Thursday, 28 August 2025

అమెరికాకు బిగ్ ఇచ్చిన భారత్ సహా 25 దేశాలు.. ఏం జరిగిందంటే ?

 అమెరికాకు బిగ్ ఇచ్చిన భారత్ సహా 25 దేశాలు.. ఏం జరిగిందంటే ?


అమెరికాకు బిగ్ ఇచ్చిన భారత్ సహా 25 దేశాలు.. ఏం జరిగిందంటే ?


అమెరికా తీసుకున్న కొత్త పన్ను విధానాలు అంతర్జాతీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపులను రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం నిర్ణయంతో ప్రపంచ దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) వెల్లడించిన వివరాల ప్రకారం, భారతదేశంతో పాటు కనీసం 25 దేశాలు అమెరికాకు తమ పోస్టల్ సేవలను నిలిపివేశాయని సమాచారం. 25 దేశాలు.. భారత్ తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, నార్వే, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న వ్యాపారాలు, వ్యక్తిగత పార్సెల్స్, ఈ–కామర్స్ డెలివరీలు అన్నీ ఈ నిర్ణయం కారణంగా దెబ్బతింటున్నాయి. 

                "ఈ నెల 27వ తేదీ అర్థరాత్రి 12:01 నిమిషాలకు: భారత్ కు ట్రంప్ పెట్టిన `ముహూర్తం`" ఐక్యరాజ్యసమితిలో ఒక విభాగంగా పనిచేసే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ప్రధాన కేంద్రాన్ని కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా సభ్యదేశాల మధ్య పోస్టల్ సహకారాన్ని పెంచడమే దీని లక్ష్యం. ఈ నిర్ణయం కారణంగా అంతర్జాతీయ పోస్టల్ వ్యవస్థలో అసమానతలు, జాప్యాలు, వాణిజ్య ఆటంకాలు తలెత్తే ప్రమాదముందని UPU హెచ్చరించింది. అమెరికా యంత్రాంగం ఆగస్టు 29 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ఆదేశాల ప్రకారం.. $800 వరకు ఉన్న వస్తువులపై పన్ను మినహాయింపు రద్దు చేసింది. ఇకపై విలువ ఎంతైనా, అమెరికాకు వచ్చే ప్రతీ పార్సెల్ సుంకాలకు లోబడి తీరాలి. $100 విలువలోపు గిఫ్ట్ ఐటమ్స్, లేఖలు, పత్రాలు మాత్రం మినహాయింపులో కొనసాగుతాయి. ఈ విధానం కారణంగా ప్రతీ చిన్న ప్యాకేజీ కూడా తనిఖీలు, పన్నులు ఎదుర్కోవాల్సి రావడంతో అమెరికా వినియోగదారులకు సరుకులు ఆలస్యంగా చేరడమే కాక, ఖర్చు కూడా పెరుగుతోంది. ఇది ఈ–కామర్స్, చిన్న వ్యాపారాలపై పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

 

విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. అమెరికా నిర్ణయంపై ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) దృష్టి సారించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో "ప్రతీకార సుంకాలు – కౌంటర్ రెస్పాన్స్‌లు" కొత్త తరహా వాణిజ్య యుద్ధానికి నాంది పలకవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రాబోయే నెలల్లో అంతర్జాతీయ రాజకీయ–ఆర్థిక సంబంధాలపై ఎలాంటి మలుపులు తీసుకురాబోతుందో చూడాలి. భవిష్యత్ సవాళ్లు.. అంతర్జాతీయ పోస్టల్ రవాణా ఖర్చులు పెరగడం చిన్న వ్యాపారాల నిలదొక్కుకోవడంలో ఇబ్బందులు అమెరికా వినియోగదారులకు అధిక ఖర్చులు, ఆలస్యాలు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదురే ప్రమాదం

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home