ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, స్థలం లేని పేదలకు కొత్తగా...!!
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, స్థలం లేని పేదలకు కొత్తగా...!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ముహూర్తం ఖరారు చేసింది. దశల వారీగా లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు కొత్త కార్యాచరణ ఖరారు చేసారు. త్వరలో అర్బన్ ప్రణాళిక ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది. కొత్త ఇళ్ల ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేసారు. అదే విధంగా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయటం పైన టార్గెట్ ఫిక్స్ చేసారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. త్వరలో లక్ష ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతా యని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశం పూర్తి అవుతుంద ని వివరించారు. వచ్చే ఏప్రిల్ నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవు తుందని చెప్పుకొచ్చారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా ప్రణాళిక సిద్ధమైంద ని వెల్లడించారు. గ్రౌండ్ ప్లస్ ఫోర్ బిల్డింగ్ నిర్మించి పేదలకు ఇచ్చే ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. త్వరలో అర్బన్ ప్రణాళిక ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఓ ఆర్ ఆర్‌కు ఆనుకుని నలువైపులా ఉన్న స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.
కాగా, ఒక్కో చోట 10వేల ఇళ్లు నిర్మించి నో ప్రాఫిట్, నో లాస్ కింద మధ్యతరగతి ప్రజలకు ఇస్తామ ని వివరించారు. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రణాళికలు ప్రకటిస్తామని రేవంత్ పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం హౌసింగ్ శాఖను నిర్వీర్యం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ శాఖను తిరిగి తాము బలోపేతం చేశామని వివరించారు. గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన ఇళ్లకు కూడా ఇందిరమ్మ పథకం వర్తింపజేయాలని తాము ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. రూరల్‌లో, అర్బన్‌లో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు కూడా త్వరలో శుభవార్త చెబుతామని పేర్కొన్నారు. ఒక విడతలోనే ఇళ్లు ఇచ్చి తాము చేతులు దులుపుకోమని చెప్పుకొచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసారు. హిల్ట్ పాలసీపై కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home