*వ్యాపార ముసుగులో భారీ మోసం!
**వ్యాపార ముసుగులో భారీ మోసం!
వాటా ఇస్తానంటూ రూ.24.53 కోట్లకు గండికొట్టిన బీజేపీ నేత గజ్జల యోగానంద్**
వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానని నమ్మించి కోట్లాది రూపాయలు దోచుకున్న ఘటన సైబరాబాద్‌లో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గజ్జల యోగానంద్ పై రూ. 24.53 కోట్ల మోసం ఆరోపణలతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, షేర్ల కేటాయింపు పేరుతో బాధితుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి, ఆపై తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్నప్పటికీ ఒప్పందాలను అమలు చేయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలపై లోతైన విచారణ జరుపుతున్నారు. అవసరమైతే మరిన్ని సెక్షన్లు జోడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాజకీయ హోదా వెనుక దాగి వ్యాపార ముసుగులో సాగిన ఈ భారీ మోసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home