడ దూరంలో ఉంటుంది. ఆ ఊరిలో పెద్ద మనుషులు గా అందరి మన్ననలు పొందే కుటుంబం. హిమబిందు గారు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా(Law) పట్ట పొందారు. 1996లో హైకోర్టు బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నారు. జడ్జి ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అయ్యి 2016లో అమలాపురంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిగా పోస్టింగ్ తీసుకున్నారు. అక్కడి నుంచి వైజాగ్ కి ట్రాన్స్ఫర్ అయి CBI Court lo Pricipal Special Judge గా Work చేసారు. 18-04-23 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వారు ఆమె ను Vijayawada కి ట్రాన్స్ఫర్ చేసి ఆమెకు మూడు పదవి బాధ్యతలు అప్పగించారు (1) CBI Court Judge (సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారాలకు సంబంధించిన) (2) ACB Court Judge(రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహారాలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టాన్ని అమలు చేయడం) (3) 3వ  Additional District And Sessions Judge గా  నియమించారు. ఆమె ఎవరి ప్రలోభాలకు గురికాకుండా న్యాయ దేవత పుత్రికగా తన తీర్పులు ఇస్తుంది. విజయవాడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయవాదులు హిమబిందు గారి ఇంటికి వెళ్లి కొంచెం రచ్చలు చేశారు. హౌస్ మోషన్ వెయ్యమని డిమాండ్ చేశారు. ఆమె వారికి ఒక్కటే మాట చెప్పింది. రిమాండ్ రిపోర్ట్ లేకుండా హౌస్ మోషన్ వెయ్యను అని చెప్పింది. రిమాండ్ రిపోర్ట్ వచ్చిన మరుక్షణమే మీరు హౌస్ మోషన్ కి అప్లై చేసుకోవచ్చు అని నిజాయితీగా చెప్పింది. చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూద్ర వారి న్యాయవాదులు 15 మంది కంటే ఎక్కువ ఉండరాదు, అలాగే ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కి సంబంధించిన న్యాయవాదులు 15 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి... న్యాయ దేవతను నమ్మే నల్ల కోటు ధరించే మనము పోలీసులతో చెప్పించు కునే పని ఉండకూడదు అని గౌరవంగా విన్నవించి ఆ విధంగా మిగతా వారందరినీ కోర్ట్ హాల్ నుంచి బయటికి పంపించి వేసింది. ఆమె నిజాయితీగా నిక్కచ్చిగా కఠి నాతి కఠినంగా తీర్పులు చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి. తెలుగుదేశం నాయకులు అవగాహన రాహిత్యం తో ఆమె జగన్ మాటలు వింటుంది అని ప్రచారం చేశారు. కానీ ఆమెకు సంబంధించిన ప్రమోషన్ లు, బదిలీలు ఇంక్రి మెంట్లు, ఉద్యోగ నియామకాలు అన్ని హైకోర్టుకు సంబంధించి ఉంటాయి. ఆమె ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆమె ను Judge గా విజయవాడ కు మార్చారు.  చంద్రబాబునాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గాని నియమించలేదు. ఆమె చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3వ  Additional District And Sessions Judge గా పని చేసారు. ఆమె చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రత్యేక గా న్యాయ దేవత ముద్దు బిడ్డగా మన్నన లు పొందిన వ్యక్తి. ఆమెను చూసి తెలుగువారు గర్వపడాలి ఎటువంటి రాగద్వేషాలకు గురికాకుండా తీర్పులు చెప్పింది. ఎవ్వరి ప్రలోభాలకు ఎప్పుడూ గురి కాలేదు. చట్టాన్ని రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ధర్మాన్ని పాటించింది. నిర్భయంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా దేశ చరిత్రలో ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చిన ఒక వీర వనితగా చరిత్ర కు ఎక్కింది.  ఆమె ఇచ్చిన తీర్పులను తర్వాత కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అణువణువునా పరిశీలిస్తారు. చట్టంలో ఉండే సెక్షన్ల ను రాజ్యాంగంలో ఉండే అధికరణాలు ను అలాగే అవినీతి నిరోధక శాఖ కు సంబంధించిన చట్టాలు, నియమాలు కు లోబడి ఆమె తీర్పులు ఉంటాయి. ఈ రోజున సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఆమె ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండవచ్చు 14 సంవత్సరాలు పని చేసి ఉండవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో సంవత్సరాలు పని చేసి ఉండవచ్చు, NDA Convener గా దేశ రాజకీయాలను చక్రం తిప్పి ఉండవచ్చు కానీ చట్టం న్యాయం ధర్మం సెక్షన్ల ప్రకారం ఆమె తీర్పు ఇచ్చినందుకు భారతదేశ ప్రజలందరూ గర్వపడుతున్నారు. భర్త ఆంధ్రప్రదేశ్లో గెజిటెడ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. చెల్లెలు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి హైదరాబాదులో మంచి Software కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అక్క చెల్లెలు ఇద్దరు మాత్రమే.

Tuesday, 19 September 2023

450 పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి,

        


 న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్-2023 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 450 అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలని RBI లక్ష్యంగా పెట్టుకుంది. RBI అసిస్టెంట్ 2023 ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 21, 23 తేదీలలో షెడ్యూల్ చేయబడింది. ప్రధాన పరీక్ష డిసెంబర్ 2న జరిగే అవకాశం ఉంది. అర్హత: భారతదేశ పౌరుడు లేదా నేపాల్, భూటాన్, లేదా జనవరి 1, 1962కి ముందు భారతదేశానికి వచ్చిన టిబెటన్ శరణార్థి అయిన అభ్యర్థి ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాకిస్థాన్, బర్మా, శ్రీలంక, తూర్పు ఆఫ్రికా దేశాలైన కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా, మలావి, జైర్, ఇథియోపియా, వియత్నాం నుంచి వలస వచ్చిన భారతీయ సంతతి వ్యక్తి కూడా భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశ్యంతో దరఖాస్తు చేసుకోవచ్చు. DSC: రేపట్నుంచి డీఎస్సీ అప్లికషన్లు, టీఆర్టీ రోస్టర్ విడుదల: నెల రోజులే గడువు Powered By PauseUnmute Loaded: 8.44% Fullscreen అయితే, అటువంటి అభ్యర్థుల విషయంలో, భారత ప్రభుత్వం జారీ చేసిన అర్హత సర్టిఫికేట్ అవసరం. వయో పరిమితి: సెప్టెంబర్ 1 నాటికి కనీసం 20 ఏళ్లు, 28 ఏళ్లు మించని అభ్యర్థులు, అంటే సెప్టెంబర్ 2, 1995 కంటే ముందు, సెప్టెంబర్ 1, 2003 తర్వాత జన్మించని అభ్యర్థులు, ఈ రెండు తేదీలతో సహా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. LIC: ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు మోడీ సర్కారు గుడ్‌న్యూస్ కనీస విద్యార్హత: దరఖాస్తుదారులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2023 నాటికి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. SC, ST, PwD అభ్యర్థుల విషయంలో, కనీస మార్కుల అవసరం లేదు కానీ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మాజీ సైనికులకు, కనీస అవసరం గ్రాడ్యుయేషన్ లేదా మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన పరీక్ష, కనీసం 15 సంవత్సరాల రక్షణ సేవ చేసి ఉండాలి. నిర్దిష్ట రిక్రూటింగ్ కార్యాలయంలో పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి - రిక్రూటింగ్ కార్యాలయం పరిధిలోకి వచ్చే రాష్ట్ర భాషను చదవడం, వ్రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వంటివి తెలుసుకోవాలి. health tips: మెంతులు. ఆహారంలో భాగం చేసుకుంటే ఉండవిక ఆరోగ్య చింతలు!! ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, ప్రధాన పరీక్ష, భాషా నైపుణ్య పరీక్ష (LPT) ద్వారా ఉంటుంది. భాషా పరీక్ష: ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సంబంధిత రాష్ట్రంలోని అధికారిక/స్థానిక భాష(ల)లో నిర్వహించబడే భాషా ప్రావీణ్యత పరీక్ష చేయించుకోవాలి. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి. దరఖాస్తు రుసుము: SC/ST/PwBD/EXS: రూ. 50 ప్లస్ 18 శాతం GST GEN/OBC/EWS: రూ. 450 ప్లస్ 18 శాతం GST

Monday, 18 September 2023

అభివృద్ధిలో హెచ్ఎండిఏ గణనీయమైన పాత్ర* జాతీయ జెండా ఆవిష్కరించిన సెక్రెటరీ చంద్రయ్య


 

*అభివృద్ధిలో హెచ్ఎండిఏ గణనీయమైన పాత్ర*


జాతీయ జెండా ఆవిష్కరించిన సెక్రెటరీ చంద్రయ్య

అభివృద్ధిలో హెచ్ఎండిఏ గణనీయమైన పాత్ర*



జాతీయ జెండా ఆవిష్కరించిన సెక్రెటరీ చంద్రయ్య





 *హైదరాబాద్* : జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ),  హైదరాబాద్ గ్రోత్ కారిడార్ (హెచ్.జి.సి.ఎల్)లలో ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. హెచ్ఎండిఏ ఆవరణలో హెచ్ఎండిఎస్ సెక్రెటరీ పి.చంద్రయ్య హైదరాబాద్ గ్రోత్ కారిడార్  ఆవరణలో చీఫ్  జనరల్ మేనేజర్ రవీందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఎగురవేశారు. 


ఈ సందర్భంగా హెచ్ఎండిఎ సెక్రెటరీ పి.చంద్రయ్య, ఓఎస్డీ ఎం. రాంకిషన్ ఉద్యోగులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతు జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల ప్రాధాన్యతను  వివరించారు. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి జాతీయ సమైక్యతను చాటిచెబుతుందని అన్నారు.  


తెలంగాణ రాష్ట్రం అవతరించిన తదుపరి ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధిని చేసిచూపిందన్నారు. 


ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు,   మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కె.టి రామారావు ఆధ్వర్యంలో మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్వింద్ కుమార్ పర్యవేక్షణలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో హెచ్ఎండిఏ ఎంతో కీలకంగా భాగస్వామ్యం కావడం సంతోషకరమని వారు తెలిపారు.  


కార్యక్రమంలో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విజయలక్ష్మి, ల్యాండ్ పూలింగ్ ఆఫీసర్ ప్రసూనాంబ, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి, ఎన్ ఫోర్స్ మెంట్ డిఎస్పీ సత్తయ్య, సర్కిల్ ఇన్స్ పెక్టర్ వెంకటేష్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వప్రసాద్ లతోపాటు  అర్బన్ ఫారెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Sunday, 17 September 2023

వైశ్య గర్జనకువిచ్చేయాలని కోరుతూతెలంగాణ విజయ డైరీ కార్పొరేషన్ చైర్మన్, సోమ భరత్ కుమార్ఆహ్వానించినకాచం సత్యనారాయణ

 అక్టోబర్ 1న జరగనున్న వైశ్య గర్జనకు అతిథిగా విచ్చేయాలని కోరుతూ తెలంగాణ విజయ డైరీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గుప్తను తెలంగాణ భవన్లో కలిసి ఆహ్వానించిన వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక చైర్మన్, వైశ్య గర్జన నిర్వాహక సారథి, తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ కాచం సత్యనారాయణ


గుప్త.  ఆహ్వానించిన వారిలో దిల్ సుక్ నగర్ షిరిడి సాయి సంస్థాన్ చైర్మన్ గుండా మల్లయ్య గుప్త, నంగునూరి  రమేష్, నేలంటి మధు, బుక్కా ఈశ్వరయ్య, కోడుమూరు దయాకర్ ఉన్నారు.

విల్లంబులు చేపట్టిన:డా: కాచం సత్యనారాయణ







 *విల్లంబులు చేపట్టిన వికాస వేదిక*

 డా: కాచం సత్యనారాయణ  స్థాపించిన వికాస వేదిక  గత కొంత కాలంగా  విద్యార్థులను, విద్యావేత్తలను, ప్రశంసిస్తూ పురస్కారాలు అందించడమే కాకుండా సబ్బండ జాతుల  వారికి పలు సేవాకార్యక్రమాలతో, ఆర్థిక సహాయ సహకారాలందించడం ద్వారా అందరి మన్ననలు పొందుతున్న  తరుణం లో  కొందరు  వైశ్య విద్యావేత్తల ఆవేదన ,ఆలోచనలతో   వైశ్యల ఐక్యత చాటాలనే సంకల్పం తో  సంఘాలు వేరైనా , వైశ్య జాతి ఒక్కటేనని  జాతి ఏకమైతే మన ఆత్మ గౌరవం కాపాడుకోవడం సలభతరమని  గ్రహించి ఉన్నత విద్యావేత్తలైన వైశ్య సోదర సోదరీమణుల  సలహాలతో  ప్రభుత్వం పై వత్తిడి పెంచి కొన్ని (10) డిమాండ్లను వారి దృష్టి కి తెచ్చి సాదించుకన్నట్లైతే   మన జాతికి  చట్టసభల్లో  సముచిత స్థానం దక్కడం మే కాకుండా, భావితరాలకు  సంఘసమాజములో సముచిత గౌరవం  లభిస్తుంది.అలాగే దారిద్ర్య రేఖ కు దిగువున ఉన్న మన  కుటింభికులకు సహాయం తో పాటు  విద్యా విధానం లో ఉద్యోగాలలో కూడా   అవకాశాలు మెరుగు పడుతాయని ఆశాభావం తో  రాష్ట్ర నలుమూలల  సభలు , సమావేశాలు జరుపుతూ,

 అక్టోబర్ 1 న హైదరాబాద్ నడిబొడ్డున  లక్ష మంది వైశ్యులతో భారీ బహిరంగ సభ 

*వైశ్య ఘర్జన* పేరున జరుపతలపెట్టారు.  రాష్ట్ర  నలుమూలల జరిపిన ప్రతి  సమావేశం  వైశ్య ఘర్జన విజయవంతం  కోరకు సహకరిస్తామని ఏక గ్రీవంగా తీర్మానించడం తో  వేదికకు మరింత బలం చేకూరింది.

 ఇదే తరుణంలో   *వైశ్యల ఐక్యత ను   జీర్ణించుకోలేని  బడా నేతలు  నిమ్మకు నీరెత్తినట్లు  వ్యవహరించడమే కాకుండా, ఐక్యతకు భంగం కలిగే విధంగా  మాట్లాడటం  తో   సమావేశానికి హాజరైన వైశ్యులు వారిపై  ఆగ్రహాం  వెల్లబుచ్చారు. సభికుల ఆవేశాలను  గ్రహించిన ఉద్యమనేత , వైశ్యగర్జన నిర్వాహకులు డా: కాచం సత్యనారాయణ గారు తన సుదీర్ఘ  ప్రసంగం లో తన దైన శైలిలో  ఘాటుగా స్పందిస్తూ  నా జాతి బిడ్డలకు నేటి వరకు  ఏ సంఘం సహకరించక పోగా ,    జాతి గౌరవం కోసం ఏర్పాటు చేసుకొన్న *వైశ్య ఘర్జన*    మీ పెద్దరికాల కోసం  ఐక్యత ను దూరం చేస్తే   సహించేది లేదని, ఉద్యమ సమయం లో 

*గౌ: ముఖ్యమంత్రి  కే సి ఆర్ గారి శిష్యరికం లో శిక్షను పొందిన నాకు  ఈ గర్జన  విజయవంతం చేయడం సులభతరమే కాని ఆ తదుపరి   అంటంక పరిచిన  ఏ ఒక్కరిని  వదిలే ప్రసక్తే లేదని   హెచ్చరించడంతో   సభికులు పెద్ద ఎత్తున  హర్శద్వనాలు చేయడం తో సహా ప్రాంగణం దద్దరిల్లింది*. 

 వివిధ  సంఘాల సభ్యులును ఉద్దేశించి *అక్టోబర్ 1 న జరిగే వైశ్య ఘర్జన కు ర్యాలీ గా  మీ సంఘం పేరున  గాని , క్లబ్ల పేరున గానీ  మీ జిల్లా పేరుతో, కాలనీల పేరుతో బ్యానర్ పెట్టుకొని రావచ్చని*

సభ వేదిక పై అందరికి  సముచిత స్థానం  కల్పిస్తామని  ఇది మన అందరి వేదిక అని కేవలం మన  జాతి ఐక్యత నిరూపనయే నా ధ్యేయం  అని  ...భావి తరాల కోసమైనా మనం   మన డిమాండ్లను సాధించు కోవాలని   ఇందుకోసమే ఈ వైశ్య ఘర్జన అని   ఆవేశ పూరితమైన ప్రసంగం చేశారు.

వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి జిట్టా ,భువనగిరి కాంగ్రెస్ లో కొత్త జోష్‌

వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి జిట్టా  ,భువనగిరి కాంగ్రెస్ లో కొత్త జోష్‌

విధాత : బీజేపీకి రాజీనామా చేసిన భువనగిరి అసెంబ్లీ నియోజవర్గం నేత జిట్టా బాలకృష్ణారెడ్డి శనివారం మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం జిట్టా అనుచరులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా హైద్రాబాద్‌లోని వెంకట్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. జిట్టాకు కాంగ్రెస్ కండువా కప్పిన వెంకట్‌రెడ్డి సాధరంగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

            


ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడైన జిట్టా తనకు సోదరుడి వంటివారని, ఆయన చేసిన ఉద్యమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు జనంలో ఎంతో ఆదరణ పొందాయన్నారు. జిట్టా చేరికతో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఈ దఫా అధికారంలోకి రాబోతుందన్నారు.

        పార్టీలో చేరిన జిట్టా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో తన చేరికకు సహకరించిన వెంకట్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టేలా పార్టీ గెలుపుకు కృషి చేస్తానన్నారు. పార్టీలో ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తనను ఆదరించి పార్టీలోకి ఆహ్వానించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో, జిల్లాలో పార్టీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. భువనగిరి నియోజకవర్గంలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం పనిచేస్తానన్నారు.

Saturday, 16 September 2023

నిజాంపై అలుపెరుగని పోరాటం, పటేల్ వల్లే సాధ్యమైంది: అమిత్ షా స్పీచ్‌లో అవేం లేవు!

 


నిజాంపై అలుపెరుగని పోరాటం, పటేల్ వల్లే సాధ్యమైంది: అమిత్ షా స్పీచ్‌లో అవేం లేవు!

        హైదరాబాద్: నిజాం పాలనపై అలుపెరుగని ప్రజా పోరాటం.. అచంచలమైన దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం అమరులైన వీరందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం (సెప్టెంబర్ 17) ఉదయం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు.

జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన.. పారా మిలటరీ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలన్నారు. సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందన్నారు.

Amit Shah

ఆపరేషన్ పోలో పేరుతో పటేల్.. నిజాం మెడలు వంచారన్నారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారన్నారు. పటేల్ లేకపోతే తెలంగాణకు అంత త్వరగా విముక్తి లభించేది కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు.

నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారన్నారు. రావి నారాయణ రెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణా రావు, నరసింహారావుకు తాను నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అయితే, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయకుండానే అమిత్ షా తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.

అంతకుముందు, 'నాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలందరికీ హైదరాబాద్ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. నిజాం దుష్ట పాలన, అణచివేత నుంచి విముక్తి కోసం హైదరాబాద్ సంస్థాన ప్రజలు సాగించిన అలుపెరగని పోరాటానికి, ఇక్కడి ప్రజల అచంచల దేశభక్తికి ఈ రోజు నిదర్శనం. హైదరాబాద్ విముక్తి పోరాటంలో అమరులైన వీరులందరికీ నా హృదయపూర్వక నివాళులు' అని అమిత్ షా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Amit Shah

ఈ వేడుకల్లో అమిత్ షాతోపాటు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు. మొదట అమరవీరుల స్తూపం వద్ద అమిత్ షా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

         హైదరాబాద్‌ సంస్థానం భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్‌ 17ను.. తెలంగాణ విమోచనం (Telangana Liberation Day) పేరిట కేంద్ర ప్రభుత్వం వేడుకల్ని నిర్వహిస్తోంది. గత ఏడాది మాదిరిగానే సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌ వేదికగా ఉత్సవాలు జరగాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం రాత్రే ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ ప్రగతిరథ చక్రాలు మరింత జోరుగా ముందుకు - సీఎం కేసీఆర్

 


తెలంగాణ ప్రగతిరథ చక్రాలు మరింత జోరుగా ముందుకు - సీఎం కేసీఆర్

ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు అయ్యారు.

: తెలంగాణ ప్రగతిరథ చక్రాలు మరింత జోరుగా ముందుకు - సీఎం కేసీఆర్

మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రగతి రథ చక్రాలు ముందుకు సాగుతూనే ఉంటాయని, దేశంలో తెలంగాణ మోడల్ మర్మోగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల దీవెనలతో ప్రగతి రథ చక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతాయని, దీనికి అడ్డుపడాలనే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని అన్నారు. మన సమైక్యతే మన బలం అని అన్నారు. సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ ప్రగతిని ఇదే విధంగా కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు అయ్యారు. పబ్లిక్‌ గార్డెన్స్‌ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సీఎం జాతీయ జెండాను ఎగరవేసి ప్రసంగించారు. అంతకుముందు సమీపంలోని గన్‌ పార్కులో అమర వీరులకు సీఎం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు ఉన్నారు.


రాష్ట్ర సాధనతోనే నా జన్మ సాకారం - కేసీఆర్

పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన, జరుగుతున్న ప్రగతిని వివరించారు. రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో సెప్టెంబర్‌ 17కు ఓ ప్రత్యేకత ఉందని వివరించారు. న్యాయం, ధర్మం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని.. ఆనాటి సామాన్యులు చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయని అన్నారు. గాంధీ, నెహ్రు, పటేల్‌ వంటి నేతల వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైందని.. తెలంగాణలో రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందని అన్నారు. తెలంగాణ సాధనతోనే తన జన్మ సాకారమైందని అన్నారు. 


పెండింగ్‌లో ప్రాజెక్ట్‌ల పూర్తి - సీఎం 


ప్రస్తుతం తెలంగాణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని..  పాలమూరు పచ్చగా మారిందని అన్నారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి పాలమూరును పూర్తి చేశామని అన్నారు. అలాగే 6 జిల్లాల్లో 12 లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని అన్నారు. దేవాదుల ఎత్తిపోతలతో వరంగల్‌కు త్వరలోనే సాగునీరు అందిస్తామని.. మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యం అని అన్నారు. హైదరాబాద్‌‌లో పేదల కోసం లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తున్నామని అన్నారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తామని చెప్పారు.



జిల్లాలో మెడికల్ కాలేజీ కల సాకారం

వైద్యవిద్యలో కూడా అనేక సంస్కరణలతో ముందుకు వచ్చామని సీఎం అన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఉన్నాయని.. మొన్న ఒకే రోజు 9 వైద్య కళాశాలలు ప్రారంభించామని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి ఏటా 10 వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నామని అన్నారు.  అటు దళిత బంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు వచ్చాయని.. దేశంలో ఎక్కడా దళిత బంధు పథకం లేదని అన్నారు.


తలసరి ఆదాయంలో నెంబర్ 1

తలసరి ఆదాయంలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌ పేదల కోసం లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తున్నామని వివరించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం నిరంతరం కొనసాగుతుందని.. అర్హుందరికీ డబుల్‌ బెడ్ రూం ఇళ్లు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని అన్నారు. పెన్షన్‌ లబ్దిదారుల వయస్సును 57 ఏళ్లకు తగ్గించామని గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరికీ డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డు, ఇలా పొందండి?


ఆరోగ్య శ్రీ కార్డు

Aarogyasri Card : పేదలందరికీ ఉచిత వైద్యం అందించాలని లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య శ్రీ లేదా ఆయుష్మాన్ పథకాలను అమలుచేస్తున్నారు. అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ కార్డులను అందిస్తున్నారు.

Aarogyasri Card : పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ పథకం కార్డులు ప్రస్తుతం డిజిటల్ కార్డులుగా మెరుగుదిద్దుకున్నాయి. గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సభ్యులందరికీ ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఆయుష్మాన్ కార్డును ఒక్కొక్క వ్యక్తికి డిజిటల్ కార్డుగా అందిస్తోంది. ఈ క్రమంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క డిజిటల్ కార్డు మీ సేవ, సీఎస్సీ సెంటర్, ఆన్లైన్ సెంటర్ ద్వారా పొందేందుకు వీలు కల్పించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకొని కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఉచితంగా వైద్యసేవలు

ఈ ఆయుష్మాన్ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీ లేదా ఆయుష్మాన్ కార్డుపై 1500 రకాల రోగాలు, శస్త్ర చికిత్సలు, సుమారు 900 రకాల వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ మీసేవ, సీఎస్సీ, ఆన్ లైన్ సెంటర్ల ద్వారా ఈకేవైసీ చేసుకొని ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు పొందవచ్చని వైద్యాధికారులు తెలిపారు.

అమిత్ షా హైదరాబాద్‌ చేరుకున్నారు.

 హైదరాబాద్ లో పీవీ సింధుతో అమిత్ షా భేటీ, యువతకు స్ఫూర్తి అని ట్వీట్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు స్వాగతం పలికారు.

         హైదరాబాద్ లో పీవీ సింధుతో అమిత్ షా భేటీ, యువతకు


స్ఫూర్తి అని ట్వీట్

హైదరాబాద్ లో అమిత్ షాతో పీవీ సింధుతో భేటీ, యువతకు స్ఫూర్తి అని ట్వీట్ప్ర

            ముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. సంపర్క్​ సే సంవర్ధన్​లో భాగంగా బ్యాండ్మిటన్​ క్రీడాకారిణి పీవీ సింధులో అమిత్ షా, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. పీవీ సింధుతో భేటీ అనంతరం అమిత్ షా స్పందించారు. సింధు అద్భుతమైన క్రీడాకారిణి. ఆమె అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేసిందన్నారు. ఆట పట్ల ఆమె నిబద్ధత, చేసిన కృషి, అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ ట్వీట్ చేశారు.

        అంతకుముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు స్వాగతం పలికారు.  రేపు ఉదయం 9 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం రేపు మధ్యాహ్నం తిరిగి అమిత్ షా దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌, ఈటల తదితర నాయకులతో అమిత్ షా సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

            మరోవైపు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పాటించాలని కేసీఆర్‌ చెప్పడం.. హాస్యాస్పదమని కిషన్‌ రెడ్డి విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని బీజేపీ సభగా హైదరాబాద్‌ పోలీసులు సర్కులర్‌ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సర్క్యులర్‌ ఇవ్వడంపై క్షమాపణ చెప్పాలని కిషన్​రెడ్డి డిమాండ్‌ చేశారు.

            ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయ్. ఎన్నికలకు మరో రెండు నెలలే సమయం మాత్రమే ఉండటంతో... రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సెప్టెంబరు 17 లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం అన్ని ప్రధాన పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు, జాతీయ జెండాల ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేయబోతున్నాయి. తెలంగాణలో ఏటా సెప్టెంబర్‌ 17పై వివాదం సాధారణంగా మారుతోంది. గతేడాది మునుగోడు ఉపఎన్నికల తరుణంలో సెప్టెంబర్ 17పై విస్తృత చర్చ జరిగింది. స్వయంగా కేంద్రం రంగంలోకి దిగి విమోచన దినోత్సవం జరుపుతోంది. కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా జాతీయ సమైక్యత దినం జరుపుతోంది. నిజానికి తెలంగాణ ఏర్పాటైన దగ్గర్నుంచీ సెప్టెంబర్‌ 17ను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో జరుపుతూ వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహించలేదు. ఏటా సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా.. విలీనమా, విమోచనా.. విద్రోహమా అనే చర్చ జరుగుతూనే ఉంది. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా జరుపుతున్నట్టు స్పష్టం చేసింది.


సెప్టెంబర్ 17కు స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1948లో ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది. ఆపరేషన్ పోలోలో భాగంగా సైనిక చర్యతో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను గద్దె దించి, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజుని కొందరు విమోచనం అంటారు. మరికొందరు విలీనం అంటున్నారు. ఇంకొందరు విద్రోహం అని పిలుస్తున్నారు.


జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్‌ పూర్తి.. 6603 మంది గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా గుర్తింపు JPS | హైదరాబాద్‌

  జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్‌ పూర్తి.. 6603 మంది గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా గుర్తింపు JPS | హైదరాబాద్‌ : రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్‌) రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. రెగ్యులరైజేషన్‌కు అర్హులైన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 6,603 ఉన్నట్లుగా గుర్తించారు. 

JPS | జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్‌ పూర్తి.. 6603 మంది గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా గుర్తింపు

JPS | హైదరాబాద్‌ : రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్‌) రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. రెగ్యులరైజేషన్‌కు అర్హులైన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 6,603 ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ శనివారం గ్రేడ్‌- 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను క్రియేట్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జేపీఎస్‌లు పంచాయతీరాజ్‌ కార్యదర్శులుగా గ్రేడ్‌- 4 హోదాలో కొనసాగనున్నారు.

            గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండాలనే లక్ష్యంతో ఒకేసారి 9వేలకు పైగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. వీరికి పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని జేపీఎస్‌లుగా నియమించారు. గత నాలుగు సంవత్సరాలుగా వీరు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగేండ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారందరినీ క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌, డీఎస్పీ, డీఎఫ్‌వోలతో కమిటీని నియమించి రెగ్యులరైజేషన్‌కు అర్హులైన వారి జాబితాను పంచాయతీరాజ్‌కు అందించారు. జేపీఎస్‌లను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-4లను క్రియేట్‌ చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్‌ శాఖ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టులపై ఆర్థిక శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది.


వినాయకుని చరిత్ర విశేషాలు




👉1-'శుక్లాంబరధరం విష్ణుం'  అనే విష్ణు శ్లోకాన్ని వినాయకునికి  ప్రార్థనగా ప్రారంభించడంలో గల అంతరార్థం ఏమిటి...?


👉2-లక్ష్మీ గణపతి అని అంటారు కదా! లక్ష్మీదేవి వినాయకునికి ఏమవుతుంది.?


👉3వినాయకుని తొండం ఎడమ, కుడి వైపున,లో ఎటువైపు తిరిగి ఉంటే ఏమి ఫలితం.?


👉4-వీధిశూల ఉన్న ఇళ్లకు వినాయకుని బొమ్మ ఎందుకు ఉంచుతారు.?


👉5-పత్రిఆకులతో పూజించడంవలన అంతరార్థం ఏమిటి.? 21రకాల పత్రిఆకులతో పూజించే కారణం ఏమిటి.? ఏ రోగానికి ఏ ఆకు ఎంతకాలం వాడాలి.  ఆరోగ్య సూత్రాలు ఏమిటి?.


👉6-పిల్లవాని తల నరకటమే ఆశ్చర్యంగా ఉంటే, ఆ తలకి బదులుగా ఏనుగు తలని అతికించడం విడ్డూరం కదా.? అంతరార్థం ఏమిటి.?


👉7-వినాయకునికి ఉండ్రాళ్ళు ఇష్టం.!  ఆంజనేయునికి అప్పాలు ఇష్టము.!

అయ్యప్పకు నెయ్యి ఇష్టము.!

సంతోషిమాతకు పులుపు పడదు..!

ఇలా దేవతలకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటే మానవుల కంటే దేవతలకు ఏం గొప్ప?


👉8-అంత పెద్ద వినాయకుడికి ఇంత చిన్న చిట్టెలుక వాహనమా.?

ఇందులో మానవులకు తెలుసు కోవల్సిన ఉపయోగమైన విషయాలు ఏమిటి. .?


 👉9-హస్తా నక్షత్రం కన్యారాశికి చెందిన వినాయకుడు బ్రహ్మచారికదా.?

 మరి" సిద్ధి- బుద్ధి" అని ఇద్దరు భార్యలు...

లాభుడు- క్షేమధన్యుడు కుమారులు. మరియూ..సంతోషిమాత వినాయకునికి మనుమరాలా.?


👉10-వినాయకునికి ఆంజనేయునికి గల పోలికలు ఏమిటి,? ఆంధ్రులకు వినాయక, తమిళులకు సుబ్రహ్మణ్యేశ్వరుడు, కేరళ అయ్యప్ప అదిదేవతలుగా పూజించే అంతరార్ధం...!


👉11-వినాయకుని ముందు నిలబడిన భక్తులు గుంజీళ్ళు  తీయడానికి గల కారణం ఏమిటి.?


 👉12-వినాయకుడిని పూజించిన తరువాత మట్టి విగ్రహాన్ని నీళ్లలో నిమజ్జనం ఎందుకు చేయాలి.?


👉13-వినాయకుని పొట్టకు నాగ సర్పాలు ఎందుకు ఉంటాయి.? విరిగిన దంతం అంతరార్థం ఏమిటి.?


👉14-అమ్మ కొడుకు వినాయకుడు! నాన్న కొడుకు వీరభద్రుడు! హరిహర పుత్రుడు మణికంఠుడు.! శివపుత్రుడు షణ్ముఖుడు.! ఇలా దేవుళ్లకు మగపిల్లలే గానీ, ఆడపిల్లలు ఎందుకు ఉండలేదు.?


👉15-వినాయకునికి నివేదించిన లడ్డుకి గల ప్రాముఖ్యత ఏమిటి.?

దానిని వేలంపాటలో కొన్న వారికి కలిగే లాభాలు ఏమిటి..?


👉16-వినాయక చవితి రోజున పాలవెల్లి  కట్టడంలోనీ ఆంతర్యమేమిటి..?

హస్తనక్షత్రం,కన్యారాశిలో జన్మించిన వినాయకునికి బాల్యంలో ప్రాణగండం కలిగింది కదా..! మరి ఆ రాశి,ఆ నక్షత్రంలో జన్మించిన మనుషులకు జాతకరీత్యా వచ్చే ప్రాణగండాలు ఎలా తప్పించుకోవాలి..?


👉17-వినాయకుని వివాహానికి అన్ని విఘ్నాలే అనే నానుడి ఎందుకు వచ్చింది...?

ఇంతేకాక మరియూ ఇంకా అనేక విశేషమైన రహస్యాలు. తెలుసుకోవాలని ఉన్నదా అయితే ఈ  ఈ లింకు చూడండి

BHAGYA NAGAR GANESH UTSAV SAMITHI


 Meeting Conducted by 

BHAGYA NAGAR GANESH UTSAV SAMITHI


 

AT: Bahethi Bhavan 

Beside RAJADHANI Hotel 

Siddiamber Bazar Hyderabad Telangana 

On: 14-09-2023 

At: 08: 00pm 

Under the Guidance of 

Bhagwath  Rao garu 

( General secretary BGUS)

Organised by ( goshamahal Constituency wing )

Abhishek, Shakthi sing and 

Ashish Vyas 

Led by  Venkatesh goud,Jashwant, Rajesh sing, Arun sing, Pawan shinde, Ramesh Vykar, Rahul,Anirudh Agarwal, Santosh varma, vagaram and others

Attended by 

BONALA SRINIVAS 

National President 

PRAJA EKTHA PARTY 

( shared  views for peaceful, successful, and Bless full of 

Ganesh Navrathri)

Friday, 15 September 2023

గౌరీ పండుగ తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత మరియు ఆచారం

 గౌరీ పండుగ తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత మరియు ఆచారం

                హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గౌరీ పండుగ ఒకటి. ఈ పండుగను గణేష్ చతుర్థి ముందు రోజు జరుపుకుంటారు. గౌరీ పండుగ పార్వతీ దేవి గౌరీ అవతారానికి అంకితం చేయబడింది. కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడులలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

          గౌరీ పండుగ నాడు గౌరీదేవిని పూజిస్తారు. ఈ పవిత్ర పండుగ రోజున మహిళలు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం గౌరీ దేవి అనుగ్రహాన్ని పొందేందుకు స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. స్వర్ణగౌరిని ఇంటికి తీసుకొచ్చి పూజిస్తారు.

    ఇతర సాధారణ వివాహిత స్త్రీలు తమ తల్లిదండ్రుల ఇంటికి వచ్చినట్లే ఈ రోజున గౌరీ దేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. మరుసటి రోజు, ఆమె కుమారుడు గణేశుడు తల్లి గౌరీని కైలాస పర్వతానికి తీసుకెళ్లడానికి వస్తాడు. మహారాష్ట్ర మరియు ఇతర ఉత్తర భారత రాష్ట్రాలలో గౌరీ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

 గౌరీ పండుగ 2023 తేదీ మరియు పూజా సమయం

గౌరీ పండుగ = సోమవారం 18 సెప్టెంబర్ 2023

2023 ప్రాతఃకాల గౌరీ పూజ ముహూర్తం/సమయం = ఉదయం 5:27 నుండి 7:52 వరకు

వ్యవధి = 2 గంటల 25 నిమిషాలు

తృతీయ తిథి ప్రారంభమవుతుంది = 17 సెప్టెంబర్ 2023 ఉదయం 11:08 గంటలకు

తృతీయ తిథి 18 సెప్టెంబర్ 2023 = 12:38 PMకి ముగుస్తుంది

గౌరీ పండుగ ప్రాముఖ్యత:

గౌరీ పర్వదినాన స్త్రీలు తమ భర్తల ఆయుష్షు కోసం పదహారు రకాల ఆభరణాలు చేసి శివునికి, పార్వతికి పూజలు చేస్తారు. ఈ రోజున పార్వతీదేవికి సుమంగళీయులు ఉపయోగించే వస్తువులను మహిళలు సమర్పిస్తారు. ఇందులో కుంకుం, మెహందీ, బిందీ, వెర్మిలియన్, చీలమండలు, కాజల్, కంకణం మరియు దువ్వెనతో సహా పదహారు వస్తువులు అందించబడతాయి.

గౌరీ పండుగ నియమాలు:

నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండి గౌరీ పండుగను జరుపుకుంటారు. గౌరీ పండుగ అత్యంత కష్టతరమైన ఉపవాసాల ఒకటి. ఒకసారి మీరు ఉపవాసం ప్రారంభించిన తర్వాత ఏ సంవత్సరంలోనైనా దానిని ఆపకూడదు. ప్రతి పండుగను తప్పకుండా జరుపుకోవాలి. పగటిపూట నిద్రపోకండి మరియు రాత్రి మేల్కొని ఉండండి.

గౌరీ పండుగ పూజా ఆచారం:

ఉదయాన్నే స్నానం చేసి గౌరీ పండుగ నాడు ఉపవాసం ఉండాలి.

పూజా స్థలాన్ని పండ్లు మరియు పూలతో అలంకరించండి.

ఒక పీఠం వేసి దానిపై శివుడు, పార్వతి మరియు గణేశుడి విగ్రహాలను ప్రతిష్టించండి.

శివపార్వతుల మానవ దీపాన్ని వెలిగించండి.

దీని తర్వాత సుమంగళీలు ఉపయోగించే వస్తువులన్నీ మేకప్ బాక్స్‌లో ఉంచి పార్వతి తల్లికి సమర్పించండి.


గురి పెట్టిన సోనియా, కౌంటర్ స్కెచ్ తో అమిత్ షా - హైదరాబాద్ కేంద్రంగా..!!

                 


: హైదరాబాద్ జాతీయ రాజకీయ నిర్ణయాలకు వేదిక కానుంది. ఈ నెల 17 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరపాలని నిర్ణయించారు. సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ నెల 17న హైదరాబాద్ లో సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక ఖరారైంది. అదే రోజు కేసీఆర్ మరో సభలో పాల్గొంటున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో : తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం హైదరాబాద్‌లో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించి, ఇటీవల అధిష్ఠానానికి లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలోనే సమావేశం జరుగుతోంది. సోనియా, రాహుల్‌, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, అశోక్‌ గెహ్లోత్‌, భూపేష్‌ భాగేల్‌, సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సహా 39 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఈ సమావేశం కోసం రాష్ట్రానికి వస్తున్నారు. 16న సోనియా, రాహుల్ రాక ఖరారైంది. రేపు (శుక్రవారం) మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎన్నికల శంఖారావం : సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్‌ చేసిన త్యాగాలేమిటో సోనియా ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన సోనియానే హైదరాబాద్‌ వేదికగా జరిగే కార్యక్రమంలో పాల్గొని..ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి కేంద్రం అనూహ్యంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయించింది. మంది పైగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య నేతలు అదే రోజు తెలంగాణవ్యాప్తంగా పర్యటించి, ఎన్నికల ప్రచారాన్ని ఏక కాలంలో ప్రారంభించేలా పార్టీ కసరత్తు చేస్తోంది. 17న సోనియా ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో చేసే ప్రసంగంలో పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే అంశాలను వివరించనున్నట్లు చెబుతున్నారు. పార్టీ మేనిఫెస్టోను ప్రకటించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. సెప్టెంబర్ 17న పోటీ పోటీగా : ఇదే సమయంలో హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. కేంద్రం అధికారికంగా నిర్వహించే హైదరాబాద్ విమోచన వేడుకల్లో పాల్గొంటారని చెబుతున్నారు. పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో షా పాల్గొంటారు. 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేందుకు వీలుగా కొత్త అంచనాలతో కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందకు కేంద్రం సిద్దమైంది. ఈ సమయంలో సోనియా, రాహుల్..ఇటు అమిత్ షా హైదరాబాద్ కేంద్రంగా చేసే ప్రసంగాలు కీలకం కానున్నాయి. అదే సమయంలో తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయంగా ఈ రెండు రోజుల కార్యక్రమాల ద్వారా మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు.. పాల్గొనున్న ఖర్గే, సోనియా, రాహుల్..

                


] హైదరాబాద్ లో నేటి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. తాజ్ కృష్ణ హోటల్ లో శని, ఆదివారం ఈ భేటీలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పిటికే పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యలకు టీపీసీసీ విందు ఇస్తుంది. విందు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం సమావేశం అనంతరం బహిరంగ సభ నిర్వహించున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఐదు కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశంఉంది. తెలంగాణతో పాటు త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, భారత్ జోడో యాత్ర-2 నిర్వహణ, 2024 లోక్ సభ ఎన్నికలు, ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల కేటాయింపు పై చర్చించున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ఈరోజుతో సమయం ముగిసింది.. రేపటి నుంచి మీరే రాజు.. మీరే మంత్రి! అలాగే దేశంలో పెరగుతోన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఎలా ఎదుర్కొవాలనే దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కేలా ప్రణాళికపై కూడా చర్చలు జరపనున్నారు. కొద్ది నెలల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికలే టార్గెట్ గా సీడబ్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. ఈ క్రమంలో ఇక్కడ సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండనుంది. ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో సాధారణ సభ్యులతోపాటు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 84 మంది పాల్గొనున్నారు. ఇప్పటికే 52 మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌సింగ్‌ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్‌ చెన్నితాల, కొడుక్కునిల్‌ సురేశ్, శశిథరూర్, రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా, రాజీవ్‌శుక్లా, పవన్‌ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్‌ సింగ్‌ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్‌ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభా సింగ్, మనీశ్‌ తివారీ, గౌరవ్‌ గొగోయ్, భక్తచరణ్‌దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్‌సింగ్, కుమారి షెల్జా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్‌ గెహ్లాట్, సిద్ధరామయ్య, భూపేశ్‌ భగేల్, మరికొందరు నేతలు ఈ రోజు రానున్నారు. 17న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ శివార్లలోని తుక్కుగూడలో కాంగ్రెస్‌ 'విజయభేరి' బహిరంగ సభ జరగనుంది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు సభకు హాజరవుతారు.

కాంగ్రెస్ గూటికి తుమ్మల

                            


మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు BRSకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ వీడతారని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలొచ్చాయి. కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలూ వచ్చాయి. హైదరాబాద్ వేదికగా సెప్టెంపర్ 16,17వ తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే హైకమాండ్ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. అయితే అంతకంటే ముందుగానే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇన్నాళ్లూ BRSకి రాజీనామా చేస్తారన్న వార్తలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా ఆయనే రాజీనామా లేఖ రాసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పంపారు. ఆ లేఖను కేవలం ఒకే వాక్యంతో ముగించినట్టు తెలుస్తోంది. "నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. రాజీనామాని ఆమోదించండి" అని మాత్రమే రాసి పంపారట. పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా హైకమాండ్ అందుకు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు తుమ్మల. కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గు చూపారు. అనుకున్న విధంగానే ఆ పార్టీ కండువా త్వరలోనే కప్పుకోనున్నారు.