అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎందుకీ రచ్చ,.....
- Nalgonda Cement Factory: వందల కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పాని నిర్ణయం జరిగిన ఒక పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది! నిరుద్యోగ సమస్యను కొంతైనా తగ్గించ వచ్చు. తమ పిల్లకు ఉద్యోగాలు వస్తాయి, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. నల్గొండలో అదానీ గ్రూప్ ఏర్పాటు చేసే సిమెంట్ కంపెనీపై వివాదం
- Nalgonda Cement Factory: ఉమ్మడి నల్గొం డ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట లో అదాని గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ప్రజాభిప్రాయం కూడా సేకరించిన అంబుజా సిమెంట్స్ వివాదాస్పదం అవుతోంది. నల్లొండ జిల్లా పచ్చని పోలాల మధ్య అదాని మంటలు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 1400కోట్ల ప్లాంట్ తమకొద్దని నిరసన చెబుతున్నారు.
బుధవారం రామన్నపేటలో ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగం, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ ఏర్పాటు కాకుండా చూస్తామని ఈ ప్రాంత రైతులకు మద్దతుగా వచ్చిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని అడ్డుకునేందుకు వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, రవీంద్ర కుమార్ లను హౌజ్ అరెస్ట్ చేశారు.
డ్రైపోర్ట్ స్థానంలో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణం
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదాని గ్రూప్ రామన్నపేట ప్రాంతంలో డ్రైపోర్టు నిర్మిస్తామని 2020లో భూసేకరణ చేసింది. కానీ, ఆ ప్రభుత్వ సమయంలో అడుగు ముందుకు పడలేదు. డ్రైపోర్ట్ నిర్మాణం అటకెక్కింది. కానీ, తాము సేకరించుకున్న భూమిని వినియోగించుకోవాలని కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది. అదాని చేతుల్లోకి వచ్చిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని నిర్ణయించుకుంది. కానీ, ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతంలో సిమెంటు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు సున్నపు రాయి నిల్వలు లేవు. కానీ, ఇక్కడ తాము 6 మిలియన్ మెట్రిక్ టన్నుల సిమెంటును ఉత్పత్తి చేస్తామని అంబుజా పేర్కొంటోంది. నెల రోజుల కిందటే ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి గ్రామపంచాయతీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రామన్నపేటను ఆనుకుని ప్రధాన రైల్వే లైన్ ఉండడం వల్ల గూడ్స్ రైళ్ళ ద్వారా ముడి సరుకు తెచ్చుకుని మిక్సింగ్ ద్వారా సిమెంటును ఉత్పతి చేస్తామని అదాని గ్రూప్ నమ్మబలుకుతోంది.
రూ.100 కోట్ల విరాళం అందుకేనా..?
మరో వైపు రాజకీయ పార్టీలూ, ప్రజా సంఘాలు కొత్త వాదనను తెరపైకి తెచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల అదాని రూ.100 కోట్ల విరాళం అందజేశారు. రామన్నపేట వద్ద పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూమిలో కనీసం 65 ఎకరాలు వాడుకుని సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే ఈ విరాళం ఇచ్చారన్న విమర్శలను ఈ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
రామన్నపేట, కొమ్మాయి గూడం ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న కాలుష్య కారక సిమెంటు ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని, ఈ ప్రాంత ప్రజలు, రైతులకు మద్దుతుగా పోరాటాలు చేస్తామని చెబుతున్నయి.
No comments:
Post a Comment