Wednesday, 31 December 2025

బి .చంద్రశేఖర్ నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు.

 ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని నల్గొండ జిల్లా నూతన కలెక్టర్

బి .చంద్రశేఖర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో

నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తాను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

తెలంగాణ ఏసీబీ వలకు ఖరీదైన అవినీతి అధికారి చిక్కిండు



 తెలంగాణ ఏసీబీ వలకు ఖరీదైన అవినీతి అధికారి చిక్కిండు.

రవాణాశాఖలో పనిచేస్తూ అక్రమార్జనలో ఆరితేరిన రవాణాశాఖ మహబూబ్నగర్ డిప్యూటీ కమిషనర్ మూడ్ కిషన్ ను ఏసీబీ పట్టుకుంది.సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి రాజరాజేశ్వరి నగర్లోని కిషన్ ఇంటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 11 ప్రాంతాల్లో ఏసీబీ హైదరాబాద్ రేంజి-2 డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించి నగదు, నగలతోపాటు అక్రమాస్తుల కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నాయి.హైదరాబాద్ తోపాటు మహబూబ్నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో మొత్తం రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు లభ్యమయ్యాయి.బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా.తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి.ఆస్తులు చూసి అధికారులే నిర్ఘాంతపోయారు.

డీటీసీ ఆస్తులు 200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అంచనా.మహబూబ్ నగర్ రవాణా శాఖలో లంచాలు తీసుకుంటూ
భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టిన మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ (డీటీసీ) కిషన్ నాయక్ అవినీతి నిరోధక విభాగానికి చిక్కారు. తనిఖీల్లో బయటపడిన ఆస్తులు చూసి అధికారులే నిర్ఘాంతపోయారు.
వాటి విలువ బహి రంగ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఏసీబీ మాత్రం డాక్యుమెంట్లలో ఉన్న విలువ ఆధారంగా కేవలం రూ.12.72 కోట్లు అనే పేర్కొంది.కిషన్ నాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్లు 13 (1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసింది.
అక్రమార్జనను వ్యాపారంలో పెట్టి..అక్రమార్జనను వ్యాపారంలో పెట్టడం ద్వారా కిషన్ నాయక్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నుంచి మొదలై డీటీసీ స్థాయికి ఆయన కేరీర్ ఎది గినట్లే.. ఆయన ఆస్తులు కూడా అంతకంతకు పెరిగాయని అంటున్నారు.
సోదాల్లో గుర్తించిన ఆస్తులు ఇవీ..
> నిజామాబాద్ లోని లాహిరి ఇంటర్నేషనల్ హోటల్లో 50 శాతం వాటా.
> నిజామాబాద్ లో 3 వేల చదరపు గజాల్లో రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణం.
> నిజామాబాద్ లోని అశోకా టౌన్షిప్ లో రెండు ఫ్లాట్లు.
> సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ తహసీల్దార్ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి.
> నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాల కమర్షియల్ భూమి.
> సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో 4 వేల చదరపు అడుగులలో పాలిహౌస్ షెడ్.
> బ్యాంకులో రూ.1.37 కోట్ల నగదు. కిలో బంగారు ఆభరణాలు.
> ఒక హోండాసిటీ కారు, ఒక ఇన్నోవా క్రిస్టా కారు.

Tuesday, 30 December 2025

స్వర్ణ గిరి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉప్పల కుటుంబం*

 *స్వర్ణ గిరి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉప్పల కుటుంబం*





వైకుంఠ ఏకాదశి పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని భువనగిరిలోని ప్రసిద్ధ స్వర్ణ గిరి దేవాలయాన్ని TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.


ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసమృద్ధులు కలగాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి వైకుంఠ ఏకాదశి విశిష్టతను వివరించారు.


శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినమని, ఈ రోజున స్వామివారి దర్శనం చేయడం వల్ల ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని తెలిపారు. సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

వేద పండితుల ఆశీర్వాదం అందించిన మానేపల్లీ గోపి గారు, మానే పల్లి మురళి గారు గారికి ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గారు కుమారుడు ఉప్పల సాయి కిరణ్ చిన్న కుమారుడు ఉప్పల సాయి తేజ అలాగే ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి బావ బచ్చ సతీష్ , సోదరీమణి ఉదయ శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 27 December 2025

*ఏచూరి శీనన్న ఆత్మ ఈరోజు శాంతించింది

 *ఏచూరి శీనన్న ఆత్మ ఈరోజు శాంతించింది


*

అవును మీరు విన్నది కరెక్టే....

ఏచూరి శీనన్న 1981- 82 ప్రాంతంలో 

నల్గొండ N G కళాశాలలో చదువుతూ ABVP 

అఖిల భారత విద్యార్థి పరిషత్  లో చురుకుగా పనిచేస్తుండేవాడు. 

 అదే కళాశాలకు చెందిన రాడికల్ స్టూడెంట్ యూనియన్ RSU కు చెందిన హనుమంతు అలియాస్ గణేష్ ద్వారా హత్య చేయబడ్డాడు. 

ఆ గణేష్ (హనుమంతు) నిన్న ఒరిస్సా లోని కుంధమాల్ లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్ అయ్యాడు. 

ఈ విధంగా దాదాపు 43 సంవత్సరాల తర్వాత ఏచూరి శీనన్న ఆత్మ శాంతించిందని చెప్పవచ్

Wednesday, 24 December 2025

వైకుంఠ ఏకాదశి (ఉత్తర ద్వార దర్శనం) సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవాలని

 ఈ నెల 30వ తేదీన జరిగే వైకుంఠ ఏకాదశి (ఉత్తర ద్వార దర్శనం) సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ శ్రీ వెంకట్రావు గారు, ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.



ఆర్యవైశ్య కార్పొరేషన్ ఫండ్స్ రిలీజ్ కోసం అందరు వైశ్యులు కలిసి పోరాడుదాం.

 ఆర్యవైశ్య కార్పొరేషన్ ఫండ్స్ రిలీజ్ కోసం అందరు వైశ్యులు కలిసి


దృఢ సంకల్పంతో ఎలాగైనా ఫండ్స్ తీసుకురావాలని అందరూ లీడర్స్ తో పెద్ద మనుషులతో మాట్లాడడం జరిగింది అదే నేపద్యంలో నిన్న ఉప్పల శ్రీనివాస్ సార్ వాళ్ళ ఇంట్లో సామూహిక డిస్కషన్ జరిగాయి శ్రీనివాస్ గారు మనకి అండగా నిలబడి సపోర్ట్ చేసి అందరం కలిసి ముందుకు వెళ్దామని తప్పకుండా దానికి కృషి చేద్దామని తెలిపారు అమరజీవి సేవా సమితి నాగభూషణం గారు ఇంకా మరి ఎందరో ప్రముఖులు కలిసి దీన్ని చేపట్టాం


Tuesday, 23 December 2025

ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

 ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు


ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఏసీబీ 

ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

మహబూబ్‌నగర్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 12 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన పాపారావుకు కిషన్ నాయక్ ప్రధాన శిష్యుడిగా ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు కిషన్ నాయక్‌పై ఉన్నాయి. వీటిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. మహబూబ్‌నగర్ ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్‌గా కిషన్ నాయక్.. డిసెంబర్ 2024లో బాధ్యతలు స్వీకరించారు.


ఏసీబీ అధికారుల అంచనా ప్రకారం కిషన్ నాయక్ వద్ద సుమారు రూ.100 కోట్ల వరకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రవాణా శాఖలో కీలక పదవిలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నారనే ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. కిషన్ నాయక్ 2024 డిసెంబర్‌లో మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పాపారావుకు ప్రధాన శిష్యుడిగా పనిచేసిన నేపథ్యం కూడా ఉన్నట్లు సమాచారం.


ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసలు ఇస్తే గానీ పనులు జరగడం లేదంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఖమ్మం ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించిన ఫైళ్లు ఏజెంట్ల వద్ద లభ్యమవడం సంచలనం రేపింది. ఏజెంట్ల నుంచి వచ్చే ప్రతి ఫైల్‌కు ప్రత్యేక కోడ్ ఉండటాన్ని గమనించిన ఏసీబీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజా సోదాలు రవాణా శాఖలో అవినీతిపై మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Sunday, 21 December 2025

కేసీఆర్ ఎంట్రీతో అనూహ్య పరిణామాలు

 కేసీఆర్ ఎంట్రీతో అనూహ్య పరిణామాలు

                ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఘాటు విమర్శలు సంధించారు. తనదైన శైలిలో చురకలు అంటించారు. కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. తెలంగాణ తిరోగమిస్తోందంటూ మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల మళ్లీ ఫ్యూడల్ భావాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఫ్యూచర్ సిటీపైనా నిప్పులు చెరిగారు.

            తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేసీఆర్. దాదాపుగా ఎనిమిది నెలల తర్వాత మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడారు. జలవనరులు, వ్యవసాయం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సహా పలు అంశాల గురించి ప్రస్తావించారు. విస్తృతస్థాయి సమావేశంలో చర్చకు వచ్చిన విషయాలపై వివరించారు.

                       ఉమ్మడి ఏపీలో మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని, ప్రత్యేక రాష్ట్రంలోనూ ఇదే కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు ద్రోహం చేస్తోన్నాయని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 308 కిలో మీటర్ల కృష్ణా నది పారుతుందని, గత ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం 174 టీఎంసీలు ఈ జిల్లాకు రావాల్సి ఉన్నప్పటికీ.. అలా జరగట్లేదని అన్నారు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు.

          కేసీఆర్ విమర్శలపై ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని ఎదురుదాడికి దిగారు. రెండేళ్ల తర్వాత కేసీఆర్ కలుగులో నుంచి బయటికి వచ్చాడని, ఓటమితో ఆయన మారుతారని ఆశించానని అలాంటిదేమీ లేదని చెప్పారు. మళ్లీ అబద్ధాలే చెబుతూ తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తోన్నారని విమర్శించారు.

            కేసీఆర్‌ సీఎం అయ్యాకే జలదోపిడీ జరిగిందని, కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే.. కృష్ణా జలాలపై అసెంబ్లీలో వివరిస్తానని అన్నారు. కృష్ణా జలాల్లో ఏపీకి 64 శాతం, తెలంగాణకు 36 శాతం చాలని కేసీఆర్‌ గతంలో సంతకం పెట్టాడని ఆరోపించారు. కడుపునిండా విషం పెట్టుకున్న హరీష్ రావు కేటీఆర్ కు గురువు కేసీఆర్‌ అని, ఈ ముగ్గురూ కలిసి కవితను వాళ్లే బయటకు పడేశారని విమర్శించారు. ఉన్న ఒక్క చెల్లెలికి చీర, సారె పెట్టలేక బయటకు పంపారని, వాళ్లు తెలంగాణ సమాజాన్ని ఏం బాగుచేస్తారని అన్నారు.

            కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా కొడుకు, అల్లుడే చేస్తున్నారని రేవంత్ అన్నారు. యూరియా పంపిణీలో టెక్నాలజీని వినియోగించడం వల్ల ఇబ్బందేమిటని ప్రశ్నించారు. దీనికోసం యాప్‌ పెడితే నష్టమేంటని అన్నారు. కృష్ణా బేసిన్‌ దెబ్బతినడానికి, రైతులు నష్టపోవడానికి కారణం కేసీఆర్, ఆయన కుటుంబ పాలనేనని చెప్పారు. పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టు ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కృష్ణా బేసిన్‌లో కేసీఆర్‌ చేసింది దగా, మోసమంటూ మండిపడ్డారు.

తెలంగాణ మహిళ విభాగానికి ఉత్తమ అవార్డుతో పాటు (లక్ష రూపాయల పారితోషికం) అందజేత

 తెలంగాణ మహిళ విభాగానికి ఉత్తమ అవార్డుతో పాటు (లక్ష రూపాయల పారితోషికం) అందజేత



IVF మహిళా విభాగం లో అనేక సేవా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న సందర్బంగా ఉత్తమ సేవలకు గుర్తింపుగా IVF తెలంగాణ విభాగానికి అవార్డ్తో పాటు (లక్షరుపాయల పరితోషకం) రావడం జరిగింది.


ఈ అవార్డ్ అయోధ్యా లో ముఖ్య అతిథి

శ్రీ చంపత్ రాయ్

ప్రధాన కార్యదర్శి,

శ్రీ రామ మందిరం, అయోధ్య

ఉత్తరప్రదేశ్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ , IVF నేషనల్ జాతీయ ప్రెసిడెంట్ Dr Ashok అగర్వాల్ చేతుల మీదుగా IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గారికి IVF 

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షు రాలు చంద భాగ్య లక్ష్మి గారికి అవార్డ్ అందజేయడం జరిగింది.


ఎంతో మంది పోటీ పడ్డ గాని తెలంగాణ మహిళ విభాగం చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డ్ రావడం జరిగింది.

మహిళ దినోత్సవ వేడుకలు అంగరా వైబవంగా చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో డా. నీరజ్ బోరా

శాసనసభ్యులు (ఎమ్మెల్యే)

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వేద్ ప్రకాష్ గుప్తా శాసనసభ్యులు (ఎమ్మెల్యే), అయోధ్య శ్రీమతి అనుపమ జైస్వాల్

శాసనసభ్యురాలు (ఎమ్మెల్యే) శ్రీ శ్యామ్ జాజూ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)

IVF జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ప్రధాన కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్ గుప్త, IVF 

అడ్వైజరీ ముత్యాల సత్తయ్య, పుర్షో త్తం , సుధాకర్ , పబ్బ స్వప్న,మణిమాల IVF నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Thursday, 18 December 2025

హెచ్-1బీ, హెచ్-4వీసాలపై మొదలైన షాకులు..! లెక్క తేల్చేస్తున్న ట్రంప్..!

 హెచ్-1బీ, హెచ్-4వీసాలపై మొదలైన షాకులు..! లెక్క తేల్చేస్తున్న ట్రంప్..! 

అమెరికా హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై నిశిత పరిశీలన, తనిఖీలను ప్రారంభించింది. నిన్నటి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. 

           అమెరికాలో ఐటీ, ఇతర ఉద్యోగాల కోసం వెళ్లే విదేశీ నిపుణులు హెచ్1బీ వీసాలకు, వారి కుటుంబ సభ్యులు హెచ్4 వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు. అయితే ఇలా విదేశాల నుంచి వచ్చిపడుతున్న నిపుణుల వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ట్రంప్ సర్కార్ తాజాగా నిబంధనల్లో కీలక మార్పులు తెచ్చింది. వీటి ప్రకారం వారు ఎక్కడ దొరికినా వీసా దరఖాస్తు తిరస్కరించడమే పనిగా పెట్టుకుంది. ఇలాంటి పరిణామాల మధ్య దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన (వెట్టింగ్ ) ప్రారంభమైంది. అమెరికా హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై నిశిత పరిశీలన, తనిఖీలను ప్రారంభించింది. నిన్నటి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. దీంతో తాజాగా అమల్లోకి వచ్చిన ఈ నూతన విధానం ప్రకారం అమెరికాలోకి ప్రవేశించడానికి "అనర్హులు"గా పరిగణించబడే వారిని గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది. వలసలను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ తనిఖీలు ప్రారంభించారు. మరిన్ని కనుగొనండి 

            "రోజూ కొన్ని ఉడికించిన వేరుశెనగలు తినండి చాలు.." ట్రంప్ సర్కార్ తాజా నిబంధనల ప్రకారం.. అమెరికా వీసా అనేది "హక్కు కాదు, ఒక ప్రత్యేక అధికారం" మాత్రమే. ప్రతి వీసా మంజూరు జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయమేనని తాజా ఉత్తర్వుల్లో తెలిపారు. విదేశీ ఉద్యోగులకు జారీ చేసే హెచ్-1బీ వీసాను, అమెరికా కంపెనీలు ఇతర దేశాల నుండి నిపుణులను నియమించుకోవడానికి వాడుకుంటున్నాయి. సాంకేతిక నిపుణులు, ఇతర రంగాల నిపుణులు ఈ వీసా ద్వారా అమెరికాలో పని చేసే అవకాశం పొందుతారు. అయితే ఈ హెచ్-1బీ వీసా కార్యక్రమం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నవారు భారతీయులే. సుమారు 70 శాతానికి పైగా హెచ్-1బీ వీసాలు భారతీయులకే ఇస్తున్నారు. అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం తాజా ఉత్తర్వుతో భారతీయులే ఎక్కువగా నష్టపోవడం ఖాయమనే అంచనాలున్నాయి. ఆ తర్వాత 11 నుండి 12 శాతం వీసాలతో చైనా పౌరులు రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 3 లక్షల మంది భారతీయ హెచ్-1బీ వీసాదారులు సాంకేతిక, సేవా రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ నిబంధన అమలులోకి రాకముందే, భారత్ లో అమెరికా రాయబార కార్యాలయం వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేసింది. దీనివల్ల చాలా మంది దరఖాస్తుదారులు చిక్కుకుపోయి, వారి ప్రయాణ ప్రణాళికలు దెబ్బతిన్నాయి.

బందీగా పత్రికా స్వేచ్ఛ!: చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్!!

 బందీగా పత్రికా స్వేచ్ఛ!: చైనాకు డొనాల్డ్ ట్రంప్

వార్నింగ్!! 

              హాంకాంగ్‌లో మీడియా దిగ్గజం, బ్రిటీష్ పౌరుడు జిమ్మీ లాయ్‌పై చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయంగా పెనుసంచలనం సృష్టిస్తున్నాయి. 78 ఏళ్ల వయసున్న జిమ్మీ లాయ్‌ను బేడీలతో కట్టి వీధుల్లో తిప్పిన దృశ్యాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం కింద జిమ్మీ లాయ్‌ను దోషిగా నిర్ధారించడంపై అమెరికా, బ్రిటన్ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఈ పరిణామం హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు కీలక విజ్ఞప్తి చేశారు. జిమ్మీ లాయ్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఒక వ్యక్తిని ఇలా జైలులో పెట్టడం చైనా పతనానికి సంకేతమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

                       మరిన్ని కనుగొనండి యూఎస్ వెళ్లాలనుకునే వారికి షాక్ .. 2026నుండి పెరగనున్న టూరిస్ట్ వీసా ఛార్జీలు!" బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ నిరసన బ్రిటన్ పార్లమెంటులో ఎంపీ ప్రీతి పటేల్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. "జిమ్మీ లాయ్‌ను జైలులో పెట్టడం, వేధించడం హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి చైనా చేస్తున్న సిగ్గుచేటు ప్రయత్నం. ఇది చైనా-బ్రిటిష్ ఉమ్మడి ప్రకటనను ఘోరంగా ఉల్లంఘించడమే" అని ఆమె మండిపడ్డారు. 78 ఏళ్ల వయసున్న వ్యక్తిని గొలుసులతో బంధించి వీధుల్లో తిప్పడం కలచివేసే దృశ్యమని, కానీ ఆయన ధైర్యం ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛను కోరుకునే వారికి స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు. గత 1,800 రోజులుగా ఏకాంత కారాగారంలో ఉండటం వల్ల జిమ్మీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయనను వెంటనే విడిచిపెట్టి బ్రిటన్‌లోని తన కుటుంబం వద్దకు వెళ్లేలా చూడాలని కోరారు. చైనా పర్యటనను రద్దు చేసుకోవాలి! బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, విదేశాంగ మంత్రికి ప్రీతి పటేల్ ఒక కీలక విన్నపం చేశారు. జనవరిలో వారు చేపట్టబోయే చైనా పర్యటనను, జిమ్మీ లాయ్ విడుదల అయ్యే వరకు రద్దు చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేయడం ద్వారానే చైనాకు సరైన సంకేతం వెళ్తుందని ఆమె స్పష్టం చేశారు. 

 ఇప్పుడు మూతపడిన ప్రజాస్వామ్య అనుకూల పత్రిక 'యాపిల్ డెయిలీ'వ్యవస్థాపకుడు. హాంకాంగ్‌లో చైనా పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడటమే ఆయన చేసిన నేరంగా చైనా భావిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో చైనా తీరుపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. ట్రంప్, బ్రిటన్ ఎంపీల డిమాండ్లకు చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Wednesday, 17 December 2025

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా విలేజ్ సర్వేయర్ శ్రీరాములు పట్టుబడ్డాడు.

 ♦️పుంగనూరు MRO office లో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా విలేజ్ సర్వేయర్ శ్రీరాములు పట్టుబడ్డాడు.


మంగళం పంచాయతీలో 8గుంటల భూమి సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్న ఉమాశంకర్, 15 రోజుల క్రితం మంగళం సచివాలంలో సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్నారు. సర్వే సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.50 వేలు ఒప్పందం కుదుర్చుకుని రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబీ కి పట్టుబడ్డాడు

నేర నియంత్రణలో 'సరిహద్దులు' చూడొద్దు

 నేర నియంత్రణలో 'సరిహద్దులు' చూడొద్దు


‘జీరో డిలే’ విధానం పక్కాగా అమలు చేయాలి
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్
మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం
హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్‌ స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు, నేరం జరిగిన వెంటనే స్పందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆయన చెప్పారు.
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా బుధవారం మూడు కమిషనరేట్ల కీలక సమన్వయ సమావేశం జరిగింది.
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సైబరాబాద్‌ సీపీ శ్రీ అవినాష్‌ మహంతి, ఐపీఎస్, రాచకొండ సీపీ శ్రీ సుధీర్‌బాబు, ఐపీఎస్ పాల్గొన్నారు. నగర భద్రత, ట్రాఫిక్ సమస్యలు, నేరస్థుల కదలికలపై సుదీర్ఘంగా చర్చించారు.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో నేరస్తులు ఒక కమిషనరేట్ పరిధిలో నేరం చేసి, మరో కమిషనరేట్ పరిధిలోకి వెళ్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి క్షేత్రస్థాయి అధికారులు తీసుకువచ్చారు. పరిధుల పేరుతో పోలీసులు కాలయాపన చేయడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కింది స్థాయి సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని నగర సీపీ సజ్జనర్ అన్నారు. నేరం ఎక్కడ జరిగినా, ఏ కమిషనరేట్ పరిధి అన్నది చూడకుండా సమీపంలోని పోలీసులు వెంటనే స్పందించాలన్నారు.
రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై మూడు కమిషనరేట్ల పోలీసులు ఉమ్మడి నిఘా ఉంచాలని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలన్నారు.
రౌడీ షీటర్లు, నేరస్థులు తరచుగా తమ నివాసాలను మారుస్తున్నారని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పక్కా సమాచార మార్పిడి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
నేరాలతో పాటు నగరంలో ట్రాఫిక్ నిర్వహణపైనా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
నగరంలోకి వచ్చే భారీ వాహనాల 'నో ఎంట్రీ' సమయాలను ఒకేలా అమలు చేయాలని, ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ఈ వాహనాలు రోడ్లపైకి రాకుండా, నగరం వెలుపలే నిలువరించాలని అన్నారు.
వారాంతాల్లో మందుబాబులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తప్పించుకోకుండా, మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో ఉమ్మడి తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
వాహనదారుల పెండింగ్ చలానాల వసూలు కోసం మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో 'స్పెషల్ డ్రైవ్'లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
సరిహద్దు జంక్షన్ల వద్ద సిగ్నల్ టైమింగ్స్ విషయంలో రెండు కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు రియల్ టైమ్ గా సమన్వయంతో పనిచేయాలని, దీనివల్ల వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల వల్ల ట్రాఫిక్ సమస్యలు జటిలమవుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమన్వయంతో అడుగులు వేయాలన్నారు.
‘‘నేరస్తులకు సరిహద్దులు ఉండనప్పుడు, పోలీసులకు కూడా ఉండకూడదు. బాధితులకు తక్షణ న్యాయం అందించే ‘జీరో డిలే’ విధానమే మనకు ముఖ్యం. మూడు కమిషనరేట్లు వేరైనా మన లక్ష్యం 'సేఫ్ హైదరాబాద్' ఒక్కటే. సాంకేతికతను వినియోగించుకుంటూ మూడు కమిషనరేట్ల పోలీసులు ‘సింగిల్ ఫోర్స్’లా పనిచేస్తేనే నేరాలను పూర్తిగా అరికట్టగలం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదు,’’ అని నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ హెచ్చరించారు.
సైబరాబాద్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోందని, ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, నేరాల కట్టడికి మూడు కమిషనరేట్ల సమన్వయం అత్యవసరమని అన్నారు. అధునాతన సాంకేతికతను, సీసీటీవీ నెట్‌వర్క్‌ను అనుసంధానించడం ద్వారా నేరస్తుల కదలికలను రియల్ టైమ్‌లో పసిగట్టవచ్చని అన్నారు.
రాచకొండ సీపీ శ్రీ సుధీర్ బాబు, ఐపీఎస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో నేరాల నియంత్రణకు జాయింట్ టీమ్స్ ని ఏర్పాటు చేసి.. మూడు కమిషనరేట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచడంలోనూ, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలోనూ సమాచార మార్పిడి కీలకమని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు, జాయింట్‌ సీపీలు తఫ్సీర్‌ ఇక్బాల్‌, జోయల్‌ డెవిస్‌, గజరావు భూపాల్‌ తో పాటు మూడు కమిషనరేట్లకు చెందిన డీసీపీలు పాల్గొన్నారు.

Tuesday, 16 December 2025

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ లో మార్పులు..


 ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ లో మార్పులు..

తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. 2026 మార్చి 3న జరగాల్సిన ఇంటర్మీడియట్​సెకండియర్ బోటనీ, మ్యాథ్స్ 2 ఏ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను తరువాతి రోజు అంటే మార్చి 4న నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. మార్చి 3న హోలీ పండగ ఉన్న నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు వెల్లడించింది. ఇక మిగతా పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.


తెలంగాణలోని ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మరుసటి రోజు అనగా మార్చి4న నిర్వహించనునున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మార్చి 3వ తేదీన హోలీ పండగ ఉన్న నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పు చేసినట్లు వివరించింది.


ఇక మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25 న ప్రారంభం కానున్నాయి. 25న ఫస్ట్ ఇయర్, 26వ తేదీన సెకండియర్ పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి.

రోజుకు రెండు సెషన్ల చొప్పున రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. అలాగే ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రతి రోజూ 2 షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 వరకు అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు.

Sunday, 14 December 2025

ఖాతాదారులకు SBI బిగ్ షాక్: ఎల్లుండి నుంచి

 

ఖాతాదారులకు SBI బిగ్ షాక్: ఎల్లుండి నుంచి

              స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. డిపాజిట్లు, రుణ వడ్డీ రేట్లను సవరించింది. రిటైల్ టర్మ్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అలాగే కొన్ని కీలక రుణ రేట్లలో కూడా కోత పెట్టింది. ఈ సవరణలన్నీ కూడా ఈ నెల డిసెంబర్ 15వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్లకు అనుగుణంగా ఆయా డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించినట్లు ఎస్బీఐ వెల్లడించింది.

             మూడు కోట్ల రూపాయలలోపు దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేట్, బేస్ రేట్‌పై ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. చాలా వరకు రిటైల్ టర్మ్ డిపాజిట్లలో వడ్డీ రేట్లు మారలేదు. అయినప్పటికీ, డిసెంబర్ 15 నుండి అమలులోకి వచ్చే 444 రోజుల 'అమృత్ వృష్టి' డిపాజిట్ పథకంలో వడ్డీ రేటును 6.60 నుండి 6.45 శాతానికి తగ్గించింది.

              సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించిన రెండేళ్లలోపు అన్ని డిపాజిట్లల్లో కూడా అధిక వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగుతాయి. రెండు నుండి మూడు సంవత్సరాలలోపు కాలపరిమితిలో డిపాజిట్లల్లో మార్పు చోటు చేసుకున్నాయి. ఈ కేటగిరీలో వారి వడ్డీ రేటును 6.95 నుండి 6.90 శాతానికి తగ్గించారు. ఈ టెన్యూర్ కోసం సాధారణ ప్రజలకు వడ్డీ రేటు గతంలో 6.45 శాతం ఉండగా, ఇప్పుడది 6.40 శాతానికి తగ్గింది.

             కొన్ని కేటగిరీలకు సంబంధించిన రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్‌బీఐ అన్ని కాలపరిమితుల MCLR రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపు ప్రభావం హోమ్, ఆటో, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలతో సహా ఎంసీఎల్ఆర్ తో అనుసంధానించిన రుణాల ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఓవర్‌నైట్, ఒక నెల కాలపరిమితులకు 7.85 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం ఇది 7.90 శాతం.

       లాగే- మూడు నెలల కాలానికి 8. 30 నుండి 8.25 శాతానికి, ఆరు నెలల కాలానికి 8.65 నుండి 8.60 శాతంగా నిర్ణయించారు. దీనితో పాటు ఏడాది నుంచి మూడేళ్ల మధ్య కాలాల కోసం కూడా ఎంసీఎల్ఆర్ తగ్గింది. ఒక సంవత్సరం కాలానికి 8.75 నుంచి 8.70, రెండు సంవత్సరాలకు 8.80 నుంచి 8.75, మూడు సంవత్సరాల కాలానికి 8.85 నుండి 8.80 శాతంగా సవరించారు.

              రిటైల్ ఫ్లోటింగ్ రేట్ రుణాల ధరలను నిర్ణయించడానికి ఉపయోగించే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేట్ ను ఎస్‌బీఐ 8.15 నుండి 7.90 శాతానికి అంటే 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఎంసీఎల్ఆర్, ఈబీఎల్ఆర్ బేస్ రేట్లలో తగ్గింపులు ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. ఈబీఎల్ఆర్ తో లింక్ అయిన గృహ రుణాల ఈఎంఐలలో గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది.

రోజురోజుకూ చుక్కలు చూపిస్తోన్న గోల్డ్..!!


 రోజురోజుకూ చుక్కలు చూపిస్తోన్న గోల్డ్..!! 

 దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి. ఎక్కడా తగ్గట్లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,33,910 పలుకుతోంది. 22 క్యారెట్లు రూ. 1,22,750లకు చేరింది. ఇది గరిష్ఠం. ఆల్ టైమ్ హైకి చేరుకుంది బంగారం ధర. 22 క్యారెట్లు కూడా అదే రేంజ్ లో ఉండటం కొనుగోలుదారులను షాక్ కు గురి చేస్తోంది. బంగారం ధరలపై అనేక అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు) 

           చెన్నై.. 24 క్యారెట్లు- రూ. 13,495, 22 క్యారెట్లు - రూ. 12,370, 18 క్యారెట్లు - రూ. 10,330 ముంబై.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు - రూ. 10,043 ఢిల్లీ.. 24 క్యారెట్లు- రూ. 13,407, 22 క్యారెట్లు- రూ. 12,290, 18 క్యారెట్లు - రూ. 10,058 

                  24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 హైదరాబాద్.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 విజయవాడ.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043  విశాఖపట్నం.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 గుంటూరు.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 నెల్లూరు.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 కాకినాడ.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 తిరుపతి.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 అనంతపురం.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043

Wednesday, 10 December 2025

మానవ హక్కుల దినోత్సవాన్నిపురస్కరించుకొని ఉచిత ఆరోగ్య శిబిరం

 *


అంతర్జాతీయ
మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా (IHRCI) ఆధ్వర్యంలో ఇండియన్ బ్యాంక్ లేన్, రామ్‌నగర్‌లో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న  డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారి దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, హిందూ ధర్మ రక్ష ఫౌండర్ డా. చికోటి ప్రవీణ్ , ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్,  ఎమ్మెల్యే ముటా గోపాల్ లు పాల్గొని  ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో ఉద్బోధించడం , మానవ హక్కుల పరిరక్షణలో సమాజం మొత్తం ముందుకు రావాల్సిన అవసరాన్ని వివరించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొని ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేశారు.*

Sunday, 7 December 2025

ఖైదీల మౌలిక సదుపాయాల పై అధ్యయనం తో పాటు పరిష్కారదిశగా మన అమరజీవి

 ఖైదీల మౌలిక సదుపాయాల పై అధ్యయనం తో 

పాటు పరిష్కారదిశగా మన అమరజీవి


1 ) ఖైదీల విడుదల అనే ఈ పక్రియ కొంత మంది కి మాత్రమే లభిస్తుంది 


2 ) మన అమరజీవి చిరు సహాయం ద్వారా ఎక్కువ మందికి లేదా అందరి కీ ఎంతో కొంత మేలు జరగాలి కదా


అందు కోసం 


ప్రస్తుతం జైల్లో అధ్యయనం చేసిన అనంతరం 


సమకూర్చువలసిన కొత్త వి 


లేదా 


రిపేర్లు ఉన్న చేయలసిన వి


1 ) సరపడా గాలి , వేలుతురు కై పరిశీలన 


2 ) కొత్త ఫ్యాన్లు ( రిపేర్లు )


3 ) కొత్త టుబ్యులైట్లు


4 ) ఈ చలికాలంలో వేడి నీళ్ళ కోసం గిజర్ల సదుపాయం 


5 ) క్రింద పడుకునే చాపలు , దిండ్లు 


6 ) పై ఓవర్ హెడ్ టాంకులు శుభ్రం చేయించుట 


7 ) దేశ భక్తి పాటలు వినిపించేదు కు మైక్ 


8 ) తువ్వాల లు , బెడ్ శీట్లు , కప్పుకనే బ్లాంకిట్లు , 


9 ) వికాలాంగుల అవసరాలు 


10 ) మహిళా ఖైదీల వారి అవసరాలు 


11 ) అన్నింటి కి అన్న ఎంతో ముఖ్యమైన త్రాగు నీరు పీల్ టర్ల సదుపాయం ROR వాటర్ 


12 ) మెరుగైన భోజనం వాటి అవసరాలు












ఆర్య వైశ్యులకు అండగా ఉంటా*



v0.

× $ m|˜t 





 *ఆర్య వైశ్యులకు అండగా ఉంటా*


- *TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*


*ముషీరాబాద్ ఆర్య వైశ్య హాస్టల్ లో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ*


ఆర్య వైశ్యుల కు అండగా ఉంటానని TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు అన్నారు.

IVF చైర్మన్ అడ్వైసరి బోర్డ్ సెంట్రల్ కమిటీ న్యూఢిల్లీ గంజి రాజమౌళి గుప్త గారు గారితో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ నీ ఆవిష్కరించారు.


ఈ సందర్బంగా గంజి రాజమౌళి గుప్త గారు మాట్లాడుతూ ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన తెలిపారు.

తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్య వైశ్య సోదరులకు అండగా ఉంటాను అని వారి గెలుపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఆయన అన్నారు.


ఈ కార్యక్రమంలో Vasavi hospital chairman Jaya Prakash Ram , IVF Youth President కట్ట రవి గుప్త గారు , ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ గుప్త , Ivf tresurer Narayana , Ivf Pro Vutukoori srinivas, adl secretary Katakam srinivas, Udutha purushottam, kacham Krishna murthy , Divadeenam , Uppala Swapna గారు మహిళ అధ్యక్షురాలు చంద భాగ్య లక్ష్మి ,Naresh guptha , Santhosh ivf youth Team , Manjula , Nalini , Bongiri srinivas, Anjaiah swamy , 33 జిల్లాల ఆర్య వైశ్య ఫెడరేషన్ (IVF) జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Saturday, 6 December 2025

పరకామణిలో చోరీ తర్వాత జరిగిందిదే..! నోరువిప్పిన నిందితుడు..!

పరకామణిలో చోరీ తర్వాత జరిగిందిదే..! నోరువిప్పిన నిందితుడు..! 

               

:తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణిలో రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న చోరీ ఘటన ఇప్పుడు కూటమి సర్కార్ లో మరోసారి తెరపైకి వస్తోంది. గతంలో వైసీపీ హయాంలో ఈ ఘటనకు కారకులైన వారు, ఫిర్యాదుదారులను లోక్ అదాలత్ లో రాజీ చేయించడంపై ఇప్పుడు రాజకీయ మాటల యుద్దం నడుస్తోంది. అలాగే ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు అనుమానాస్పద రీతిలో రైలు పట్టాలపై శవమై తేలారు. దీంతో పరకామణి వ్యవహారం అధికార, విపక్షాల మధ్య రాజకీయ అంశంగా మారిపోయింది. అలాగే ఈ చోరీకి పాల్పడిన టీటీడీ ఉద్యోగి రవి కుమార్ పాత్రపై పలు ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. దీంతో ఆయన ఇవాళ నోరు విప్పారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన రవి కుమార్ అప్పట్లో ఏం జరిగిందో కుండబద్దలు కొట్టారు. దీంతో పాటు తమపై తప్పుడు ప్రచారం చేయొద్దంటూ వేడుకున్నారు. 

             గతంలో తాను పెద్ద జీయర్ మఠంలో గుమస్తాగా పని చేస్తూనే పలు వ్యాపారాలు చేసినట్లు రవి కుమార్ తెలిపారు. రెండేళ్ల క్రిత్తం పరకామణిలో చోరికి పాల్పడింది నిజమే అన్నారు. అయితే పరకామణిలో చోరీని మహాపాపంగా భావించి తాను, తన కుటుంబం ఆస్థిలో 90 శాతం వేంకటేశ్వరస్వామివారికి రాసి ఇచ్చామని వెల్లడించారు. దీని వెనుక ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. అలాగే ఇతరులకు ఎవరికీ తాము డబ్బులు, ఆస్తి ఇవ్వలేదన్నారు. వైసీపీ నేతలు రవి కుమార్ నుంచి డబ్బులు తీసుకుని ఈ కేసు రాజీ చేయించినట్లు టీడీపీ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు. అయితే తనను కొంతమంది బ్లాక్‌మెయిల్ చేశారని రవికుమార్ వెల్లడించారు. వారిపై కేసు కూడా పెట్టినట్లు తెలిపారు. అలాగే తాను కొన్ని సర్జరీలు చేయించుకున్నానని, అనారోగ్యంతో బాధపడుతున్న తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని రవి కుమార్ ఆరోపించారు. కోర్టు ఆదేశిస్తే ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అయినా సిద్దమన్నారు. కానీ ఈ వివాదం వల్ల తనతో పాటు కుటుంబం కూడా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అసదుద్దీన్ ఓవైసీ AI షాకింగ్ వీడియో.. హెచ్చరిక!

 అసదుద్దీన్ ఓవైసీ AI షాకింగ్ వీడియో.. హెచ్చరిక! 

 


             ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది నిజమైంది ఏది ఫేక్ అన్నది అర్థం కాని పరిస్థితి చోటుచేసుకుంది . ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉచ్చులో పడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తాను చేయనివి చేసినట్టు చూపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వీడియోలు కొన్ని సందర్భాలలో సెలబ్రిటీలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక తాజాగా అసదుద్దీన్ ఓవైసీ కి సంబంధించి ఒక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓవైసీ హనుమంతునికి హారతి .. ఏఐ వీడియో పార్లమెంటు సభ్యుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆంజనేయ స్వామిని దర్శించి హారతి ఇస్తున్నట్టు, ఏఐ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కులమతాల మధ్య చిచ్చుపెట్టే లాగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరిన్ని కనుగొనండి వీడియో వార్తలు జ్యోతిష్యం సేవలు ట్రావెల్ గైడ్‌లు మొబైల్ ఫోన్లు బంగారం నాణేలు మ‌నీ సమాచారం విద్య కోర్సులు నకిలీ ఏఐ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ ఏఐ జనరేటర్ వీడియో పైన ఏ ఐ ఎం ఐ ఎం సోషల్ మీడియా అడ్మిన్ మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఆంజనేయ స్వామికి హారతి ఇస్తున్నట్టు ప్రచారం చేయడం పైన ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో ను వైరల్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు హెచ్చరిక దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరూ ఆ ఏఐ జనరేటర్ వీడియోను షేర్ చేయవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని చెబుతున్నారు. ఈ ఏఐ జనరేటెడ్ వీడియోను ఒకవేళ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ ముసుగులో చేసే ఇటువంటి చర్యలను సహించేది లేదని ఎంఐఎం నేతలు తేల్చి చెప్తున్నారు. 

           సమయస్పూర్తి ఇలా ఉండాలి! మత విశ్వాసాలను దెబ్బ తీస్తున్నారని భగ్గుమన్న ఎంఐఎం ఇటువంటి వీడియోలు తమ మత విశ్వాసాలను దెబ్బతీస్తాయని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడిని ఇందులో భాగం చేయడం సరి కాదని అంటున్నారు. ఈ వీడియో పైన సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Friday, 5 December 2025

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, స్థలం లేని పేదలకు కొత్తగా...!!

 ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, స్థలం లేని పేదలకు కొత్తగా...!! 


                 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ముహూర్తం ఖరారు చేసింది. దశల వారీగా లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు కొత్త కార్యాచరణ ఖరారు చేసారు. త్వరలో అర్బన్ ప్రణాళిక ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది. కొత్త ఇళ్ల ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేసారు. అదే విధంగా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయటం పైన టార్గెట్ ఫిక్స్ చేసారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. త్వరలో లక్ష ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతా యని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశం పూర్తి అవుతుంద ని వివరించారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవు తుందని చెప్పుకొచ్చారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా ప్రణాళిక సిద్ధమైంద ని వెల్లడించారు. గ్రౌండ్ ప్లస్ ఫోర్ బిల్డింగ్ నిర్మించి పేదలకు ఇచ్చే ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. త్వరలో అర్బన్ ప్రణాళిక ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఓ ఆర్ ఆర్‌కు ఆనుకుని నలువైపులా ఉన్న స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.

                      కాగా, ఒక్కో చోట 10వేల ఇళ్లు నిర్మించి నో ప్రాఫిట్, నో లాస్ కింద మధ్యతరగతి ప్రజలకు ఇస్తామ ని వివరించారు. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రణాళికలు ప్రకటిస్తామని రేవంత్ పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం హౌసింగ్ శాఖను నిర్వీర్యం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ శాఖను తిరిగి తాము బలోపేతం చేశామని వివరించారు. గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన ఇళ్లకు కూడా ఇందిరమ్మ పథకం వర్తింపజేయాలని తాము ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. రూరల్‌లో, అర్బన్‌లో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు కూడా త్వరలో శుభవార్త చెబుతామని పేర్కొన్నారు. ఒక విడతలోనే ఇళ్లు ఇచ్చి తాము చేతులు దులుపుకోమని చెప్పుకొచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసారు. హిల్ట్ పాలసీపై కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

పోలీస్ కమిషనర్‌గా ఆర్‌సీబీ బ్యాటర్!

పోలీస్ కమిషనర్‌గా ఆర్‌సీబీ బ్యాటర్!

మహిళల వన్డే ప్రపంచకప్ విజేత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.. సిలిగురి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌(ఏసీపీ)గా నియమించింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) హోదాలో ఆమె ఈ బాధ్యతలు చేపట్టింది. వెస్ట్ బెంగాల్ డీజీపీ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) శ్రీ రాజీవ్ కుమార్(ఐపీఎస్) చేతుల మీదుగా రిచా ఘోష్ బాధ్యతలు స్వీకరించింది.

పోలీస్ డ్రెస్‌లో రిచా ఘోష్‌ డీజీపీని కలవగా.. ఈ ఫొటోలను ఎక్స్‌ వేదికగా వెస్ట్ బెంగాల్ పోలీస్ విభాగం పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లేడీ సింగం రిచా ఘోష్ అని ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్రికెటర్ నుంచి పోలీస్ అధికారిగా నియామకమైన రిచా ఘోష్ జీవిత ప్రయాణానికి సంబంధించిన వీడియోను కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

World Cup Star Richa Ghosh Appointed as ACP Siliguri After Joining West Bengal Police

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు విజేతగా నిలవడంలో 22 ఏళ్ల రిచా ఘోష్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దాంతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్లేయర్ అయిన రిచా ఘోష్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ.34 లక్షల క్యాష్ ప్రైజ్ అందజేసింది. అంతేకాకుండా బంగా బిభూషణ్ అనే బిరుదును ప్రకటించింది. రిచా ఘోస్ స్వస్థలమైన సిలిగురిలోని చందమణి టీ ఎస్టేట్ ప్రాంతంలో ఆమె పేరు మీద కొత్త క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తామని ప్రకటించింది.

పవర్ హిట్టర్ అయిన రిచా ఘోష్ 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. మఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్లో దూకుడుగా ఆడి భారత్‌కు భారీ లక్ష్యాన్ని అందించింది. 8 మ్యాచ్‌లు ఆడిన రిచా ఘోష్ 39.16 సగటు 133.52 స్ట్రైక్‌రేట్‌తో 235 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్‌దే అత్యుత్తమ స్ట్రైక్‌రేట్. ఈ టోర్నీలో మొత్తం 12 సిక్స్‌లు బాదిన రిచా ఘోష్.. ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత ప్లేయర్‌గా నిలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీకి రిచా ఘోష్ ప్రాతినిథ్యం వహిస్తోంది.

Thursday, 4 December 2025

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీపై ఏసీబీ దాడులు

 


రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీపై ఏసీబీ దాడులు


కలెక్టర్ కార్యాలయంతో పాటు, మై హోమ్ భూజలోని తన నివాసంలో సోదాలు


రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్న అధికారులు, పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు సంపాదించినట్లు గుర్తింపACB దాడులు

రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ & భూ రికార్డుల కార్యాలయములో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులు పైన #అక్రమఆస్తులకేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.


#అనిశా అధికారులు అతనికి మరియు అతని బంధువులకు సంబంధించిన 6 స్థలాలలో సోదాలు నిర్వహించి హైదరాబాద్ లోని రాయదుర్గం - మై హోమ్ భుజాలో ఒక ఫ్లాట్, మహబూబ్ నగర్ లో 4 ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో ఒక రైస్ మిల్లుతో పాటుగా 3 ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురములో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి,

కర్ణాటకలో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి, 2 చతు:చక్ర వాహనాలు మరియు 1.6 కిలోల బంగారు & 770 గ్రాముల వెండి ఆభరణాల వంటి స్థిర,చరాస్తులతో పాటు ఐదు లక్షల రూపాయల నగదు కలిగి ఉన్నట్లు గుర్తించినారు. కేసు దర్యాప్తులో ఉన్నది.