Tuesday, 31 March 2026

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 న నిర్వహించే గ్రామ,మున్సిపల్ వార్డు సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.



       ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 న నిర్వహించే గ్రామ,మున్సిపల్ వార్డు సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్  అధికారులను ఆదేశించారు.

           గ్రామ, మున్సిపల్ వార్డు సభల నిర్వహణ వి


షయమై మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

          అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు ,మండల స్థాయి అధికారులతో ఇదే విషయమై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

      ప్రభుత్వ  నియమ నిబంధనల ప్రకారం  గ్రామ, మున్సిపల్ వార్డు సభలు నిర్వహించాలని, ఈ గ్రామ,వార్డు సభలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, తదితరులు అందర్నీ ఆహ్వానించాలన్నారు. గ్రామ సభలో వివిధ పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల పేర్లన్నీ చదివి వినిపించాలని చెప్పారు. గ్రామసభకు హాజరయ్యే వారి కి అవసరమైన టెంటు, తాగునీరు వంటివి ఏర్పాటు చేయాలని, ఆయా పథకాల కింద లబ్ధిదారులను గుర్తించి వారి ద్వారా వారు పొందిన లబ్ధిపై మాట్లాడించాలన్నారు. గ్రామసభల నిర్వహణ వివరాలన్ని రిపోర్టు రూపంలో డాక్యుమెంటేషన్ చేసి పంపించాలని తెలిపారు. గ్రామసభ సక్రమ నిర్వహణకు గాను ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, గ్రామ సభకు సంబంధించి గ్రామ అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు.   గ్రామ సభలలో భాగంగా ఆయా పథకాల కింద లబ్ధిదారులకు లబ్ధిని కల్పించే పత్రాల పంపిణీ ఏర్పాటు చేసుకోవాలని, గ్రామసభల ను సవ్యంగా నిర్వహించేందుకు తక్షణమే మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.

      అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ,వార్డ్ సభలను పకడ్బందీగా నిర్వహించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడాలని, జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరిని గ్రామ సభలకు పిలవాలని, ప్రభుత్వం ద్వారా వివిధ పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల పేర్లన్నీ చదివి వినిపించాలని, ముఖ్యంగా రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ జీవిత బీమా, పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం వంటి వాటన్నిటిపై తెలియజేయాలని అన్నారు.

         రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆయా శాఖల సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు, అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.

        స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్ నాయక్, గృహ నిర్మాణ పిడి రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జెడ్పిసిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

_________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Tuesday, 24 March 2026

ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక రుణాలు యాక్షన్ ప్లాన్ విడుదల*

 *ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక రుణాలు యాక్షన్ ప్లాన్ విడుదల*


 *▪️ ఏప్రిల్ 11 నుండి మే 20 వరకు లోన్స్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్*


 *2025 - 26 సంవత్సరానికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పలు యూనిట్ల ప్రాతిపదికన ఆర్థిక చేయూత రుణాలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.*


 *దీని ప్రకారం ఏప్రిల్ 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి.*


ఇందులో 


1. ప్యాసింజర్ ఆటో 4వీలర్=8,00,000/- 

2.పాసింజర్ ఆటో3వీలర్ =3,00,000/- 

3.ఎలెక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్=2,000,000/-

4. ఎలెక్ట్రిక్ ఆటో =3,00,000/-

5. పాసింజర్ కార్ (4 వీలర్)=1000000/-

6. గూడ్స్ ట్రక్ తదితర యూనిట్ల =10,00,000/- 

7. ఫ్లవర్ బొక్కే షాప్ =2,50,000/-

8. అగ్రికల్చర్ డ్రోన్ =10,00,000/- 

9. వర్మీ కంపోస్టు =2,50,000/-

10. నెట్ సెంటర్ =2,70,000/-

11. LED బల్బ్ =2,80,000/-

12. ఫ్లంబింగ్, ఎలక్ట్రికల్ షాప్=2,90,000/-

13. వాటర్ బాటిల్ తయారీ =2,90,000/-

14. వాటర్ రీసైక్లింగ్ =2,95,000/-

15. మొబైల్ రేపైరింగ్ షాప్ =3,10,000/-

16. Soap డిటర్జెంట్ తయారీ =3,20,000/-

17. Fish ఫార్మింగ్ =3,50,000/-

18. Car వాష్ =3,50,000/-

19. బ్రిక్స్ మేకింగ్=3,50,000/-

20. Tourism =3,50,000/-

21. బేకరి షాప్ =3,60,000/-

22. సిరి culture =3,80,000/-

23. Water R O plant =3,80,000/-

24. Welding ఫ్యాబ్రికేషన్ =3,85,000/-

25. Solar ప్రొడక్టింగ్ =3,90,000/-

26. జ్యూట్ బ్యాగ్ =3,90,000/-

27. సోలార్ ప్యానెల్ =3,95,000/-

28. కొబ్బరికాయ తోట=4,00,000

29. ఫోటో షాప్ =4,00,000/- 

30. ఆయుర్వేదిక్ మెడికల్ =4,00,000/–

31. జనరల్ మెడికల్ షాప్=5,00,000/- 

32. బ్యూటీ పార్లర్ =5,00,000/- 

33. మెడికల్ లాబ్ =5,00,000/- 

*34. E V బ్యాటరీ ఛార్జింగ్* =2,00,00,000/-

విశాఖ: ఏసీబీకి చిక్కిన సచివాలయం ఉద్యోగి.

 #ఏసీబీ వలలో మరో #అవినీతి అధికారి.

విశాఖ: ఏసీబీకి చిక్కిన సచివాలయం ఉద్యోగి.

రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అక్కయ్యపాలెం సచివాలయ ఉద్యోగి పైలా రాజేష్..

https://heyzine.com/flip-book/7c3e81f4c3.html

 https://heyzine.com/flip-book/7c3e81f4c3.html

శ్రీరామ నవమి ఎప్పుడు? భద్రాచలంలో కల్యాణం ఏ రోజు?

 శ్రీరామ నవమి ఎప్పుడు? భద్రాచలంలో కల్యాణం ఏ రోజు? 

      భారతీయ సంస్కృతిలో ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడి జన్మదినం 'శ్రీరామనవమి'. లోకోద్ధరణ కోసం అయోధ్యలో దశరథ నందనుడిగా రాముడు అవతరించిన ఈ పర్వదినం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమోగే ఈ వేడుకలు, ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నుంచే ప్రారంభమైన వసంత నవరాత్రులు నవమి నాటికి పరాకాష్టకు చేరుకుంటాయి. ఈ ఏడాది 2026, మార్చి 27వ తేదీన (శుక్రవారం) భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 26న నవమి తిథి ప్రవేశించినప్పటికీ, సూర్యోదయ తిథి మరియు వైష్ణవ సంప్రదాయం ప్రకారం 27నే ప్రధాన వేడుకలు జరగనున్నాయి. మరిన్ని కనుగొనండి మనీ మేనేజ్‌మెంట్ సలహా విద్య & ఉద్యోగ కోర్సులు క్రికెట్ స్కోర్లు క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు ఆటోమొబైల్స్ రివ్యూ అభిజిత్ లగ్నంలో కల్యాణం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వేలాదిమంది భక్తుల సమక్షంలో ఉదయం 11:06 గంటల నుంచి మ 1:31 గంటల మధ్య అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం అత్యంత శాస్త్రోక్తంగా జరుగుతుంది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా మంత్రులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించడం ఇక్కడి ఆచారం. మరుసటి రోజు, అంటే మార్చి 28న స్వామివారి మహా పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా సాగనుంది. Also Read అయోధ్య చరిత్రలో మరో అద్భుత ఘట్టం, ఏంటి 'శ్రీరామ యంత్రం’? భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ సౌకర్యాలను కల్పించారు. కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూడలేని భక్తుల కోసం ఆర్టీసీ (TGSRTC) ద్వారా తలంబ్రాలను నేరుగా ఇంటికే పంపించే ప్రత్యేక విభాగాన్ని కూడా ప్రారంభించారు. భద్రాద్రి రాముడి కల్యాణ తలంబ్రాలను శుభకార్యాల్లో ఉపయోగించుకోవడం భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు. Powered By Recommended For You శ్రీరామ నవమి రోజు ఈ దానాలు చేయండి.. కానీ ఈ తప్పులు చేసి పాపాలు మూటకట్టుకోవద్దు! ధర్మ స్థాపనకు మార్గదర్శి రాముడి జీవితం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ జీవన విధానం. పితృవాక్య పరిపాలన, ఏకపత్నీ వ్రతం, ప్రజా రంజక పాలన వంటి ఆదర్శాలతో 'రామరాజ్యం' ఎలా ఉండాలో ఆయన చేసి చూపించారు. నేటి సమాజంలో నైతిక విలువలు కాపాడుకోవడానికి రాముడి అడుగుజాడల్లో నడవడం ఎంతో అవసరమని ఆధ్యాత్మిక వేత్తలు ప్రబోధిస్తున్నారు.

Monday, 23 March 2026

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.





 ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

       ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

      ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ను సీరియస్ గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో ఆదేశించినట్లు ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ సభలో ప్రభుత్వ ప్రాధామ్య పథకాలు, 6 గ్యారంటీలకు సంబంధించి గ్రామపంచాయతీ, మండల,  మున్సిపల్,జిల్లా వారిగా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాను తక్షణమే తయారు చేసి సిపిఓ కు  సమర్పించాలి. మండల ప్రత్యేక అధికారులు  మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను సందర్శించి ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి.

      జనగణనకు సంబంధించి తక్షణమే ఎన్యుమరేషన్ బ్లాక్ లను  నిర్ణయించడంతోపాటు, సూపర్వైజర్ల తుది జాబితాను రూపొందించాలి. అంతేకాక నియామకపు తరువులు జారీ చేయాలి.

        ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా వివిధ పథకాల కింద నిధులు పొందిన అధికారులందరూ తక్షణమే యుటీలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలి.

     జంతు సంరక్షణ లో భాగంగా మిర్యాలగూడలో చేపట్టిన ఏబిసీ 

 స్టెరిలైజేషన్ కేంద్రం పనులను వేగవంతం చేయాలి. మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు పనులు జరిగేలా చూడాలి. దేవరకొండ ఆర్డిఓ దేవరకొండలో ఏబి సి కేంద్రం ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలాన్ని చూడాలి. అందరూ మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి అన్ని మేజర్ గ్రామపంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలలో ఏబీసీల ఏర్పాటుకు స్థలాన్ని చూడాలి.  

        కుక్కల రిహబిలిటేషన్ గాను నల్గొండ మున్సిపల్ కమిషనర్ నల్గొండలో కుక్కల షెల్టర్ ను  ఏర్పాటు చేయాలి. ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల ఆవరణలలో సంచరించే కుక్కలకు సెంటర్లకు తరలించే ఏర్పాటు  చేయాలి. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఒక రోజు "దత్తత" కార్యక్రమాన్ని నిర్వహించి ఆవులు, కుక్కలను దత్తత ఇచ్చేలా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్  చూడాలి.  దీనికి మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ సహకార అందించాలని కలెక్టర్ ఆదేశించారు .

       ఈ సమావేశంలో ఉపాధి హామీ ,తదిత అంశాలపై సమీక్షించారు.

         కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 40 పిటిషన్లు,  ఇతర శాఖలకు 43 పిటిషన్లు,  మొత్తం 83 ఫిర్యాదులను ప్రజలు ప్రజావాణిలో సమర్పించారు.

        మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ  అమిత్, రెవెన్యూ అదనపు కలెక్ట్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

__________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

పదవ తరగతి పరీక్షలు ముగిసేవరకు కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.



 పదవ తరగతి పరీక్షలు ముగిసేవరకు  కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

        సోమవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో ఉన్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.

         పరీక్షా కేంద్రాలలో  అన్ని వసతులు ఎప్పటిలాగే ఉండాలని,ప్రత్యేకించి తాగునీరు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,టాయ్ లెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని అధికారులకు చెప్పారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా కుండలలో తాగునీరు  ఏర్పాటు చేయాలని అన్నారు. 

పరీక్ష కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేయాలని తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని,పూర్తి స్థాయిలో తనిఖీ తర్వాతే విద్యార్థులను  పరీక్ష కేంద్రం లోకి పంపించాలన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల హాజరు,తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స లో భాగంగా ఏ ఎన్ ఎం తో మాట్లాడారు.వేసవిని దృష్టిలో ఉంచుకొని ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్


 తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 

         తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు నూతన నేషనల్ హైవేలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ హైవే 565 అందుబాటులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్ వద్ద మొదలై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో గల ఏర్పేడు వద్ద ఈ రహదారి ముగుస్తుంది. ఈ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మదనపల్లి నుంచి నాయుడుపేట వెళ్లే ఎన్ హెచ్ 71తో కలుపుతుంది. తెలంగాణా నుండి తిరుపతికి కొత్త మార్గం తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుపతి వెళ్లాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయ జాతీయ రహదారి దొరికినట్లు అయింది. ఈ కొత్త మార్గం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రాపూరు, వెంకటగిరి, ఏర్పేడు ప్రాంతాల మీదుగా ఈ రహదారి సాగుతుంది. మరిన్ని కనుగొనండి TV & Video జాతీయ వార్తలు సబ్స్క్రిప్షన్ తెలుగు భాషా కోర్సులు ఆరోగ్యం & ఫిట్‌నెస్ ఉత్పత్తులు ఎన్ హెచ్ 565 నిర్మాణంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ గతంలో మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం నుండి హైదరాబాదుకు రాత్రిపూట అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే జనాలు ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మీదుగా దారుణంగా రోడ్డు ఉండేది. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ఈ ఎన్ హెచ్ 565 నిర్మాణం చేయడంతో ప్రస్తుతం ఆ కష్టాలు తొలగిపోయాయి. ప్రయాణికులకు ప్రయాణం చాలా సులభతరంగా మారింది. రహదారి విస్తరణకు అటవీ అనుమతుల జాప్యంతో అడ్డంకి NH565 లోని 20 కిలోమీటర్ల రహదారి విస్తరణకు అటవీ అనుమతుల జాప్యం వంటి అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే 2024లో ఈ పనులకు లైన్ క్లియర్ కావడంతో, వేగవంతం చేసి నిర్దేశిత సమయం కంటే ముందుగానే పూర్తి చేశారు. అటవీ ప్రాంతంలో సాగే ఈ మార్గం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. Powered By 20 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం కోసం 393 కోట్ల రూపాయల ఖర్చు గతంలో పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మండలం వరకు ప్రయాణం చేయాలంటే 50 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల్లోనే ప్రయాణం సాగుతుంది. దీంతో సమయం బాగా ఆదా అవుతుంది. 20 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం కోసం 393 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అటవీ మరియు ఘాట్ ప్రాంతాలను కలుపుతూ 16 వంతెనలు, ఎనిమిది అండర్ పాస్ లు ఈ మార్గంలో ఏర్పాటయ్యాయి. Also Read హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! ఈ ప్రాంతాల మీదుగా రహదారి మొత్తం 420 కిలోమీటర్ల పొడవైన ఈ హైవేలో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్, నల్గొండ, దేవరకొండ, కనగల్ ప్రాంతాల మీదుగా వచ్చి, మాచర్ల వద్ద ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఏర్పేడు వద్ద ఎడమవైపుకు వెళితే కాళహస్తి కుడివైపుకు వెళితే తిరుపతిని చేరుకునేలా ఈ మార్గం ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు తిరుపతి వెళ్లడం ఈజీ అవుతుంది.

Sunday, 22 March 2026

ఘనంగా వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం .,........




 ఘనంగా వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం .,........                             











  హైదరాబాద్... వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమము మహిళా దినోత్సవ వేడుకలు శనివారం రోజు కర్మన్ఘాట్ లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది ఫౌండేషన్ గ్లోబల్ అధ్యక్షులుగా మేడ నరేష్ ప్రధాన కార్యదర్శిగా నారాయణస్వామి కోశాధికారిగా గ్రంధి సతీష్ ఉపాధ్యక్షులుగా కమలాపురం నాగేష్ లు మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా ఎస్ విజయలక్ష్మి కే వసంత కోశాధికారిగా ఎస్ నీరజలు ప్రమాణస్వీకారం చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీ శివ స్వామి మాట్లాడుతూ  హిందూ ధర్మాన్ని సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని అన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గందే సుధాకర్ ఇమ్మడి జూఎలర్స్ అధినేత విబిజి నాయకులు ఇమ్మడి రమేష్.లా కేఫిన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ. విబిజి ఫౌండర్లు మడిపడి గ రాము మడిపడిగ రాజు,ప్రసాద్,ఫౌండేషన్ నాయకులు రాజేశ్వర్ డొంకేశ్వర్ పబ్లిషెడ్ శివకుమార్ బుగ్గారి శివకుమార్ ఎల్వి సేవా వేదిక అధ్యక్షులు ఎల్వీ కుమార్ జగిని శ్శ్రీనివాస్.జగిని రమేష్ మయూకా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు

Saturday, 14 March 2026

సూర్యాపేటలో మిరుదొడ్డి శ్యామ్ కి బ్రహ్మరథం

 

సూర్యాపేటలో మిరుదొడ్డి శ్యామ్ కి బ్రహ్మరథం



 *ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అద్యక్షులు గా మిరుదొడ్డి శ్యామ్ సుందర్ ని అత్యదిక మెజారిటీతో గెలిపించాలి*


*మీలా వంశి ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో మద్దతు పలికిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు*


సూర్యాపేట పట్టణం లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు శుక్రవారం సాయంత్రం ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా వంశీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అద్యక్షులుగా పోటి చేస్తున్న మిరుదొడ్డి శ్యామ్ సుందర్ కు మద్దతుగా జరిగిన సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ అమరావది లక్ష్మి నారాయణ గత 12 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా తానే చైర్మన్ గా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మహాసభకు ఎన్నికలు నిర్వహించాలని మిరుదొడ్డి శ్యామ్ సుందర్ పోరాటం చేసి ఎన్నికలు తీసుకుని రావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందరూమిరుదొడ్డి శ్యాంసుందర్ కు అత్యదికంగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ సుందర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్యవైశ్య భవన్ నిర్మాణం చేయడంతో పాటు, కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. శ్రీశైలం ఆర్య సత్రం చైర్మన్ గా వ్యవహరించారని, అనేక సేవా కార్యక్రమాలు చేశారని వారు తెలిపారు. ఆర్యవైశ్యులలో రాజకీయ చైతన్యం కావాలి అని, మార్పు కోరుకునే వారందరూ కూడా శ్యామ్ సుందర్ కు మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా మహదేవ్, కక్కిరేణి చంద్రశేఖర్, బ్రాహ్మండ్లపల్లి మురళిధర్, బొమ్మిడి లక్ష్మి నారాయణ, సింగిరికొండ రవీందర్, గొండ్రాల అశోక్, కర్నాటి రవి లు పాల్గొన్నారు. సూర్యాపేట ఆర్యవైశ్య నాయకులు కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, వెంపటి శబరినాథ్, చల్లా లక్ష్మయ్య, యామా సంతోష్, మంచాల శ్రీనివాస్, బెలిదె శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, మిర్యాల వెంకటేశ్వర్లు, వా సా లక్ష్మి నారాయణ,


Friday, 13 March 2026

 మార్చి మొదటి పక్షం

Thursday, 12 March 2026

ఆర్యవైశ్యుల శక్తి అపారం


 ఆర్యవైశ్యుల శక్తి అపారం

* జయాపజయాలను ప్రభావితం చేయగలరు

* వాసవీ పారాయణం ప్రపంచ రికార్డు సృష్టించాలి

హైదరాబాద్:  ఆర్యవైశ్యుల శక్తి అపారం..వారు తలచుకుంటే రాజకీయాలను , జయాపజయాలను ప్రభావితం చేయగలరని  మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వారు రాజకీయాల్లో ఎదగాలన్నారు.ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో ఆర్యవైశ్యులు వాసవి మాత పారాయణం చేయ తలపెట్టడం హర్షణీయమని  అన్నారు. ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా నలభై వేల మందితో... భవిష్యత్తులో ఎవరూ చేయలేని విధంగా వాసవీమాత పారాయణం చేయాలన్నారు. ఆ రికార్డు కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు 

శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం పేరిట ఈనెల 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సామూహిక పారాయణానికి సంబంధించి  గురువారం బంజారా హిల్స్ పార్క్ హోటల్ కర్టెన్ రెయిజర్ కార్యక్రమం జరిగింది.‌ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.‌ ఆయన మాట్లాడుతూ కల్వ సుజాత సంకల్పాన్ని కొనియాడారు. . శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం కావాలని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఆకాంక్షించారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కాల్వ సుజాత మాట్లాడుతూ 

 21,000 మందితో సామూహిక పారాయణానికి వైశ్యులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.  అందుకు తగిన ఏర్పాటు చేశామని వెల్లడించారు ఈ పారాయణం ప్రపంచ రికార్డు కాబోతోందని అన్నారు. ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించిన 102 చరణాల వాసవీ మాత స్తుతి గీతాన్ని  ఈ కార్యక్రమంలో ఆలపించారు. వాసవమ్మ జాతరకు తరలి రావాలంటూ ప్రముఖ జర్నలిస్ట్ , మఖన్లాల్ చతుర్వేది జర్నలిజం యూనివర్సిటీ బోర్డు మెంబర్ రావి కంటి శ్రీనివాస్ రచించి, దృశ్య రూపంలో చిత్రీకరించిన గీతాన్ని ఈ సందర్భంగా 

ప్రదర్శించారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కొణిజేటి సుబ్బారావు , ఉప్పల శ్రీనివాస్ గుప్తా, చీకోటి ప్రవీణ్ , కాచం సత్యనారాయణ, మలిపెద్ది శంకర్ తదితరులు పాల్గొన్నారు. .

Wednesday, 11 March 2026

జర్నలిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం! సీఎం తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులతో వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, మార్చి11 ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేసే అంశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ అన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీం ను జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జే ఎఫ్) బృందం బుదవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి హెల్త్ పాలసీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసినవారిలో టి డబ్ల్యూ జె ఎఫ్ ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ.చంద్ర శేఖర్ , బి జగదీశ్వర్ ఉన్నారు. గౌరవనీయులైన దామోదర రాజనర్సింహ్మ గారు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మాత్యులు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్. ໖: 11-3-2026 విషయం: ప్రభుత్వ ఉద్యోగుల హెల్కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయుట గురించి మనవి చేయునది ఏమనగా రాష్ట్రంలో జర్నలిస్టుల హెల్త్కేర్డులు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల పెండింగ్ పేర వైద్యచికిత్స అందించడం లేదు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ కింద ఉన్న నేపథ్యంలో సేవలు వేగంగా, నాణ్యంగా అందడం లేదు. హైదరాబాద్లోని నిమ్స్ కూడా చికిత్స పూర్తి ఉ చితంగా అందడం లేదు. దీంతో చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు, అధికమొత్తంలో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల కోసం 'తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ కేర్' పథకం ద్వారా ప్రత్యేక వైద్య చికిత్స పథకం అమలు కోసం కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు కూడా ఉద్యోగుల పథకాన్ని వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ని ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసి మెడిక్లెయిమ్ పథకం తరహాలో హెల్త్ కార్డుల పథకానికి ప్రభుత్వమే చెల్లించాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి. రిటైరైన జర్నలిస్టులనూ ఈపథకం కింద చేర్చాలి. సమస్యలు: 1. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేయనున్న కొత్త ఆరోగ్య కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించాలి. 2. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3. వెల్నెస్ కేంద్రాల్లో రోగులకు అన్ని రకాల పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు, టెక్నిషియన్లను కూడా రోగులకు వేగంగా సేవలు అందించేలా సంఖ్యను పెంచాలి. 4. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను గతంలో మాదిరిగా మార్చి పరీక్షలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కృతజ్ఞతలతో పి రాంచందర్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బి.బసవపున్నయ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి

 జర్నలిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం!

సీఎం తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుజర్నలిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం!
సీఎం తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం
టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులతో వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, మార్చి11
ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేసే అంశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ అన్నారు.
జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీం ను జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జే ఎఫ్) బృందం
బుదవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి హెల్త్ పాలసీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసినవారిలో టి డబ్ల్యూ జె ఎఫ్ ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ.చంద్ర శేఖర్ , బి జగదీశ్వర్ ఉన్నారు.
గౌరవనీయులైన దామోదర రాజనర్సింహ్మ గారు
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మాత్యులు
తెలంగాణ రాష్ట్రం,
హైదరాబాద్.
໖: 11-3-2026
విషయం: ప్రభుత్వ ఉద్యోగుల హెల్కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయుట గురించి
మనవి చేయునది ఏమనగా రాష్ట్రంలో జర్నలిస్టుల హెల్త్కేర్డులు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల పెండింగ్ పేర వైద్యచికిత్స అందించడం లేదు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ కింద ఉన్న నేపథ్యంలో సేవలు వేగంగా, నాణ్యంగా అందడం లేదు. హైదరాబాద్లోని నిమ్స్ కూడా చికిత్స పూర్తి ఉ చితంగా అందడం లేదు. దీంతో చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు, అధికమొత్తంలో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల కోసం 'తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ కేర్' పథకం ద్వారా ప్రత్యేక వైద్య చికిత్స పథకం అమలు కోసం కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు కూడా ఉద్యోగుల పథకాన్ని వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ని ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసి మెడిక్లెయిమ్ పథకం తరహాలో హెల్త్ కార్డుల పథకానికి ప్రభుత్వమే చెల్లించాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి. రిటైరైన జర్నలిస్టులనూ ఈపథకం కింద చేర్చాలి.
సమస్యలు:
1. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేయనున్న కొత్త ఆరోగ్య కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించాలి.
2. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
3. వెల్నెస్ కేంద్రాల్లో రోగులకు అన్ని రకాల పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు, టెక్నిషియన్లను కూడా రోగులకు వేగంగా సేవలు అందించేలా సంఖ్యను పెంచాలి.
4. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను గతంలో మాదిరిగా మార్చి పరీక్షలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
కృతజ్ఞతలతో
పి రాంచందర్
యాక్టింగ్ ప్రెసిడెంట్
బి.బసవపున్నయ్య
రాష్ట్ర ప్రధానకార్యదర్శి

కుంటాం
టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులతో వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, మార్చి11
ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేసే అంశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ అన్నారు.
జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీం ను జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జే ఎఫ్) బృందం
బుదవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి హెల్త్ పాలసీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసినవారిలో టి డబ్ల్యూ జె ఎఫ్ ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ.చంద్ర శేఖర్ , బి జగదీశ్వర్ ఉన్నారు.
గౌరవనీయులైన దామోదర రాజనర్సింహ్మ గారు
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మాత్యులు
తెలంగాణ రాష్ట్రం,
హైదరాబాద్.
໖: 11-3-2026
విషయం: ప్రభుత్వ ఉద్యోగుల హెల్కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయుట గురించి
మనవి చేయునది ఏమనగా రాష్ట్రంలో జర్నలిస్టుల హెల్త్కేర్డులు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల పెండింగ్ పేర వైద్యచికిత్స అందించడం లేదు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ కింద ఉన్న నేపథ్యంలో సేవలు వేగంగా, నాణ్యంగా అందడం లేదు. హైదరాబాద్లోని నిమ్స్ కూడా చికిత్స పూర్తి ఉ చితంగా అందడం లేదు. దీంతో చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు, అధికమొత్తంలో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల కోసం 'తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ కేర్' పథకం ద్వారా ప్రత్యేక వైద్య చికిత్స పథకం అమలు కోసం కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు కూడా ఉద్యోగుల పథకాన్ని వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ని ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసి మెడిక్లెయిమ్ పథకం తరహాలో హెల్త్ కార్డుల పథకానికి ప్రభుత్వమే చెల్లించాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి. రిటైరైన జర్నలిస్టులనూ ఈపథకం కింద చేర్చాలి.
సమస్యలు:
1. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేయనున్న కొత్త ఆరోగ్య కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించాలి.
2. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
3. వెల్నెస్ కేంద్రాల్లో రోగులకు అన్ని రకాల పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు, టెక్నిషియన్లను కూడా రోగులకు వేగంగా సేవలు అందించేలా సంఖ్యను పెంచాలి.
4. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను గతంలో మాదిరిగా మార్చి పరీక్షలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
కృతజ్ఞతలతో
పి రాంచందర్
యాక్టింగ్ ప్రెసిడెంట్
బి.బసవపున్నయ్య
రాష్ట్ర ప్రధానకార్యదర్శి

హైదరాబాద్ TO ఊటీ.. తక్కువ ధరకే IRCTC సమ్మర్ ప్యాకేజీ

 హైదరాబాద్ TO ఊటీ.. తక్కువ ధరకే IRCTC సమ్మర్ ప్యాకేజీ 

          వేసవి వచ్చేసింది. మార్చి మొదటి వారం నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇక ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. అయితే సమ్మర్ ఎటైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) సంస్థ. అతి తక్కువ ధరకే ఈ సూపర్ ప్యాకేజీని అందిస్తోంది. దీంతో ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఊటీ అందాలను అది కూడా సమ్మర్ లో తక్కువ ధరలో ఆస్వాధించే అవకాశం ఉంది. మరి ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. దేశంలో చాలా హిల్ స్టేషన్లు ఉన్నాయి. అన్నీ కూడా కొండలు, లోయల మధ్య ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లోనే ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు హిల్ స్టేషన్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ఊటీ. వేసవిలో ఈ ప్రాంతానికి ఎక్కువగా వెళ్తుంటారు. ఎండ వేడిమిని తట్టుకోలేక ఈ ప్రాంతాలకు వెళ్తుంటారు టూరిస్టులు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో వేసవిలోనే కాదు శీతాకాలంలో కూడా పర్యాటకులు ఊటీకి క్యూ కడుతున్నారు. అయితే ఊటీకి వెళ్లే టూరిస్టుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ టూర్ పేరు 'అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్' గా ఉంది. ఊటీకి వెళ్లే టూరిస్టుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ టూర్​ మార్చి 17, 24, 31, ఏప్రిల్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంది. మీకు కావాలనుకున్న తేదీల్లో ఈ టూర్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ ప్యాకేజీలో భాగంగా పర్యటకులు ఊటీ, కున్నూర్, బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్, దోడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతం ప్రాంతాలను సందర్శించే వీలుంది. 

 "ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం" టూర్ లో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఉంటుంది. రాత్రంతా ప్రయాణించాలి. అలా రెండో రోజు ఉదయం కోయంబత్తూరు రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్ లో బస చేసిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. తర్వాతి రోజు దోడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా జలపాతం చూస్తారు.  నాలుగోరోజు కూనూర్ సంద‌ర్శ‌న‌కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే బస చేయాలి. ఇక ఐదో రోజు కోయంబత్తూర్‌ రైల్వేస్టేషన్​ కు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు శబరి ఎక్స్‌ప్రెస్​ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ చేయాలి. అలా ఆరో రోజు మధ్యాహ్నానికి సికింద్రాబాద్‌ చేరుకుంటారు. దాంతో టూర్ ముగుస్తుంది. మరిన్ని కనుగొనండి తెలుగు వార్తల సేవ గిజ్‌బాట్ సేవలు ట్రెండింగ్ వీడియో సేవలు మనీ సేవలు ఆటోమొబైల్స్ రివ్యూలు  "నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..!" ఇక టికెట్ ధరల విషయానికి వస్తే స్టాండర్డ్ ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలంటే రూ.30,060 పే చేయాలి. అలాగే ట్విన్ షేరింగ్‌ అయితే రూ.17,130, ట్రిపుల్ షేరింగ్‌ కు రూ.16,120 ఉంటుంది. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టికెట్ ధర రూ.8,840 గా ఉంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.

Tuesday, 10 March 2026

పెరిగిన వంట గ్యాస్ ధరల వేళ కేంద్రం బిగ్ రిలీఫ్..!?


 పెరిగిన వంట గ్యాస్ ధరల వేళ కేంద్రం బిగ్ రిలీఫ్..!?


వంట గ్యాస్ సరఫరా.. ధరలు వినియోగదారుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పరిమితుల పైన ఆంక్షలు విధించారు. అటు కమర్షియల్ గ్యాస్ సరఫరా సమస్యతో హోటళ్లు మూత బడుతున్నాయి. కేంద్రం ఈ పరిస్థితుల పై అధ్యయనం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో పెరిగిన వంట గ్యాస్ ధరల పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. సరఫరా, బుకింగ్ లో పరిమితులు వినియోగ దారులకు సమస్యగా మారుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఒకే సారి ఏకంగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అటు గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చేలా.. ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. దీంతో పాటుగా సిలిండర్ బుకింగ్ కోసం పరిమితులు.. గడువు విధించింది. దీంతో.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. కాగా, దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.


Also Read

ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!

ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!

central-key-discussions-over-the-lpg-rates-reports-indicate-a-further-increase-in-prices-here-the

అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ పెరిగిన ధరల పై పునరాలోచన

ఈ పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పశ్చిమాసియా పరిస్థితులతో పాటుగా వంట గ్యాస్ సరఫరా.. పెరిగిన ధరల పైన సమీక్ష చేయనుంది. ఈ వారంలోనే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రతిపక్షాలు వంట గ్యాస్ ధరల పెంపు పైన రాజకీయం గా టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పెరిగిన ధరలను ఎంత మేర తగ్గిస్తే.. ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందీ... పశ్చిమాసియాలో ఎప్పటి లోగా పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అనే అంశాల పైన చర్చించనున్నారు. ఎన్నికల వేళ వంట గ్యాస్ ధరల పైన పునరాలోచన చేయకుంటే నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది. గ్లోబల్ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ వినియోగంపై నియంత్రణ అవసరమైందని ప్రభుత్వం చెబుతోంది. ఈ రోజు కేంద్రం తీసుకునే నిర్ణయం కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారు.

Monday, 2 March 2026

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌

 


 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌


హైదరాబాద్: 

తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కార్యాలయానికి ఎన్నికలు నిర్వహించడానికి తనను కమిషనర్‌గా నియమింప బడినట్లు  పి. బాల గోపేంద్రనాథ్‌ (అడ్వకేట్ కమిషనర్) పబ్లిక్ నోటీస్ ను దిన పత్రికలో ప్రకటించారు.

ఖైరతాబాద్ లోని చింతల్‌బస్తీ నంబర్ 6-2-648లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉంది. దీనిని సాధారణంగా "వైశ్య భవన్" అని పిలుస్తారని , ప్రస్తుత ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నోటీసు ప్రచురించబడిన తేదీ నుండి మూడు రోజుల్లోపు అంటే 03-03-2026 నుండి 05-03-2026 వరకు నాకు లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చునని, తాను స్వయంగా ఈ మూడు రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు హైదరాబాద్‌లోని వైశ్య భవన్ చింతల్‌బస్తీలో అందుబాటులో ఉంటాననీ, ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించరని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు.

ఓటర్ల లిస్టులో పేర్లు కోల్పోయినవారికి ఇది మంచి అవకాశము. తమ హక్కును నిరంకుశ ధోరణిలో తొలిగిపబడ్డ వారు వారి అభ్యంతరాలు సమర్పించవచ్చు. ముఖ్యంగా ఐవిఎఫ్, వామ్ లలో సభ్యులుగా చేరిన వారిని ఓటర్ల లిస్ట్ నుండి తొలిగించినట్లు వార్తలు వచ్చాయి. వారు అడ్వకేటి కమీషనర్ కు అభ్యంతరాలు సమర్పించి తిరిగి ఓటు హక్కు పొందే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మండల అధ్యక్షుల ప్రమేయం లేకుండా హోటల్స్ లో కూర్చొని ఓటర్ల లిస్ట్ తయారు చేసినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఓటర్ల లిస్ట్ పై అభ్యంతరాలు ఉన్న వారందరూ అభ్యంతరాలు సమర్పించవచ్చు.