చిన్న పత్రికలకు అండగా ఉంటాం
అక్రిడిటేషన్ కార్డులు పెంచేందుకు కృషి
టియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ
హైదరాబాద్ :
చిన్న పత్రికలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని టియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ అన్నారు. శుక్రవారం యూనియన్ కార్యాలయంలో చిన్న పత్రికల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న పత్రికలకు అక్రిడిటేశన్ కార్డులు, అఫ్ గ్రేడ్ విషయంలో ఎదుర్కొంటున్న పలు అంశాలను దృష్టికి తేగా ఆయా సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ చైర్మన్,అక్రిడిటేశన్ మార్గనిర్దేశకాల ప్రత్యేక కమిటి చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.2018 నుంచి అఫ్ గ్రేడ్ పెండింగ్ ఉన్న విషయంతో పాటు అక్రిడిటేశన్ కార్డులను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఇళ్ళ స్థలాలు, హెల్త్ కార్డుల విషయంలోనూ చిన్న పత్రికలకు సముచిత స్థానం ఉంటుందన్నారు.టియూడబ్ల్యూజే- ఐజేయూకు అనుబంధంగా ఉన్న తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ కు ఆయా జిల్లాల్లోని మీడియా అక్రిడిటేశన్ కమిటీల్లోనూ సభ్యులుగా ఉంటారన్నారు. పదేళ్లుగా చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న ఆయా సమస్యల పట్ల తమకు అవగాహాన ఉందని, పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ సందర్బంగా నల్గొండ జిల్లా చిన్న పత్రికల సంఘం నేతలను అభినందించారు. ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగి,యూనియన్ నాయకులు బొమ్మపాల వెంకటయ్య, షేక్ అహ్మద్ అలీ, కొమర్రాజు శ్రీనివాసులు, మక్సుద్ అహ్మద్, కోటగిరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment