Friday, 18 October 2024

మద్యం మాఫియా గుప్పిట్లో ఎక్సైజ్‌.. అక్రమ లిక్కర్‌ను పట్టుకున్న ఐఏఎస్‌ అధికారిణిపై బదిలీ

  మద్యం మాఫియా గుప్పిట్లో ఎక్సైజ్‌.. అక్రమ లిక్కర్‌ను పట్టుకున్న ఐఏఎస్‌ అధికారిణిపై బదిలీ వేటు ప్రభుత్వానికి పన్ను ఎగవేసేందుకు అక్రమంగా మద్యం తయారుచేసి దొంగచాటు గా విక్రయిస్తున్న రెండు డిస్టిలరీల మీద ఓ ఐఏఎస్‌ అధికారిణి దాడులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ అధికారిణి అక్కడ దొరికిన తీగ లాగగా మద్యం మాఫి యా డొంకంతా కదిలినట్టు తెలిసింది.

రెండు డిస్టిలరీల్లో ఆకస్మిక తనిఖీలు.. గుట్టు రట్టు

ఖజానాకు 100 కోట్ల నష్టం

ఆ అధికారిణి లేఖతో ఉలిక్కిపడిన ముఖ్య నేతలు

అధికారిణి ఆకస్మిక బదిలీ

ఆలస్యంగా వెలుగులోకి ఘటన

                 Telangana | హైదరాబాద్‌,: ప్రభుత్వానికి పన్ను ఎగవేసేందుకు అక్రమంగా మద్యం తయారుచేసి దొంగచాటు గా విక్రయిస్తున్న రెండు డిస్టిలరీల మీద ఓ ఐఏఎస్‌ అధికారిణి దాడులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ అధికారిణి అక్కడ దొరికిన తీగ లాగగా మద్యం మాఫి యా డొంకంతా కదిలినట్టు తెలిసింది. అక్రమంగా తయారుచేస్తున్న ఎన్‌డీపీఎల్‌ (నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌)ను డిస్టిలరీల నుంచి నేరుగా మద్యం దుకాణాలకు, అక్కడి నుంచి బెల్టు షాప్‌లకు తరలిస్తున్న వైనాన్ని ఆమె పసిగట్టినట్టు సమాచారం. కేవలం మూడు నెలల్లోనే రెండు లిక్కర్‌ కంపెనీల ద్వారా రూ.100 కోట్ల విలువైన అక్రమ మద్యం వ్యాపారం సా గినట్టు ఆమె అంచనాకు వచ్చారని తెలిసింది. దీనిపై ఆమె ఎక్సైజ్‌శాఖకు లేఖ రాయడంతో లిక్కర్‌ మాఫియా ఉలిక్కిపడటం, వారు వెంట నే ఓ ‘ముఖ్య’నేతను కలవడం, వారం రోజుల్లోనే ఆ అధికారిణిని బదిలీ చేసినట్టు అధికారవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.

తీగ లాగిన వైనమిదీ

సదరు అధికారి తన శాఖ అధికారులతో కలిసి ఎక్సైజ్‌ రాబడి మీద సమీక్ష చేసినప్పుడు పలు అనుమానాలు రావడంతో లిక్కర్‌ అమ్మకాలపై నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో గత మే నెలలో రెండు డిస్టిలరీల మీద దాడి చేశారు. రికార్డులను ఆడిట్‌ చేశారు. ఆ రెండు డిస్టిలరీలలో అనుమతించిన లిక్కర్‌ ఉత్పత్తికి వాడిన నీరు, కరెంటు, ముడిసరుకు లెక్కలను పోల్చి చూస్తే..! భారీగా తేడాలు ఉన్నట్టు గుర్తించారు.


ఆ కంపెనీ మరో డిస్డిలరితో కలిపి ఏడాదికి 1.30 కోట్ల లీటర్ల మద్యం ఉత్పత్తికి అనుమతి తీసుకున్నాయి. దాడి చేసే సమయానికి మూడు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకొని రికార్డులను పరిశీలిస్తే.. అనుమతించిన మద్యం కంటే 12.50 లక్షల లీటర్లు అదనంగా ఉత్పత్తి జరిగినట్టు గుర్తించారు. దీని విలువ రూ.100 కోట్లుగా అంచనా వేశారు. వివరాలతో ఆ అధికారిణి ఎక్సైజ్‌శాఖకు లేఖ రాశారు. రెండు డిస్టిలరీలలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతున్నదని దీంతో 70 శాతం వ్యాట్‌ కింద సర్కార్‌కు రావాల్సిన రూ.90 కోట్లు వరకు గండి పడినట్టు తెలిపారు.


తనిఖీల్లో అక్రమాలు బట్టబయలు

ఈ లేఖతో ఎక్సైజ్‌ అధికారులు సోదాలు నిర్వహించగా ఒక డిస్టిలరీలో అక్రమ మద్యం ను గుర్తించినట్టు సమాచారం. ఇందుకు బాధ్యులుగా ఇద్దరు సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఎక్సైజ్‌ సీఐలపై క్రమశిక్షణ చర్యలు తీసున్నది. ఇదే అంశాన్ని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సదరు అధికారికి జవాబు రూపంలో రాశారు. ఈ జవాబుపై సంతృప్తి చెందని అధికారిణి, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు అవసరం లేదని, ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండి పడ్డదో ? డిస్టిలరీల వారీగా వివరాలు పంపాలని ఎక్సైజ్‌ శాఖకు మరో లేఖ రాశారు.


అధికారిణిపై బదిలీవేటు

అధికారిణి దూకుడుతో రాష్ట్రంలో భారీ అక్రమ మద్యం కుంభకోణం బయటపడే అవకాశం ఉండటంతో ఎక్సైజ్‌ అధికారులు, డిస్టిలరీల యాజమాన్యం అప్రమత్తం అయ్యారు. అక్రమ మద్యం ఉత్పత్తి, వ్యాపారానికి ఒడిగట్టిన మద్యం మాఫియా వెళ్లి రాష్ట్ర ముఖ్యనేతను, మరో కీలక నేతను కలిసి ప్రసన్నం చేసుకున్నట్టు తెలిసింది. మాఫియా లాబీయింగ్‌తో సదరు ఐఏఎస్‌ అధికారిణిని అకస్మికంగా అక్కడి నుంచి వేరొక శాఖకు బదిలీ చేశారు. తాజాగా జరిగిన ఐఏఎస్‌ల పోస్టింగుల సర్దుబాటులో సదరు అధికారిణికి మరో శాఖకు ఎఫ్‌ఎసీ బాధ్యతలు అప్పగించారు. అధికారిణి బదిలీతో మద్యం అక్రమ వ్యాపారం విచారణను మ మ అనిపించి ఫైల్‌ను సంపూర్ణంగా అటకెక్కించినట్టు సమాచారం.

No comments:

Post a Comment