Monday, 23 March 2026

పదవ తరగతి పరీక్షలు ముగిసేవరకు కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.



 పదవ తరగతి పరీక్షలు ముగిసేవరకు  కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

        సోమవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో ఉన్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.

         పరీక్షా కేంద్రాలలో  అన్ని వసతులు ఎప్పటిలాగే ఉండాలని,ప్రత్యేకించి తాగునీరు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,టాయ్ లెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని అధికారులకు చెప్పారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా కుండలలో తాగునీరు  ఏర్పాటు చేయాలని అన్నారు. 

పరీక్ష కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేయాలని తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని,పూర్తి స్థాయిలో తనిఖీ తర్వాతే విద్యార్థులను  పరీక్ష కేంద్రం లోకి పంపించాలన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల హాజరు,తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స లో భాగంగా ఏ ఎన్ ఎం తో మాట్లాడారు.వేసవిని దృష్టిలో ఉంచుకొని ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home