మాతా ది జై వాసవి జై జై వాసవి
జోహార్ మహాత్మా గాంధీ అమర్ రహే అమర్ రహే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు
నేను మీ బోనాల శ్రీనివాస్ వ్యవస్థాపకులు ప్రజాఏక్తా పార్టీ హైదరాబాద్
యావత్ తెలంగాణ మరియు తెలుగు ప్రజలందరికీ నమస్కారములు. నేను మొన్నటి రోజున పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పును నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు సాహసోపేత నిర్ణయం
తీసుకున్నాను సోషల్ మీడియాలో తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలు వాస్తవ్యులు పేరు కం నాగ ఆంజనేయులు వ్యవస్థాపక అధ్యక్షులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం మరియు అమరజీవి జన్మభూమి పునరుద్ధరణ కమిటీ చైర్మన్ గారు నా నిర్ణయాన్ని సాహసోపేత నిర్ణయంగా ప్రశంసించారు అదేవిధంగా నా యొక్క అకుంటిత దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఆమరణ నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేయమని ఉద్యమ తీవ్రతను యావత్ ఆర్యవైశ్యులకు మరియు తెలుగు ప్రజలందరి దృష్టికి తీసుకు వెళ్లేందుకు భవిష్యత్తు కార్యాచరణ ప్రారంబిద్దామని ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి శిష్యులైన పొట్టి శ్రీరాములు గారు క్విట్ ఇండియా ఉద్యమంలో నాలుగు సార్లు జైలు శిక్ష అనుభవించి దళిత జనార్ధన కార్యక్రమాలు చేపట్టి తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ సాహసోపేతంగా 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు వారి త్యాగం వల్లనే నేడు మన భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన పది రాష్ట్రాల ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు అటువంటి మహానుభావుడికి గౌరవం కల్పిస్తూ 1985లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించకపోగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు మార్చాలని నిర్ణయాన్ని వారి మంత్రివర్గం కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అదే పేరు కొనసాగాలని ఉద్యమ కార్యాచరణ ఈ రోజున గాంధీ జయంతి రోజున ప్రారంభం చేస్తున్నాము త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పైన న్యాయపోరాటం చేస్తామని అటులనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్యవైశ్య సంఘాలన్నిటిని తెలుగు ప్రజలను అమరజీవి పొట్టి శ్రీరాములు అభిమానులను అందరినీ కలుపుకుంటూ భవిష్యత్తులో పొట్టి శ్రీరాములు గారికి ఇటువంటి అగౌరవ సంఘటనలు జరగకుండా ఉద్యమ కార్యాచరణ పెంచుతూ వారికి తగిన గౌరవం కల్పించేందుకు పాటుపడతామని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం మరియు ప్రజా ఏక్తా పార్టీ సంయుక్తంగా ఉద్యమంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాము మా ఈ కార్యాచరణకు వయ తెలుగు రాష్ట్రాల్లోనే ఆర్యవైశ్యులు యావత్తు తెలుగు ప్రజలు అమరజీవి అభిమానులు అందరూ సహకరించాలని కోరుచున్నాము ఇది నీది నాది సమస్య కాదు యావత్తు తెలుగు జాతి సమస్యగా అందరూ భావించాలని కోరుచున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సమాచారం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు వెనకడుగు వేసేది లేదని అందరినీ కలుపుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో ఆమరణ నిరాహార దీక్ష కార్యాచరణను కూడా ప్రారంభిస్తామని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము మీ బోనాల శ్రీనివాస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా ఏక్తా పార్టీ మరియు పేరుకం నాగ ఆంజనేయులు వ్యవస్థాపకులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం అమరజీవి జన్మభూమి పునరుద్ధరణ కమిటీ చైర్మన్
మనకి స్వాతంత్రం రావటానికి మునుపు సుమారు 80 సంవత్సరాలుగా ప్రత్యేక తెలుగు రాష్ట్రం డిమాండ్తో ఎన్నో ఉద్యమాలు జరిగినప్పటికీ ఒకే ఒక్కడిగా 53 సంవత్సరాల వయసులో ఢిల్లీ పీఠం తలవంచాలి అని గట్టి నిర్ణయంతో మరణాన్ని కూడా లెక్కచేయకుండా తీసుకున్న నిర్ణయం వల్లే ఈ రోజున మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తూ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం ఎవరి ఆత్మ బలిదానం వల్ల ఈ రాష్ట్రాలు ఏర్పడ్డాయో వారిని విస్మరించటం కాకుండా అవమానించటం అనేది చాలా ఘోరమైన తప్పిదంగా భావిస్తూ రేవంత్ రెడ్డి గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వాసవి మాతను కోరుకుంటున్నాను ఆ రోజున ఢిల్లీలో మదరాశీలుగా పిలవబడే తెలుగు వారు నేడు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అది పొట్టి శ్రీరాములు గారి ఆత్మబలిదానం ప్రాణ త్యాగ ఫలితమే
తెలంగాణలో బోనాల పండుగ ఎంత ఘనంగా నిర్వహిస్తారో అంతే పవిత్రతతో పార్టీ నడిపిస్తున్నాను ఆదేవిధంగా పొట్టిశ్రీరాములు తెలుగుయూనివర్సిటీ పెరు మార్చొద్దు అని అంతే పవిత్రంగా భావిస్తున్నాను
No comments:
Post a Comment