విటమిన్ డి అందాలంటే ఇవి తినండి.
Vitamin D :బాడీకి సహజంగా విటమిన్ డి ఎండ నుంచి వస్తుంది. కానీ, వీటితో పాటు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల విటమిన్ డి అందుతుంది.
బాడీలో విటమిన్ డి లోపం కారణంగా చాలా సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం ప్రపంచ జనాభాలో 13 శాతం వరకూ ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే అసలు విటమిన్ డి ఎందుకు అవసరం. రోజు ఎంత తినాలో ఎలా సమస్యని అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.
విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్ ఇది కాల్షియం శోషణకి చాలా ముఖ్యమైనది. విటమిన్ డి ఆరోగ్య కణాల పెరుగుదలకు, ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. దీని వల్ల ఎముకల బలంగా మారతాయి. పిల్లల్లో రికెట్స్ వ్యాధిని రాకుండా చేస్తుంది. వయసు ఎక్కువగా ఉన్నవారిలో బోలు ఎముకల సమస్య నుంచి కాపాడుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెబుతోంది.
నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ 600-800 IU సరిపోతుందని చెబుతోంది. రోజుకి 4000 IU విటమిన్ డి తీసుకోవడం చాలా మందికి అవసరమని చెబుతున్నారు. అయితే, కొంతమందికి రక్తస్థాయిలను పెంచడానికి తాత్కాలికంగా ఎక్కువ మోతాదులో అవసరం కావొచ్చు. నాన్ టాక్సిక్ అయినప్పటికీ, 4000 IU యొక్క దీర్ఘకాలిక మోతాదులు ఉత్తమంగా నివారించబడతాయి.
ఎండకి ఎందుకు ఉండాలంటే..
సూర్యరశ్మిని విటమిన్ డి అంటారు. సూర్యుని నుండి లభించే ఉత్తమ పోషకాల్లో ఒకటి. ఎండలో మనం ఉన్నప్పుడు విటమిన్ డి లభిస్తుంది. సూర్యుని నుండి లభించే ఎండ మనం ఆహారం ద్వారా తీసుకున్నదానికంటే రెండు రెట్లు ఎక్కువ.
అయినా, ముదురు రంగు ఉన్నవారు మెలనిన్ ఉత్పత్తి పెరగడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి తగ్గుతుంది. వృద్ధాప్యం తర్వాత చర్మంలో విటమిన్ డి సహజంగా తగ్గుతుంది. ఎండ ఉన్న ప్రదేశాల్లో ఉన్నవారికి విటమిన్ డి లోపం ఉండదు.
రోజువారీ విటమిన్ డి కోసం కేవలం 8 నుంచి 15 నిమిషాల వరకూ ఎండలో ఉంటే చాలాు. ముదురు రంగు ఉన్నవారికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే, 15 నిమిషాల కంటే ఎక్కువసమయం ఉండొద్దు. వీటితో పాటు కొన్ని ఫుడ్స్ తినాలి. అవేంటో చూద్దాం.
ఫ్యాటీ ఫిష్..
సీ ఫుడ్స్‌లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. చేపల రకాన్ని బట్టి విటమిన్ డి కంటెంట్ మారుతుంది.
అందులో
ట్యూనా చేప
మాకేరెల్
గుల్లలు
రొమ్యలు
సార్డినెస్
అంకోవిస్
వీటన్నింటిలో ఒమేగా 3 ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.
పుట్టగొడుగులు..
పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అడవీ ప్రాంతంలో పెరిగిన పుట్టగొడుగుల్లో విటమిన్ డి అధిక స్థాయిలో ఉంటుంది. విషపూరిత కారకాలను నివారించడానికి నేచురల్ పుట్టగొడుగులని తినడం మంచిది.
గుడ్లు..
సహజంగానే విటమిన్ డి లభించే ఫుడ్స్‌లో గుడ్డు సొన కూడా ఒకటి కోడి జాతిని బట్టి గుడ్లలో విటమిన్ డి పరిమాణం మారుతుంది. కాబట్టి, కచ్చితంగా రోజుకి ఓ గుడ్డు తినడం మంచిది.
వీటితో పాటు.. ఆవుపాలు
సోయా పాలు
బాదం పాలు
పత్తి పాలు వంటి ప్లాంట్ బేస్డ్ మిల్క్ ప్రోడక్ట్స్
నారింజరసం
ధాన్యాలు
పెరుగు
విటమిన డి టోఫు వంటి ఫుడ్స్‌లోనూ ఉంటుంది.
అయితే, ఇవన్నీ సహజ సిద్దమైవి తీసుకోవడం మంచిది.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
No comments:
Post a Comment