Saturday, 30 August 2025

భార్య ఎందుకు ప్రియుడిని కోరుకుంటుంది? ఈ ఏజ్ లోనే ఎక్కువగా ఎఫైర్స్..ఆశ్చర్యపరిచే కారణాలు

 భార్య ఎందుకు ప్రియుడిని కోరుకుంటుంది? ఈ ఏజ్ లోనే ఎక్కువగా ఎఫైర్స్..ఆశ్చర్యపరిచే కారణాలు


పెళ్లంటే నూరేళ్ల నంట అని అనేవాళ్లు గతంలో. ఇప్పుడయితే నూరేళ్ల మంటగా దానికి ముద్ర వేశారు. పెళ్లి అంటే కొందరిలో విరక్తి కూడా వచ్చేస్తుంది. దీనికి కారణంగా ఇటీవల కాలంలో పెరిగిపోతున్న వివాహ సంబంధాలు. లవర్ కోసం భార్యను చంపే భర్తలు..ప్రియుడు కోం భర్తను చంపేస్తున్న భార్యలు..ఇవన్నీ నిత్యం వార్తల్లో చూస్తున్నాం. గత కొంతకాలంగా అయితే వివాహేతర సంబంధాల కారణంగా జరిగే నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే అసలు మహిళలు ఎక్కువగా ఏ వయస్సులో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు? ఎందుకు? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.

ముఖ్యంగా 34- 38 ఏళ్ల మధ్య వయసులో చాలా మంది స్త్రీల జీవితంలో ఒక వర్ణించలేని శూన్యం ఆవరిస్తుందని.. అది మాటల్లో చెప్పలేని ఓ నిశ్శబ్ద వేదన అని నిపుణులు చెబుతున్నారు. తమ మాట వినేవారెవరూ లేరని, తమ మనసును అర్థం చేసుకునే ఆత్మీయులు కరువయ్యారని మథనపడతారు. ఈ క్రమంలోన, ప్రేమ, గుర్తింపు కోసం వారి ఆత్మ పరితపిస్తుంది. అలాంటి సున్నితమైన సమయంలో, వారి మనసు నిశ్శబ్దంగా మరొకరి వైపు ఆకర్షింపబడుతుంది. ఇది వివాహేతర సంబంధంగా మారుతుంది. ఇది కేవలం ద్రోహం కథ కాదు.. అంతకంటే లోతైనదని నిపుణులు చెబుతున్నారు.

వినాయక నిమజ్జనం ఎప్పుడు చేయాలి? పండితుల మాట ఇదే!

ఆన్ లైన్ పేమెంట్ ఫెయిల్.. రహస్యం బట్టబయలు..ఉన్న పెళ్లాం పోయింది,ఉంచుకున్న సెటప్ పోయిందిఆన్ లైన్ పేమెంట్ ఫెయిల్.. రహస్యం బట్టబయలు..ఉన్న పెళ్లాం పోయింది,ఉంచుకున్న సెటప్ పోయింది

ఎందుకిలా జరుగుతుంది?

రిలేషన్ షిప్ నిపుణులు చెప్పేదాని ప్రకారం..34- 38 ఏళ్ల వయసులో స్త్రీలు భావోద్వేగపరమైన లేదా శారీరకమైన బంధాల వైపు మొగ్గు చూపడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అది నిర్లక్ష్యం, ఒంటరితనం, అన్నింటికంటే మించి తనని తాను కోల్పోతున్నాననే బాధ నుంచి పుడుతుంది.


వివాహమైన కొన్నాళ్లకు, ప్రేమ స్థానాన్ని బాధ్యత ఆక్రమిస్తుంది. ఒకప్పటి ప్రియురాలైన భార్య.. అమ్మగా, కోడలిగా, ఇంటి నిర్వాహకురాలిగా కొన్ని పాత్రలకే పరిమితమైపోతుంది. ఈ పాత్రల బరువులో అసలు నేను ఎవరన్న ప్రశ్నే మరుగున పడిపోతుంది. పక్కనే భర్త ఉన్నా, పలకరించే మనసు ఉండదు. మాటలుంటాయి కానీ మనసులు కలవవు. ఒకప్పుడు ప్రేమ స్పర్శతో పులకరించిన జీవితం, ఇప్పుడు కేవలం మెషీన్ లా మారిపోతుంది. ఈ నిర్లక్ష్యం, ఈ ఒంటరితనం ఆమెలో ఓ అగాధాన్ని సృష్టిస్తుంది.

శరీరం చెప్పేది వేరు, బంధం అర్థం చేసుకునేది వేరు

మధ్య వయసులో స్త్రీలలో హార్మోన్ల మార్పులు సహజం. దీంతో వారిలో మానసిక, శారీరక సాన్నిహిత్యం కోసం ఆకాంక్ష కొత్తగా చిగురిస్తుంది. కానీ భాగస్వామి ఈ అవసరాన్ని గుర్తించలేనప్పుడు ఆ దాహం తీరక, తన భావాలను అర్థం చేసుకునే మరొకరి కోసం ఆమె మనసు వెతకడం ప్రారంభిస్తుంది.

        పెళ్లయిన మొదటి ఏడాదిలో అస్సలు చేయకూడని 3 పనులు..పొరపాటున చేస్తే జీవితం నాశనం!పెళ్లయిన మొదటి ఏడాదిలో అస్సలు చేయకూడని 3 పనులు..పొరపాటున చేస్తే జీవితం నాశనం!

ప్రతీకాత్మక చిత్రం

బయటి నుంచి దొరికే చిన్నపాటి గుర్తింపు

పిల్లల పెంపకం, ఉద్యోగం, ఇంటి పనుల చక్రబంధంలో నలిగిపోతున్న స్త్రీకి బయటి ప్రపంచంలో చిన్న ప్రశంస దొరికినా, అది ఎడారిలో ఒయాసిస్సులా అనిపిస్తుంది. తన కెరీర్‌ లో విజయాలు సాధిస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న ఆమెకు తన భావాలకు విలువనిచ్చే వాతావరణం కావాలనిపిస్తుంది. అలాంటి సమయంలో మీరెలా ఉన్నారు? అని అడిగే ఒక ఆత్మీయ స్వరం, తన మాటలను శ్రద్ధగా వినే వాళ్లు, తనను చూసి చిరునవ్వు చిందించే ఒక స్నేహం దొరికితే చాలు ఆమె మనసు ఆ వ్యక్తి వైపు ఇట్టే ఆకర్షింపబడుతుంది. ఇది బలహీనత కాదు, ప్రతి మనిషి కోరుకునే మానవీయ అవసరం.


ఇది ఒక హెచ్చరిక

నిజానికి ఒక స్త్రీ మరో బంధంలోకి అడుగుపెడుతోందంటే ఆమె తన భాగస్వామిని ద్వేషిస్తున్నట్టు కాదు. బదులుగా తనతో తనకున్న బంధాన్ని కోల్పోయిందని అర్థం. ఇది సంబంధానికి ఒక ప్రమాద ఘంటిక. బంధంలో ప్రేమ ఇంకిపోయి, శూన్యం ఏర్పడుతోందని చెప్పే ఒక సంకేతం. ఆమె మరొకరిని వెతకడం లేదు, బహుశా తనలో తాను కోల్పోయిన తననే వెతుక్కుంటోంది. కాబట్టి దీన్ని నిందించే ముందు ఆ శూన్యానికి కారణమేంటో అర్థం చేసుకోవడం ప్రతి బంధానికీ ఎంతో ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.

DRDO నుంచి భారీ డిఫెన్స్ ఆర్డర్స్ పొందిన మన హైదరాబాద్ కంపెనీ.. సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్..

 DRDO నుంచి భారీ డిఫెన్స్ ఆర్డర్స్ పొందిన మన హైదరాబాద్ కంపెనీ.. సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్..

డిఫెన్స్ సెక్టార్ కి చెందిన అపోలో మైక్రోసిస్టమ్స్ షేర్లు శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్ లో 8 శాతం లాభాన్ని నమోదు చేసి సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకోవడం జరిగింది. DRDO తో పాటు మరికొన్ని ప్రభుత్వరంగ డిఫెన్స్ కంపెనీల నుంచి భారీ ఆర్డర్లు రావడంతో పెట్టుబడిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఈ స్టాక్ గత ఆరు నెలల్లోనే ఏకంగా 133 శాతం రాబడితో మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిచింది.

DRDO నుంచి భారీ డిఫెన్స్ ఆర్డర్స్ పొందిన మన హైదరాబాద్ కంపెనీ.. సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్..

DRDO నుంచి భారీ డిఫెన్స్ ఆర్డర్స్ పొందిన మన హైదరాబాద్ కంపెనీ.. సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్..

స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన డిఫెన్స్ సెక్టార్ స్టాక్ అయిన అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ (Apollo Micro Systems Limited) షేర్లు శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్ లో ఏకంగా 8 శాతం లాభపడి సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయి అయిన రూ. 271.40 మార్క్ ని టచ్ చేయడం జరిగింది.


డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజెషన్ (DRDO) తో పాటు మరికొన్ని ప్రభుత్వరంగ డిఫెన్స్ కంపెనీల నుంచి వర్క్ ఆర్డర్స్ పొందినట్లు కంపెనీ ప్రకటించడంతో ఈరోజు ఈ కంపెనీ షేరు ధరలో భారీ ర్యాలీ కనిపించింది. మరొకవైపు గత ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ షేరు ఏకంగా 133 శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించి మల్టీబ్యాగర్ స్టాక్ గా నిలిచింది.


కంపనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజెషన్ (DRDO) తో పాటు మరికొన్ని ప్రభుత్వరంగ డిఫెన్స్ కంపెనీల నుంచి రూ. 25.12 కోట్ల విలువైన వివిధ రకాల డిఫెన్స్ వర్క్ ఆర్డర్స్ ని సొంతం చేసుకోవడం జరిగిందని కంపెనీ తెలిపింది.




శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్ లో అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ షేరు ధర 8.05 శాతం లాభపడి రూ. 262 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 271.40 గాను, అలాగే 52 వారాల కనిష్ట ధర రూ. 87.99 లుగా ఉంది.


గత వారం రోజుల్లో ఈ షేరు ధర సుమారు 12 శాతం లాభాన్ని, అలాగే గత నెల రోజుల్లో సుమారు 51 శాతం లాభాన్ని, అదే విధంగా గత ఆరు నెలల్లో సుమారు 133 శాతం లాభాన్ని, ఇక గత ఏడాది కాలంలో ఈ షేర్ సుమారు 152 శాతం లాభాన్ని, చివరగా గత ఐదేళ్ల కాలంలో 2124 శాతం లాభాన్ని తమ వాటాదారులకి అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 8790 కోట్లుగా ఉంది.

మీరు మెచ్చే కథనాలు

సోమవారం, సెప్టెంబర్ 1 ట్రేడింగ్ కోసం మూడు స్టాక్స్ సిఫార్సు చేసిన సుమీత్ బగాడియా

డబుల్ బొనాంజా ప్రకటించిన మల్టీబ్యాగర్ ఫార్మా స్టాక్.. స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్స్ తో పాటు 6 నెలల్లో 62 శాతం లాభం..

ధర రూ. 200 లోపు ఉన్న మూడు స్టాక్స్ ను సిఫార్సు చేసిన మెహుల్ కొఠారీ

రానున్న రోజుల్లో ఏకంగా 30 శాతం పెరిగే ఛాన్స్ ఉన్న ప్రముఖ ఐటీ.. రికమండ్ చేసిన మోతీలాల్ ఓస్వాల్..

అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ అనేది డిఫెన్స్, ఏరోస్పేస్ సెక్టార్స్ లో అగ్రగామి సంస్థగా ఉంది. ఈ కంపెనీ ప్రధానంగా డిఫెన్స్, ఏరోస్పేస్, స్వదేశీ భద్రతా అవసరాల కోసం ఎలక్ట్రానిక్, ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ ని డిజైన్ చేసి తయారు చేస్తుంది.


ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలని నిర్వహిస్తుంది. ఈ కంపెనీని 1985వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 2025 మార్చి నాటికి ఈ కంపెనీలో మొత్తం 405 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.


ఫిబ్రవరిలోనే ఇంటర్‌ పరీక్షలు, ప్రశ్నా పత్రాల విధానం మార్పు - షెడ్యూల్..!!

ఫిబ్రవరిలోనే ఇంటర్‌ పరీక్షలు, ప్రశ్నా పత్రాల విధానం మార్పు - షెడ్యూల్..!! 


 ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నెల ముందుగానే ఫిబ్రవరిలో పరీక్షల నిర్వహణకు నిర్ణయించింది. పరీక్షా విధానంలోనూ మార్పులు తెచ్చింది. తాజా నిర్ణయం మేరకు ఇక పై రోజుకు ఒక్క సబ్జెక్టుకే పరీక్షలు జరగనున్నాయి. మొదట సైన్స్‌ గ్రూపులకు, ఆ తర్వాత ఆర్ట్స్‌ గ్రూపులకు పరీక్షలు నిర్వహించేలా ఇంటర్‌ బోర్డు మార్పులు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పైన మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. నెల ముందే పరీక్షలు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను ఈ విద్యాసంవత్సరంలో ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రణాళికలో సిద్దమైంది. సాధారణంగా ప్రతీ ఏటా మార్చి నెలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. కాగా, ఈసారి సీబీఎస్‌ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో తరగతులను నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలన్నీ పూర్తవుతాయి. అందుకు అనుగుణంగానే పరీక్షల విధానంలోనూ పలు మార్పులు జరిగాయి. మొదట సైన్స్‌ విద్యార్థులకు గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభం కానున్నాయి రోజుకు ఒక్క సబ్జెక్టు పరీక్షే ఉంటుంది. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు అదేరోజు బైపీసీ, ఆర్ట్స్‌ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు. రోజుకు ఒక్క సబ్జెక్టే ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా పరీక్షల నిర్వహణలో మార్పులు తెచ్చారు. ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే ఆ రోజు ఆ సబ్జెక్టు ఒక్కటే ఉంటుంది. ఎంబైపీసీ గ్రూపును తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులూ జీవశాస్త్రం చదివే అవకాశం వచ్చింది. అందువల్ల ఒకేరోజు 2 పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టి ఒక రోజు ఒకే పరీక్ష పెట్టనున్నారు. సైన్స్‌ గ్రూపు సబ్జెక్టులన్నీ పూర్తయ్యాక చివరిలో భాషల పరీక్షలు ఉంటాయి. అనంతరం ఆర్ట్స్‌ గ్రూపు పరీక్షలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలను జనవరి చివరలో నిర్వహించాలని భావిస్తున్నారు. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో పూర్తిగా ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేశారు.

                   ప్రశ్నా పత్రాల విధానం అదే విధంగా ఎంబైపీసీ, జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే వెసులుబాటును సైతం కల్పించారు. ఆర్ట్స్‌ విద్యార్థులు సైతం కొందరు ఐచ్ఛికంగా సైన్స్‌ సబ్జెక్టులు ఎంచుకున్నారు. మరికొందరు కొందరు సైన్స్‌ గ్రూపు విద్యార్థులు రాజనీతిశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం ఎంపిక చేసుకున్నారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ దేనికైనా అర్హత సాధించేందుకు ఇలా సబ్జెక్టులను ఎంచుకున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రశ్నపత్రాల విధానాన్ని కూడా మార్చారు. భౌతిక శాస్త్రం, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులను 85 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. మిగతా మార్కులు రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. అన్ని పేపర్లలోనూ ఒక్క మార్కు ప్రశ్నలను కొత్తగా తీసుకొచ్చారు. ఇకపై జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం 43 మార్కులకు, జంతుశాస్త్రం 42 మార్కులకు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.

 ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నెల ముందుగానే ఫిబ్రవరిలో పరీక్షల నిర్వహణకు నిర్ణయించింది. పరీక్షా విధానంలోనూ మార్పులు తెచ్చింది. తాజా నిర్ణయం మేరకు ఇక పై రోజుకు ఒక్క సబ్జెక్టుకే పరీక్షలు జరగనున్నాయి. మొదట సైన్స్‌ గ్రూపులకు, ఆ తర్వాత ఆర్ట్స్‌ గ్రూపులకు పరీక్షలు నిర్వహించేలా ఇంటర్‌ బోర్డు మార్పులు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పైన మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. నెల ముందే పరీక్షలు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను ఈ విద్యాసంవత్సరంలో ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రణాళికలో సిద్దమైంది. సాధారణంగా ప్రతీ ఏటా మార్చి నెలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. కాగా, ఈసారి సీబీఎస్‌ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో తరగతులను నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలన్నీ పూర్తవుతాయి. అందుకు అనుగుణంగానే పరీక్షల విధానంలోనూ పలు మార్పులు జరిగాయి. మొదట సైన్స్‌ విద్యార్థులకు గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభం కానున్నాయి రోజుకు ఒక్క సబ్జెక్టు పరీక్షే ఉంటుంది. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు అదేరోజు బైపీసీ, ఆర్ట్స్‌ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు. రోజుకు ఒక్క సబ్జెక్టే ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా పరీక్షల నిర్వహణలో మార్పులు తెచ్చారు. ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే ఆ రోజు ఆ సబ్జెక్టు ఒక్కటే ఉంటుంది. ఎంబైపీసీ గ్రూపును తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులూ జీవశాస్త్రం చదివే అవకాశం వచ్చింది. అందువల్ల ఒకేరోజు 2 పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టి ఒక రోజు ఒకే పరీక్ష పెట్టనున్నారు. సైన్స్‌ గ్రూపు సబ్జెక్టులన్నీ పూర్తయ్యాక చివరిలో భాషల పరీక్షలు ఉంటాయి. అనంతరం ఆర్ట్స్‌ గ్రూపు పరీక్షలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలను జనవరి చివరలో నిర్వహించాలని భావిస్తున్నారు. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో పూర్తిగా ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేశారు.

                   ప్రశ్నా పత్రాల విధానం అదే విధంగా ఎంబైపీసీ, జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే వెసులుబాటును సైతం కల్పించారు. ఆర్ట్స్‌ విద్యార్థులు సైతం కొందరు ఐచ్ఛికంగా సైన్స్‌ సబ్జెక్టులు ఎంచుకున్నారు. మరికొందరు కొందరు సైన్స్‌ గ్రూపు విద్యార్థులు రాజనీతిశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం ఎంపిక చేసుకున్నారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ దేనికైనా అర్హత సాధించేందుకు ఇలా సబ్జెక్టులను ఎంచుకున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రశ్నపత్రాల విధానాన్ని కూడా మార్చారు. భౌతిక శాస్త్రం, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులను 85 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. మిగతా మార్కులు రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. అన్ని పేపర్లలోనూ ఒక్క మార్కు ప్రశ్నలను కొత్తగా తీసుకొచ్చారు. ఇకపై జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం 43 మార్కులకు, జంతుశాస్త్రం 42 మార్కులకు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.

శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు ఇక చెక్ - కొత్తగా అందుబాటులోకి PAC, అన్నీ ఒకే చోట..!!


 శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు ఇక చెక్ - కొత్తగా అందుబాటులోకి PAC, అన్నీ ఒకే చోట..!! 


తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సౌకర్యాల పెంపు పైన టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భక్తుల వసతి కష్టాలు తీర్చేందుకు తిరుమలలో కొత్తగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం ప్రారంభానికి సిద్దమైంది. భక్తుల సదుపాయాలు మొత్తం ఒకే చోట అందుబాటులోకి తెచ్చారు. ఇక, బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ విశేష పర్వదినాలను టీటీడీ ప్రకటించింది. నూతన సముదాయం తిరుమలలో కొత్తగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం పీఏసీ-5 భవనం అధునాతనం గా తీర్చి దిద్దారు. ఈ భవనాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు... ఏఈవో వెంకయ్య చౌదరి పరిశీలన చేసారు. భవనంలోని హాళ్లు, కళ్యాణ కట్ట, మరుగుదొడ్లు, అన్న ప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించి అధికారులకు ఛైర్మన్ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు అద్భుతంగా ఈ సముదాయాన్ని నిర్మించారని అభినందించారు. 2018లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టు ద్వారా తిరుమలలో యాత్రికుల వసతి సమస్యకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని తెలిపారు. బ్రహ్మోత్సవాల వేళ ప్రస్తుతం తిరుమలలో 45 వేలమందికి మాత్రమే వసతి సౌకర్యాలు ఉన్నాయని, కొత్తగా నిర్మించిన పీఏసీ-5లో 2,500 మంది యాత్రికులు సులభంగా వసతి పొందగలరని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న బ్రహ్మోత్సవాల సమయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సముదాయాన్ని ప్రారంభిస్తారని.. అప్పటి నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నూతన పీఏసీ భవనంలో అనేక ఆధునిక మార్పులు చేశామని ఏఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. 2,500 మందికి వసతి సౌకర్యం కల్పించినప్పటికీ, అవసరమైతే మరో 1,000 మంది యాత్రికులను కూడా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. Also Read ఏపీలో సెప్టెంబర్ 1 పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన - ఇలా చేయండి..!! అన్ని సదుపాయాలు చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మిల్క్ ఫీడింగ్ గది ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకేసారి 1,400 మంది అన్నప్రసాదాలు స్వీకరించే విధంగా విస్తృతమైన అన్నప్రసాదాల హాలును ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్స కేంద్రం, కళ్యాణకట్ట, అన్న ప్రసాద వితరణ కేంద్రం, తదితర అన్ని అవసరమైన సదుపాయాలను ఈ భవనంలో కల్పించామని తెలియజేశారు. సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలను ప్రకటించారు. సెప్టెంబర్ 6న అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8న మహాలయ పక్ష ప్రారంభం కానుంది. 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం ఉంటుంది. 28న తిరుమల శ్రీవారి గరుడోత్సవం.. సెప్టెంబర్ 29న తిరుమల శ్రీవారి స్వర్ణ రథం జరగనుంది.

ఏపీ ఉచిత బస్సు పథకం.. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు శుభవార్త!

 ఏపీ ఉచిత బస్సు పథకం.. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు శుభవార్త! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతోంది. ఈ పథకం కారణంగా జీరో టిక్కెట్ తో మహిళలు ఉచిత బస్సులలో ప్రయాణం చేస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ఇటు మహిళలకు మాత్రమే కాకుండా, ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు కూడా శుభవార్త చెప్పింది. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు అలవెన్స్ లపై ప్రభుత్వం శుభవార్త ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ భారాన్ని మోస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు అలవెన్స్ లను పెంచి తీపి కబురు చెప్పింది. 80 రూపాయలుగా ఉన్న నైట్ అలవెన్స్ ను ప్రస్తుతం 150 రూపాయలకు పెంచామని తాజాగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. డ్రైవర్లకు వెయ్యి రూపాయలు కండక్టర్లకు 900 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం చేస్తుందిదే ఇక ఉద్యోగుల ప్రమాద బీమా ను ఉచితంగా అందిస్తున్నామని ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో 20 లక్షల రూపాయల పరిహారం ఇచ్చే వారిమని, దానిని కోటి రూపాయలకు పెంచామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు 6500 మందికి పదోన్నతులు కల్పించామని చెప్పారు. ఆన్ కాల్ డ్రైవర్ల వేతనాన్ని 8 వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలకు పెంచామని పేర్కొన్నారు. డబుల్ డ్యూటీలకు అలవెన్స్ పెంపు ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఉండడంతో అక్కడక్కడ అవసరమైన చోట ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డబల్ డ్యూటీలు చేస్తున్నారని, వారికి డబల్ డ్యూటీలు డబ్బులు కూడా పెంచామని చెప్పారు. 

              గతంలో డబల్ డ్యూటీ చేస్తే డ్రైవర్లకు 800 కండక్టర్లకు 700 ఇచ్చేవారు.         ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు కూడా లాభం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా అటు మహిళలకు మాత్రమే కాకుండా ఇటు ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు కూడా లాభం చేకూరుస్తుందని, ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఇవి మాత్రమే కాదు త్వరలో ఆర్టీసీకి 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురాబోతున్నామని, మరో ఆరేడు నెలల్లో 1500 నుంచి 2000 వరకు ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. 


 వారికి ఉపాధికి అవకాశం వీటి ద్వారా మరికొంత మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందని మంత్రి శుభవార్త చెప్పారు. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైనా స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లకు, కండక్టర్లకు ఎంతగానో మేలు చేస్తుంది.

Friday, 29 August 2025

గాంధీగ్యాన్ ప్రస్థాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో ఒక లక్ష గాంధీ విగ్రహాల పంపిణీ

 గాంధీగ్యాన్ ప్రస్థాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో ఒక లక్ష గాంధీ విగ్రహాలను భారతదేశంలో మొత్తం స్థాపించాలనే సంకల్పంతో ఈరోజు జరిగిన మీటింగ్లో రవీంద్ర భారతిలో మొట్టమొదటి గాంధీ విగ్రహాన్ని నాకు అందజేయడం జరిగింది చాలా చాలా ధన్యవాదాలు నేరెళ్ల మల్యాద్రి సార్ గారికి ప్రభాకర్ గారికి ఇంకా టీమ్ అందరికీ పుట్టినరోజు సందర్భంగా ఈ విగ్రహాన్ని అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అందరికీ చాలా ధన్యవాదాలు.



Thursday, 28 August 2025

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74 కృత్రిమ నిమజ్జన కేంద్రాలు

 

 




11 Attachments • Scanned by Gmail
 
 

అమెరికాకు బిగ్ ఇచ్చిన భారత్ సహా 25 దేశాలు.. ఏం జరిగిందంటే ?

 అమెరికాకు బిగ్ ఇచ్చిన భారత్ సహా 25 దేశాలు.. ఏం జరిగిందంటే ?


అమెరికాకు బిగ్ ఇచ్చిన భారత్ సహా 25 దేశాలు.. ఏం జరిగిందంటే ?


అమెరికా తీసుకున్న కొత్త పన్ను విధానాలు అంతర్జాతీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపులను రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం నిర్ణయంతో ప్రపంచ దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) వెల్లడించిన వివరాల ప్రకారం, భారతదేశంతో పాటు కనీసం 25 దేశాలు అమెరికాకు తమ పోస్టల్ సేవలను నిలిపివేశాయని సమాచారం. 25 దేశాలు.. భారత్ తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, నార్వే, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న వ్యాపారాలు, వ్యక్తిగత పార్సెల్స్, ఈ–కామర్స్ డెలివరీలు అన్నీ ఈ నిర్ణయం కారణంగా దెబ్బతింటున్నాయి. 

                "ఈ నెల 27వ తేదీ అర్థరాత్రి 12:01 నిమిషాలకు: భారత్ కు ట్రంప్ పెట్టిన `ముహూర్తం`" ఐక్యరాజ్యసమితిలో ఒక విభాగంగా పనిచేసే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ప్రధాన కేంద్రాన్ని కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా సభ్యదేశాల మధ్య పోస్టల్ సహకారాన్ని పెంచడమే దీని లక్ష్యం. ఈ నిర్ణయం కారణంగా అంతర్జాతీయ పోస్టల్ వ్యవస్థలో అసమానతలు, జాప్యాలు, వాణిజ్య ఆటంకాలు తలెత్తే ప్రమాదముందని UPU హెచ్చరించింది. అమెరికా యంత్రాంగం ఆగస్టు 29 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ఆదేశాల ప్రకారం.. $800 వరకు ఉన్న వస్తువులపై పన్ను మినహాయింపు రద్దు చేసింది. ఇకపై విలువ ఎంతైనా, అమెరికాకు వచ్చే ప్రతీ పార్సెల్ సుంకాలకు లోబడి తీరాలి. $100 విలువలోపు గిఫ్ట్ ఐటమ్స్, లేఖలు, పత్రాలు మాత్రం మినహాయింపులో కొనసాగుతాయి. ఈ విధానం కారణంగా ప్రతీ చిన్న ప్యాకేజీ కూడా తనిఖీలు, పన్నులు ఎదుర్కోవాల్సి రావడంతో అమెరికా వినియోగదారులకు సరుకులు ఆలస్యంగా చేరడమే కాక, ఖర్చు కూడా పెరుగుతోంది. ఇది ఈ–కామర్స్, చిన్న వ్యాపారాలపై పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

 

విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. అమెరికా నిర్ణయంపై ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) దృష్టి సారించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో "ప్రతీకార సుంకాలు – కౌంటర్ రెస్పాన్స్‌లు" కొత్త తరహా వాణిజ్య యుద్ధానికి నాంది పలకవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రాబోయే నెలల్లో అంతర్జాతీయ రాజకీయ–ఆర్థిక సంబంధాలపై ఎలాంటి మలుపులు తీసుకురాబోతుందో చూడాలి. భవిష్యత్ సవాళ్లు.. అంతర్జాతీయ పోస్టల్ రవాణా ఖర్చులు పెరగడం చిన్న వ్యాపారాల నిలదొక్కుకోవడంలో ఇబ్బందులు అమెరికా వినియోగదారులకు అధిక ఖర్చులు, ఆలస్యాలు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదురే ప్రమాదం

తప్పుడు పని చేసి దొరికిపోయిన తెలుగు హీరోయిన్

 

తప్పుడు పని చేసి దొరికిపోయిన తెలుగు హీరోయిన్ 


కేరళలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో ప్రముఖ తమిళ నటి లక్ష్మీ మీనన్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకులం నార్త్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఒక రెస్టారెంట్ బార్ వద్ద లక్ష్మీ మీనన్ బృందానికి, బాధితుడి స్నేహితుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత, నటి లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు ఐటీ ఉద్యోగిని కారులో వెంబడించి, అడ్డగించారు. అనంతరం అతడిని బలవంతంగా తమ కారులోకి లాగి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


      ఇంతకు మించి ఏం చెప్పలేనంటూ మ్యాటర్ లీక్" ఈ కేసులో ఇప్పటివరకు మిథున్, అనీష్, సోనామోల్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నటి లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు. లక్ష్మీ మీనన్ తమిళ చిత్రాలైన కుమ్కి, సుందరపాండియన్, జిగర్తాండ, వేదాలం, చంద్రముఖి 2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విశాల్ నటించిన 'ఇంద్రుడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఒక నటి కిడ్నాప్, దాడి కేసులో ఇరుక్కోవడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Saturday, 23 August 2025

ఈవారం రాశి ఫలాలు..

"ఈవారం రాశి ఫలాలు.. ఆగస్టు 24 నుంచి 30 వరకు"

 మేషం

వృత్తిపరంగా సంతోషంగా ఉంటారు. ఒత్తిళ్లున్నా సకాలంలో పనులు నెరవేరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వ్యాపార ఒప్పందాల్లో, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. రామాలయాన్ని సందర్శించండి.

వృషభం

పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కోర్టులో ఉన్న పెండింగ్‌ కేసుల్లో కదలిక వస్తుంది. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు స్థానచలన సూచన. ఉద్యోగ మార్పు ఉండవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. పారిశ్రామికవేత్తల రాబడి పెరుగుతుంది. కళాకారులకు అనుకూల వారం. ఇష్టదైవాన్ని పూజించండి.

మిథునం

వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. బంధువుల సహకారంతో శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కోర్టు పనుల్లో అనుకూల తీర్పు వెలువడుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పట్టుదలతో ప్రయత్నిస్తే కార్యసిద్ధి ఉంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటారు. విద్యార్థులకు మంచి సమయం. శివాలయాన్ని దర్శించండి.

కర్కాటకం

ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంది. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. బంధుమిత్రులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూలత ఉంది. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి సేవ చేసుకోండి.

సింహం

ఆత్మీయులు, స్నేహితుల సలహాలతో పనులు పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంది. భూముల వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. ప్రభుత్వ, రాజకీయ పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్వయం ఉపాధిలో ఉన్నవారికి పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించండి.

కన్య

నిర్మాణాత్మక కార్యాలు చేపడతారు. అన్నదమ్ములు, బంధువర్గంతో కార్యసాఫల్యం ఉంది. పనిలో ఏకాగ్రతను కనబరుస్తారు. సమాజంలో ఉన్నతస్థితిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగుల సహకారం పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన. వ్యవసాయదారుల ఆదాయం పెరుగుతుంది. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.

తుల

శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచన. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. దుర్గాదేవి స్తోత్రాలు చదవండి.

వృశ్చికం

ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అయితే, జాగ్రత్త అవసరం. ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి. పూర్వం నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

ధనుస్సు

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగంలో స్థానచలన అవకాశం. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. స్థిర, చరాస్తుల వల్ల రాబడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

మకరం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసులలో విజయం వరిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. రైతులకు దిగుబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రామాలయాన్ని దర్శించండి.

కుంభం

ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వస్తువుల కొనుగోలులో ఆలస్యం జరగవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పనులు పూర్తిచేయడంలో పట్టుదల కనబరుస్తారు. బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి.

మీనం

వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలను చేపడతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలతో లబ్ధి పొందుతారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్త పాటించడం అవసరం. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి.

Monday, 18 August 2025

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల కారణంగా ప్రజలు పడుతున్న బాధలను తొలగించి, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా :బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,

 నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల కారణంగా ప్రజలు పడుతున్న బాధలను తొలగించి, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా : బిఆర్ఎస్  పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,


 నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో.. నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం... కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలుసుకొని... పట్టణంలోనూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోనూ..వీధి కుక్కలవల్ల పలువురు గాయపడిన విషయం.. కలెక్టర్ దృష్టికి తీసుకు వస్తు.. వాటి తరలింపుకై వినతిపత్రం సమర్పించారు.. ఇటీవల గిరక కబావి గూడ గ్రామంలో.. వీధి కుక్కలు.. వెంటపడి కరిచి పొట్టలోని పేగులు బయటికి వచ్చేలా తీవ్రంగా గాయపరిచాయని.. ఆ మహిళ చావు బతుకుల మధ్య ఉందని.. అదేవిధంగా  పట్టణంలోని అనేక వార్డులలో.. మండలాల్లోని అనేక గ్రామాలలో.. చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు.. పాదచారులపై వాహనదారులపై.. దాడి చేసి గాయపరుస్తున్నాయని.. ఇందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. తెలియజేశారు... ఇకనైనా కిందిస్థాయి అధికారులకు తగు ఆదేశాలిచ్చి.. వీధి కుక్కలను ఆయా ప్రదేశాల నుండి తరలించి.. కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని  విజ్ఞప్తి చేశారు.

 వినతి పత్రం పూర్తి పాఠం.....

భారత రాష్ట్ర సమితి

 నల్లగొండ జిల్లా


 శ్రీయుత జిల్లా కలెక్టర్, నల్లగొండ గారికి


 నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల కారణంగా ప్రజలు పడుతున్న బాధలను తొలగించి, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరుట గురించి......


 నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు..... పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు రోడ్లపై వెళ్తున్న వారిపై దాడి చేయడంతో గాయాలపాలై ఆసుపత్రులకు చికిత్స కోసం వెళ్లడంతో పాటు పేగులు బయటికి వచ్చేలా ప్రజలను కరుస్తున్న నేపథ్యంలో తీవ్ర భయాందోళనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మున్సిపాలిటీలో కమిషనర్లకు, గ్రామపంచాయతీల పరిధిలో పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకునే నాధుడు కరువై ప్రజలు భయాందోళన మధ్య జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రోడ్లపై వీధి కుక్కలు సైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు రోడ్లపై నడవాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చిన అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం అత్యంత బాధాకరం.

 వీధి కుక్కలు బడికి పోయే విద్యార్థుల పట్ల వీధి గుండాల లాగా దాడి చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కనీసం వీధి కుక్కలను నివారించడంలో విఫలమైన జిల్లా యంత్రాంగం యాంటీ రాబిస్ ఇంజక్షన్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస నిలువలు ఉంచకపోవడం శోచనీయం  

 వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన వారిని ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని కోరుతున్నాం 

 ఇప్పటికే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలు కరవడం తో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలు పాలు కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే వీధి కుక్కలు కరిచి పేగు లు బయటికి వచ్చేలా కరిచినటువంటి ఘటన జిల్లావ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ అధికారుల స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీధి కుక్కల కారణంగా ప్రజలు గాయాల పాలు కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. వీధి కుక్కల నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది 

 అనేకమంది పేద ప్రజలు ముక్కుపచ్చలారని చిన్నారులు వీధి కుక్కలకు బలైతుంటే  ఈ రాష్ట్ర సర్కారు  చోద్యం చూస్తుందని అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల కావచ్చు విద్యార్థుల పట్ల కావచ్చు  ఏ మాత్రం కూడా కనికరం లేదని

 ప్రతి ఒక్కరికి పోలీసులకు ఏ విధంగా అయితే లాఠీలు ఇస్తున్నారు అదేవిధంగా వీధి కుక్కల భారీ నుండి  తమను తాము రక్షించుకోవడం కోసం సాధారణ ప్రజల కూడా ప్రభుత్వమే లాటిలు ఇచ్చి ప్రజలను ఇది కుక్కల బారి నుండి రక్షించుకునే విధంగా చూడగలరు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం 

 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చేయడంలో గాని వీధి కుక్కలు తరలించడంలో గాని అధికారులు ఎలాంటి చొరవ చూపడం లేదని అన్నారు 

 వీధి కుక్కలకు ప్రత్యేకంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఊరి బయట ఒక  షెడ్డు ఏర్పాటు చేసి పట్టణంలో జీవిస్తున్న కుక్కలన్నిటిని ఒక దగ్గరికి పోగుచేసి ప్రభుత్వమే కుక్కలను సాదాలని కోరుతున్నాం  

 ముఖ్యంగా నల్లగొండ పట్టణంలోని 13 వ వార్డు గిరిక బాయిగూడెం  చెందిన పందుల శ్రీదేవిని ఇంటి ముందు ఉండగా  వీధి కుక్క  విపరీతంగా దాడి చేసి పేగులు బయటికి వచ్చేలాగా వీధి కుక్క  దాడి చేయడంతో ఆమె  మలకపేట యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నది  ఆమెకు అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వ భరించాలని డిమాండ్ చేశారు


 బిఆర్ఎస్ పార్టీ తరఫున, వినతి పత్రం  సమర్పించిన వారిలో..

మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, సింగం రామ్మోహన్, లోడంగి గోవర్ధన్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి,గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, జమాల్ ఖాద్రి, కందుల లక్ష్మయ్య పేర్ల అశోక్ దొడ్డిరమేష్.. పెరికే యాదయ్య, వీరమల్ల భాస్కర్ వజ్జ శ్రీనివాస్ మాతంగి అమర్ అనిల్, తదితరులు కలెక్టర్ ను కలిసిన వారిలో  ఉన్నారు

మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ,,:జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

        మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను




ఆకస్మికంగా తనిఖీ : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 
                                              నకిరేకల్ లోని మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల లో సరైన వసతులు లేని కారణంగా తక్షణమే పాఠశాలను అన్ని సౌకర్యాలు ఉన్న భవనానికి మార్చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్  పాఠశాలల రీజినల్ కో-ఆర్డినేటర్ ను ఆదేశించారు.

      సోమవారం ఆమె నకిరేకల్ లోని మైనార్టీ రెసిడెన్షియల్  పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

      భవనం మొత్తం తిరిగి పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత భవనంలో విద్యార్థులకు సరిపడా మౌలిక వసతులు లేవని, అందువల్ల వెంటనే పాఠశాల భవనాన్ని ఇతర భవనంలోకి మార్చాలని ఆర్ సి ఓ ను ,నల్గొండ  ఆర్డీవోను ఆదేశించారు.


        అనంతరం జిల్లా కలెక్టర్ నకిరేకల్ మండలం చందుబట్లలోని ఓ కాలనీలో తాగునీటి సమస్య ను పరిష్కరించేందుకు 80 వేల రూపాయలు మంజూరు చేసినప్పటికీ ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై ఆమె ఆర్ డబ్ల్యు ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎనిమిది రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 

      ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

__________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కలువ సుజాత గుప్తా

 ఈరోజు దేవరకొండలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి స్వర్ణ రథోత్సవ   ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కలువ సుజాత గుప్తా



గారు

Saturday, 16 August 2025

కృష్ణాష్టమి స్పెషల్ వెన్న ఉండలు..స్వీట్ షాప్ కి మించిన రుచితో..ఎలా చేసుకోవాలంటే


 కృష్ణాష్టమి స్పెషల్ వెన్న ఉండలు..స్వీట్ షాప్ కి మించిన రుచితో..ఎలా చేసుకోవాలంటే

]             కృష్ణాష్టమి పండుగ రోజున, శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైన వెన్న ఉండలు (వెన్న ముద్దలు) నివేదించడం ఆనవాయితీ. వెన్న అంటే శ్రీకృష్ణుడికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. బాల్యంలో ఆయన వెన్న దొంగిలించి తినడం, గోపికల నుంచి వెన్నను అడిగి తీసుకోవడం వంటి కథలు చాలా ప్రసిద్ధి. అందుకే, కృష్ణాష్టమి నాడు వెన్నను, వెన్నతో చేసిన వెన్న ఉండలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే విడి రోజుల్లో తినడానికి కూడా ఇది పర్ఫెక్ట్ స్నాక్. కృష్ణాష్టమి స్పెషల్ వెన్న ఉండలను ఇంట్లోనే స్వీట్ షాప్ కి మించిన రుచితో గుల్లగా వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

యారీకి కావాల్సిన పదార్థాలు

-పాలు

-వెన్న

-ఉప్పు

-బియ్యం పిండి

-బెల్లం

-యాలకల పొడి

-ఆయిల్

-నెయ్యి

తయారీ విధానం


-ముందుగా ఓ పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, 4 టేబుల్ స్పూన్ల వెన్న, చిటికెడు ఉప్పు వేసి మొత్తం బాగా కలపాలి. వెన్న మొత్తం పిండిలో కలిసేలా కలుపుకోండి.


-తర్వాత అరకప్పు పచ్చిపాలను కొంచెం కొంచెంగా ఆ పిండి మిశ్రమంలో పోస్తూ పిండిని ముద్దలా చేసుకోవాలి. పిండి చేతికి అంటుకున్నట్లుగా వత్తుకోకూడదు, అలాగే గట్టిగా క్రాక్స్ వచ్చే విధంగా ఉండకూడదు.


-పిండి కలిపేటప్పుడు పాలు ఎక్కువై పలుచనైతే కాస్త బియ్యం పిండిని వేసి అడ్జెస్ట్ చేసుకోవచ్చు.


-తర్వాత మూతతీసి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని అరచేతిలో పెట్టి రౌండ్ గా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న గోలీల సైజులో బాల్స్ లా చేసుకోండి.


-తయారచేసుకున్న ఉండల మీద మూతపెట్టేసి పక్కన ఉంచుకోండి.


-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసి మీడియం హీట్ లో ఆయిల్ వేడి చెయ్యాలి.


-వేడెక్కిన ఆయిల్ లో కలిపి ఉంచుకున్న ఉండలను బ్యాచ్ లుగా వేసి సన్నటి సెగ మీద మీద వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బంగారు రంగులోకి మారి క్రిస్పీగా మారేదాకా వేయించుకొని బాండీలోని నుంచి తీసి ఓ ప్లేట్ లో పెట్టుకోండి.


-తర్వాత ఓ ప్లేట్ లో అర కప్పు తురుమిన బెల్లం వేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. మంటను తక్కువలో ఉంచండి.


-బెల్లం కరిగి తీగ పాకంలా మారిన తర్వాత అందులో 1 టీస్పూన్ యాలకల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపండి.


-ఇప్పుడు పాకంలో వేయించిన వెన్న ఉండలు వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయండి.


-గిన్నెను ఫ్యాన్ కింద పెట్టి చల్లారేవరకు గరిటతో కలుపుతూ ఉండండి.


-బెల్లం లేయర్ ఉండలకు అంటిన తర్వాత పూర్తిగా చల్లారేదాకా అలా వదిలేయండి. చల్లారాకా విడి విడిగా వస్తాయి. అంతే వెన్న ఉండలు రెడీ.

Friday, 15 August 2025

అవి లేకుంటే తిరుమలలో నో ఎంట్రీ: తప్పనిసరి చేసిన టీటీడీ

 అవి లేకుంటే తిరుమలలో నో ఎంట్రీ: తప్పనిసరి చేసిన టీటీడీ 

       దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలు, ఫాస్టాగ్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రోజుకో సంచలన నిర్ణయాన్ని తీసుకుంటూ వస్తోంది. జాతీయ రహదారులపై నిర్మించిన టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగడానికి సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతోన్నప్పటికీ.. అది వాహనదారులకు భారంగా పరిణమిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై నెలకొల్పిన ప్లాజాల వాహనాల నుంచి టోల్ మొత్తాన్ని వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ఫాస్టాగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ.. టోల్ ప్లాజాల వద్ద తప్పనిసరిగా కొంతసేపయినా వాహనాలను నిలిపివేయాల్సి వస్తోంది.

             కొన్ని సందర్భాల్లో ఫాస్టాగ్ రీడర్లు మొరాయించడం, సాంకేతిక లోపాలు తలెత్తుతోండటం వల్ల టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి నిల్చున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ.. వాహనాల రాకపోకలు సజావుగా సాగట్లేదనే అభిప్రాయానికి వచ్చింది కేంద్రం. దీన్ని దృష్టిలో ఉంచుకుని- మరో సరికొత్త వ్యవస్థపై దృష్టి సారించింది. కొత్తగా టోల్ పాసులను ప్రవేశపెట్టింది. వార్షిక టోల్ పాస్ ధర- 3,000 రూపాయలు. దీన్ని కొన్న తేదీ నుంచి మరుసటి ఏడాది అదే తేదీ వరకు 200 ట్రిప్పులు రాకపోకలు సాగించే వీలు వాహనదారులకు ఉంటుంది. ఈ సౌకర్యం నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తించదు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వార్షిక ఫాస్టాగ్ టోల్ పాస్ ను అమలులోకి తీసుకుని రానున్నట్లు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వార్షిక పాస్ కొన్న తేదీ నుంచి ఏడాది పాటు అంటే పాస్ కొన్న తేదీ వరకు లేదా.. 200 ట్రిప్పులు.. వీటిలో ఏది ముందుగా వస్తే అది- చెల్లుబాటు అవుతుంది.

 

              ఇప్పుడిదే ఫాస్టాగ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం తప్పనిసరి చేసింది. ఈ నూతన విధానం ఈ నెల 15 నుండి అమలులోకి రానుంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 15వ తేదీ నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది టీటీడీ. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించబోమని టీటీడీ తేల్చి చెప్పింది. ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో వాటిని జారీ చేస్తామని, దీనికోసం ప్రత్యేకంగా కౌంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపింది. ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఈ కౌంటర్ వద్ద అతి తక్కువ సమయంలో వాటిని పొందవచ్చని, వాటిని తీసుకున్న తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని స్పష్టం చేసింది టీటీడీ. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

బంగారం కొంటున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..!

 బంగారం కొంటున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..! 


              ఆగస్టు 14వ తేదీ గురువారం బంగారం ధరలు చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,03,180 పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,350కి చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ. 1,18,511 వద్ద రికార్డు సృష్టించింది. కేవలం ఒక ఏడాది వ్యవధిలో బంగారం ధర లక్ష రూపాయల మార్కును దాటడం విశేషం. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

గతంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో మాత్రమే బంగారం ధరలు పెరుగుతాయని భావించేవారు. కానీ ఇప్పుడు ఆషాఢం, శ్రావణం, ఇతర సీజన్‌లతో సంబంధం లేకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం దేశీయ డిమాండ్ కాదు, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే. చైనా వంటి దేశాలు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకోవడం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వంటి కారణాలు పసిడి ధరలను శాసిస్తున్నాయి.

మన దేశంలో బంగారానికి ఉన్న సెంటిమెంట్ గురించి చెప్పనవసరం లేదు. చాలామంది తమ జీవితకాల సంపాదనను బంగారు ఆభరణాలపై పెట్టుబడిగా పెడతారు. కానీ ఇప్పుడు బంగారం ధరలు భారీగా పెరగడంతో, సామాన్య ప్రజలు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం కూడా కష్టంగా మారింది. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక పెద్ద సవాలుగా మారింది. భవిష్యత్తులో ధరలు భారీగా తగ్గుతాయని చాలామంది ఆశిస్తున్నప్పటికీ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను బట్టి చూస్తే అది ఎంతవరకు సాధ్యమో చెప్పలేం.


Tuesday, 12 August 2025

ACB అధికారులకు పట్టుబడిన కలెక్టర్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్

ACB అధికారులకు పట్టుబడిన కలెక్టర్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్

Telangana ACB Update " ఫిర్యాదుధారుని తల్లి గారికి ప్రభుత్వం వారు ఇచ్చిన రెండు ఎకరాల భూమికి సంబంధించి, ఆమె పేరును చేర్చడం కోసం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత పత్రాలను ప్రాసెస్ చేయడానికి మరియు కలెక్టర్ జారీ చేసిన అధికారిక సందేశ ప్రతిని పాటుగా నవాబ్‌పేట తహశీల్దార్ వారి కార్యాలయానికి పంపడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.15,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ - కె. సుజాత.

Sunday, 10 August 2025

నిరుపేదలకు 81 కుట్టు మిషన్లు అందజేసిన సేవాగుణ సంపన్నులు బండారు సుబ్బారావు*.


 *వాసవి సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తూరు సీతయ్య గుప్తా 114వ జయంతి వేడుకలు*                                                      *--నిరుపేదలకు 81 కుట్టు మిషన్లు అందజేసిన సేవాగుణ సంపన్నులు బండారు సుబ్బారావు*.         











 హైదరాబాద్  నీలగిరి శంఖారావం: లకడికపూల్ వాసవి కళ్యాణ మండపంలో ఘనంగాకొత్తూరు సీతయ్య గుప్తా 114 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు మాజీ రాజ్యసభ సభ్యులు టి జి వెంకటేష్ మాట్లాడుతూ కొత్తూరు సీతయ్య గుప్తా దార్శనికతను మరియు దూరదృష్టిని కొనియాడిరి.

వారి సంకల్ప బలం మరియు ప్రముఖుల సహకారం తో ఈ అద్భుత సేవ సంస్థ ఏర్పాటు కావడమే కాక 52 సంవత్సరాలుగా సమాజానికి గొప్ప సేవలు అందిస్తున్నదని ప్రశంసించినారు. కొండ్లె మల్లికార్జున్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు తిరుపతి నగరంలో ప్రారంభించే ప్రయత్నాలకు తమ వంతు సహకారం ఉంటుందని T G వెంకటేష్ హామీ ఇవ్వడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పేదలకు స్వయం ఉపాధి నిమిత్తం 81 కుట్టు మిషన్లు స్పాన్సర్ చేసిన సీల్ వెల్ కార్పొరేషన్ అధినేత మరియు గౌరవ అతిథి బండారు సుబ్బారావు సమాజ హితం కోసం జరిపే ప్రతి మంచి కార్యక్రమంలో తమ చేయూత ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. మరొక గౌరవ అతిథి బొగ్గారపు దయానంద్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరుపట్ల తమ సంతృప్తి మరియు సహకారం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా 500 మందికి పింఛన్లు, 125 మందికి 10 కిలోల బియ్యం, సైకిళ్ళు, గ్రైండర్లు పంపిణీ చేసారు. వాసవి హాస్పిటల్ సౌజన్యంతో పెన్షన్ గ్రహీతలకు షుమారు నాలుగు వందల మందికి 

ఆరోగ్య పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగింది. విశ్వ కుమార్ రచించిన శ్రీ వాసవి మాత ప్రార్థన గీతం మరియు పుస్త ఆవిష్కరణ టీ జి వెంకటేష్ ద్వారా నిర్వహించడం జరిగింది. సభాధ్యకులుగా వ్యవహరించిన అధ్యక్షులు కోల్పూరు రమేష్ మాట్లాడుతూ సమాజానికి వాసవి కేంద్రం ద్వారా 52 సంవత్సరాల నుండి జరుగుతున్న సేవా కార్యక్రమాల సరళిని వివరించారు.

సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు

 

కొండ్లె మల్లికార్జున్,

 చీకట్ మర్ల అశోక్ కుమార్,

ఆలంపల్లి రవి కుమార్,

కాసనగొట్టు రాజశేఖర్ గుప్త,

నాచం ప్రభాకర్ (ప్రధాన కార్యదర్శి),

శ్రీ ఇల్లూరి నరేంద్ర కుమార్ (కోశాధికారి)

రాజేష్ కోలావార్ (కన్వీనర్),

కూర జయరాములు గుప్త, కొత్తూరు జయప్రకాష్ రామ్, చైర్మన్, వాసవీ హాస్పిటల్

తదితరులు పాల్గొన్నారు.