Saturday, 16 August 2025

కృష్ణాష్టమి స్పెషల్ వెన్న ఉండలు..స్వీట్ షాప్ కి మించిన రుచితో..ఎలా చేసుకోవాలంటే


 కృష్ణాష్టమి స్పెషల్ వెన్న ఉండలు..స్వీట్ షాప్ కి మించిన రుచితో..ఎలా చేసుకోవాలంటే

]             కృష్ణాష్టమి పండుగ రోజున, శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైన వెన్న ఉండలు (వెన్న ముద్దలు) నివేదించడం ఆనవాయితీ. వెన్న అంటే శ్రీకృష్ణుడికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. బాల్యంలో ఆయన వెన్న దొంగిలించి తినడం, గోపికల నుంచి వెన్నను అడిగి తీసుకోవడం వంటి కథలు చాలా ప్రసిద్ధి. అందుకే, కృష్ణాష్టమి నాడు వెన్నను, వెన్నతో చేసిన వెన్న ఉండలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే విడి రోజుల్లో తినడానికి కూడా ఇది పర్ఫెక్ట్ స్నాక్. కృష్ణాష్టమి స్పెషల్ వెన్న ఉండలను ఇంట్లోనే స్వీట్ షాప్ కి మించిన రుచితో గుల్లగా వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

యారీకి కావాల్సిన పదార్థాలు

-పాలు

-వెన్న

-ఉప్పు

-బియ్యం పిండి

-బెల్లం

-యాలకల పొడి

-ఆయిల్

-నెయ్యి

తయారీ విధానం


-ముందుగా ఓ పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, 4 టేబుల్ స్పూన్ల వెన్న, చిటికెడు ఉప్పు వేసి మొత్తం బాగా కలపాలి. వెన్న మొత్తం పిండిలో కలిసేలా కలుపుకోండి.


-తర్వాత అరకప్పు పచ్చిపాలను కొంచెం కొంచెంగా ఆ పిండి మిశ్రమంలో పోస్తూ పిండిని ముద్దలా చేసుకోవాలి. పిండి చేతికి అంటుకున్నట్లుగా వత్తుకోకూడదు, అలాగే గట్టిగా క్రాక్స్ వచ్చే విధంగా ఉండకూడదు.


-పిండి కలిపేటప్పుడు పాలు ఎక్కువై పలుచనైతే కాస్త బియ్యం పిండిని వేసి అడ్జెస్ట్ చేసుకోవచ్చు.


-తర్వాత మూతతీసి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని అరచేతిలో పెట్టి రౌండ్ గా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న గోలీల సైజులో బాల్స్ లా చేసుకోండి.


-తయారచేసుకున్న ఉండల మీద మూతపెట్టేసి పక్కన ఉంచుకోండి.


-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసి మీడియం హీట్ లో ఆయిల్ వేడి చెయ్యాలి.


-వేడెక్కిన ఆయిల్ లో కలిపి ఉంచుకున్న ఉండలను బ్యాచ్ లుగా వేసి సన్నటి సెగ మీద మీద వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బంగారు రంగులోకి మారి క్రిస్పీగా మారేదాకా వేయించుకొని బాండీలోని నుంచి తీసి ఓ ప్లేట్ లో పెట్టుకోండి.


-తర్వాత ఓ ప్లేట్ లో అర కప్పు తురుమిన బెల్లం వేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. మంటను తక్కువలో ఉంచండి.


-బెల్లం కరిగి తీగ పాకంలా మారిన తర్వాత అందులో 1 టీస్పూన్ యాలకల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపండి.


-ఇప్పుడు పాకంలో వేయించిన వెన్న ఉండలు వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయండి.


-గిన్నెను ఫ్యాన్ కింద పెట్టి చల్లారేవరకు గరిటతో కలుపుతూ ఉండండి.


-బెల్లం లేయర్ ఉండలకు అంటిన తర్వాత పూర్తిగా చల్లారేదాకా అలా వదిలేయండి. చల్లారాకా విడి విడిగా వస్తాయి. అంతే వెన్న ఉండలు రెడీ.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home