ఖాతాదారులకు SBI బిగ్ షాక్: ఎల్లుండి నుంచి
ఖాతాదారులకు SBI బిగ్ షాక్: ఎల్లుండి నుంచి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. డిపాజిట్లు, రుణ వడ్డీ రేట్లను సవరించింది. రిటైల్ టర్మ్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అలాగే కొన్ని కీలక రుణ రేట్లలో కూడా కోత పెట్టింది. ఈ సవరణలన్నీ కూడా ఈ నెల డిసెంబర్ 15వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్లకు అనుగుణంగా ఆయా డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించినట్లు ఎస్బీఐ వెల్లడించింది.
మూడు కోట్ల రూపాయలలోపు దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేట్, బేస్ రేట్‌పై ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. చాలా వరకు రిటైల్ టర్మ్ డిపాజిట్లలో వడ్డీ రేట్లు మారలేదు. అయినప్పటికీ, డిసెంబర్ 15 నుండి అమలులోకి వచ్చే 444 రోజుల 'అమృత్ వృష్టి' డిపాజిట్ పథకంలో వడ్డీ రేటును 6.60 నుండి 6.45 శాతానికి తగ్గించింది.
సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించిన రెండేళ్లలోపు అన్ని డిపాజిట్లల్లో కూడా అధిక వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగుతాయి. రెండు నుండి మూడు సంవత్సరాలలోపు కాలపరిమితిలో డిపాజిట్లల్లో మార్పు చోటు చేసుకున్నాయి. ఈ కేటగిరీలో వారి వడ్డీ రేటును 6.95 నుండి 6.90 శాతానికి తగ్గించారు. ఈ టెన్యూర్ కోసం సాధారణ ప్రజలకు వడ్డీ రేటు గతంలో 6.45 శాతం ఉండగా, ఇప్పుడది 6.40 శాతానికి తగ్గింది.
కొన్ని కేటగిరీలకు సంబంధించిన రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్‌బీఐ అన్ని కాలపరిమితుల MCLR రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపు ప్రభావం హోమ్, ఆటో, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలతో సహా ఎంసీఎల్ఆర్ తో అనుసంధానించిన రుణాల ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఓవర్‌నైట్, ఒక నెల కాలపరిమితులకు 7.85 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం ఇది 7.90 శాతం.
లాగే- మూడు నెలల కాలానికి 8. 30 నుండి 8.25 శాతానికి, ఆరు నెలల కాలానికి 8.65 నుండి 8.60 శాతంగా నిర్ణయించారు. దీనితో పాటు ఏడాది నుంచి మూడేళ్ల మధ్య కాలాల కోసం కూడా ఎంసీఎల్ఆర్ తగ్గింది. ఒక సంవత్సరం కాలానికి 8.75 నుంచి 8.70, రెండు సంవత్సరాలకు 8.80 నుంచి 8.75, మూడు సంవత్సరాల కాలానికి 8.85 నుండి 8.80 శాతంగా సవరించారు.
రిటైల్ ఫ్లోటింగ్ రేట్ రుణాల ధరలను నిర్ణయించడానికి ఉపయోగించే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేట్ ను ఎస్‌బీఐ 8.15 నుండి 7.90 శాతానికి అంటే 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఎంసీఎల్ఆర్, ఈబీఎల్ఆర్ బేస్ రేట్లలో తగ్గింపులు ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. ఈబీఎల్ఆర్ తో లింక్ అయిన గృహ రుణాల ఈఎంఐలలో గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home