Friday, 27 February 2026

ఎర్ర జెండా అమ్ముడు పోయిందా ?

 ఎర్ర జెండా అమ్ముడు పోయిందా ?

రూ. 50 కోట్లకు డీల్ సెట్ అయిందా ?

ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతలపై కమ్యూనిస్టుల మౌనమెందుకు ?
ఖాళీ స్థలాల్లో పేదలకు ఇళ్లు కావాలని పంచాయతీ పెట్టె కమ్యూనిస్టు పార్టీలు పేదలను రోడ్డున పడేస్తుంటే ఎందుకు చప్పుడు చేయట్లేదు ?
కంచుకోట ఖమ్మంలో ఇంత అన్యాయం జరుగుతున్నా వారికి పట్టదా ? లేదా పట్టనట్లు నటిస్తున్నారా ?
రేవంత్ రెడ్డి ఇస్తున్న డబ్బుకి ఆశపడ్డారా ? రాజీ పడ్డారా ?.. లేదా పొంగులేటి డబ్బులకు దాసోహం అన్నారా ?
మొన్న కొత్తగూడెంలో కాంగ్రెస్ మీద తొడలు కొట్టి లాలూచి పడిన సీపీఐ నాయకత్వం ఇప్పుడు డబ్బులకు లొంగిందా ?
కమ్యూనిస్టుల కంచు కోట .. ఎర్ర జెండా అడ్డాగా ఉన్న ఖమ్మంలో ఇంత అన్యాయం జరుగుతున్నా బాధితుల వైపు సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఎందుకు వెళ్లట్లేదు ? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు పోరాడట్లేదు ?
కమ్యూనిస్టు నాయకులు ముగ్గురు కాంగ్రెస్ మంత్రులతో రూ. 50 కోట్లు డీల్ సెట్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.. కమ్యూనిస్టు పార్టీల మౌనం చూస్తుంటే అది నిజమని నమ్మక తప్పట్లేదు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home