Thursday, 28 August 2025

తప్పుడు పని చేసి దొరికిపోయిన తెలుగు హీరోయిన్

 

తప్పుడు పని చేసి దొరికిపోయిన తెలుగు హీరోయిన్ 


కేరళలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో ప్రముఖ తమిళ నటి లక్ష్మీ మీనన్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకులం నార్త్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఒక రెస్టారెంట్ బార్ వద్ద లక్ష్మీ మీనన్ బృందానికి, బాధితుడి స్నేహితుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత, నటి లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు ఐటీ ఉద్యోగిని కారులో వెంబడించి, అడ్డగించారు. అనంతరం అతడిని బలవంతంగా తమ కారులోకి లాగి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


      ఇంతకు మించి ఏం చెప్పలేనంటూ మ్యాటర్ లీక్" ఈ కేసులో ఇప్పటివరకు మిథున్, అనీష్, సోనామోల్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నటి లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు. లక్ష్మీ మీనన్ తమిళ చిత్రాలైన కుమ్కి, సుందరపాండియన్, జిగర్తాండ, వేదాలం, చంద్రముఖి 2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విశాల్ నటించిన 'ఇంద్రుడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఒక నటి కిడ్నాప్, దాడి కేసులో ఇరుక్కోవడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home