Wednesday, 30 October 2024

టీటీడీ బోర్డు ఛైర్మెన్ గా నాయుడు

 టీటీడీ బోర్డు ఛైర్మెన్ గా TV-5 MD *BR నాయుడు* నియామకం 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి.. 


Kukatpally : వాస్తవాలను కప్పేసిన వాసవి నిర్మాణ సంస్థ.

 

Kukatpally : వాస్తవాలను కప్పేసిన వాసవి నిర్మాణ సంస్థ...

ఎవరు ఏమనుకున్నా మాకేం సిగ్గు అన్న చందంగా తయారైంద.

         కూకట్​పల్లి: ఎవరు ఏమనుకున్నా మాకేం సిగ్గు అన్న చందంగా తయారైంది బడా నిర్మాణ సంస్థల తీరు. జల కలతో కళకళలాడిన జలాశయాలు, తాగు, సాగు నీరును అందించిన వందల ఎకరాల చెరువులు రియల్​ ఎస్టేట్​ మాఫియా చేతిలో చిక్కుకుని కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. కూకట్​పల్లి నియోజకవర్గం పరిధికి చెందిన గొలుసు కట్టు చెరువులలోని రెండు చెరువు బంధాన్ని తెంపి యధేచ్చగా రియల్​ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది బడా నిర్మాణ సంస్థ అయిన వాసవి. కూకట్​పల్లి మండల పరిధిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలుపుతూ ఉన్న నాలాను మాయం చేశారు. మైసమ్మ చెరువు ఎఫ్​టిఎల్​, బఫర్​ జోన్​లలో యధేచ్చగా నిర్మాణాలను చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా వాసవి గ్రూప్స్​కు జీహెచ్ఎంసీ నుంచి పొందిన అనుమతి పత్రంలో ఉన్న సర్వే నంబర్​లు ఇప్పటికి వ్యవసాయ భూమిగానే ధరణి పోర్టల్​లో దర్శనమిస్తున్నాయి. వ్యవసాయం నుంచి వ్యవసాయేతర భూమిగా బదిలి చేసుకోకుండానే గత పాలకులు 3 సెల్లార్​లు, గ్రౌండ్​ ఫ్లోర్​, 29 అంతస్థుల 9 బ్లాక్​లతో భారి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. పూర్తిగా వాటర్​ బాడీలో వాసవి నిర్మాణ సంస్థ తమ టవర్​లను నిర్మాణం చేపడుతుందని ఇప్పటికే పలువురు జీహెచ్ఎంసీ తో పాటు, హైడ్రా కమిషనర్​ రంగనాథ్​కు ఫిర్యాదు చేశారు. చెరువును మింగేస్తున్న వాసవి నిర్మాణ సంస్థకే చెరువు సుందరీకరణ పనులను గత పాలకులు అప్పగించడం గమనార్హం.

దొంగకు తాళం చెవి..

మైసమ్మ చెరువు, ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లలో నిర్మాణాలు చేపడుతున్న బడా నిర్మాణ సంస్థ అయిన వాసవి గ్రూప్​ నిర్మాణ సంస్థకు జీహెచ్ఎంసీ అధికారులు మైసమ్మ చెరువు సుందరీకరణ పనులను కార్పోరేట్​ సోషల్​ రెస్పాన్స్​బిలిటీ (సిఎస్​ఆర్)​ కింద అప్పగించారు. రెండు ఏండ్ల పాటు చెరువు సుందరీకరణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టే విధంగా జీహెచ్ఎంసీ, వాసవి గ్రూప్​ సంస్థల మధ్య 2024, జులై 11వ తేదిన ఎంవోయూ జరిగింది. చెరువు సుందరీకరణ, నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే గడువు పొడగించబడుతుందన్న షరతులతో కూడిన ఒప్పందం కుదిరింది.

లేక్​ వీవ్​ పేరుతో విక్రయాలు..

చెరువు సుందరీకరణ పేరుతో కొంత మొత్తం ఖర్చు చేసి చెరువును సుందరీకరించేందుకు ముందుకు వచ్చిన వాసవి నిర్మాణ సంస్థ తమ ఫ్లాట్​లను లేక్ వీవ్​ పేరుతో విక్రయాలు చేపడుతుంది. చెరువులను చెరబడుతున్న బడా నిర్మాణ సంస్థలే మిగిలి ఉన్న చెరువును సీఎస్​ఆర్​ కింద సుందరీకరంచి పక్కనే చెరువు ఉంది అంటు బ్రోచర్​లను ప్రింట్​ చేసుకుని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా నిర్వహించుకునేందుకు జీహెచ్ఎంసీ అండగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.

గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూమిని వేలం వేసిన గత పాలకులు..

మూసాపేట్​ గ్రామం పరిధిలోని మైసమ్మ చెరువు, కాముని చెరువు మధ్యలో కాముని చెరువు అలుగుకు ఆనుకుని సర్వేనెంబర్​ 75 లో ఉన్న 1.27 ఎకరాల ప్రభుత్వ భూమి గత బీఆర్​ఎస్​ హయాంలో వేలం వేశారు. సదరు భూమినిరూ. 75 వేలకు గజం లెక్కన వాసవి నిర్మాణ సంస్థ చేజిక్కించుకుంది. పక్కనే ఉన్న ప్రైవేటు సర్వే నంబర్​లలో వాసవి నిర్మాణ సంస్థ తమ వెంచర్​ను నిర్మాణ పనులను చేపడుతుంది. ఇదిలా ఉండగా వాసవి నిర్మాణ సంస్థ చేపడుతున్న ప్రైవేటు సర్వే నెంబర్​లో ఇప్పటికి ధరణిలో వ్యవసాయ భూమిగానే దర్శనమిస్తుంది. భూమి బదిలి కాకముందే నిర్మాణ పనులు చక చక కొనసాగుతున్నాయంటే అధికారులు ఏ రేంజిలో వారికి వంత పాడుతున్నారో ఇట్టే అర్థం అవుతుంది.

జిల్లా ప్రజలందరికీ పోలీసు శాఖ తరుపున దీపావళి పండుగ శుభాకాంక్షలు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్*

 జిల్లా ప్రజలందరికీ పోలీసు శాఖ తరుపున దీపావళి పండుగ  శుభాకాంక్షలు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్* 



 *దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలి జిల్లా ఎస్పి* 


 ఈ దీపావళి పండుగ  ప్రతి ఒక్కరి జీవితాల్లో అష్టఐశ్వర్యాలు, సుఖసంతోషాలను, సరికొత్త వెలుగులతో ప్రకాశించాలని ఆకాంక్షిస్తూ, జిల్లా ప్రజలందరికీ పోలీసు శాఖ తరుపున దీపావళి పండుగ శుభాకాంక్షలు జిల్లా ఎస్పి గారు తెలియజేశారు.


దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పండుగను సురక్షితంగా నిర్వహించుకోవాలని బాణాసంచాలు కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ముఖ్యంగా చిన్నారులు పెద్దల సమక్షంలో బాణాసంచాలు కాల్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

 రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు  తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*




“చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” అని ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు.. జ్ఞానదీపం వెలగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి కోరుకున్నారు. 

ఈ దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగురేఖలను ఇనుమడింపచేయాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని వెలుగుల పండగను సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


మీడియా అకాడమీ చైర్మన్ ను* *కలిసిన సమాచార శాఖ* *కమిషనర్*

 *మీడియా అకాడమీ చైర్మన్ ను* *కలిసిన సమాచార శాఖ* *కమిషనర్*


-neelagiri shankaravam                                                 -----------------------------

తెలంగాణ రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.హరీష్ గారు బుధవారం నాడు మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గారిని బి.ఆర్.కె భవన్ లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త కమిషనర్ కు చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై వారు చర్చించారు.

Tuesday, 29 October 2024

దీపావళి వివరణ

 దీపావళి వివరణ 


1)బొమ్మలు పెట్టుకునే వారు 

30/10/2024 బుధవారం రోజు 

సాయంత్రం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు 

02/10/2024 శనివారం తీసుకోవాలి 


2)తేది 31/10/2024 గురువారం 

రోజు ఉదయం 4.30నుండి 6.30వరకు  8.30నుండి 10వరకు 

మళ్ళీ 11నుండి 2.30 వరకు 

   పై ప్రకారం హరతులు తీసుకోవాలి 

  దూర ప్రాంతీయులు తప్పనిసరై 

పగలు 3.30నుండి 6.30వరకు 

తీసుకోవచ్చు 


3) ధనలక్ష్మి పూజలు చేసుకునేవారు పగలు 2.30నుండి 

రాత్రి 11.45వరకు చేసుకోవచ్చు 


4)కేదారి నోములు ఆగిపోయినవారు 01/11/2024

శుక్రవారం -నుండి 06/11/2024బుధవారం 

సాయంత్రం 6.30వరకు చేసుకోవచ్చు 


5)కొత్తగా నోము పట్టుకోవచ్చు పంచుకోవచ్చు కాని 

01/11/2024శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం 5.గం వరకే ఆచరించుకోవాలి 

6)ఎప్పుడు చేసుకునే పాతవాళ్ళు 

యాదాప్రకారం 15/11/2024పౌర్ణమి శుక్రవారం వరకు చేస్కోవచ్చు 

 

7)దీపావళి ఓడి బియ్యం పోసుకునేవారు 2/11శనివారం =

3/11 ఆదివారం మాత్రమే పోసుకోవాలి తదుపరి 06/11బుధవారం సాయంత్రం 5నుండి  19/11మంగళవారం వరకు విశాఖలు ఉన్నందున పనికిరాదు కావున 

తేది 20/11/2024బుధవారం నుండి చూసుకొని పోసుకోగలరు 


(తిగుళ్ల )దీక్షితుల హనుమంత్ శర్మ 

      (పురోహితులు 🎇🎇🎇

శుభమస్తు ✋🏻

సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. హరీష్

 సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన

 ఎస్. హరీష్


నల్గొండ జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

  నల్గొండ జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి,






రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.


       మంగళవారం ఉదయాదిత్య భవన్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ ,కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


      శిక్షణ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు అన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని, శిక్షణలో నేర్చుకున్న విషయాలను మండల స్థాయిలో ఎన్యుమరేటర్లకు  తెలియజేయాలని చెప్పారు. జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్వే పారదర్శకంగా ఉండాలని, సర్వే విషయాలను గోప్యంగా ఉంచాలని, ఎలాంటి తప్పులు లేకుండా సర్వే పక్కగా చేయాలని, ఏ ఒక్క విషయం తప్పిపోకుండా అన్ని వివరాలు సేకరించాలని తెలిపారు. వివరాల సేకరణ అనంతరం డేటా ఎంట్రీ సైతం పక్కాగా నిర్వహించాలని చెప్పారు. సర్వే సందర్భంగా అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని తెలిపారు.


     అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్  నారాయణ్ అమిత్ ,సిపిఓ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, ఇతర అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .

నకిలీ పత్రాలతో స్థలం కబ్జా కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్

 నకిలీ పత్రాలతో స్థలం కబ్జా కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్

           : కుత్బుల్లాపూర్ పరిధిలో ఓ స్థలం కబ్జా కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. స్థల యజమాని మృతి చెందినట్లు నకిలీ పత్రాలు సృష్టించి 200 గజాల స్థలాన్ని కొట్టేశారు.

నకిలీ పత్రాలతో స్థలం కబ్జా కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్

                నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్స్ లో పద్మజారెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. గతంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన జ్యోతి... ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తో స్థలాన్ని పద్మజారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ జ్యోతి సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పద్మజారెడ్డితో పాటు సబ్ రిజిస్ట్రార్ జ్యోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూకబ్జా కేసులో ఇటీవల పద్మజారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు రిమాండ్‌కు విధించారు. తాజాగా ఈ కేసులో...ప్రస్తుతం సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బీఆర్ఎస్ మహిళా నేత కీలక సూత్రధారి

                    కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్ నగర్ లోని ఓ ఖాళీ స్థలాన్ని కొట్టేయాలని ప్లాన్ వేసిన కొందరు, ఆ స్థలం యజమాని మరణించినట్లు ఫేక్ సర్టిఫికెట్ సృష్టించారు. అప్పుడు కుత్బుల్లాపూర్ సబ్‌ రిజిస్ట్రార్‌ పనిచేస్తు్న్న జ్యోతి సాయంతో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. ఉప్పుగూడ హనుమాన్‌నగర్‌కు చెందిన లెండ్యాల సురేష్ కు సుభాష్‌నగర్‌ ప్రాంతంలో 200 గజాల ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంపై సుభాష్‌నగర్‌కు చెందిన బీఆర్ఎస్ మహిళా నేత పద్మజారెడ్డి కన్నుపడింది. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు హయత్‌నగర్‌కు చెందిన కరుణాకర్‌ ను సంప్రదించి, అతడికి రూ.3.50 లక్షలు చెల్లించి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఈ స్థలం యజమాని 1992లోనే మృతి చెందినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.

రవిశంకర్‌ అనే వ్యక్తిని లెండ్యాల సురేష్ కు కుమారుడిగా సృష్టించారు. ఆధార్‌ కేంద్రం ఆపరేటర్‌గా నరేంద్ర సాయంతో హరీశ్‌ అనే వ్యక్తిని రవిశంకర్‌గా చూపించి ఫేక్ పాన్‌కార్డు తయారు చేశారు. ఈ పాన్ కార్డు సాయంతో ఆధార్‌లో మార్పులు చేశారు. 2023 ఫిబ్రవరిలో కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతి సాయంతో...బీఆర్ఎస్ నేత పద్మజారెడ్డి సోదరికి ఈ స్థలాన్ని రవిశంకర్‌ అమ్మినట్లు రిజిస్ట్రేషన్‌ చేయించారు. తన స్థలం కబ్జా చేశారని యజమాని లెండ్యాల సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూసింది. నకిలీపత్రాలు, ల్యాప్‌టాప్‌లు, స్కానర్‌ ఇతర పరికరాలను సీజ్ చేశారు.

సబ్ రిజిస్ట్రార్ అరెస్టు

                    ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన బీఆర్ఎస్ మహిళా నేత పద్మజారెడ్డి సహా మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో సబ్ రిజిస్ట్రార్ జ్యోతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు మంగళవారం సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతిని అరెస్టు చేసి మేడ్చల్‌ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

సబ్ రిజిస్టర్ జ్యోతిని అరెస్టు

 

సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ జ్యోతి అరెస్టు


 *సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ జ్యోతిని అరెస్టు చేసిన జీడిమెట్ల పోలీసులు*

మేడ్చల్ కోర్టులో హాజరపరిచిన పోలీసులు

*సబ్ రిజిస్ట్రార్ జ్యోతి కి 14 రోజులు పాటు రిమాండ్ విధించిన మేడ్చల్ కోర్ట్*

సుభాష్ నగర్ లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసిన పద్మాజా రెడ్డి

అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ గా పనిచేసిన జ్యోతి

నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్కు పద్మజా రెడ్డికి సహకరించిన జ్యోతి

ఇటీవల (టిఆర్ఎస్ లీడర్) పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పోలీసులు 

ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్టార్ జ్యోతి అరెస్ట్

పగిడిమర్రి – కుదావన్ పూర్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన రోడ్లు భవనాలు, మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారు.

 నల్గొండ జిల్లా పగిడిమర్రి గ్రామంలో 38 కోట్ల రూపాయలతో.. శంకుస్థాపన మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.







సోమన్నవాగు హైలెవల్ బ్రిడ్జ్ 

కొత్తపల్లి – పగిడిమర్రి రోడ్

పగిడిమర్రి – మదనాపురం రోడ్

పగిడిమర్రి – కుదావన్ పూర్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన రోడ్లు భవనాలు, మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారు.

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

 విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి








హైదరాబాద్, అక్టోబర్ 29:   దీపావళి పండుగను పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం బంజారాహిల్స్ ఎన్ బి టి నగర్ ప్రభుత్వ హై స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో 300 మంది నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... విద్యార్థులకు చదువులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వంతుగా సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 

మెగా హెల్త్ క్యాంప్ లో క్యాన్సరు, ఈసీజీ, బిపి ,షుగర్, కంటి మరియు పంటి పరీక్షలు

 మెగా హెల్త్ క్యాంప్ లో క్యాన్సరు, ఈసీజీ, బిపి ,షుగర్, కంటి మరియు పంటి పరీక్షలు 

                   neelagiri  shankaravam :ఆర్యవైశ్య సంఘం కొత్తపేట, లైన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట మరియు మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి మెగా హెల్త్ క్యాంప్ లో క్యాన్సరు, ఈసీజీ, బిపి ,షుగర్, కంటి మరియు పంటి పరీక్ష లో 250 మంది పైన పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపుకు అతిథులుగా బుగ్గారపు దయానంద్ గారు ఎమ్మెల్సీ ,హిందూ బంధువు టైగర్ చీకోటి ప్రవీణ్ గారు, సామాజిక సేవా తత్పరుమెగా హెల్త్ క్యాంప్ లో క్యాన్సరు, ఈసీజీ, బిపి ,షుగర్, కంటి మరియు పంటి పరీక్ష  మొగుళ్ళపల్లి ఉపేందర్ గారు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు పవన్ కుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు వజీర్ ప్రకాష్ గౌడ్ గారు, మా చీఫ్ అడ్వైజర్స్ అయినా ఎల్వీ కుమార్ గారు, మంచుకొండ సురేందర్ గారు,  అడ్వైజర్ బిల్లా కంటి రాజుగారు భారతీయ జనతా పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ బుక్క రమేష్ గారు ,వి బి జి మడిపడిగే రాజు గారు సోదరీమణులు సరాఫ్ తులసి గారు జయశ్రీ గారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ సంఘ అభివృద్ధికి పాల్పడుతున్నటువంటి అధ్యక్షులు మాడూరి వాసు గారు ,జనరల్ సెక్రెటరీ సత్తయ్య గారు, ఈ యొక్క ప్రాజెక్టు చైర్మన్ రేణిగుంట శ్రీనివాస్ గారు, ట్రెజరర్ ప్రభాకర్ గారు, జాయింట్ సెక్రెటరీ అరవ పెళ్లి శ్రీనివాస్ గారు ,సంఘ సభ్యులు బుగ్గారపు వెంకటేశ్వర్ గారు, చంద్రకాంత్ అడ్వకేట్

గారు ,సోమ అనంత రాములు గారు ,అమర్నాథ్ గారు, వీర లింగం గారు, నాగభూషణం గారు ,మిగతా సంఘ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని వాటికి మా చేయూతనిస్తామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి భోజన సదుపాయానికి చేయూతనిచ్చినటువంటి ఎల్ వి కుమార్ గారికి మరియు అతిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట జై వాసవి జై జై వాసవి

బట్టబయలైన_రహస్యం.. క్యాన్సర్_ఒక_వ్యాధి_కాదు..... ఒక_విటమిన్_లోపం...... కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందితా డిసౌజా చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్ అనే పదమే ఒక_పెద్ద_అబద్ధం. క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎలా బయపెడుతున్నారో అందరికి తెలిసిందే. ఈ భూతం వెనుక దాగున్న నిజాన్ని బట్టబయలు చేయడమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.. మిమ్మల్ని అభ్యర్దించే ఒక విషయం ఏమిటంటే.... ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి. ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు. కాని ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి ఓ_నలుగురినైనా_కాపాడితే_అంతే_చాలు.... క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెబుతారు. కానీ అది శుద్ధ అబద్ధం. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు... ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలా మంది అంటుంటారు. ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వస్తుందని.... అందరిని భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి అర్ధం_కావాలనే_ఈ_పోస్ట్ ఉద్దేశ్యం.... వరల్డ్_వితౌట్_క్యాన్సర్- World without CANCER అనే ఒక బుక్ ఉందని, దాన్ని అన్ని భాషలలో తర్జుమా చెయ్యకుండా ఎందుకు, ఎవరు అడ్డు పడుతున్నారో చూద్దాం. క్యాన్సర్ అనేది B17 లోపమే గాని జబ్బు కాదు. 👌👍ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు. మీకు గుర్తుందా? గతంలో అనే అంతుపట్టని వ్యాధితో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి స్కర్వీ (scurvy) అని పేరు పెట్టారు. విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు. అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా... అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు హాస్పిటల్స్ వాళ్ళు దోచుకున్నారు అది కేవలం విటమిన్ C వల్ల వచ్చిన రోగం. క్యాన్సర్_కూడా_ఇలాంటిదే...అంటే విటమిన్ లోపమే క్యాన్సర్_అని_అర్ధం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీ లోనే ఉంటాయని చాల మంది డాక్టర్స్ కూడా చెపుతారు. అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది? మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన. మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్ లో బ్రతుకుతున్న జీవితాల వల్ల, క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి... దాన్ని బిజినెస్ చేసారు కొంతమంది డాక్టర్స్. మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని కొన్ని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఇప్పటిది కాదు... వరల్డ్ వార్ 2 తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా_చూసుకోవడమట, నివారణట. అసలు రాకుండా చెయ్యడం కాదు, అలా చేస్తే హాస్పిటల్స్ కి డబ్బులు రావు కదా. మీకు గాని.. మీకు తెలిసిన వాళ్లకు గాని క్యాన్సర్ అని లోపం ఉంటె_కంగారు_పడాల్సిన_అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే... ఈ రోజుల్లో ఎవరైనా స్కర్వీ (scurvy) వ్యాధితో చనిపోతున్నారా? లేదు.... ఎందుకంటే దానికి కారణం విటమిన్ C లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిద్దికోవడం వల్ల. మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఆ_లోపాన్ని_కూడా_B17_తో_పోగొట్టుకోవచ్చు. #క్యాన్సర్_రాకుండా_చేసుకోవడం_చాలసులువు!! ★15 నుండి 20 నేరెడు కాయలు.. ★ క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్. ★ ఎండు ద్రాక్ష. ★ బాదాం పప్పు. ★ బ్లాక్ మల్బెర్రి, బ్లూ మల్బెర్రి, కోరిందకాయ స్ట్రాబెర్రి. ★ నువ్వులు, అవిసె గింజలు. ★ ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు. ★ బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ ★ (పియర్ ఆపిల్) ★ నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి, ★ జీడీపప్పు,పిస్తా....... పైన చెప్పినవన్నీ అధిక_శాతంలో_విటమిన్_B17_కలిగిఉన్నవి. ఈ లోపాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి. గోధుమ_మొలకలు (Wheat Sprouts ) ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు. రోజూ_ఒక_తులసి_ఆకు_తింటే_జీవితంలో ఎలాంటి క్యాన్సర్ లు దరిచేరవు.. Wheat Sprouts bud is a Rich Source of Liquid Oxygen and the strongest anti-cancer matter in the name of "laetrile", and this matter is present in the fruit stone of ఆపిల్ (ఆపిల్ గింజలు). Laetrile is the extract form of vitamin B17 (Amygdalin) అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా, నిషేధించబడిన - LAETRILE- ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లీమెంట్ చేస్తుంది (ఈ మందుని మెక్సికో లో తయారుచేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు) Dr. హారొల్ద్ W.మన్నెర్ తన -డెత్ అఫ్ క్యాన్సర్- బుక్ లో క్యాన్సర్ ని -laetrile- ట్రీట్మెంట్ తో 90 శాతం వరకు నయం చేసారని వివరించారు. క్యాన్సర్_రావడానికి_ముఖ్యకారణం_ఏంటో తెలిస్తే అవాక్కవుతారు అవేంటంటే 1) #వాష్_చెయ్యడానికి_వాడే_రసాయనాలు. 2) వాషబేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు. 3) టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే రసాయనాలు పీలచడం. మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు. కానీ మీరు పీలుస్తున్నారంటే అది ఒకరకంగా తినడం లాంటిదే. మీరు మీ ప్లేట్స్ ని లిక్విడ్స్ తోనే వాష్ చేస్తున్నారు కదా? అలా ఎంత క్లీన్ చేసిన సరే.. ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్ లో అలానే ఉంటాయి. ఆ ప్లేట్ లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి. (పూర్వ కాలంలో ఆకులలో తినేది అందుకే కదా) దీనికి_విరుగుడు_ఏంటో_తెలుసా ??? మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు. మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి. దయచేసి ఈ పోస్టుని అందరితో షేర్ చేయండి..!! ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి...! క్యాన్సర్_బారిన_పడకుండా_అందరిని_కాపాడండి.

బట్టబయలైన_రహస్యం..

క్యాన్సర్_ఒక_వ్యాధి_కాదు.....

ఒక_విటమిన్_లోపం......

మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి.


దయచేసి ఈ పోస్టుని అందరితో షేర్ చేయండి..!! 

ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా 

మీ శత్రువులతో కూడా షేర్ చేయండి...! 


క్యాన్సర్_బారిన_పడకుండా_అందరిని_కాపాడండి.




కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందితా డిసౌజా చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్ అనే పదమే ఒక_పెద్ద_అబద్ధం. క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎలా బయపెడుతున్నారో అందరికి తెలిసిందే. ఈ భూతం వెనుక దాగున్న నిజాన్ని బట్టబయలు చేయడమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం..


మిమ్మల్ని అభ్యర్దించే ఒక విషయం ఏమిటంటే.... ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి. ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు. కాని ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి 

ఓ_నలుగురినైనా_కాపాడితే_అంతే_చాలు....


క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెబుతారు. కానీ అది శుద్ధ అబద్ధం. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు... ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలా మంది అంటుంటారు.

   ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వస్తుందని.... అందరిని భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి


అర్ధం_కావాలనే_ఈ_పోస్ట్ ఉద్దేశ్యం....


వరల్డ్_వితౌట్_క్యాన్సర్- World without CANCER అనే ఒక బుక్ ఉందని, దాన్ని అన్ని భాషలలో తర్జుమా చెయ్యకుండా ఎందుకు, ఎవరు అడ్డు పడుతున్నారో చూద్దాం.

క్యాన్సర్ అనేది B17 లోపమే గాని జబ్బు కాదు.

👌👍ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు.


మీకు గుర్తుందా? గతంలో అనే అంతుపట్టని వ్యాధితో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి స్కర్వీ (scurvy) అని పేరు పెట్టారు. విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు.


 అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా... అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు హాస్పిటల్స్ వాళ్ళు దోచుకున్నారు


 అది కేవలం విటమిన్ C వల్ల వచ్చిన రోగం.

క్యాన్సర్_కూడా_ఇలాంటిదే...అంటే విటమిన్ లోపమే క్యాన్సర్_అని_అర్ధం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీ లోనే ఉంటాయని చాల మంది డాక్టర్స్ కూడా చెపుతారు. అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది? 


మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన.


మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్ లో బ్రతుకుతున్న జీవితాల వల్ల, క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి... దాన్ని బిజినెస్ చేసారు కొంతమంది డాక్టర్స్.

మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని కొన్ని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఇప్పటిది కాదు... వరల్డ్ వార్ 2 తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా_చూసుకోవడమట, నివారణట. అసలు రాకుండా చెయ్యడం కాదు, అలా చేస్తే హాస్పిటల్స్ కి డబ్బులు రావు కదా.


   మీకు గాని.. మీకు తెలిసిన వాళ్లకు గాని క్యాన్సర్ అని లోపం

ఉంటె_కంగారు_పడాల్సిన_అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే...


   ఈ రోజుల్లో ఎవరైనా స్కర్వీ (scurvy) వ్యాధితో చనిపోతున్నారా? లేదు.... ఎందుకంటే దానికి కారణం విటమిన్ C లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిద్దికోవడం వల్ల.

   మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం.  ఆ_లోపాన్ని_కూడా_B17_తో_పోగొట్టుకోవచ్చు.


#క్యాన్సర్_రాకుండా_చేసుకోవడం_చాలసులువు!!


★15 నుండి 20 నేరెడు కాయలు..

★ క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్.

★ ఎండు ద్రాక్ష.

★ బాదాం పప్పు.

★ బ్లాక్ మల్బెర్రి, బ్లూ మల్బెర్రి, కోరిందకాయ స్ట్రాబెర్రి.

★ నువ్వులు, అవిసె గింజలు. 

★ ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు.

★ బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ ★ (పియర్ ఆపిల్)

★ నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి, 

★ జీడీపప్పు,పిస్తా.......      పైన చెప్పినవన్నీ 


అధిక_శాతంలో_విటమిన్_B17_కలిగిఉన్నవి.


ఈ లోపాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి.


గోధుమ_మొలకలు (Wheat Sprouts ) 


ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు.


రోజూ_ఒక_తులసి_ఆకు_తింటే_జీవితంలో ఎలాంటి క్యాన్సర్ లు దరిచేరవు..


Wheat Sprouts bud is a Rich Source of Liquid Oxygen and the strongest anti-cancer matter in the name of "laetrile", and this matter is present in the fruit stone of ఆపిల్ (ఆపిల్ గింజలు). Laetrile is the extract form of vitamin B17 (Amygdalin)


అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా, నిషేధించబడిన -  LAETRILE- ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లీమెంట్ చేస్తుంది (ఈ మందుని మెక్సికో లో తయారుచేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు)

Dr. హారొల్ద్ W.మన్నెర్ తన -డెత్ అఫ్ క్యాన్సర్- బుక్ లో క్యాన్సర్ ని -laetrile- ట్రీట్మెంట్ తో 90 శాతం వరకు నయం చేసారని వివరించారు.


క్యాన్సర్_రావడానికి_ముఖ్యకారణం_ఏంటో తెలిస్తే అవాక్కవుతారు అవేంటంటే

1) #వాష్_చెయ్యడానికి_వాడే_రసాయనాలు.

2) వాషబేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు.

3) టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే 

రసాయనాలు పీలచడం.


మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు. కానీ మీరు పీలుస్తున్నారంటే అది ఒకరకంగా తినడం లాంటిదే. మీరు మీ ప్లేట్స్ ని లిక్విడ్స్ తోనే వాష్ చేస్తున్నారు కదా? అలా ఎంత క్లీన్ చేసిన సరే.. ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్ లో అలానే ఉంటాయి. ఆ ప్లేట్ లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి. (పూర్వ కాలంలో ఆకులలో తినేది అందుకే కదా)


దీనికి_విరుగుడు_ఏంటో_తెలుసా ???

మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు.


మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి.


దయచేసి ఈ పోస్టుని అందరితో షేర్ చేయండి..!! 

ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా 

మీ శత్రువులతో కూడా షేర్ చేయండి...! 


క్యాన్సర్_బారిన_పడకుండా_అందరిని_కాపాడండి.


కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందితా డిసౌజా చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్ అనే పదమే ఒక_పెద్ద_అబద్ధం. క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎలా బయపెడుతున్నారో అందరికి తెలిసిందే. ఈ భూతం వెనుక దాగున్న నిజాన్ని బట్టబయలు చేయడమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం..


మిమ్మల్ని అభ్యర్దించే ఒక విషయం ఏమిటంటే.... ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి. ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు. కాని ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి 

ఓ_నలుగురినైనా_కాపాడితే_అంతే_చాలు....


క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెబుతారు. కానీ అది శుద్ధ అబద్ధం. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు... ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలా మంది అంటుంటారు.

   ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వస్తుందని.... అందరిని భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి


అర్ధం_కావాలనే_ఈ_పోస్ట్ ఉద్దేశ్యం....


వరల్డ్_వితౌట్_క్యాన్సర్- World without CANCER అనే ఒక బుక్ ఉందని, దాన్ని అన్ని భాషలలో తర్జుమా చెయ్యకుండా ఎందుకు, ఎవరు అడ్డు పడుతున్నారో చూద్దాం.

క్యాన్సర్ అనేది B17 లోపమే గాని జబ్బు కాదు.

👌👍ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు.


మీకు గుర్తుందా? గతంలో అనే అంతుపట్టని వ్యాధితో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి స్కర్వీ (scurvy) అని పేరు పెట్టారు. విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు.


 అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా... అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు హాస్పిటల్స్ వాళ్ళు దోచుకున్నారు


 అది కేవలం విటమిన్ C వల్ల వచ్చిన రోగం.

క్యాన్సర్_కూడా_ఇలాంటిదే...అంటే విటమిన్ లోపమే క్యాన్సర్_అని_అర్ధం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీ లోనే ఉంటాయని చాల మంది డాక్టర్స్ కూడా చెపుతారు. అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది? 


మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన.


మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్ లో బ్రతుకుతున్న జీవితాల వల్ల, క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి... దాన్ని బిజినెస్ చేసారు కొంతమంది డాక్టర్స్.

మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని కొన్ని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఇప్పటిది కాదు... వరల్డ్ వార్ 2 తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా_చూసుకోవడమట, నివారణట. అసలు రాకుండా చెయ్యడం కాదు, అలా చేస్తే హాస్పిటల్స్ కి డబ్బులు రావు కదా.


   మీకు గాని.. మీకు తెలిసిన వాళ్లకు గాని క్యాన్సర్ అని లోపం

ఉంటె_కంగారు_పడాల్సిన_అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే...


   ఈ రోజుల్లో ఎవరైనా స్కర్వీ (scurvy) వ్యాధితో చనిపోతున్నారా? లేదు.... ఎందుకంటే దానికి కారణం విటమిన్ C లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిద్దికోవడం వల్ల.

   మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం.  ఆ_లోపాన్ని_కూడా_B17_తో_పోగొట్టుకోవచ్చు.


#క్యాన్సర్_రాకుండా_చేసుకోవడం_చాలసులువు!!


★15 నుండి 20 నేరెడు కాయలు..

★ క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్.

★ ఎండు ద్రాక్ష.

★ బాదాం పప్పు.

★ బ్లాక్ మల్బెర్రి, బ్లూ మల్బెర్రి, కోరిందకాయ స్ట్రాబెర్రి.

★ నువ్వులు, అవిసె గింజలు. 

★ ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు.

★ బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ ★ (పియర్ ఆపిల్)

★ నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి, 

★ జీడీపప్పు,పిస్తా.......      పైన చెప్పినవన్నీ 


అధిక_శాతంలో_విటమిన్_B17_కలిగిఉన్నవి.


ఈ లోపాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి.


గోధుమ_మొలకలు (Wheat Sprouts ) 


ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు.


రోజూ_ఒక_తులసి_ఆకు_తింటే_జీవితంలో ఎలాంటి క్యాన్సర్ లు దరిచేరవు..


Wheat Sprouts bud is a Rich Source of Liquid Oxygen and the strongest anti-cancer matter in the name of "laetrile", and this matter is present in the fruit stone of ఆపిల్ (ఆపిల్ గింజలు). Laetrile is the extract form of vitamin B17 (Amygdalin)


అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా, నిషేధించబడిన -  LAETRILE- ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లీమెంట్ చేస్తుంది (ఈ మందుని మెక్సికో లో తయారుచేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు)

Dr. హారొల్ద్ W.మన్నెర్ తన -డెత్ అఫ్ క్యాన్సర్- బుక్ లో క్యాన్సర్ ని -laetrile- ట్రీట్మెంట్ తో 90 శాతం వరకు నయం చేసారని వివరించారు.


క్యాన్సర్_రావడానికి_ముఖ్యకారణం_ఏంటో తెలిస్తే అవాక్కవుతారు అవేంటంటే

1) #వాష్_చెయ్యడానికి_వాడే_రసాయనాలు.

2) వాషబేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు.

3) టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే 

రసాయనాలు పీలచడం.


మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు. కానీ మీరు పీలుస్తున్నారంటే అది ఒకరకంగా తినడం లాంటిదే. మీరు మీ ప్లేట్స్ ని లిక్విడ్స్ తోనే వాష్ చేస్తున్నారు కదా? అలా ఎంత క్లీన్ చేసిన సరే.. ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్ లో అలానే ఉంటాయి. ఆ ప్లేట్ లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి. (పూర్వ కాలంలో ఆకులలో తినేది అందుకే కదా)


దీనికి_విరుగుడు_ఏంటో_తెలుసా ???

మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు.


మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి.


దయచేసి ఈ పోస్టుని అందరితో షేర్ చేయండి..!! 

ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా 

మీ శత్రువులతో కూడా షేర్ చేయండి...! 


క్యాన్సర్_బారిన_పడకుండా_అందరిని_కాపాడండి.

ధన్వంతరి జయంతి


                                                           ధన్వంతరి జయంతి

                                                   :శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని , ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం , బ్రహ్మవైవర్త పురాణం , హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.   దేవతలు , దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా , దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం , కామధేనువు , ఐరావతం , చంద్రుడు , శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరవాత అమృతకలశం , ఔషధులు , ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. ‘దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో , ఎర్రని కళ్లతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు , ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో , విశాలమైన వక్షస్థలంతో , సింహంవలె శక్తిని కలిగి అమృతభాండంతో అవతరించాడు’ అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది.

ధన్వంతరిని విష్ణువు ‘అబ్జుడు’గా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు. అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని , కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని , అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్తం పేర్కొంది.

సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతర కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం.

బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణజన్మ ఖండంలో ధన్వంతరి , మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి , అతడి శిష్యులు కైలాసానికి వెళ్తుండగా తక్షకుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహతప్పింది. ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతణ్ని తేరుకునేట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి , ద్రోణ , పుండరీక , ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు , బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేస్తారు.

అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారంచేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ , బాల , గ్రహ చికిత్సల గురించి , శలాక్య , శల్య , విష , రసాయన , వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వవైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని , అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.

చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావడం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్‌ సమీపంలో ‘ధన్వంతరి క్షేత్రం’ ఉంది.


ధన త్రయోదశి


ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం.  క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.


వెలుగు దివ్వెల పండుగైన దీపావళి పర్వదినానికి రెండురోజుల ముందు జరుపుకొనే ఉత్సవ విశేషం - ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా , యమ త్రయోదశిగా మనం జరుపుకొంటాం. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. దీపావళి గుజరాతీయు లకు సంవత్సరాది. ధన త్రయోదశి , నరక చతుర్దశి , దీపావళి , బలిపాడ్యమి , యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని , అత్యంత సంరంభంగా జరుపుతారు. 'చతుర్వర్గ చింతామణి' గ్రంథం ప్రకారం ధన త్రయోదశినాడు గోత్రిరాత్ర వత్రాన్ని చేసుకుంటారు. 'ఆమాదేర్ జ్యోతిషీ' గ్రంథం ధన త్రయోదశి గురించి విశేషంగా వివరించింది. 'ధన్ తేరస్' పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్య ప్రదాయక తరుణంగా భావిస్తారు.

ధన త్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరివరకూ కొనసాగుతుంది. అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి , పుష్పగంధాదులతో దాన్ని పూజించి ఇంటిముందు ఉంచుతారు. దీనినే యమదీపమంటారు. యమతర్పణం చేసి దీపదానం చేస్తారు. పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది. అందుకే ధన్ తేరస్ సాయంకాలాన తమ ఇంటిముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృ దేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం.

ధన త్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య , సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం ఉంది. దీనికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి , తన పాంచజన్య శంఖంతో , కామధేను క్షీరంతో , చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైందంటారు. అలాగే , శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా ఉండాలని దామోదరుణ్ని బలిచక్రవర్తి ప్రార్థించాడు. ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధన త్రయోదశినాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెబుతారు.

యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది. హిమవంతుడనే రాజుకు లేకలేక పుత్రుడు జన్మించాడు. ఆ రాకుమారుడు తన పదహారో ఏట , వివాహమైన నాలుగో రోజున పాముకాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు. దాంతో ఆ యువరాజు భార్య , తన భర్త ప్రాణాల్ని కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారం , వెండి , రత్నాల్ని రాశులుగా పోసి , ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథా రూపంలో గానం చేస్తుంది. యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికీ , బంగారం , వెండి ధగధగలకూ కళ్లు మిరుమిట్లు గొలిపాయి. కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోయి , వచ్చిన పని మరచి తెల్లారగానే తిరిగి వెళ్లిపోయాడని కథ. అందుకే స్త్రీల సౌభాగ్యానికీ , ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. ఈ రోజున వెండి , బంగారాల్ని కొని ధన లక్ష్మీపూజ చేస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి - ధన త్రయోదశి.

ఈ చతుర్దశినాటి అభ్యంగన స్నానం వల్ల , దీపదానం వల్ల , యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరకచతుర్దశి అని పేరని కొందరు అంటారు.

'చతర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చ

తషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:' అని శాస్త్ర వచనం.

'చతుర్దశి నాడు ఎవరు నరక లోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు అందరూ నరక లోకం నుండి స్వర్గలోకానికి పోవుదురు అని దాని తాత్పర్యం.


దంతేరాస్ పూజా విశిష్టత , ప్రాముఖ్యత..!

  

భారత దేశంలో ఎన్నో పండుగలుంటాయి వాటిలో కొన్ని ఒకరోజు కంటే ఎక్కువే జరుపుకుంటారు. నవరాత్రి , దీపావళి లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఈ పండుగలని అందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంతో జరుపుకుంటారు. ఆ సంవత్సరంలో పడ్డ బాధలూ , కష్టాలూ అన్నీ మర్చిపోయి బంధుమిత్రులతో ఈ పండుగలని సంతోషంగా జరుపుకుంటారు.  ధన త్రయోదశితో మొదలయ్యే హిందువుల ముఖ్య పండుగ అయిన దీపావళి ఐదు రోజుల పండుగ.

కృష్ణ పక్షంలో పదమూడవరోజున అక్టోబరు - నవంబరు లో వచ్చే కార్తీక మాసం వచ్చే ఈ త్రయోదశి దీపావళి మొదలవుతుంది. పదిహేనవ రోజు అమావాశ్య రోజున దీపావళి జరుపుకుంటారు. ఈ త్రయోదశి రోజున మీరందరూ కొత్త నగలూ లేదా ఏమైనా లోహాలూ కొనుక్కుంటారు కదా.  ముఖ్యంగా ఈరోజున బంగారం లేదా వెండి కొనడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అసలు ఈరోజున బంగారం ఎందుకు కొనాలని ఎప్పుడైనా ఆలోచించారా ?  అసలు ఈ త్రయోదశి విశిష్టత తెలుసా?  ప్రతీ పండగ వెనుక ఉన్న పరమార్ధాన్ని తెలుసుకుంటే కనుక ఆ పండగని మరింత శ్రద్ధాశక్తులతో జరుపుకోగలము.  ఇక ఈ త్రయోదశి విశిష్టత తెలుసుకుందామా ? దీపావళి షాపింగుకి బయలుదేరేముందు ధన త్రయోదశి విశిష్టత తెలుసుకోండి.


1. ధన్‌తేరస్ అని కూడా వ్యవహరిస్తారు ధన త్రయోదశిని. అనగా సంపద అని అర్ధం. చాలా మంది ఈరోజున తమ కుటుంబం సుఖ సంతోషాలూ , అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీ దేవినీ , గణపతినీ పూజిస్తారు. బంగారం , వెండిని కూడా మంగళప్రదంగా భావించి ఈ లోహాలని కూడా పూజిస్తారు.


2. లక్ష్మీ దేవికి స్వాగతం - సంపదకి గుర్తు లక్ష్మీ దేవి. అందుకే ఈరోజున అందరూ కొత్త వస్తువులనీ , నగలనీ , వెండి వస్తువులనీ కొంటారు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు.


3. యమ దీపం కధ - హీమ రాజు కుమారుడు పెళ్లయ్యిన నాలుగో రోజున పాము కాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసి పెట్టి ఉంది. తన భర్తని కాపాడుకోవటానికి ఆ యువరాజు భార్య ఆరోజు భర్తని నిద్ర పోనీయకుండా మెలకువతో ఉంచి , గది నిండా బంగారం , వెండి నాణాలు కుప్ప పోసి , మరో పక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతూ ఉంది. యువరాజు ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన యమ ధర్మ రాజుకి నాణేల కాంతి , దీపాల కాంతిలో ఏమీ కనపడదు. అందువల్ల ఆయన వెనుదిరిగివెళ్ళిపోతాడు. తెలివైన ఆ యువరాజు భార్య అలా ధన త్రయోదశి రోజున తన భర్త ప్రాణాలని కాపాడుగోగలిగింది. అందువల్ల ఆరోజు నుండీ ధన త్రయోదశిరోజున రాత్రంతా యమ ధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు.


4. అమృత మధనం కథ


దేవ దానవులు క్షీర సాగర మధనం చేసినప్పుడు ధనత్రయోదశి రోజున క్షీర సాగరం నుండి అమృతం బయటపడింది. అందువల్ల ధన త్రయోదశి నిష్టతో జరుపుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది.


5.  కుబేరుని   పూజ - యక్షుడైన కుబేరుడు సంపదకి అధిపతి.  ఈ రోజున కుబేరుణ్ణి పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా.


6.  పార్వతీ దేవి కథ - ధన త్రయోదశిని అల్లుకుని ఉన్న మరోక కదేమిటంటే తన పతితో పాచికలాడిన పార్వతీ దేవి మీద పరమ శివుడు విజయం సాధించాడు. ఈరోజున కనుక పాచికలూ , జూదం లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం.

ఇప్పుడు తెలిసిందా ధన త్రయోదశి యొక్క విశిష్టత ?  దీపావళి ముందు వచ్చే ఈ పండుగ భారత దేశంలో చాలా ముఖ్యమయినది. ఈరోజున కనీసం కొంచెం బంగారం లేదా వెండి కొంటారు. ఒక వేళ అవి కొనలేక పోతే కొత్త పాత్రలు కొని లక్ష్మీ దేవినీ, గణపతినీ పూజిస్తారు.

సేకరణ

నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ గా ఇలా త్రిపాఠి

 నల్గొండ : నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ గా ఇలా త్రిపాఠి


పదవీ బాధ్యతల స్వీకరణ. దిక్సూచి / నల్గొండ కలెక్టరేట్ నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా ఇలా త్రిపాఠి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సి. నారాయణరెడ్డి ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయగా,ఆయన స్థానంలో ( 2017) ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి ఇలా త్రిపాఠి ని నల్గొండ జిల్లా కలెక్టర్ గా నియమించింది.

Saturday, 26 October 2024

సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎందుకీ రచ్చ

   అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎందుకీ రచ్చ,.....


    • Nalgonda Cement Factory: వందల కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పాని నిర్ణయం జరిగిన ఒక పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది! నిరుద్యోగ సమస్యను కొంతైనా తగ్గించ వచ్చు. తమ పిల్లకు ఉద్యోగాలు వస్తాయి, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.         నల్గొండలో అదానీ గ్రూప్‌ ఏర్పాటు చేసే సిమెంట్‌ కంపెనీపై వివాదం
    • Nalgonda Cement Factory: ఉమ్మడి నల్గొం   డ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట లో అదాని గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ప్రజాభిప్రాయం కూడా సేకరించిన అంబుజా సిమెంట్స్ వివాదాస్పదం అవుతోంది. నల్లొండ జిల్లా పచ్చని పోలాల మధ్య అదాని మంటలు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 1400కోట్ల ప్లాంట్‌ తమకొద్దని నిరసన చెబుతున్నారు.
ఎందుకీ వివాదం..?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించాలని నాడు కొత్తగా ఏర్పాటైన టీఆర్ఎస్ ( ఇపుడు బీఆర్ఎస్ ) ప్రభుత్వం ఒక పాలసీని తీసుకుంది. తెలంగాణకు తీరప్రాంతం లేని కారణంగా ఏపీలోని క్రిష్ణా జిల్లా సరిహద్దుల్లోని కోదాడ, గుంటూరు జిల్లా సరిహద్దుల్లోని దామరచర్ల, జాతీయ రహదారిని, బీబీనగర్ నడికుడి ప్రధాన రైల్వే లైను ఆనుకుని ఉన్న చిట్యాల లేదా రామన్నపేటల వద్ద డ్రైపోర్ట్ నిర్మించాలని తలపెట్టింది.

ఈ ప్రతిపాదనల్లో ఏవీ కార్యరూపం దాల్చకున్నా, రామన్నపేట మండల కేంద్రానికి సమీపంలో డ్రైపోర్ట్ నిర్మాణానికి అవసరమైన 365 ఎకరాల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సేకరించింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డ్రైపోర్ట్ ఏర్పాటు అంశం అటకెక్కింది.

కానీ, 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రామన్నపేట వద్ద సేకరించిన భూమిని అదాని గ్రూప్ కు కేటాయించింది. తొలి ప్రతిపాదన మేరకు ఇక్కడ డ్రైపోర్టును నిర్మించాల్సి ఉండగా, కాలుష్యానికి ప్రధాన కారణంగా పేరున్న సిమెంటు ఫ్యాక్టరీ (అంబుజా బ్రాండ్ సిమెంట్)ని 70 ఎకరాలలో నెలకొల్పాలని నిర్ణయించుకోవడంతో వివాదానికి కారణంగా కనిపిస్తోంది.

పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారాలా..?
డ్రైపోర్ట్ నిర్మాణమంటే తమ భూములు ఇచ్చామని, ఇపుడు సిమెంటు ఫ్యాక్టరీ అంటే ఎందుకు అంగీకరిస్తామని రామన్నపేట సమీప 12 గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రామన్నపేట మండలం పరిధిలోని 24 గ్రామపంచాయతీల్లో పన్నెండు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయబోయే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రభావితం అవుతున్నాయి.          తాజాగా తలపెట్టిన ఫ్యాక్టరీ మూసీ నదికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇప్పటికే మూసీ కాలుష్యంతో సతమతమవుతున్న రైతులు, పులిమీద పుట్రలా మరో ఫ్యాక్టరీ వెదజల్లె కాలుష్యాన్ని తట్టుకోవడానికి సిద్దంగా లేరు. ఈ కారణంగానే సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టగా ప్రజలు తిరగబడ్డారు.

బుధవారం రామన్నపేటలో ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగం, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ ఏర్పాటు కాకుండా చూస్తామని ఈ ప్రాంత రైతులకు మద్దతుగా వచ్చిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని అడ్డుకునేందుకు వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, రవీంద్ర కుమార్ లను హౌజ్ అరెస్ట్ చేశారు.

డ్రైపోర్ట్ స్థానంలో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణం

నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదాని గ్రూప్ రామన్నపేట ప్రాంతంలో డ్రైపోర్టు నిర్మిస్తామని 2020లో భూసేకరణ చేసింది. కానీ, ఆ ప్రభుత్వ సమయంలో అడుగు ముందుకు పడలేదు. డ్రైపోర్ట్ నిర్మాణం అటకెక్కింది. కానీ, తాము సేకరించుకున్న భూమిని వినియోగించుకోవాలని కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది. అదాని చేతుల్లోకి వచ్చిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని నిర్ణయించుకుంది.             కానీ, ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతంలో సిమెంటు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు సున్నపు రాయి నిల్వలు లేవు. కానీ, ఇక్కడ తాము 6 మిలియన్ మెట్రిక్ టన్నుల సిమెంటును ఉత్పత్తి చేస్తామని అంబుజా పేర్కొంటోంది. నెల రోజుల కిందటే ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి గ్రామపంచాయతీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రామన్నపేటను ఆనుకుని ప్రధాన రైల్వే లైన్ ఉండడం వల్ల గూడ్స్ రైళ్ళ ద్వారా ముడి సరుకు తెచ్చుకుని మిక్సింగ్ ద్వారా సిమెంటును ఉత్పతి చేస్తామని అదాని గ్రూప్ నమ్మబలుకుతోంది.


రూ.100 కోట్ల విరాళం అందుకేనా..?

మరో వైపు రాజకీయ పార్టీలూ, ప్రజా సంఘాలు కొత్త వాదనను తెరపైకి తెచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల అదాని రూ.100 కోట్ల విరాళం అందజేశారు. రామన్నపేట వద్ద పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూమిలో కనీసం 65 ఎకరాలు వాడుకుని సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే ఈ విరాళం ఇచ్చారన్న విమర్శలను ఈ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


రామన్నపేట, కొమ్మాయి గూడం ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న కాలుష్య కారక సిమెంటు ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని, ఈ ప్రాంత ప్రజలు, రైతులకు మద్దుతుగా పోరాటాలు చేస్తామని చెబుతున్నయి.

ఐఏఎస్ అమోయ్ వెనుకున్న బడా వ్యక్తి ఎవరు ?


                 

ఐఏఎస్ అమోయ్ వెనుకున్న బడా వ్యక్తి ఎవరు ?

  :హైదరాబాద్ శివారులో వేయి కోట్లకుపైగా విలువైన భూదాన్ భూముల్ని ప్రైవేటుపరంగా చేసిన వ్యవహారంలో ఐఏఏస్ అమోయ్ కుమార్ ను వరుసగా మూడు రోజుల పాటీ ఈడీ విచారించింది. ఏదో లింక్ దొరకబట్టే ఆయనను వదిలి పెట్టకుండా ప్రశ్నిస్తోందని గుసగసలు వినిపిస్తున్నాయి. ఆ లింక్ ఏమిటన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.

అమోయ్ కుమార్ .. భూదాన్ భూముల్ని కొంత మందికి వారసత్వ భూమి అని రాసిచ్చేశారు. కింది స్థాయి నుంచి అనుకూలంగా దానికి నివేదికలు వచ్చేలా చూసుకున్నారు. చివరికి ఆ భూములు కట్టబెట్టిన వాళ్లు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్ముకున్నారు. మొత్తంగా రెండు భారీ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. అందులో అమోయ్ కుమార్ కు ఏమైనా అందాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఐఏఎస్ అధికారులు తమ సొంత లాభం కోసం ఇలా అడ్డగోలు భూలావాదేవీలు చేయరు. ఖచ్చితంగా రాజకీయ నేతల ప్రమేయం ఉంటేనే చేస్తారు. ఆ విధంగా చూస్తే అమేయకుమార్ వెనుక ఎవరు ఉన్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది.

ఈ విషయంలో ఈడీ చాలా గోప్యంగా విచారణ జరుపుతోందని .. త్వరలో కీలక వ్యక్తుల గురించి బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులే అమేయ్ కుమార్‌తో ఈ తరహా స్కామ్ చేయించారనికాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా ప్రచారం చేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

Friday, 25 October 2024

ఆర్యవైశ్య సంఘం కొత్తపేట, మెగా హెల్త్ క్యాంప్

ఆర్యవైశ్య సంఘం కొత్తపేట, లైన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట మరియు మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి మెగా హెల్త్ క్యాంప్ లో క్యాన్సరు, ఈసీజీ, బిపి ,షుగర్, కంటి మరియు



























పంటి పరీక్ష లో 250 మంది పైన పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపుకు అతిథులుగా బుగ్గారపు దయానంద్ గారు ఎమ్మెల్సీ ,హిందూ బంధువు టైగర్ చీకోటి ప్రవీణ్ గారు, సామాజిక సేవా తత్పరులు మొగుళ్ళపల్లి ఉపేందర్ గారు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు పవన్ కుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు వజీర్ ప్రకాష్ గౌడ్ గారు, మా చీఫ్ అడ్వైజర్స్ అయినా ఎల్వీ కుమార్ గారు, మంచుకొండ సురేందర్ గారు,  అడ్వైజర్ బిల్లా కంటి రాజుగారు భారతీయ జనతా పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ బుక్క రమేష్ గారు ,వి బి జి మడిపడిగే రాజు గారు సోదరీమణులు సరాఫ్ తులసి గారు జయశ్రీ గారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ సంఘ అభివృద్ధికి పాల్పడుతున్నటువంటి అధ్యక్షులు మాడూరి వాసు గారు ,జనరల్ సెక్రెటరీ సత్తయ్య గారు, ఈ యొక్క ప్రాజెక్టు చైర్మన్ రేణిగుంట శ్రీనివాస్ గారు, ట్రెజరర్ ప్రభాకర్ గారు, జాయింట్ సెక్రెటరీ అరవ పెళ్లి శ్రీనివాస్ గారు ,సంఘ సభ్యులు బుగ్గారపు వెంకటేశ్వర్ గారు, చంద్రకాంత్ అడ్వకేట్
గారు ,సోమ అనంత రాములు గారు ,అమర్నాథ్ గారు, వీర లింగం గారు, నాగభూషణం గారు ,మిగతా సంఘ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని వాటికి మా చేయూతనిస్తామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి భోజన సదుపాయానికి చేయూతనిచ్చినటువంటి ఎల్ వి కుమార్ గారికి మరియు అతిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట జై వాసవి జై జై వాసవి