భార్య ఎందుకు ప్రియుడిని కోరుకుంటుంది? ఈ ఏజ్ లోనే ఎక్కువగా ఎఫైర్స్..ఆశ్చర్యపరిచే కారణాలు
భార్య ఎందుకు ప్రియుడిని కోరుకుంటుంది? ఈ ఏజ్ లోనే ఎక్కువగా ఎఫైర్స్..ఆశ్చర్యపరిచే కారణాలు
పెళ్లంటే నూరేళ్ల నంట అని అనేవాళ్లు గతంలో. ఇప్పుడయితే నూరేళ్ల మంటగా దానికి ముద్ర వేశారు. పెళ్లి అంటే కొందరిలో విరక్తి కూడా వచ్చేస్తుంది. దీనికి కారణంగా ఇటీవల కాలంలో పెరిగిపోతున్న వివాహ సంబంధాలు. లవర్ కోసం భార్యను చంపే భర్తలు..ప్రియుడు కోం భర్తను చంపేస్తున్న భార్యలు..ఇవన్నీ నిత్యం వార్తల్లో చూస్తున్నాం. గత కొంతకాలంగా అయితే వివాహేతర సంబంధాల కారణంగా జరిగే నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే అసలు మహిళలు ఎక్కువగా ఏ వయస్సులో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు? ఎందుకు? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.
ముఖ్యంగా 34- 38 ఏళ్ల మధ్య వయసులో చాలా మంది స్త్రీల జీవితంలో ఒక వర్ణించలేని శూన్యం ఆవరిస్తుందని.. అది మాటల్లో చెప్పలేని ఓ నిశ్శబ్ద వేదన అని నిపుణులు చెబుతున్నారు. తమ మాట వినేవారెవరూ లేరని, తమ మనసును అర్థం చేసుకునే ఆత్మీయులు కరువయ్యారని మథనపడతారు. ఈ క్రమంలోన, ప్రేమ, గుర్తింపు కోసం వారి ఆత్మ పరితపిస్తుంది. అలాంటి సున్నితమైన సమయంలో, వారి మనసు నిశ్శబ్దంగా మరొకరి వైపు ఆకర్షింపబడుతుంది. ఇది వివాహేతర సంబంధంగా మారుతుంది. ఇది కేవలం ద్రోహం కథ కాదు.. అంతకంటే లోతైనదని నిపుణులు చెబుతున్నారు.
వినాయక నిమజ్జనం ఎప్పుడు చేయాలి? పండితుల మాట ఇదే!
ఆన్ లైన్ పేమెంట్ ఫెయిల్.. రహస్యం బట్టబయలు..ఉన్న పెళ్లాం పోయింది,ఉంచుకున్న సెటప్ పోయిందిఆన్ లైన్ పేమెంట్ ఫెయిల్.. రహస్యం బట్టబయలు..ఉన్న పెళ్లాం పోయింది,ఉంచుకున్న సెటప్ పోయింది
ఎందుకిలా జరుగుతుంది?
రిలేషన్ షిప్ నిపుణులు చెప్పేదాని ప్రకారం..34- 38 ఏళ్ల వయసులో స్త్రీలు భావోద్వేగపరమైన లేదా శారీరకమైన బంధాల వైపు మొగ్గు చూపడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అది నిర్లక్ష్యం, ఒంటరితనం, అన్నింటికంటే మించి తనని తాను కోల్పోతున్నాననే బాధ నుంచి పుడుతుంది.
వివాహమైన కొన్నాళ్లకు, ప్రేమ స్థానాన్ని బాధ్యత ఆక్రమిస్తుంది. ఒకప్పటి ప్రియురాలైన భార్య.. అమ్మగా, కోడలిగా, ఇంటి నిర్వాహకురాలిగా కొన్ని పాత్రలకే పరిమితమైపోతుంది. ఈ పాత్రల బరువులో అసలు నేను ఎవరన్న ప్రశ్నే మరుగున పడిపోతుంది. పక్కనే భర్త ఉన్నా, పలకరించే మనసు ఉండదు. మాటలుంటాయి కానీ మనసులు కలవవు. ఒకప్పుడు ప్రేమ స్పర్శతో పులకరించిన జీవితం, ఇప్పుడు కేవలం మెషీన్ లా మారిపోతుంది. ఈ నిర్లక్ష్యం, ఈ ఒంటరితనం ఆమెలో ఓ అగాధాన్ని సృష్టిస్తుంది.
శరీరం చెప్పేది వేరు, బంధం అర్థం చేసుకునేది వేరు
మధ్య వయసులో స్త్రీలలో హార్మోన్ల మార్పులు సహజం. దీంతో వారిలో మానసిక, శారీరక సాన్నిహిత్యం కోసం ఆకాంక్ష కొత్తగా చిగురిస్తుంది. కానీ భాగస్వామి ఈ అవసరాన్ని గుర్తించలేనప్పుడు ఆ దాహం తీరక, తన భావాలను అర్థం చేసుకునే మరొకరి కోసం ఆమె మనసు వెతకడం ప్రారంభిస్తుంది.
పెళ్లయిన మొదటి ఏడాదిలో అస్సలు చేయకూడని 3 పనులు..పొరపాటున చేస్తే జీవితం నాశనం!పెళ్లయిన మొదటి ఏడాదిలో అస్సలు చేయకూడని 3 పనులు..పొరపాటున చేస్తే జీవితం నాశనం!
ప్రతీకాత్మక చిత్రం
బయటి నుంచి దొరికే చిన్నపాటి గుర్తింపు
పిల్లల పెంపకం, ఉద్యోగం, ఇంటి పనుల చక్రబంధంలో నలిగిపోతున్న స్త్రీకి బయటి ప్రపంచంలో చిన్న ప్రశంస దొరికినా, అది ఎడారిలో ఒయాసిస్సులా అనిపిస్తుంది. తన కెరీర్ లో విజయాలు సాధిస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న ఆమెకు తన భావాలకు విలువనిచ్చే వాతావరణం కావాలనిపిస్తుంది. అలాంటి సమయంలో మీరెలా ఉన్నారు? అని అడిగే ఒక ఆత్మీయ స్వరం, తన మాటలను శ్రద్ధగా వినే వాళ్లు, తనను చూసి చిరునవ్వు చిందించే ఒక స్నేహం దొరికితే చాలు ఆమె మనసు ఆ వ్యక్తి వైపు ఇట్టే ఆకర్షింపబడుతుంది. ఇది బలహీనత కాదు, ప్రతి మనిషి కోరుకునే మానవీయ అవసరం.
ఇది ఒక హెచ్చరిక
నిజానికి ఒక స్త్రీ మరో బంధంలోకి అడుగుపెడుతోందంటే ఆమె తన భాగస్వామిని ద్వేషిస్తున్నట్టు కాదు. బదులుగా తనతో తనకున్న బంధాన్ని కోల్పోయిందని అర్థం. ఇది సంబంధానికి ఒక ప్రమాద ఘంటిక. బంధంలో ప్రేమ ఇంకిపోయి, శూన్యం ఏర్పడుతోందని చెప్పే ఒక సంకేతం. ఆమె మరొకరిని వెతకడం లేదు, బహుశా తనలో తాను కోల్పోయిన తననే వెతుక్కుంటోంది. కాబట్టి దీన్ని నిందించే ముందు ఆ శూన్యానికి కారణమేంటో అర్థం చేసుకోవడం ప్రతి బంధానికీ ఎంతో ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home