Wednesday, 15 July 2026

ఘనంగా ప్రారంభం ఐన కుబేరా సిల్క్స్ దిల్‌సుఖ్‌నగర్ నూతన బ్రాంచ్‌*




 *ఘనంగా ప్రారంభం ఐన కుబేరా సిల్క్స్ దిల్‌సుఖ్‌నగర్ నూతన బ్రాంచ్‌*


*ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*


 దిల్‌సుఖ్‌నగర్‌లో మిరిదొద్ది శ్యామ్ సుందర్ గారు ప్రముఖ వస్త్ర సంస్థ కుబేరా సిల్క్స్ నూతన (4వ) బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. 


ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన షోరూమ్‌ను ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ, వ్యాపార రంగంలో నాణ్యత, విశ్వసనీయత, వినియోగదారుల సంతృప్తిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న కుబేరా సిల్క్స్ యాజమాన్యాన్ని అభినందించారు. ఒకే చోట పట్టు చీరలు, బ్రైడల్ కలెక్షన్స్, డిజైనర్ చీరలు మరియు వివిధ రకాల వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.


నేటి పోటీ ప్రపంచంలో వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యమని, ఆ నమ్మకంతోనే కుబేరా సిల్క్స్ వరుసగా కొత్త బ్రాంచ్‌లను ప్రారంభిస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. ఈ సంస్థ మరింత విస్తరించి, మరెందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


ఈ సందర్భంగా కుబేరా సిల్క్స్ యాజమాన్యం ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని ఘనంగా సన్మానించి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి తమను ఆశీర్వదించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో కుభేర సిల్క్స్ టీం తదితరులు పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home