నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల కారణంగా ప్రజలు పడుతున్న బాధలను తొలగించి, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా :బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల కారణంగా ప్రజలు పడుతున్న బాధలను తొలగించి, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా : బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,
నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో.. నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం... కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలుసుకొని... పట్టణంలోనూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోనూ..వీధి కుక్కలవల్ల పలువురు గాయపడిన విషయం.. కలెక్టర్ దృష్టికి తీసుకు వస్తు.. వాటి తరలింపుకై వినతిపత్రం సమర్పించారు.. ఇటీవల గిరక కబావి గూడ గ్రామంలో.. వీధి కుక్కలు.. వెంటపడి కరిచి పొట్టలోని పేగులు బయటికి వచ్చేలా తీవ్రంగా గాయపరిచాయని.. ఆ మహిళ చావు బతుకుల మధ్య ఉందని.. అదేవిధంగా పట్టణంలోని అనేక వార్డులలో.. మండలాల్లోని అనేక గ్రామాలలో.. చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు.. పాదచారులపై వాహనదారులపై.. దాడి చేసి గాయపరుస్తున్నాయని.. ఇందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. తెలియజేశారు... ఇకనైనా కిందిస్థాయి అధికారులకు తగు ఆదేశాలిచ్చి.. వీధి కుక్కలను ఆయా ప్రదేశాల నుండి తరలించి.. కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
వినతి పత్రం పూర్తి పాఠం.....
భారత రాష్ట్ర సమితి
నల్లగొండ జిల్లా
శ్రీయుత జిల్లా కలెక్టర్, నల్లగొండ గారికి
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల కారణంగా ప్రజలు పడుతున్న బాధలను తొలగించి, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరుట గురించి......
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు..... పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు రోడ్లపై వెళ్తున్న వారిపై దాడి చేయడంతో గాయాలపాలై ఆసుపత్రులకు చికిత్స కోసం వెళ్లడంతో పాటు పేగులు బయటికి వచ్చేలా ప్రజలను కరుస్తున్న నేపథ్యంలో తీవ్ర భయాందోళనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మున్సిపాలిటీలో కమిషనర్లకు, గ్రామపంచాయతీల పరిధిలో పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకునే నాధుడు కరువై ప్రజలు భయాందోళన మధ్య జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రోడ్లపై వీధి కుక్కలు సైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు రోడ్లపై నడవాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చిన అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం అత్యంత బాధాకరం.
వీధి కుక్కలు బడికి పోయే విద్యార్థుల పట్ల వీధి గుండాల లాగా దాడి చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కనీసం వీధి కుక్కలను నివారించడంలో విఫలమైన జిల్లా యంత్రాంగం యాంటీ రాబిస్ ఇంజక్షన్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస నిలువలు ఉంచకపోవడం శోచనీయం
వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన వారిని ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని కోరుతున్నాం
ఇప్పటికే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలు కరవడం తో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలు పాలు కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే వీధి కుక్కలు కరిచి పేగు లు బయటికి వచ్చేలా కరిచినటువంటి ఘటన జిల్లావ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ అధికారుల స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీధి కుక్కల కారణంగా ప్రజలు గాయాల పాలు కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. వీధి కుక్కల నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది
అనేకమంది పేద ప్రజలు ముక్కుపచ్చలారని చిన్నారులు వీధి కుక్కలకు బలైతుంటే ఈ రాష్ట్ర సర్కారు చోద్యం చూస్తుందని అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల కావచ్చు విద్యార్థుల పట్ల కావచ్చు ఏ మాత్రం కూడా కనికరం లేదని
ప్రతి ఒక్కరికి పోలీసులకు ఏ విధంగా అయితే లాఠీలు ఇస్తున్నారు అదేవిధంగా వీధి కుక్కల భారీ నుండి తమను తాము రక్షించుకోవడం కోసం సాధారణ ప్రజల కూడా ప్రభుత్వమే లాటిలు ఇచ్చి ప్రజలను ఇది కుక్కల బారి నుండి రక్షించుకునే విధంగా చూడగలరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చేయడంలో గాని వీధి కుక్కలు తరలించడంలో గాని అధికారులు ఎలాంటి చొరవ చూపడం లేదని అన్నారు
వీధి కుక్కలకు ప్రత్యేకంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఊరి బయట ఒక షెడ్డు ఏర్పాటు చేసి పట్టణంలో జీవిస్తున్న కుక్కలన్నిటిని ఒక దగ్గరికి పోగుచేసి ప్రభుత్వమే కుక్కలను సాదాలని కోరుతున్నాం
ముఖ్యంగా నల్లగొండ పట్టణంలోని 13 వ వార్డు గిరిక బాయిగూడెం చెందిన పందుల శ్రీదేవిని ఇంటి ముందు ఉండగా వీధి కుక్క విపరీతంగా దాడి చేసి పేగులు బయటికి వచ్చేలాగా వీధి కుక్క దాడి చేయడంతో ఆమె మలకపేట యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నది ఆమెకు అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వ భరించాలని డిమాండ్ చేశారు
బిఆర్ఎస్ పార్టీ తరఫున, వినతి పత్రం సమర్పించిన వారిలో..
మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, సింగం రామ్మోహన్, లోడంగి గోవర్ధన్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి,గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, జమాల్ ఖాద్రి, కందుల లక్ష్మయ్య పేర్ల అశోక్ దొడ్డిరమేష్.. పెరికే యాదయ్య, వీరమల్ల భాస్కర్ వజ్జ శ్రీనివాస్ మాతంగి అమర్ అనిల్, తదితరులు కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home