Friday, 29 May 2026

దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల నమోదు➡️యాప్ ను ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్

 

➡️భాష ఏదైనా.. ఫిర్యాదు ఇక సులభం➡️హైదరాబాద్ పోలీసుల అమ్ములపొదిలోకి 'ఏఐ కాప్‌రైట‌ర్'➡️


దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల నమోదు➡️యాప్ ను ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్

✅పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషా పరమైన ఇబ్బందులు కలగకుండా, వారి ఫిర్యాదులను త్వరితగతిన, కచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్‌రైట‌ర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.
✅హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో శనివారం ఏఐ కాప్‌రైట‌ర్ యాప్ ను హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. దాని ప‌నితీరును ప‌రిశీలించారు.
✅నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా, బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు తక్షణమే రికార్డు చేసి, అనువదించుకోవచ్చు.
✅హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో తెలుగు, ఇంగ్లీష్ రాని ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు ఫిర్యాదు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాష అర్థం కాక ఎఫ్.ఐ.ఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదవ్వడం వంటి సమస్యలకు ఈ యాప్ స్వస్తి పలకనుంది. 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం ఈ యాప్ సొంతం. ఈ వినూత్న యాప్ ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతో పాటు ఇంటర్న్ పాగ్రో చందు సహకారంతో హైద‌రాబాద్ సిటీ పోలీస్ రూపొందించింది.
ప్ర‌ధాన అంశాలు:
✅బహుభాషా సౌలభ్యం: హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే, అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారి, పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదించబడుతుంది.
✅వేగం-కచ్చితత్వం: గంటల తరబడి పట్టే ఫిర్యాదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. అనువాదకుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
✅పారదర్శకత: ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు.
✅ మల్టీ-పార్టీ లేబులింగ్: బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేస్తుంది.
✅పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్‌ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అన్నారు.
✅"హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ కావడంతో ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ రాని వలసవచ్చిన ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎందరో ఉంటారు. భాష తెలియకపోవడం వల్ల ఫిర్యాదు చేయడంలో జాప్యం జరగడం లేదా సమాచారం తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలకు ఈ యాప్ చెక్ పెట్టనుంది. బాధితుడు తన మాతృభాషలో మాట్లాడితే, ఈ యాప్ దానిని వెంటనే గుర్తించి, అనువదించి, అధికారిక రికార్డుగా మారుస్తుంది. మాట్లాడిన ప్రతి 5 సెకన్లకు సమాచారం అప్‌డేట్ అవుతుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మికులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి, తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయి. దీనివల్ల పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాకుండా, రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుంది." అని ఆయన అన్నారు.
✅న్యాయం పొందడానికి భాష ఎప్పటికీ అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ఏఐ కాప్‌రైట‌ర్ ఆధునిక పోలీసింగ్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ‘స్మార్ట్ పోలీసింగ్’ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే హైదరాబాద్ సిటీ పోలీస్ లక్ష్యమని పేర్కొన్నారు.
✅ఈ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో అద‌న‌పు సీపీ(క్రైమ్స్ అండ్ సిట్) ఎం.శ్రీనివాసులు, ఐపీఎస్ గారు, అద‌నపు సీపీ(లా అండ్ ఆర్డ‌ర్) శ్రీ త‌ఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ గారు, డీసీపీ (ఎస్ఎమ్ఐటీ) శ్రీ సీహెచ్ రూపేష్, ఐపీఎస్, ఐటీ సెల్ ఇన్స్పెక్ట‌ర్ ర‌మేశ్, బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ ప్ర‌తినిధులు, త‌దితరులు పాల్గొన్నారు.
నగర పోలీసింగ్‌లో కృత్రిమ మేధ జోరు:
✅ఆధునిక పోలీసింగ్ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ పనితీరులో మరింత సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో టెక్నాలజీ ఆధారిత పాలనకు ప్రాధాన్యతనిస్తోంది.
✅ఇందులో భాగంగానే.. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను పక్కాగా రూపొందించడానికి ఇప్పటికే 'సి-మిత్ర' లో ఏఐ సాంకేతికతను పోలీస్ శాఖ విజయవంతంగా అమలు చేస్తోంది. అలాగే సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి విధులను కేటాయించే ప్రక్రియలో ఏఐను వాడుతోంది. గతంలో ఉన్న మ్యాన్యువల్ పద్ధతుల స్థానంలో ప్రవేశపెట్టిన ఈ ఆటోమేటెడ్ విధానం వల్ల, ఎటువంటి పక్షపాతం లేకుండా సిబ్బందికి పోస్టింగ్‌లు కేటాయించబడుతున్నాయి. ఇది వ్యవస్థలో పూర్తి పారదర్శకతను పెంచుతోంది.
✅సోషల్ మీడియాలో సమాజ శాంతికి భంగం కలిగించే అంశాలను గుర్తించేందుకు 'సాక్-ఐ' అనే ఏఐ ఆధారిత యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆన్‌లైన్ కంటెంట్‌ను నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా, మహిళల, చిన్నారుల భద్రతకు విఘాతం కలిగించే పోస్టులను కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఫిర్యాదుల నమోదు ప్రక్రియను కూడా ఏఐతో అనుసంధానించింది. అందుకు ఏఐ కాప్‌రైట‌ర్ యాప్ ను రూపొందించింది. దీనివల్ల ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు మరింత వేగంగా, క్రమబద్ధంగా నమోదవుతాయి.
See less

*ఉప్పల స్వప్న గారికి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్*

 *ఉప్పల స్వప్న గారికి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్*

“కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025” కార్యక్ర




మం సినీ, సాంస్కృతిక వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ అవార్డు వేడుక అమీర్ పేట AAA సినిమాస్‌లో వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా సమాజ సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న IVF ప్రధమ మహిళ శ్రీమతి ఉప్పల స్వప్న గారికి ప్రతిష్టాత్మకమైన “కళావేదిక ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”ను ప్రదానం చేశారు.
వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, మహిళా సాధికారత, సేవా కార్యక్రమాల్లో ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు.
కార్యక్రమంలో సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ఉప్పల స్వప్న గారిని అభినందించారు.
సమాజానికి సేవ చేయాలనే తపనతో నిరంతరం ప్రజలకు అండగా నిలుస్తున్న ఆమె సేవలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని వక్తలు కొనియాడారు.
ఈ సందర్భగా ఉప్పల స్వప్న గారు మాట్లాడుతూ నేను చేసిన సేవలకు గుర్తింపుగా నన్ను గుర్తించి NTR Film Award నీ నాకు ప్రదానం చేయడం సంతోషకరం అని ఆమె అన్నారు.
ఈ అవార్డ్ తో బాధ్యత మరింత పెరిగింది అని ఆమె అన్నారు.
TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ ఈ వేడుకలో కళావేదిక నిర్వాహకులు మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు, సామాజిక సేవా రంగానికి విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి అవార్డ్ అందజేయడం నిజంగా అభినందనీయం అని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళా వేదిక వారికి అభినందనలు తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆయన సూచించారు.
ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మరింత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి హాజరైన అతిథులు ఉప్పల స్వప్న గారికి శాలువాతో సన్మానం చేసి, జ్ఞాపికను అందజేశారు. సభలో పాల్గొన్నవారు ఆమె భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు, నందమూరి తారక రామారావు గారి మనవరాలు శ్రీమతి నందమూరి మోహన రూప గారు,
శ్రీమతి సీమంతిని గారు,
ఎన్టీఆర్ గారి కుమారుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ గారు, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్ గారు,
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు చెందిన ప్రసన్న గారు,
నటి లయ గారు,భువన రాయవరపు గారు పాల్గొనడం జరిగింది.
S

*వ్యాపార ముసుగులో భారీ మోసం!

 **వ్యాపార ముసుగులో భారీ మోసం!


వాటా ఇస్తానంటూ రూ.24.53 కోట్లకు గండికొట్టిన బీజేపీ నేత గజ్జల యోగానంద్**

వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానని నమ్మించి కోట్లాది రూపాయలు దోచుకున్న ఘటన సైబరాబాద్‌లో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గజ్జల యోగానంద్ పై రూ. 24.53 కోట్ల మోసం ఆరోపణలతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, షేర్ల కేటాయింపు పేరుతో బాధితుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి, ఆపై తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్నప్పటికీ ఒప్పందాలను అమలు చేయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలపై లోతైన విచారణ జరుపుతున్నారు. అవసరమైతే మరిన్ని సెక్షన్లు జోడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాజకీయ హోదా వెనుక దాగి వ్యాపార ముసుగులో సాగిన ఈ భారీ మోసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

జాతీయ రహదారుల ప్రైవేటీకరణ: అభివృద్ధి దిశలో అడుగేనా.. ప్రజలపై భారం పెంచే నిర్ణయమా?

జాతీయ రహదారుల ప్రైవేటీకరణ: అభివృద్ధి దిశలో అడుగేనా.. ప్రజలపై భారం పెంచే నిర్ణయమా?

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తాజా నిర్ణయం విస్తృత చర్చకు దారి తీస్తోంది. అభివృద్ధి వేగవంతం చేయాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ఒకవైపు ఆశలు కలిగిస్తే, మరోవైపు ప్రజల్లో అనేక సందేహాలను కూడా రేకెత్తిస్తోంది.

ప్రభుత్వానికి నిధుల కొరత పెరుగుతున్న నేపథ్యంలో రహదారుల నిర్వహణను ప్రైవేటు రంగానికి అప్పగించడం ఒక ఆర్థిక వ్యూహంగా కనిపిస్తోంది. భారీ మొత్తంలో పెట్టుబడులు సమీకరించడమే కాకుండా, ఆధునిక సాంకేతికత, మెరుగైన నిర్వహణ అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. కాగితాలపై చూస్తే ఇది సమర్థవంతమైన విధానంగానే కనిపిస్తుంది.

అయితే, వాస్తవ పరిస్థితుల్లో ఈ విధానం ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుందన్నది కీలక ప్రశ్న. ప్రైవేటు సంస్థల ప్రధాన లక్ష్యం లాభమే. రహదారి నిర్వహణ మెరుగుపడినప్పటికీ, టోల్ వసూళ్ల రూపంలో ప్రజలపై అదనపు భారం పడే అవకాశం లేకపోలేదు. గత అనుభవాలు చూస్తే, ప్రైవేటీకరణ తర్వాత టోల్ రేట్లు పెరగడం, వినియోగదారుల ఫిర్యాదులు పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది.

తెలంగాణలో యాదగిరి–వరంగల్ జాతీయ రహదారి ఈ జాబితాలోకి రావడం రాష్ట్రానికి కీలక అంశం. ఈ మార్గం రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణికులకు అత్యంత అవసరమైన రహదారి. నిర్వహణ మెరుగుపడితే ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది. కానీ అదే సమయంలో టోల్ భారం అధికమైతే, అభివృద్ధి ప్రయోజనం కొద్దిమందికే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

టోల్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్ (TOT), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (InvIT) వంటి మోడళ్లు ఆర్థికంగా ప్రభుత్వానికి ఉపశమనమివ్వవచ్చు. కానీ ఈ మోడళ్ల అమలులో పారదర్శకత, ప్రజాప్రయోజనాల పరిరక్షణ కీలకం. కాంట్రాక్టుల మంజూరు, టోల్ రేట్ల నియంత్రణ, రహదారి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ లేకపోతే ఈ విధానం ప్రజావ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.

అభివృద్ధి అంటే కేవలం పెట్టుబడులే కాదు, ప్రజలకు అందే ప్రయోజనం కూడా. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ అభివృద్ధి భారమంతా సామాన్యుడి భుజాలపై మోపకూడదు.

కాబట్టి జాతీయ రహదారుల ప్రైవేటీకరణలో ప్రభుత్వం సమతుల్య దృష్టితో ముందుకెళ్లాలి. ప్రజలకు నాణ్యమైన రహదారులు, భద్రమైన ప్రయాణం అందించడంతో పాటు, టోల్ భారం నియంత్రణలో ఉంచడం ప్రభుత్వ బాధ్యత. అప్పుడు మాత్రమే ఈ నిర్ణయం నిజమైన అభివృద్ధి అడుగుగా నిలుస్తుంది.

Wednesday, 27 May 2026

రూ.30 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో శామీర్ పేట MRO మేడమ్!

రూ.30 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో శామీర్ పేట MRO మేడమ్! 
               

తెలంగాణా రాష్ట్రంలో ఇంకా తహసీల్దార్ వ్యవస్థలో అవినీతి వేళ్ళూనుకునే ఉంది అని చెప్పటానికి తాజాగా ఒక ఘటన ఉదాహరణగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం చేసిన ఆకస్మిక దాడి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో ఆఫీసులలో జరిగే అవినీతిపై చర్చకు కారణమైంది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తహసీల్దార్ తాజాగా భూమి కన్వర్షన్ వ్యవహారంలో భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఏసీబీ దాడులు చేపట్టి, తహసీల్దార్ ను, డ్రైవర్‌ను రూ.2 లక్షల లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. మరిన్ని కనుగొనండి లైవ్ న్యూస్ యాప్ తెలుగు ఆరోగ్య చిట్కాలు తెలుగు వంటల పుస్తకాలు భారతీయ చరిత్ర పుస్తకాలు భూమి కన్వర్షన్ కు 30 లక్షల డిమాండ్ ఆలియాబాద్ ప్రాంతంలోని సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఏసీబీ విచారణ చేపట్టింది. ప్రాథమిక తనిఖీలో ఆరోపణలు నిజమైనట్లు తేలడంతో ఏసీబీ ట్రాప్ వేసి చర్యలు తీసుకుంది. తహసీల్దార్ ఆఫీసు డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు అందుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ లో తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా కార్యాలయంలోని ముఖ్యమైన భూమి సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకుని విస్తృతంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుత తహసీల్దార్ సుచరితను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు కీసర ఆర్‌డీఓ రాజేష్‌తో సహా ఇతర సిబ్బందిని కూడా విచారణకు పిలిచినట్లు సమాచారం. గత ఏడాది (2024) కూడా అదే శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. 
               ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో కారిడార్‌.. రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్! గతంలో వివాదాలకు కేరాఫ్ గా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం అప్పటి తహసీల్దార్ సత్యనారాయణ తన డ్రైవర్‌తో కలిసి రూ.2 లక్షల లంచం కేసులో అరెస్ట్ అయ్యారు. తాజా ఘటనతో శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం మళ్లీ వివాదాస్పదం అయింది.ఏసీబీ అధికారులు ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. భూమి సంబంధిత అనుమతులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడం అనేది సాధారణంగా మారిపోతున్నట్లు ఈ ఘటనలు చూపిస్తున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Monday, 25 May 2026

నల్గొండ జిల్లాలో అత్యధికంగా 937 గ్రామ సమాఖ్య భవనాలకు స్థలాలను సేకరించి 48 భవనాల నిర్మాణం పూర్తి చేసినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి

 




నల్గొండ జిల్లాలో అత్యధికంగా 937 గ్రామ సమాఖ్య భవనాలకు స్థలాలను సేకరించి 48 భవనాల నిర్మాణం పూర్తి చేసినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాన్ని అభినందించారు
.

                ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళ వారోత్సవాన్ని పురస్కరించుకుని

సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అంతేకాక మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరల నూతన డిజైన్ (చిలకపచ్చ డిజైన్) ను వర్చువల్ గా ఆవిష్కరించారు.

         ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా 937 గ్రామ సమాఖ్య భవనాలకు స్థలాలను సేకరించడమే కాకుండా 48 భవనాల నిర్మాణాలు కూడా పూర్తి చేయడం పట్ల ఆయన జిల్లా మహిళా సమాఖ్య ను అభినందిస్తూ అధ్యక్షురాలు మాధవితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడారు. 937  గ్రామ సమాఖ్య భవనాల స్థల సేకరణ  ఎలా చేశారో వివరాలు తెలియజేస్తే ఇతర జిల్లాలలో కూడా అదేవిధంగా స్థల సేకరణ చేస్తారని కోరగా, ఇందుకు నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి స్పందిస్తూ జిల్లాలో జిల్లా మహిళా సమాఖ్య కింద 38 మండల సమాఖ్యలు ఉన్నాయని, 1144 గ్రామ సమాఖ్యలు ఉండగా, మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణానికి ఆదేశం ఇవ్వగా, నెల రోజుల్లో 937 గ్రామ సమాఖ్య భవనాలకు స్థల సేకరణ చేయడం జరిగిందని చెప్పారు.

          ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాధవి తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం పై అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. ఇటీవల కొంతమంది ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని కోరుతున్నారని, అందువల్ల ఈ విషయంపై స్పష్టంగా అభిప్రాయం చెప్పమని కోరగా మాధవి మాట్లాడుతూ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం చాలా బాగుందని, ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధి చేసుకునే వారికి, విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నదని ,ఉచిత బస్సు వల్లనే వారు చేసుకునే ఉద్యోగంలో సగం జీతం మిగులుతుందని తెలిపారు.

      అనంతరం  రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ  ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ఉచిత బస్సు కారణంగా అమ్మాయిలు మధ్యలో బడిమానేసే వారి సంఖ్య తగ్గిపోయిందని, అలాగే తల్లితండ్రులకు ప్రయాణ భారం తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధి కోసం వెళ్లే  మహిళకు ఒక్కొక్కరికి ప్రతి నెల 8 నుండి పదివేల వరకు మిగులుతున్నదని, అందువల్ల ఈ అంశంపై గ్రామ సమాఖ్య సమావేశాలలో చర్చించాలని  చెప్పారు.అంతేకాక గ్రామ సమాఖ్య సమావేశాల్లో పంట మార్పిడి పై అవగాహన కల్పించాలని, సేంద్రియ ఎరువులు ,క్యాన్సర్ వంటి వాటిపై కూడా మాట్లాడాలని సీఎం చెప్పారు. తెలంగాణలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని అన్నారు. మహిళలు ఆడాని,అంబానితో పోటీ పడేలా వారికి పెట్రోల్ బంకులను అప్పగించడం జరిగిందని ,అలాగే మహిళలకు రుణాలు ఇవ్వడం ద్వారా ధాన్యం కొనుగోలుతో పాటు, గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ,ప్రతి మండలంలో పెద్ద గోడౌన్ కట్టించి భవిష్యత్తులో ధాన్యాన్ని భద్రపరిచి మిల్లర్లు అక్కడికె వచ్చి తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకుగాను ప్రతి మండలంలో రెండు నుండి నాలుగు ఎకరాల వరకు భూసేకరణ చేయాలని, అవసరమైన లాజిస్టిక్స్ ఏర్పాటు కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు  అలాగే మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడమే కాకుండా, రుణం ఇస్తామని, రాష్ట్రం నలుమూలల మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత ఎదిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

            

        వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళా సమాఖ్య భవనాలు మంజూరు చేయడం సంతోషమని ,జిల్లాలో 937 భవనాలకు స్థల సేకరణ చేయడమే కాకుండా, 48 పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. ఇతర భవనాలను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వీటితోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, గోడౌన్లు నిర్మాణం , పాఠశాల విద్యార్థుల యూనిఫాం త్వరలోనే వస్తాయని, వాటిని కూడా అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. మహిళలు ఎదిగేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ ఎల్బీసీలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ ద్వారా మరింత అభివృద్ధి చెందవచ్చు అని, అక్కడే సూపర్ బజార్ కూడా నిర్మాణం చేస్తున్నందున నల్గొండ మహిళా సమాఖ్యలకు ఎంతో మేలుకు కలుగుతుందని అన్నారు. అదే సమయంలో మహిళలు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించాలని , తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించని శాతాన్ని తగ్గించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం, తదిత అంశాలపై చర్చించాలని, మహిళలు వ్యాపారవేత్తలుగా ఆలోచించాలని చెప్పారు.

          రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ,రాష్ట్ర సీనియర్ అధికారులు మాట్లాడారు.

          జిల్లా నుండి డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్ష ,కార్యదర్శులు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Wednesday, 20 May 2026

గతంలో ఎన్నడూ లేనివిధంగారాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

 గతంలో ఎ


న్నడూ లేనివిధంగా, తెలంగాణ మీడియా అకాడమీ మరియు రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన, సమాచార శాఖ కమిషనర్ జి. ముకుందరెడ్డి గారి సమక్షంలో, మసాబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లో అక్రెడిటేషన్ కమిటీ సమావేశాలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. మూడు నెలల వ్యవధిలో 7సార్లు కమిటీ సమావేశమై, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వేలాది మంది జర్నలిస్టులకు కార్డులను మంజూరీ చేసింది. ఒక్కొక్క దరఖాస్తును స్క్రీన్ లో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పారదర్శకంగా కార్డులు మంజూరీ చేయడం విశేషం. నిన్న ఉదయం 10.30గం.ల నుండి సాయంత్రం 6.30గం.ల వరకు (దాదాపు 8గం.ల పాటు) ఏకధాటిగా జరిగిన 7వ సమావేశంలో దాదాపు 700దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. జూన్ మొదటి వారంలో జరిగే మరో ఒకటి రెండు సమావేశాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు జిల్లాల్లో అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ప్రతి సమావేశంలో సమీక్షా నిర్వహిస్తుంది. జిల్లాల్లో జర్నలిస్టులకు ఎదురవుతున్న ఆయా సమస్యలపై కమిటీ చర్చిస్తూ తగు చర్యలు చేపడుతుంది.

ఏది ఏమైనా అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు మంజూరీ కావడం శుభపరిణామంగా భావిస్తున్నాను.

Saturday, 16 May 2026

ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి మిల్లర్లకు జిల్లా కలెక్టర్. బి. చంద్రశేఖర్.ఆదేశం


  @ ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి మిల్లర్లకు జిల్లా కలెక్టర్. బి. చంద్రశేఖర్.ఆదేశం


          శనివారం ఆయన జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ తో కలిసి  మిర్యాలగూడ సబ్ కలెక్టర్  కార్యాలయ  సమావేశ మందిరంలో

 పౌర సరఫరాల  అధికారులు,రైస్  మిల్ యాజమానులతో  ధాన్యం ఆన్ లోడింగ్ పై సమీక్షించారు.




             జిల్లాలో ఇప్పటివరకు 6 లక్షల 76 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.   ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశముందని చెప్పారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు  జాప్యం చేయకుండా ధాన్యాన్ని అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు.

హమాలీల కొరత లేకుండా చూడాలని, అవసరమైతే సుదూర ప్రాంతాల నుంచి హమాలీలను తీసుకురావాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం 400 లారీల ధాన్యాన్ని మిల్లులలో దించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల ప్రయోజనాల కై అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.

చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని, ఖాళీ అయిన ఐకేపీ కేంద్రాల హమాలీలను కూడా అన్లోడింగ్ పనులకు వినియోగించుకోవాలని సూచించారు.  ధాన్యం అన్లోడింగ్ అయిన వెంటనే ట్రక్ షీట్లను

తీసుకెళ్లాలని తెలిపారు.  రైస్ మిల్లులు,లారీ ట్యాగింగ్ సమస్యలు ఉంటే అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

                 మిర్యాలగూడ లారీ అసోసియేషన్ అదనంగా 50 లారీలను అందుబాటులో ఉంచాలని, ధాన్యం తరలింపు పూర్తయ్యే వరకు సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. 


         ఈ సందర్బంగా రైస్ 

 మిల్లర్ అసోసియేషన్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.         

                    లారీలు, హమాలీల కొరత లేకుండా 

ధాన్యం రవాణా, అన్లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  అధికారులకు సూచించారు. 

లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం  ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.

మిగిలిన ధాన్యాన్ని 10 రోజుల్లో పూర్తిగా లిఫ్టింగ్ చేయాలని తెలిపారు. 

మిల్లులకు ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం వెంటనే పరిష్కరిస్తుందని , రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ శాఖలు, మిల్లర్లు, లారీ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.


             ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ  ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి వెంకటేష్, మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు,  పౌర సరఫరాల డిఎం రాంపత్తి నాయక్, తహసిల్దార్ శ్రీనివాస్, మిల్లర్లు గౌరు శ్రీనివాస్,  బాబి ,

నవీన్ శ్రీరామ్, రైస్ మిల్స్ యజమానులు ,, అధికారులు  హాజరయ్యారు.

____________________________  

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Wednesday, 13 May 2026

అమరజీ సేవా సమితి సేవా కార్యక్రమం బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

 అమరజీ సేవా సమితి సేవా కార్యక్రమం

బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ




అమరజీ సేవా సమితి ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం మానవతా విలువలకు ప్రతీకగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను సమితి సభ్యులు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ శేపూరి చిరంజీవి గారికి అవసరమైన బియ్యం, పప్పులు, నూనె, చక్కెర, ఇతర కిరాణా సామగ్రిని శ్రీమతి వందనపు శిల్పా గారు స్వయంగా వారి నివాసానికి వెళ్లి అందజేశారు. కుటుంబ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకొని, మానవత్వంతో ముందుకొచ్చి సహాయం చేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

ఇటీవల ప్రమాదం కారణంగా గాయపడిన కుటుంబ పెద్ద ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో, ఈ సహాయం వారికి తాత్కాలిక ఉపశమనం కలిగించిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అవసర సమయంలో ఆదుకున్న అమరజీ సేవా సమితి సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, అవసరమైన వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కూడా పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సహాయ సహకారాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు.

— సేవే లక్ష్యంగా అమరజీ సేవా సమితి

Saturday, 9 May 2026

అంగన్‌వాడీల్లో ‘ఫ్యాన్–ట్యూబ్’ పేరిట దోపిడీ!





 అంగన్‌వాడీల్లో ‘ఫ్యాన్–ట్యూబ్’ పేరిట దోపిడీ!

₹20 లక్షల టెండర్… ₹10 లక్షలు మింగేసినట్టు ఆరోపణలు

 ఒక మోడల్ కి బదులు తక్కువ ధర మోడల్ సరఫరా – సప్లయర్‌తో చేతులు కలిపిన అధికారులేనా?

నల్గొండ, శంఖారావం:

చిన్నారుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమమే అవినీతి అడ్డాగా మారిందా? అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఎండాకాలం ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ సదుద్దేశాన్ని కొందరు తమ జేబులు నింపుకునేందుకు వాడుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

శాఖా బడ్జెట్ లేనప్పటికీ మినరల్ ఫండ్స్ నుంచి నిధులు మళ్లించి అంగన్‌వాడీ కేంద్రాలకు హై స్పీడ్ ఫ్యాన్లు, 3-ఇన్-వన్ LED ట్యూబ్‌లైట్లు సరఫరా చేయాలంటూ టెండర్ పిలిచారు. టెండర్ ప్రక్రియ, ఆర్డర్ జారీ వరకూ అన్నీ నిబంధనల ప్రకారమే జరిగినట్టు చూపించారు. కానీ అసలు దోపిడీ సప్లై దశలోనే మొదలైందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

పేరు ఒక్కటే… సరుకు వేరే!

టెండర్‌లో పేర్కొన్న క్రాంప్టన్ హై స్పీడ్ ఫ్యాన్లకు బదులుగా  క్రాంప్టన్ సివిడ్ మోడల్ నార్మల్ సీలింగ్ ఫ్యాన్లు,

అలాగే 3-ఇన్-వన్ LED ట్యూబ్‌లైట్ల స్థానంలో సాధారణ ట్యూబ్‌లైట్లు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల అయితే టెండర్‌లో లేని ఇతర కంపెనీల ట్యూబ్‌లైట్లు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సగం సొమ్ము స్వాహా?

ఈ నాసిరకం సరఫరాతో ₹20 లక్షల టెండర్‌లో సుమారు ₹10 లక్షల మేర ప్రభుత్వ సొమ్ము గాలిలో కలిసిపోయిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం సప్లయర్ ఒక్కడి పని కాదని, కొంతమంది అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లల సంక్షేమమా? లేక కొందరి కమీషన్లా?

పిల్లల కోసం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది అధికారులు, సప్లయర్లు కలిసి కమీషన్ల పండుగగా మార్చేశారన్న విమర్శలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన వసతులు కల్పించాల్సిన బదులు, చెత్త సరుకుతో ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారన్న ఆరోపణలు ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై కళ్లెత్తి చూడాలని,

సప్లై చేసిన సామగ్రిపై తక్షణ ఫిజికల్ వెరిఫికేషన్,

టెండర్ నిబంధనలతో సరఫరా సరుకును పోల్చి విచారణ,

అవినీతికి పాల్పడిన సప్లయర్‌తో పాటు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

లేకపోతే… పిల్లల పేరుతో జరిగిన ఈ దోపిడీకి న్యాయం జరగదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

— శంఖారావం ప్రతినిధి

Friday, 8 May 2026

ప్రకాశం బజార్‌లో భూకబ్జాదారుల ఆగడాలు

 ప్రకాశం బజార్‌లో భూకబ్జాదారుల ఆగడాలు


1959 రిజిస్ట్రేషన్ ఉన్న భూమిపై భూకబ్జాదారుల కన్ను

మున్సిపల్ కమిషనర్‌కు బాధితుల వినతిపత్రం

ప్రకాశం బజార్ ప్రాంతంలో తాతల కాలం నుంచి వస్తున్న తమ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు గడాలె విజయ, జయ ప్రకాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ భూకబ్జాయత్నాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

బాధితుల మాటల్లో చెప్పాలంటే, సంబంధిత భూమికి 1959 సంవత్సరానికి చెందిన చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్పష్టంగా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ, ఎలాంటి రిజిస్టర్ డాక్యుమెంట్లు గానీ, హక్కు పత్రాలు గానీ లేని కొంతమంది వ్యక్తులు భూమిని కబ్జా చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు

న్యాయం కోసం మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి సరైన స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, వాస్తవాలను పూర్తిగా వక్రీకరిస్తూ మీడియాకు తప్పుడు సమాచారం అందించి అధికారులను మభ్యపెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే భూకబ్జాదారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, తమ పరువుకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా కూడా వేయడానికి వెనుకాడబోమని గడాలె విజయ, జయ ప్రకాష్ స్పష్టమైన హెచ్చరిక చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ప్రజా ఉద్యమానికి దిగాల్సి వస్తుందని వారు తేల్చిచెప్పారు.

Wednesday, 6 May 2026

డబ్బులు ఇవ్వలేదని సరెండర్ చేశారు - డీఎస్‌ఓపై సీఎస్‌కు డిప్యూటీ తహసీల్దార్ సంచలన ఫిర్యాదు"*

 l

డబ్బులు ఇవ్వలేదని సరెండర్ చేశారు - డీఎస్‌ఓపై సీఎస్‌కు డిప్యూటీ తహసీల్దార్ సంచలన ఫిర్యాదు"*  


*"సెల్ రిపేర్‌లో ఉంది... ఫోన్ ఎత్తలేదనే నెపంతో వేటు: బాధితుడు 

క్రైమ్ బ్యూరో*  

*నల్లగొండ:* "లంచం ఇవ్వలేదనే అకారణంగా సరెండర్ చేశారు" అంటూ జిల్లా పౌరసరఫరాల అధికారి - డీఎస్‌ఓపై పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సంచలన ఆరోపణలు చేశారు. తన సరెండర్ ఉత్తర్వులు రద్దు చేసి యథావిధిగా విధుల్లో కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.

*ఫిర్యాదులో ఏముంది?*  

"నా సెల్ ఫోన్ రిపేర్‌లో ఉండటంతో గత నెల 21న డీఎస్‌ఓ ఫోన్ చేస్తే మాట్లాడలేకపోయాను. కానీ 22న నాకు మెమో ఇచ్చారు. నేను మునుగోడు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో విధుల్లో ఉన్నానని వివరణ ఇచ్చాను. అయినప్పటికీ 30న ఆకస్మికంగా నన్ను సరెండర్ చేశారు" అని రఘునందన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


*"చాలాసార్లు డబ్బులు అడిగారు"*  

"డీఎస్‌ఓ చాలాసార్లు నన్ను డబ్బులు అడిగారు. నేను ఇవ్వలేనని చెప్పాను. ఆ కక్షతోనే నన్ను అకారణంగా సరెండర్ చేశారు" అని డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ సీఎస్‌కు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన ఆరోపణ చేశారు.

ధాన్యం కొనుగోళ్ల సీజన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. అక్రమ రవాణా, దళారుల దందా అరికట్టాల్సిన డిప్యూటీ తహసీల్దార్‌నే సరెండర్ చేయడంపై శాఖలో చర్చ జరుగుతోంది. ఫోన్ ఎత్తలేదనే సాకుతో మెమో ఇచ్చి, విధుల్లో ఉన్నా పట్టించుకోకుండా సరెండర్ చేయడం వెనుక "లంచం మతలబు" ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

* శంఖారావం ప్రశ్న:*  

1. సెల్ రిపేర్‌లో ఉంటే అది నేరమా? అధికారిక మెమోకు విధుల్లో ఉన్నానని వివరణ ఇచ్చినా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?  

2. డబ్బులు అడిగారనే ఆరోపణపై విచారణ జరగాలి.

3. ధాన్యం కొనుగోళ్ల వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిని తప్పిస్తే దళారులకు పండగేనా?


సీఎస్ ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారో, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్‌ఓపై చర్యలు ఉంటాయో లేదో వేచి చూడాలి.


ఈ విషయం పై DSO వివరణ కోరగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చండూరు RDO ఇచ్చిన రిపోర్ట్ తో జాయింట్ కలెక్టర్ dt ని సరెండర్ చేసినట్లు తెలిపారు. తనపై dt చేసిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.


Saturday, 2 May 2026

*"అమరవాది సభ పెత్తనం ఆంధ్రా వారిదే - తెలంగాణ ఆర్యవైశ్యుల బహిష్కరణతో అమరావాది సభ అట్టర్ ఫ్లాప్"* - మిడిదుడ్డి శ్యాంసుందర్





*"అమరవాది సభ పెత్తనం ఆంధ్రా వారిదే - తెలంగాణ ఆర్యవైశ్యుల బహిష్కరణతో అమరావాది సభ అట్టర్ ఫ్లాప్"*

- మిడిదుడ్డి శ్యాంసుందర్


*హైదరాబాద్, , మే 2:* అమరవాది ప్రమాణ స్వీకార సభ కాస్తా ఆంధ్రా నాయకుల సభగా మిగిలిపోయింది. తెలంగాణ ఆర్యవైశ్య నాయకులు, ప్రముఖులు మూకుమ్మడిగా బహిష్కరించడంతో అమరావాది వర్గం పరువు బజారున పడిందని మిడిదుడ్డి శ్యాంసుందర్ విమర్శించారు.


*తెలంగాణ నాయకుల పూర్తి బహిష్కారం*  

నేడు జరిగిన ప్రమాణ స్వీకారానికి తెలంగాణ వైశ్య పితామహుడు గంజి రాజమౌళి గుప్తా, MLC బొగ్గారాపు దయానంద్, MLA దన్‌పాల్ సూర్యనారాయణ, మాజీ MLA గణేష్ గుప్త, వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సుజాత, మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్ గుప్త, బొల్లం సంపత్ తదితర తెలంగాణ ప్రముఖులెవ్వరూ హాజరుకాలేదు. ప్రోటోకాల్ ఉన్న నాయకులు సైతం ఈ "అక్రమ ఎన్నిక గెలుపు"ను సమ్మతించక బహిష్కరించడం గమనార్హం. అని ఆయన అన్నారు.


అమరవాది కి *"ఆంధ్రానే దిక్కు" అయ్యిందని - శ్యామ్ సుందర్ ధ్వజం ఎత్తారు.

ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. "11 ఏండ్లుగా అప్రజాస్వామికంగా ఉన్న అమరావతి వర్గానికి తెలంగాణ ఆర్యవైశ్యులు బుద్ధి చెప్పారు. నిన్నటిదాకా 'బయటి రాష్ట్రం' అంటూ ఆంధ్రాను సంబోధించిన వారే, నేడు TG వెంకటేష్, కనక రాజు లాంటి ఆంధ్రా నాయకులే దిక్కయ్యారు. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనం" అని విమర్శించారు.


*"శ్రీశైలం సత్రం విమర్శ మరిచారా?" - అని ఆయన  సూటి ప్రశ్న*   వేశారు. "గతంలో శ్రీశైలం సత్రంలో TG పేరు పెడితే 'తెలంగాణ వారు లేరా?' అని విమర్శించిన అమరవాది, ఇప్పుడు తనకు ఆంధ్రా వారే దిక్కు కావడం ఏవిధంగా సమర్థించుకుంటారు? అప్పుడు ప్రాంతీయవాదం, ఇప్పుడు ఆంధ్రా వాదమా? ఆయన వైఖరి ఏమిటో తెలంగాణ ఆర్యవైశ్య సమాజానికి తెలియజేయాలి" అని శ్యామ్ సుందర్ నిలదీశారు.


*"2-3 ఓట్ల గెలుపు గెలుపు కాదు"*  

"స్వచ్ఛమైన నీతి నిజాయితీ ఓట్లు నాకు 520 వచ్చాయి. డబ్బు, అంగబలం, అధికారం ఉపయోగించి సాంకేతికంగా 2-3 ఓట్లతో గెలిచామనుకోవడం భ్రమ. సమాన ఓట్లు వచ్చాయంటేనే జనవ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోండి" అని శ్యామ్ సుందర్ స్పష్టం చేశారు.


*"కోర్టు ద్వారా బుద్ధి చెబుతాం"*  

కేవలం కొద్దిమంది రైస్ మిల్లర్ల నాయకులతో సభ జరిపి ప్రమాణ స్వీకారం చేసుకోవడం విఫల ప్రయత్నమని ఆయన ఎద్దేవా చేశారు. "అక్రమ పదవి శాశ్వతం కాదు. ఉప్పల్‌లో కానీ మహాసభలో కానీ అన్యాయం జరిగితే పోరాటం తప్పదు. అక్రమాలపై త్వరలోనే న్యాయస్థానం ద్వారా బుద్ధి చెబుతాం" అని హెచ్చరించారు.

 "పదవులు, బానిసత్వం, గులాంగిరి, వ్యాపారం కోసం కొందరు ఉండవచ్చు. కానీ ఆత్మాభిమానం, పౌరుషం, న్యాయం, ధర్మం ఉన్న ఆర్యవైశ్య జాతి ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. అవసరమైతే మన సత్తా, బలం, బలగం, పోరాటం చూపిస్తాం. వేచి చూద్దాం" అని పేర్కొన్నారు.


_తెలంగాణ నాయకులు పూర్తిగా దూరం పెట్టడంతో అమరవాది వర్గం ఏకాకి అయ్యింది. "తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ" పేరు పెట్టుకుని ఆంధ్రా వారితో సభ జరుపుకోవడం విడ్డూరంగా ఉందని సామాజిక వర్గం చర్చించుకుంటోంది._


---

Friday, 1 May 2026

ఒవైసీ కాలేజీ ఆక్రమణలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది?


 ఒవైసీ కాలేజీ ఆక్రమణలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది? 


పేదల ఇండ్లు కూల్చడంలో చూపించిన అత్యుత్సాహం చెరువులు ఆక్రమించి కడుతుంటే కనపడట్లేదా!


హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం..


సల్కం చెరువును ఆక్రమించి నిర్మించిన ఒవైసీ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఓ న్యాయవాది


ఈ పిటిషన్ విచారిస్తూ పేదల ఇళ్ల మీదకి ఎలాంటి నిబంధనలు లేకుండా వెళ్లే హైడ్రాకు ఒవైసీ కాలేజీ పట్ల వివక్ష ఎందుకని నిలదీసిన న్యాయమూర్తి..


ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్థారణకు రెండు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా, ఎన్ని ఏళ్లు ఏం చేశారని, ఆక్రమణలకు బాధ్యులైన అధికారులపై నివేదిక తయారు చేయాలని హైకోర్టు ఆదేశాలు..


ఒవైసీ విద్యాసంస్థలో చదువుతున్న వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి మార్చాలని, బయటికి వెళ్లాలనుకునే వారికి ఒవైసీ కాలేజీ యాజమాన్యం సహకరించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు..