మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ,,:జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను
ఆకస్మికంగా తనిఖీ : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నకిరేకల్ లోని మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల లో సరైన వసతులు లేని కారణంగా తక్షణమే పాఠశాలను అన్ని సౌకర్యాలు ఉన్న భవనానికి మార్చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల రీజినల్ కో-ఆర్డినేటర్ ను ఆదేశించారు.
సోమవారం ఆమె నకిరేకల్ లోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భవనం మొత్తం తిరిగి పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత భవనంలో విద్యార్థులకు సరిపడా మౌలిక వసతులు లేవని, అందువల్ల వెంటనే పాఠశాల భవనాన్ని ఇతర భవనంలోకి మార్చాలని ఆర్ సి ఓ ను ,నల్గొండ ఆర్డీవోను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ నకిరేకల్ మండలం చందుబట్లలోని ఓ కాలనీలో తాగునీటి సమస్య ను పరిష్కరించేందుకు 80 వేల రూపాయలు మంజూరు చేసినప్పటికీ ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై ఆమె ఆర్ డబ్ల్యు ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎనిమిది రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
__________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home