బందీగా పత్రికా స్వేచ్ఛ!: చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్!!
బందీగా పత్రికా స్వేచ్ఛ!: చైనాకు డొనాల్డ్ ట్రంప్
వార్నింగ్!!
హాంకాంగ్‌లో మీడియా దిగ్గజం, బ్రిటీష్ పౌరుడు జిమ్మీ లాయ్‌పై చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయంగా పెనుసంచలనం సృష్టిస్తున్నాయి. 78 ఏళ్ల వయసున్న జిమ్మీ లాయ్‌ను బేడీలతో కట్టి వీధుల్లో తిప్పిన దృశ్యాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం కింద జిమ్మీ లాయ్‌ను దోషిగా నిర్ధారించడంపై అమెరికా, బ్రిటన్ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఈ పరిణామం హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు కీలక విజ్ఞప్తి చేశారు. జిమ్మీ లాయ్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఒక వ్యక్తిని ఇలా జైలులో పెట్టడం చైనా పతనానికి సంకేతమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని కనుగొనండి యూఎస్ వెళ్లాలనుకునే వారికి షాక్ .. 2026నుండి పెరగనున్న టూరిస్ట్ వీసా ఛార్జీలు!" బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ నిరసన బ్రిటన్ పార్లమెంటులో ఎంపీ ప్రీతి పటేల్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. "జిమ్మీ లాయ్‌ను జైలులో పెట్టడం, వేధించడం హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి చైనా చేస్తున్న సిగ్గుచేటు ప్రయత్నం. ఇది చైనా-బ్రిటిష్ ఉమ్మడి ప్రకటనను ఘోరంగా ఉల్లంఘించడమే" అని ఆమె మండిపడ్డారు. 78 ఏళ్ల వయసున్న వ్యక్తిని గొలుసులతో బంధించి వీధుల్లో తిప్పడం కలచివేసే దృశ్యమని, కానీ ఆయన ధైర్యం ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛను కోరుకునే వారికి స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు. గత 1,800 రోజులుగా ఏకాంత కారాగారంలో ఉండటం వల్ల జిమ్మీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయనను వెంటనే విడిచిపెట్టి బ్రిటన్‌లోని తన కుటుంబం వద్దకు వెళ్లేలా చూడాలని కోరారు. చైనా పర్యటనను రద్దు చేసుకోవాలి! బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, విదేశాంగ మంత్రికి ప్రీతి పటేల్ ఒక కీలక విన్నపం చేశారు. జనవరిలో వారు చేపట్టబోయే చైనా పర్యటనను, జిమ్మీ లాయ్ విడుదల అయ్యే వరకు రద్దు చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేయడం ద్వారానే చైనాకు సరైన సంకేతం వెళ్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఇప్పుడు మూతపడిన ప్రజాస్వామ్య అనుకూల పత్రిక 'యాపిల్ డెయిలీ'వ్యవస్థాపకుడు. హాంకాంగ్‌లో చైనా పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడటమే ఆయన చేసిన నేరంగా చైనా భావిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో చైనా తీరుపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. ట్రంప్, బ్రిటన్ ఎంపీల డిమాండ్లకు చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home