ప్రకాశం బజార్‌లో భూకబ్జాదారుల ఆగడాలు
ప్రకాశం బజార్‌లో భూకబ్జాదారుల ఆగడాలు
1959 రిజిస్ట్రేషన్ ఉన్న భూమిపై భూకబ్జాదారుల కన్ను
మున్సిపల్ కమిషనర్‌కు బాధితుల వినతిపత్రం
ప్రకాశం బజార్ ప్రాంతంలో తాతల కాలం నుంచి వస్తున్న తమ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు గడాలె విజయ, జయ ప్రకాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ భూకబ్జాయత్నాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
బాధితుల మాటల్లో చెప్పాలంటే, సంబంధిత భూమికి 1959 సంవత్సరానికి చెందిన చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్పష్టంగా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ, ఎలాంటి రిజిస్టర్ డాక్యుమెంట్లు గానీ, హక్కు పత్రాలు గానీ లేని కొంతమంది వ్యక్తులు భూమిని కబ్జా చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు
న్యాయం కోసం మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి సరైన స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, వాస్తవాలను పూర్తిగా వక్రీకరిస్తూ మీడియాకు తప్పుడు సమాచారం అందించి అధికారులను మభ్యపెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే భూకబ్జాదారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, తమ పరువుకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా కూడా వేయడానికి వెనుకాడబోమని గడాలె విజయ, జయ ప్రకాష్ స్పష్టమైన హెచ్చరిక చేశారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ప్రజా ఉద్యమానికి దిగాల్సి వస్తుందని వారు తేల్చిచెప్పారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home