జర్నలిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం! సీఎం తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులతో వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, మార్చి11 ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేసే అంశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీం ను జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జే ఎఫ్) బృందం బుదవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి హెల్త్ పాలసీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసినవారిలో టి డబ్ల్యూ జె ఎఫ్ ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ.చంద్ర శేఖర్ , బి జగదీశ్వర్ ఉన్నారు. గౌరవనీయులైన దామోదర రాజనర్సింహ్మ గారు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మాత్యులు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్. ໖: 11-3-2026 విషయం: ప్రభుత్వ ఉద్యోగుల హెల్కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయుట గురించి మనవి చేయునది ఏమనగా రాష్ట్రంలో జర్నలిస్టుల హెల్త్కేర్డులు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల పెండింగ్ పేర వైద్యచికిత్స అందించడం లేదు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ కింద ఉన్న నేపథ్యంలో సేవలు వేగంగా, నాణ్యంగా అందడం లేదు. హైదరాబాద్లోని నిమ్స్ కూడా చికిత్స పూర్తి ఉ చితంగా అందడం లేదు. దీంతో చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు, అధికమొత్తంలో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల కోసం 'తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ కేర్' పథకం ద్వారా ప్రత్యేక వైద్య చికిత్స పథకం అమలు కోసం కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు కూడా ఉద్యోగుల పథకాన్ని వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ని ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసి మెడిక్లెయిమ్ పథకం తరహాలో హెల్త్ కార్డుల పథకానికి ప్రభుత్వమే చెల్లించాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి. రిటైరైన జర్నలిస్టులనూ ఈపథకం కింద చేర్చాలి. సమస్యలు: 1. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేయనున్న కొత్త ఆరోగ్య కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించాలి. 2. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3. వెల్నెస్ కేంద్రాల్లో రోగులకు అన్ని రకాల పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు, టెక్నిషియన్లను కూడా రోగులకు వేగంగా సేవలు అందించేలా సంఖ్యను పెంచాలి. 4. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను గతంలో మాదిరిగా మార్చి పరీక్షలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కృతజ్ఞతలతో పి రాంచందర్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బి.బసవపున్నయ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి
జర్నలిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం!
సీఎం తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుజర్నలిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం!
సీఎం తో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం
టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులతో వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, మార్చి11
ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేసే అంశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీం ను జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జే ఎఫ్) బృందం
బుదవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి హెల్త్ పాలసీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసినవారిలో టి డబ్ల్యూ జె ఎఫ్ ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ.చంద్ర శేఖర్ , బి జగదీశ్వర్ ఉన్నారు.
గౌరవనీయులైన దామోదర రాజనర్సింహ్మ గారు
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మాత్యులు
తెలంగాణ రాష్ట్రం,
హైదరాబాద్.
໖: 11-3-2026
విషయం: ప్రభుత్వ ఉద్యోగుల హెల్కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయుట గురించి
మనవి చేయునది ఏమనగా రాష్ట్రంలో జర్నలిస్టుల హెల్త్కేర్డులు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల పెండింగ్ పేర వైద్యచికిత్స అందించడం లేదు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ కింద ఉన్న నేపథ్యంలో సేవలు వేగంగా, నాణ్యంగా అందడం లేదు. హైదరాబాద్లోని నిమ్స్ కూడా చికిత్స పూర్తి ఉ చితంగా అందడం లేదు. దీంతో చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు, అధికమొత్తంలో డబ్బులు చెల్లించి వైద్య చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల కోసం 'తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ కేర్' పథకం ద్వారా ప్రత్యేక వైద్య చికిత్స పథకం అమలు కోసం కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు కూడా ఉద్యోగుల పథకాన్ని వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ని ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసి మెడిక్లెయిమ్ పథకం తరహాలో హెల్త్ కార్డుల పథకానికి ప్రభుత్వమే చెల్లించాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి. రిటైరైన జర్నలిస్టులనూ ఈపథకం కింద చేర్చాలి.
సమస్యలు:
1. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేయనున్న కొత్త ఆరోగ్య కార్డుల పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించాలి.
2. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
3. వెల్నెస్ కేంద్రాల్లో రోగులకు అన్ని రకాల పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు, టెక్నిషియన్లను కూడా రోగులకు వేగంగా సేవలు అందించేలా సంఖ్యను పెంచాలి.
4. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను గతంలో మాదిరిగా మార్చి పరీక్షలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
కృతజ్ఞతలతో
పి రాంచందర్
యాక్టింగ్ ప్రెసిడెంట్
బి.బసవపున్నయ్య

రాష్ట్ర ప్రధానకార్యదర్శి

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home