దూసుకొస్తున్న తుఫాను.. కోస్తా, సీమలో గజ గజ..
AP Toofan: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా బలపడటంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో మరింత బలపడనుంది. ఇప్పటికే ఉత్తర తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు , రాయలసీమ, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు పడుతున్నాయి.
AP Rains: వాయు గుండం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి భారీ ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గంటలకు 40 కిలో మీటర్ల నుంచి 60 కిలో మీటర్ల ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ జన జీనవం స్తంభించి పోయింది. అటు తుఫాను ప్రభావంతో తెలంగాణతో పాటు హైదరాబాద్ లో ఓ మోస్తరు ఝల్లులు పడుతున్నాయి. మరోవైపు పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల కొనసాగుతుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 15 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ అధికారులు తెలిపారు. మరవైపు అద్దంకి లో 14 సెంటీమీటర్ల వర్షపాతం.. కందుకూరులో 12 సెం.మీ.. రైల్వే కోడూరులో సెం.మీ చొప్పున వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
తుఫాను ప్రభావంతో మత్య్స కారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్ర అధికారులు ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. వర్షాల నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఇప్పటికే తుఫాను చెన్నై తీరం దాటిందని చెబుతున్నారు.
పరిస్థితి భయానకంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లవొద్దని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో బుధవారం నాడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవిన్యూ-విపత్తుల నిర్వహణ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అలర్ట్ జారీ చేశారు.అంతేకాదు అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారుల సెలవులను క్యాన్సిల్ చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో పునరావాస కేంద్రంతో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. అంతేకాదు తుఫాను కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశాలున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
నైరుతి ఋతుపవనాలు నిన్నటితో మన దేశం నుంచి వెళ్లిపోయినట్టు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. నైరుతి ఋతుపవనాల కారణంగానే మన దేశంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. మాములుగా జూన్ 1 కేరళ రాష్ట్రంలో ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు.. దేశ వ్యాప్తంగా అన్ని వ్యాపించి .. సెప్టెంబర్ 17న వాయువ్య దిశగా రాజస్థాన్ వైపు పయనిస్తాయి. అయితే ఈ ఇయర్ మే 31న కేరళలో ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు కేరళ రాష్ట్రంలో ప్రవేశించి జూలై 2న దేశ వ్యాప్తంగా అంతగా విస్తరించాయి. ఇక సెప్టెంబర్ 23న ఆరు రోజులు లేట్ గా వెనక్కి మళ్లినట్టు వాతావరణ అధికారులు తెలిపారు. ఈ సారి మన దేశంలో సాధారణంగా కంటే 10.5 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయినట్టు తెలుస్తుంది.
No comments:
Post a Comment