Sunday, 6 October 2024

Journalist: జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు : సుప్రీంకోర్

* Journalist: జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు : సుప్రీంకోర్



ఢిల్లీ: ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  జర్నలిస్టుల వార్తలను ప్రభుత్వ విమర్శగా భావించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించారు. ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. విమర్శలు చేసే జర్నలిస్టులపై  కేసు నమోదు చేస్తే.. అది భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కుల వివరాలకు సంబంధించి ఓ వార్తా కథనాన్ని ప్రచురించినందుకు ఉ‍త్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జర్నలిస్ట్‌ అభిషేఖ్‌ ఉపాధ్యాయ్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జర్నలిస్ట్‌ అభిషేఖ్‌ ఉపాధ్యాయ్‌ను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

No comments:

Post a Comment