neelagirishankaravam july 02 issue https://heyzine.com/flip-book/6b334f31ec.html
neelagirishankaravam july 02 issue https://heyzine.com/flip-book/6b334f31ec.h
neelagirishankaravam july 02 issue https://heyzine.com/flip-book/6b334f31ec.h
"హీరో" లకు ఆహ్వానం
పొగాకు నియంత్రణ కు పురస్కారాలు
జులై 22 తో ఆఖరు
టుబాకో కంట్రోల్ హీరో మాచన రఘునందన్ వెల్లడి
పొగాకు నియంత్రణ లో విశేష కృషి చేసిన వారికి 2026 సంవత్సరానికి గాను టుబాకో కంట్రోల్ హీరో అవార్డులను పంజాబ్ కు చెందిన సైఫర్ ప్రదానం చేస్తోందని,ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 22 ఆఖరు అని టుబాకో కంట్రోల్ హీరో మాచన రఘునందన్ స్పష్టం చేశారు.మంగళవారం నాడు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ..స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్(సైఫర్) ఈ అవార్డులను ప్రకటించిందని,పొగాకు నియంత్రణ లో 10 ఏళ్ల అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ అవార్డుకు అర్హులు అని రఘునందన్ వివరించారు.కాగా..తెలుగు రాష్ట్రాల నుంచి టుబాకో కంట్రోల్ హీరో అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి గా మాచన రఘునందన్ గుర్తింపు తెచ్చుకున్నారు.ఆగస్టు 8 న పంజాబ్ రాష్ట్రం చండీఘర్ లో అవార్డు విజేతలను ప్రకటిస్తారని రఘునందన్ వివరించారు.ధూమపానం వద్దు,పొగాకు వినియోగం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది అని ప్రచారం చేయడమే గాక తన వంతుగా సమాజం లో మార్పు కోసం పొగాకు నియంత్రణ అవసరం అని..ఆ దిశగా కృషి చేస్తున్న వ్యక్తులు ఈ అవార్డు కు అప్లై చేసుకోవాలని రఘునందన్ పిలుపునిచ్చారు.
నల్లగొండ జిల్లా
_ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్ యాక్షన్..!_
పోక్సో కేసులో కానిస్టేబుల్ అరెస్ట్.. రిమాండ్.. తక్షణమే సస్పెన్షన్..!
నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గుర్రంపోడు పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన *సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి...*
వన్‌టౌన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలింపు...
*ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..*
కానిస్టేబుల్ సత్యనారాయణను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు...
ఖాకీ ధరించినంత మాత్రాన చట్టానికి అతీతులు కారు.. నేరం చేసిన వారెవరైనా ఉపేక్షించేది లేదు!
మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీపడేది లేదు..
పోలీసు శాఖ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సీరియస్ వార్నింగ్...
జిల్లాలో మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్న *ఎస్పీ శరత్ చంద్ర పవార్..*
ఈ ఘటనలోనూ వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది...
నిందితుడు పోలీసు ఉద్యోగి అయినా.. చట్టం ముందు అందరూ సమానమే.. అనే సందేశాన్ని ఎస్పీ చర్య మరోసారి స్పష్టం చేసింది...
ఖాకీకి మచ్చ తెచ్చిన వారిపై రాజీ లేదు.. నేరం చేసిన వారెవరైనా శిక్ష తప్పదు..
*నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్.
*హైదరాబాద్ లోని దిల్
#ACB ట్రాప్ కేసు
*ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*
దిల్‌సుఖ్‌నగర్‌లో మిరిదొద్ది శ్యామ్ సుందర్ గారు ప్రముఖ వస్త్ర సంస్థ కుబేరా సిల్క్స్ నూతన (4వ) బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన షోరూమ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ, వ్యాపార రంగంలో నాణ్యత, విశ్వసనీయత, వినియోగదారుల సంతృప్తిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న కుబేరా సిల్క్స్ యాజమాన్యాన్ని అభినందించారు. ఒకే చోట పట్టు చీరలు, బ్రైడల్ కలెక్షన్స్, డిజైనర్ చీరలు మరియు వివిధ రకాల వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.
నేటి పోటీ ప్రపంచంలో వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యమని, ఆ నమ్మకంతోనే కుబేరా సిల్క్స్ వరుసగా కొత్త బ్రాంచ్‌లను ప్రారంభిస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. ఈ సంస్థ మరింత విస్తరించి, మరెందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కుబేరా సిల్క్స్ యాజమాన్యం ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని ఘనంగా సన్మానించి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి తమను ఆశీర్వదించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుభేర సిల్క్స్ టీం తదితరులు పాల్గొన్నారు.
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం మొత్తం బోనాల శోభతో పులకించిపోతుంది. హైదరాబాద్ లో ఎటు చూసినా సందడే సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ నిలుస్తూ వస్తోంది. ఇక ఈ ఏడాది జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల పండగ ఘనంగా జరగనుంది. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల పండగపై సమీక్ష నిర్వహించారు. జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలతో మొదలవుతుంది. అలాగే 20,21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఉత్సవాలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు 20 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, 21 వ తేదీన అమ్మవారి కల్యాణం, 22వ తేదీన రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇక ఆగస్టు 2 న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, ఆగస్టు9 న లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి బోనాలు జరుగుతాయని ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు బోనాల పండగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 3,427 ఆలయాలకు రూ.15.05 కోట్ల నిధులు విడుదల చేసింది. ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీసు , ఆరోగ్య శాఖల సమన్వయంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఆషాఢ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో భక్తులు దేవుడి ఆరాధన, ఉపవాసాలు, పూజలు, దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
ఆషాఢ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో భక్తులు దేవుడి ఆరాధన, ఉపవాసాలు, పూజలు, దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కాలంలో ఆధ్యాత్మిక సాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్యంలో 10 ఏళ్ల అనుభవం ఉన్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు గుడి ప్రశాంత్ శర్మ న్యూస్ 18తో అన్నారు.
ఆషాఢ మాసంలో ఆషాఢ ఏకాదశి (తొలి ఏకాదశి), గురు పౌర్ణిమ, ఆషాఢ అమావాస్య, బోనాలు వంటి ముఖ్యమైన పర్వదినాలు వస్తాయి. ఈ రోజుల్లో భక్తులు ఉపవాసాలు ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. గురుపౌర్ణిమ రోజున గురువులను స్మరించి వారి ఆశీర్వాదాలు పొందడం ఆనవాయితీ. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం.
ఆషాఢ మాసంలో ప్రకృతి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో భూమి పచ్చదనంతో కళకళలాడుతుంది. రైతులు ఈ సమయంలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. మంచి వర్షాలు పడి పంటలు బాగా పండాలని రైతులు దేవుడిని ప్రార్థిస్తారు. ఈ నెల వ్యవసాయానికి కూడా ఎంతో కీలకమైనదిగా భావిస్తారు.
మత సంప్రదాయాల ప్రకారం ఈ నెలలో సాత్విక ఆహారం తీసుకోవడం, దానధర్మాలు చేయడం, పెద్దలను గౌరవించడం, పేదలకు సహాయం చేయడం శుభప్రదంగా భావిస్తారు. చాలామంది మాంసాహారాన్ని తగ్గించి, శాకాహారాన్ని పాటిస్తారు. ప్రతిరోజూ దేవాలయ దర్శనం, విష్ణు సహస్రనామం, శివ స్తోత్రాలు, లలితా సహస్రనామం వంటి పవిత్ర గ్రంథాలను పారాయణం చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని విశ్వసిస్తారు.
కొన్ని ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో కొత్త శుభకార్యాలు, వివాహాలు నిర్వహించరు. అయితే ఇది ప్రాంతీయ సంప్రదాయాలు, కుటుంబ ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నెలను భక్తి, నియమ నిష్ఠలు, ఆత్మపరిశీలనకు అనువైన కాలంగా భావిస్తారు. కోపం, అసత్యం, అనవసర వాదనలకు దూరంగా ఉండి మంచి ఆలోచనలతో జీవించాలని పెద్దలు సూచిస్తారు.మొత్తంగా చెప్పాలంటే, జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగే ఆషాఢ మాసం ఆధ్యాత్మికత, భక్తి, ప్రకృతి అందాలు, పండుగల సమ్మేళనంగా నిలుస్తుంది. ఈ నెలలో సత్కార్యాలు చేయడం, దేవుడిని భక్తితో ఆరాధించడం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మనశ్శాంతి, కుటుంబ సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని మత విశ్వాసం. అందుకే హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
neelagirishankaravam july issue -2026
https://heyzine.com/flip-book/9978a4d33f.html
రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖను అన్ని రంగాల్లో నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఆయన నల్గొండ జిల్లా ,నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్‌పల్లి మండల కేంద్రంలో 76 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నార్కట్‌పల్లి–మునుగోడు సేతుబంధు (సీఆర్‌ఐ) రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెరుగైన రహదారులు, వంతెనలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
నల్లగొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్లు, సాగునీరు, వ్యవసాయం, తదితర రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎక్కువ స్థాయిలో ధాన్యం పండిస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రంలోనే
ధాన్యం అత్యధికంగా పండించిన జిల్లా నల్గొండ జిల్లా అని అన్నారు.
నార్కట్‌పల్లి–మునుగోడు రహదారి అభివృద్ధి పనుల్లో స్థానిక రైతుల భూములకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసి నార్కట్‌పల్లి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనే రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. నార్కెట్ పల్లి మండలంలో 600 కోట్లతో హ్యాం రోడ్లను,4000 కోట్లతో రాష్ట్రంలో అన్ని రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు .
2028లో ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గం పూర్తి చేసి నార్కట్పల్లి మండల ప్రజలకు తాగునీరు, సాగు నీరు అందిస్తామని చెప్పారు.
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు.
ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్
బి చంద్రశేఖర్,
సేతు బందు సిఆర్ఐఎఫ్ చీఫ్ వసంత నాయక్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు .
__________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
సర్ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరం
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15 లక్షల 16 వేల 253 మంది ఓటర్లు ఉన్నారని ,ఇందులో 15 లక్షల 12 వేల 548 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పటివరకు 99.76 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. మిగిలిన ఫారాల పంపిణీని కూడా త్వరలో పూర్తి చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు.
ఇప్పటివరకు సుమారు 33.58 శాతం ఫారాలను తిరిగి స్వీకరించామని, ఇంకా సుమారు 66 శాతం ఫారాలను సేకరించాల్సి ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్ సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రారంభ రోజుల్లో బీఎల్ఓల పనితీరులో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం బిఎల్ఓలు అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ సహకరిస్తున్నారని తెలిపారు. బీఎల్ఓలు ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి ఫారాల సేకరణ చేపడుతున్నారని పేర్కొన్నారు.
2002 ఓటరు జాబితాకు సంబంధించి ఫారాలను ఎలా నింపాలనే సందేహాలపై ఎన్నికల కమిషన్‌కు వివరించామని, 2002 ఓటరు జాబితాను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటివరకు 88 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, ప్రతి బీఎల్ఓ వద్ద సంబంధిత జాబితా అందుబాటులో ఉందన్నారు.
మరణించిన ఓటర్ల పేర్లను తొలగించాలని, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. డబుల్ ఓట్లను తొలగించేందుకు ఓటర్లు సహకరించాలని కోరారు. గ్రామంలో ఓటు ఉంచుకోవాలా లేదా పట్టణంలో ఉంచుకోవాలా అనే విషయంలో ఓటర్లు ఒక నిర్ణయం తీసుకొని, . ఎక్కడైనా ఒకఓటును ఉంచుకోవాలని తెలిపారు.
సర్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తిచేయాలని, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఇళ్లు తాళం వేసి ఉండడం వంటి కారణాలతో ఫారాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల బీఎల్ఏలు బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
కొన్ని కుటుంబాలకు చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని, అటువంటి సందర్భాల్లో ఫారం-8 ద్వారా కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చుకునే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదం తీసుకున్న తర్వాత, జిల్లా స్థాయిలో కూడా ఆమోదం పొంది తుది జాబితాను ప్రదర్శిస్తామని తెలిపారు.
పనిభారం ఎక్కువగా ఉన్న లేదా పనితీరు బలహీనంగా ఉన్న బీఎల్ఓలకు సహాయకులను నియమించామని కలెక్టర్ తెలిపారు. ప్రతి బీఎల్ఓ ఇంటింటికీ తిరిగి ఫారాలు నింపాలని సూచించారు. ప్రతి ఫారంపై సంబంధిత బీఎల్ఓ ఫోన్ నంబర్ ఉంటుందని, ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా సంప్రదించాలని సూచించారు.
అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చే సూచనలను పరిశీలించి, అవసరమైతే ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఏలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ,రెవెన్యూ అధికారి దశరథ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ముంతాజ్ అలీ ,బి ఆర్ఎస్ నుండి బక్క పిచ్చయ్య ,బిజెపి తరఫున లింగస్వామి, సిపిఎం నుండి నర్సిరెడ్డి, ధర్మసమాజ్ పార్టీ ప్రతినిధి రవికుమార్, ఆప్ పార్టీ నుండి రవీందర్,ఎంఐఎం. నుండి కలీం ,
టిడిపి నుండి రవి తదితరులు పాల్గొన్నారు .
____________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
ఎంత పటిష్టమైన ఉద్యోగ భద్రత!
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..
నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను ఓర్పుగా విన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 63 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి కేసుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు చట్టపరమైన న్యాయం అందేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
భూమి వివాదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత వ్యవహారాలు, దాడులు, వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రతి కేసును నిష్పక్షపాతంగా విచారించి, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్భయంగా పోలీస్ శాఖను ఆశ్రయించాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
ఘనంగా జగ్జీవన్ రామ్ వర్ధంతి
పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు
నల్గొండ:
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య అన్నారు.
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం నల్లగొండలోని NG కళాశాల ఎదురుగా ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషిచేసి భారత దేశ ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలు అందించారని అన్నారు.
అదేవిధంగా దేశ స్వాతంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి అని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాల సాధన దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ శంకర్, మామిడి కార్తీక్, పెరిక వినాయక రాజ్, పెరిక అంజయ్య, పెరిక చిట్టి తదితరులు పాల్గొన్నారు.
స్వర్గస్తుడి సంతకంతో చెక్ జారీ..! తెలంగాణ ఆర్య వైశ్య మహాసభలో తీవ్ర వివాదం** హైదరాబాద్ : తెలంగాణ ఆర్య వైశ్య మహాసభలో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. మహాసభ ద్వారా ఒక శ్రీయశ్రీ విద్యార్థినికి ₹5,000/- విలువైన చెక్ జారీ చేయగా, ఆ చెక్‌పై స్వర్గస్తులైన కీ.శే. మిత్తినింటి వెంకటేశ్వర్లు గారి సంతకం ఉండడం పెను దుమారం రేపుతోంది. 04-07-2026 తేదీతో జారీ చేసిన చెక్‌పై మృతి చెందిన వ్యక్తి సంతకం ఎలా వచ్చిందనే అంశంపై ఆర్య వైశ్య సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంకటేశ్వర్లు గారు బ్రతికి వచ్చారా? లేదా ఆయన పేరును బద్నాం చేయాలనే దురుద్దేశ్యంతో ఈ చర్య చేపట్టారా? అని జాతి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది సాధారణ పొరపాటు కాదని, పెద్ద స్థాయి ద్రోహం, అధికార దుర్వినియోగం, నకిలీ సంతకాల వ్యవహారమని ప్రక్షాళన కమిటీ ఆరోపిస్తోంది. అధికారంలో ఉన్న కొందరు నాయకులు తప్పుల మీద తప్పులు చేస్తూ జాతి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా మార్పు కోసం, క్రమశిక్షణతో, నిజాయితీతో పనిచేయకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అక్రమాలు, నకిలీ సంతకాలు, దుర్వినియోగం కొనసాగితే కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కేసులు తప్పవని ప్రక్షాళన కమిటీ స్పష్టం చేసింది. “ప్రక్షాళన కమిటీ ఎందుకు?” అని ప్రశ్నించే వారికి మీరు చేసిన తప్పులే సమాధానం అని ఘాటుగా వ్యాఖ్యానించింది. బీదల కోసం విద్య, వైద్యం, వసతి వంటి సేవలు నిజంగా అందిస్తే మద్దతు ఉంటుందని, కానీ కేవలం కన్వెన్షన్ హాళ్లు, అధికార దాహం కోసమే వ్యవహరిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్య వైశ్య సమాజం డిమాండ్ చేస్తోంది.