గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74 కృత్రిమ నిమజ్జన కేంద్రాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74 కృత్రిమ నిమజ్జన కేంద్రాలు
– నిమజ్జనం సజావుగా జరిగేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు
హైదరాబాద్, ఆగస్టు28, 2025: గణేష్ ప్రతిమల నిమజ్జన కార్యక్రమం సాఫీగా, వేగంగా జరిగేలా చూసేందుకు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74 కృత్రిమ నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి నిమజ్జన పాండ్ వద్ద ఒక ఇంచార్జీ అధికారి సర్జిక్ కు నోడల్ అధికారి తో పాటు ఓవరాల్ ఇంచార్జీ గా సంబంధిత డిప్యూటీ కమీషనర్, శానిటేషన్ సిబ్బంది సరిపోను క్రేన్లు, కంట్రోల్ రూమ్, మెడికల్ క్యాంపు, ఎప్పటి కప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు శానిటేషన్ సిబ్బంది తో పాటుగా వాహనాలను ఏర్పాటు చేసి సాఫీగా నిమజ్జనం జరిగేలా సిబ్బంది మూడు షిఫ్ట్ లలో పని చేస్తారు.
హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, ఐడిఎల్ చెరువు, సఫిల్‌గూడ చెరువు, సున్నం చెరువు సహా 20 ప్రధాన చెరువులతో పాటు ఈ 74 కృత్రిమ కుంటలలో నిమజ్జనం జరుగనుంది. తద్వారా ప్రధాన చెరువుల పై ఒత్తిడి తగ్గించడమే కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సమీపంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కు ప్రజల సౌకర్యం కోసం విసృతంగా కృత్రిమ నిమజ్జన పాండ్ లను జిహెచ్ఎంసి ఏర్పాటు చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఏర్పాటు చేసిన 74 కృత్రిమ నిమజ్జన కేంద్రాలు ఇవే
తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంకులు – 24
1. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఏ.ఎస్.రావు నగర్
2. సచివాలయ నగర్, ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్స్
3. ఎం.ఆర్.ఓ.ఆఫీస్, హయత్‌నగర్
4. క్రికెట్ గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్ పక్కన, సుష్మా థియేటర్, వనస్థలిపురం
5. గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ వెనుక
6. శివాలయం గ్రౌండ్, రియాసత్‌నగర్
7. లక్ష్మణేశ్వర ప్లేగ్రౌండ్, జంగం మెట్
8. రామ్ లీలా గ్రౌండ్, చింతల్ బస్తీ
9. SBA గార్డెన్ ఎదురుగా, 100 అడుగుల రోడ్డు
10 . నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ – 2
11. అమీర్‌పేట్ ప్లేగ్రౌండ్
తాత్కాలిక ఎక్స్కవేషన్ పాండ్లు – 23
1. దేవేందర్ నగర్ రోడ్
2. హుడా భారతి నగర్ పార్క్, జెడ్.పి.రోడ్, హస్తినాపురం
3. ఎన్.టి.ఆర్.నగర్ వెజిటబుల్ మార్కెట్
4. ఫ్రెండ్స్ కాలనీ షటిల్ కోర్ట్
5. ఎస్‌బిహెచ్ కాలనీ, సైదాబాద్
6. బతుకమ్మ బావి, కందికల్ గేట్, గౌలిపురా
7. వైశాలి నగర్, ఇస్సాదాన్ 8. నర్సాబైకుంట, మైలార్‌దేవ్‌పల్లి
9. సంజీవిని హిల్స్, మూసీ నది పక్కన, ఉప్పర్ పల్లి
బేబీ పాండ్లు (శాశ్వతమైనవి) – 27
ఎల్.బి.నగర్ జోన్ లో
1.చర్లపల్లి చెరువు
2. కాప్రా చెరువు
3. నల్ల చెరువు
4.నాగోల్ చెరువు
5.మన్సూరాబాద్ పెద్ద చెరువు
చార్మినార్ జోన్ లో
6. పాఠి కుంట
7. రాజన్న బావి
ఖైరతాబాద్ జోన్ లో
8. నెక్నాంపూర్
9. నెక్లెస్ రోడ్
10. దుర్గం చెరువు
11. మల్కం చెరువు
12. నల్లగండ్ల చెరువు
13. గోపి చెరువు
శేరిలింగంపల్లి జోన్ లో
14. గంగారం చెరువు
15. కైదమ్మ కుంట
16. గురునాథం చెరువు
17. రాయ సముద్రం
కూకట్ పల్లి జోన్ లో
18. ముల్కత్వ చెరువు
19. ఐడీఎల్ బేబీ పాండ్, బాలాజీ నగర్, మూసాపేట్
20. బోయిన్ చెరువు బేబీ పాండ్
21. ప్రగతి నగర్ బేబీ పాండ్, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్
22. వెన్నెల గడ చెరువు
23. లింగం చెరువు, సురారం (మైసమ్మ దేవాలయం పక్కన)
24. కొత్త చెరువు, అల్వాల్ దేవాలయం
సికింద్రాబాద్ జోన్ లో
25. సంజీవయ్య పార్క్
26. సఫిల్‌గూడ
27. బండ చెరువు
––––––––––––––––––––––
సిపిఆర్ఓ, జీహెచ్ఎంసీ చే జారీ చేయనైనది.
11 Attachments • Scanned by Gmail
ReplyReply allForward |

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home