ఐఏఎస్ అమోయ్ వెనుకున్న బడా వ్యక్తి ఎవరు ?
:హైదరాబాద్ శివారులో వేయి కోట్లకుపైగా విలువైన భూదాన్ భూముల్ని ప్రైవేటుపరంగా చేసిన వ్యవహారంలో ఐఏఏస్ అమోయ్ కుమార్ ను వరుసగా మూడు రోజుల పాటీ ఈడీ విచారించింది. ఏదో లింక్ దొరకబట్టే ఆయనను వదిలి పెట్టకుండా ప్రశ్నిస్తోందని గుసగసలు వినిపిస్తున్నాయి. ఆ లింక్ ఏమిటన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.
అమోయ్ కుమార్ .. భూదాన్ భూముల్ని కొంత మందికి వారసత్వ భూమి అని రాసిచ్చేశారు. కింది స్థాయి నుంచి అనుకూలంగా దానికి నివేదికలు వచ్చేలా చూసుకున్నారు. చివరికి ఆ భూములు కట్టబెట్టిన వాళ్లు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్ముకున్నారు. మొత్తంగా రెండు భారీ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. అందులో అమోయ్ కుమార్ కు ఏమైనా అందాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఐఏఎస్ అధికారులు తమ సొంత లాభం కోసం ఇలా అడ్డగోలు భూలావాదేవీలు చేయరు. ఖచ్చితంగా రాజకీయ నేతల ప్రమేయం ఉంటేనే చేస్తారు. ఆ విధంగా చూస్తే అమేయకుమార్ వెనుక ఎవరు ఉన్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఈ విషయంలో ఈడీ చాలా గోప్యంగా విచారణ జరుపుతోందని .. త్వరలో కీలక వ్యక్తుల గురించి బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులే అమేయ్ కుమార్‌తో ఈ తరహా స్కామ్ చేయించారనికాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా ప్రచారం చేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
No comments:
Post a Comment