ఏపీ ఉచిత బస్సు పథకం.. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు శుభవార్త!
ఏపీ ఉచిత బస్సు పథకం.. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతోంది. ఈ పథకం కారణంగా జీరో టిక్కెట్ తో మహిళలు ఉచిత బస్సులలో ప్రయాణం చేస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ఇటు మహిళలకు మాత్రమే కాకుండా, ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు కూడా శుభవార్త చెప్పింది. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు అలవెన్స్ లపై ప్రభుత్వం శుభవార్త ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ భారాన్ని మోస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు అలవెన్స్ లను పెంచి తీపి కబురు చెప్పింది. 80 రూపాయలుగా ఉన్న నైట్ అలవెన్స్ ను ప్రస్తుతం 150 రూపాయలకు పెంచామని తాజాగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. డ్రైవర్లకు వెయ్యి రూపాయలు కండక్టర్లకు 900 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం చేస్తుందిదే ఇక ఉద్యోగుల ప్రమాద బీమా ను ఉచితంగా అందిస్తున్నామని ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో 20 లక్షల రూపాయల పరిహారం ఇచ్చే వారిమని, దానిని కోటి రూపాయలకు పెంచామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు 6500 మందికి పదోన్నతులు కల్పించామని చెప్పారు. ఆన్ కాల్ డ్రైవర్ల వేతనాన్ని 8 వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలకు పెంచామని పేర్కొన్నారు. డబుల్ డ్యూటీలకు అలవెన్స్ పెంపు ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఉండడంతో అక్కడక్కడ అవసరమైన చోట ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డబల్ డ్యూటీలు చేస్తున్నారని, వారికి డబల్ డ్యూటీలు డబ్బులు కూడా పెంచామని చెప్పారు.
గతంలో డబల్ డ్యూటీ చేస్తే డ్రైవర్లకు 800 కండక్టర్లకు 700 ఇచ్చేవారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు కూడా లాభం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా అటు మహిళలకు మాత్రమే కాకుండా ఇటు ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు కూడా లాభం చేకూరుస్తుందని, ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఇవి మాత్రమే కాదు త్వరలో ఆర్టీసీకి 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురాబోతున్నామని, మరో ఆరేడు నెలల్లో 1500 నుంచి 2000 వరకు ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు.
వారికి ఉపాధికి అవకాశం వీటి ద్వారా మరికొంత మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందని మంత్రి శుభవార్త చెప్పారు. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైనా స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లకు, కండక్టర్లకు ఎంతగానో మేలు చేస్తుంది.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home