Wednesday, 6 May 2026

డబ్బులు ఇవ్వలేదని సరెండర్ చేశారు - డీఎస్‌ఓపై సీఎస్‌కు డిప్యూటీ తహసీల్దార్ సంచలన ఫిర్యాదు"*

 l

డబ్బులు ఇవ్వలేదని సరెండర్ చేశారు - డీఎస్‌ఓపై సీఎస్‌కు డిప్యూటీ తహసీల్దార్ సంచలన ఫిర్యాదు"*  


*"సెల్ రిపేర్‌లో ఉంది... ఫోన్ ఎత్తలేదనే నెపంతో వేటు: బాధితుడు 

క్రైమ్ బ్యూరో*  

*నల్లగొండ:* "లంచం ఇవ్వలేదనే అకారణంగా సరెండర్ చేశారు" అంటూ జిల్లా పౌరసరఫరాల అధికారి - డీఎస్‌ఓపై పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సంచలన ఆరోపణలు చేశారు. తన సరెండర్ ఉత్తర్వులు రద్దు చేసి యథావిధిగా విధుల్లో కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.

*ఫిర్యాదులో ఏముంది?*  

"నా సెల్ ఫోన్ రిపేర్‌లో ఉండటంతో గత నెల 21న డీఎస్‌ఓ ఫోన్ చేస్తే మాట్లాడలేకపోయాను. కానీ 22న నాకు మెమో ఇచ్చారు. నేను మునుగోడు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో విధుల్లో ఉన్నానని వివరణ ఇచ్చాను. అయినప్పటికీ 30న ఆకస్మికంగా నన్ను సరెండర్ చేశారు" అని రఘునందన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


*"చాలాసార్లు డబ్బులు అడిగారు"*  

"డీఎస్‌ఓ చాలాసార్లు నన్ను డబ్బులు అడిగారు. నేను ఇవ్వలేనని చెప్పాను. ఆ కక్షతోనే నన్ను అకారణంగా సరెండర్ చేశారు" అని డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ సీఎస్‌కు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన ఆరోపణ చేశారు.

ధాన్యం కొనుగోళ్ల సీజన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. అక్రమ రవాణా, దళారుల దందా అరికట్టాల్సిన డిప్యూటీ తహసీల్దార్‌నే సరెండర్ చేయడంపై శాఖలో చర్చ జరుగుతోంది. ఫోన్ ఎత్తలేదనే సాకుతో మెమో ఇచ్చి, విధుల్లో ఉన్నా పట్టించుకోకుండా సరెండర్ చేయడం వెనుక "లంచం మతలబు" ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

* శంఖారావం ప్రశ్న:*  

1. సెల్ రిపేర్‌లో ఉంటే అది నేరమా? అధికారిక మెమోకు విధుల్లో ఉన్నానని వివరణ ఇచ్చినా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?  

2. డబ్బులు అడిగారనే ఆరోపణపై విచారణ జరగాలి.

3. ధాన్యం కొనుగోళ్ల వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిని తప్పిస్తే దళారులకు పండగేనా?


సీఎస్ ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారో, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్‌ఓపై చర్యలు ఉంటాయో లేదో వేచి చూడాలి.


ఈ విషయం పై DSO వివరణ కోరగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చండూరు RDO ఇచ్చిన రిపోర్ట్ తో జాయింట్ కలెక్టర్ dt ని సరెండర్ చేసినట్లు తెలిపారు. తనపై dt చేసిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home