విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, అక్టోబర్ 29: దీపావళి పండుగను పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం బంజారాహిల్స్ ఎన్ బి టి నగర్ ప్రభుత్వ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో 300 మంది నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... విద్యార్థులకు చదువులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వంతుగా సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
No comments:
Post a Comment