Sunday, 10 August 2025

నిరుపేదలకు 81 కుట్టు మిషన్లు అందజేసిన సేవాగుణ సంపన్నులు బండారు సుబ్బారావు*.


 *వాసవి సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తూరు సీతయ్య గుప్తా 114వ జయంతి వేడుకలు*                                                      *--నిరుపేదలకు 81 కుట్టు మిషన్లు అందజేసిన సేవాగుణ సంపన్నులు బండారు సుబ్బారావు*.         











 హైదరాబాద్  నీలగిరి శంఖారావం: లకడికపూల్ వాసవి కళ్యాణ మండపంలో ఘనంగాకొత్తూరు సీతయ్య గుప్తా 114 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు మాజీ రాజ్యసభ సభ్యులు టి జి వెంకటేష్ మాట్లాడుతూ కొత్తూరు సీతయ్య గుప్తా దార్శనికతను మరియు దూరదృష్టిని కొనియాడిరి.

వారి సంకల్ప బలం మరియు ప్రముఖుల సహకారం తో ఈ అద్భుత సేవ సంస్థ ఏర్పాటు కావడమే కాక 52 సంవత్సరాలుగా సమాజానికి గొప్ప సేవలు అందిస్తున్నదని ప్రశంసించినారు. కొండ్లె మల్లికార్జున్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు తిరుపతి నగరంలో ప్రారంభించే ప్రయత్నాలకు తమ వంతు సహకారం ఉంటుందని T G వెంకటేష్ హామీ ఇవ్వడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పేదలకు స్వయం ఉపాధి నిమిత్తం 81 కుట్టు మిషన్లు స్పాన్సర్ చేసిన సీల్ వెల్ కార్పొరేషన్ అధినేత మరియు గౌరవ అతిథి బండారు సుబ్బారావు సమాజ హితం కోసం జరిపే ప్రతి మంచి కార్యక్రమంలో తమ చేయూత ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. మరొక గౌరవ అతిథి బొగ్గారపు దయానంద్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరుపట్ల తమ సంతృప్తి మరియు సహకారం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా 500 మందికి పింఛన్లు, 125 మందికి 10 కిలోల బియ్యం, సైకిళ్ళు, గ్రైండర్లు పంపిణీ చేసారు. వాసవి హాస్పిటల్ సౌజన్యంతో పెన్షన్ గ్రహీతలకు షుమారు నాలుగు వందల మందికి 

ఆరోగ్య పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగింది. విశ్వ కుమార్ రచించిన శ్రీ వాసవి మాత ప్రార్థన గీతం మరియు పుస్త ఆవిష్కరణ టీ జి వెంకటేష్ ద్వారా నిర్వహించడం జరిగింది. సభాధ్యకులుగా వ్యవహరించిన అధ్యక్షులు కోల్పూరు రమేష్ మాట్లాడుతూ సమాజానికి వాసవి కేంద్రం ద్వారా 52 సంవత్సరాల నుండి జరుగుతున్న సేవా కార్యక్రమాల సరళిని వివరించారు.

సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు

 

కొండ్లె మల్లికార్జున్,

 చీకట్ మర్ల అశోక్ కుమార్,

ఆలంపల్లి రవి కుమార్,

కాసనగొట్టు రాజశేఖర్ గుప్త,

నాచం ప్రభాకర్ (ప్రధాన కార్యదర్శి),

శ్రీ ఇల్లూరి నరేంద్ర కుమార్ (కోశాధికారి)

రాజేష్ కోలావార్ (కన్వీనర్),

కూర జయరాములు గుప్త, కొత్తూరు జయప్రకాష్ రామ్, చైర్మన్, వాసవీ హాస్పిటల్

తదితరులు పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home