Saturday, 30 August 2025

DRDO నుంచి భారీ డిఫెన్స్ ఆర్డర్స్ పొందిన మన హైదరాబాద్ కంపెనీ.. సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్..

 DRDO నుంచి భారీ డిఫెన్స్ ఆర్డర్స్ పొందిన మన హైదరాబాద్ కంపెనీ.. సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్..

డిఫెన్స్ సెక్టార్ కి చెందిన అపోలో మైక్రోసిస్టమ్స్ షేర్లు శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్ లో 8 శాతం లాభాన్ని నమోదు చేసి సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకోవడం జరిగింది. DRDO తో పాటు మరికొన్ని ప్రభుత్వరంగ డిఫెన్స్ కంపెనీల నుంచి భారీ ఆర్డర్లు రావడంతో పెట్టుబడిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఈ స్టాక్ గత ఆరు నెలల్లోనే ఏకంగా 133 శాతం రాబడితో మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిచింది.

DRDO నుంచి భారీ డిఫెన్స్ ఆర్డర్స్ పొందిన మన హైదరాబాద్ కంపెనీ.. సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్..

DRDO నుంచి భారీ డిఫెన్స్ ఆర్డర్స్ పొందిన మన హైదరాబాద్ కంపెనీ.. సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్..

స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన డిఫెన్స్ సెక్టార్ స్టాక్ అయిన అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ (Apollo Micro Systems Limited) షేర్లు శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్ లో ఏకంగా 8 శాతం లాభపడి సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయి అయిన రూ. 271.40 మార్క్ ని టచ్ చేయడం జరిగింది.


డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజెషన్ (DRDO) తో పాటు మరికొన్ని ప్రభుత్వరంగ డిఫెన్స్ కంపెనీల నుంచి వర్క్ ఆర్డర్స్ పొందినట్లు కంపెనీ ప్రకటించడంతో ఈరోజు ఈ కంపెనీ షేరు ధరలో భారీ ర్యాలీ కనిపించింది. మరొకవైపు గత ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ షేరు ఏకంగా 133 శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించి మల్టీబ్యాగర్ స్టాక్ గా నిలిచింది.


కంపనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజెషన్ (DRDO) తో పాటు మరికొన్ని ప్రభుత్వరంగ డిఫెన్స్ కంపెనీల నుంచి రూ. 25.12 కోట్ల విలువైన వివిధ రకాల డిఫెన్స్ వర్క్ ఆర్డర్స్ ని సొంతం చేసుకోవడం జరిగిందని కంపెనీ తెలిపింది.




శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్ లో అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ షేరు ధర 8.05 శాతం లాభపడి రూ. 262 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 271.40 గాను, అలాగే 52 వారాల కనిష్ట ధర రూ. 87.99 లుగా ఉంది.


గత వారం రోజుల్లో ఈ షేరు ధర సుమారు 12 శాతం లాభాన్ని, అలాగే గత నెల రోజుల్లో సుమారు 51 శాతం లాభాన్ని, అదే విధంగా గత ఆరు నెలల్లో సుమారు 133 శాతం లాభాన్ని, ఇక గత ఏడాది కాలంలో ఈ షేర్ సుమారు 152 శాతం లాభాన్ని, చివరగా గత ఐదేళ్ల కాలంలో 2124 శాతం లాభాన్ని తమ వాటాదారులకి అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 8790 కోట్లుగా ఉంది.

మీరు మెచ్చే కథనాలు

సోమవారం, సెప్టెంబర్ 1 ట్రేడింగ్ కోసం మూడు స్టాక్స్ సిఫార్సు చేసిన సుమీత్ బగాడియా

డబుల్ బొనాంజా ప్రకటించిన మల్టీబ్యాగర్ ఫార్మా స్టాక్.. స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్స్ తో పాటు 6 నెలల్లో 62 శాతం లాభం..

ధర రూ. 200 లోపు ఉన్న మూడు స్టాక్స్ ను సిఫార్సు చేసిన మెహుల్ కొఠారీ

రానున్న రోజుల్లో ఏకంగా 30 శాతం పెరిగే ఛాన్స్ ఉన్న ప్రముఖ ఐటీ.. రికమండ్ చేసిన మోతీలాల్ ఓస్వాల్..

అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ అనేది డిఫెన్స్, ఏరోస్పేస్ సెక్టార్స్ లో అగ్రగామి సంస్థగా ఉంది. ఈ కంపెనీ ప్రధానంగా డిఫెన్స్, ఏరోస్పేస్, స్వదేశీ భద్రతా అవసరాల కోసం ఎలక్ట్రానిక్, ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ ని డిజైన్ చేసి తయారు చేస్తుంది.


ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలని నిర్వహిస్తుంది. ఈ కంపెనీని 1985వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 2025 మార్చి నాటికి ఈ కంపెనీలో మొత్తం 405 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home