ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ను సీరియస్ గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో ఆదేశించినట్లు ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ సభలో ప్రభుత్వ ప్రాధామ్య పథకాలు, 6 గ్యారంటీలకు సంబంధించి గ్రామపంచాయతీ, మండల, మున్సిపల్,జిల్లా వారిగా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాను తక్షణమే తయారు చేసి సిపిఓ కు సమర్పించాలి. మండల ప్రత్యేక అధికారులు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను సందర్శించి ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి.
జనగణనకు సంబంధించి తక్షణమే ఎన్యుమరేషన్ బ్లాక్ లను నిర్ణయించడంతోపాటు, సూపర్వైజర్ల తుది జాబితాను రూపొందించాలి. అంతేకాక నియామకపు తరువులు జారీ చేయాలి.
ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా వివిధ పథకాల కింద నిధులు పొందిన అధికారులందరూ తక్షణమే యుటీలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలి.
జంతు సంరక్షణ లో భాగంగా మిర్యాలగూడలో చేపట్టిన ఏబిసీ
స్టెరిలైజేషన్ కేంద్రం పనులను వేగవంతం చేయాలి. మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు పనులు జరిగేలా చూడాలి. దేవరకొండ ఆర్డిఓ దేవరకొండలో ఏబి సి కేంద్రం ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలాన్ని చూడాలి. అందరూ మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి అన్ని మేజర్ గ్రామపంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలలో ఏబీసీల ఏర్పాటుకు స్థలాన్ని చూడాలి.
కుక్కల రిహబిలిటేషన్ గాను నల్గొండ మున్సిపల్ కమిషనర్ నల్గొండలో కుక్కల షెల్టర్ ను ఏర్పాటు చేయాలి. ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల ఆవరణలలో సంచరించే కుక్కలకు సెంటర్లకు తరలించే ఏర్పాటు చేయాలి. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఒక రోజు "దత్తత" కార్యక్రమాన్ని నిర్వహించి ఆవులు, కుక్కలను దత్తత ఇచ్చేలా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ చూడాలి. దీనికి మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ సహకార అందించాలని కలెక్టర్ ఆదేశించారు .
ఈ సమావేశంలో ఉపాధి హామీ ,తదిత అంశాలపై సమీక్షించారు.
కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 40 పిటిషన్లు, ఇతర శాఖలకు 43 పిటిషన్లు, మొత్తం 83 ఫిర్యాదులను ప్రజలు ప్రజావాణిలో సమర్పించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్ట్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
__________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*





0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home