Saturday, 30 August 2025

శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు ఇక చెక్ - కొత్తగా అందుబాటులోకి PAC, అన్నీ ఒకే చోట..!!


 శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు ఇక చెక్ - కొత్తగా అందుబాటులోకి PAC, అన్నీ ఒకే చోట..!! 


తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సౌకర్యాల పెంపు పైన టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భక్తుల వసతి కష్టాలు తీర్చేందుకు తిరుమలలో కొత్తగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం ప్రారంభానికి సిద్దమైంది. భక్తుల సదుపాయాలు మొత్తం ఒకే చోట అందుబాటులోకి తెచ్చారు. ఇక, బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ విశేష పర్వదినాలను టీటీడీ ప్రకటించింది. నూతన సముదాయం తిరుమలలో కొత్తగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం పీఏసీ-5 భవనం అధునాతనం గా తీర్చి దిద్దారు. ఈ భవనాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు... ఏఈవో వెంకయ్య చౌదరి పరిశీలన చేసారు. భవనంలోని హాళ్లు, కళ్యాణ కట్ట, మరుగుదొడ్లు, అన్న ప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించి అధికారులకు ఛైర్మన్ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు అద్భుతంగా ఈ సముదాయాన్ని నిర్మించారని అభినందించారు. 2018లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టు ద్వారా తిరుమలలో యాత్రికుల వసతి సమస్యకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని తెలిపారు. బ్రహ్మోత్సవాల వేళ ప్రస్తుతం తిరుమలలో 45 వేలమందికి మాత్రమే వసతి సౌకర్యాలు ఉన్నాయని, కొత్తగా నిర్మించిన పీఏసీ-5లో 2,500 మంది యాత్రికులు సులభంగా వసతి పొందగలరని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న బ్రహ్మోత్సవాల సమయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సముదాయాన్ని ప్రారంభిస్తారని.. అప్పటి నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నూతన పీఏసీ భవనంలో అనేక ఆధునిక మార్పులు చేశామని ఏఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. 2,500 మందికి వసతి సౌకర్యం కల్పించినప్పటికీ, అవసరమైతే మరో 1,000 మంది యాత్రికులను కూడా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. Also Read ఏపీలో సెప్టెంబర్ 1 పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన - ఇలా చేయండి..!! అన్ని సదుపాయాలు చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మిల్క్ ఫీడింగ్ గది ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకేసారి 1,400 మంది అన్నప్రసాదాలు స్వీకరించే విధంగా విస్తృతమైన అన్నప్రసాదాల హాలును ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్స కేంద్రం, కళ్యాణకట్ట, అన్న ప్రసాద వితరణ కేంద్రం, తదితర అన్ని అవసరమైన సదుపాయాలను ఈ భవనంలో కల్పించామని తెలియజేశారు. సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలను ప్రకటించారు. సెప్టెంబర్ 6న అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8న మహాలయ పక్ష ప్రారంభం కానుంది. 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం ఉంటుంది. 28న తిరుమల శ్రీవారి గరుడోత్సవం.. సెప్టెంబర్ 29న తిరుమల శ్రీవారి స్వర్ణ రథం జరగనుంది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home