సర్వే సంస్థలకే వణుకు పుట్టిస్తోన్న ఏపీ ఫలితo
జకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఏపీలో ఎన్నికల్లో స్థానికత, సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కులాల మీద ఏపీలో ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ముందే ఓ అంచనాకు వస్తుంటారు. సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటిస్తాయి. ఇప్పటి వరకు వెలువడిన సర్వేలు కొన్ని వైసీపీకి అనుకూలంగా చెప్పగా, మరికొన్ని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు.ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు. గతంలో మాదిరిగా సర్వే సంస్థలు ఫలితం ఎలా ఉండబోతుంది అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా అడ్డుగా ఉండడంతో, సర్వే సంస్థలు తమ నివేదికను తెలియజేయడానికి వెనకడుగు వేస్తున్నాయి.కానీ తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే నిబంధనలు ఉన్నా పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఎగ్జిట్ పోల్స్ సర్వే పేరుతో కాకుండా, అధ్యయనం అంచనాలంటూ పేర్లు మార్చి వెల్లడించారు.కానీ ఏపీ ఫలితాలను మాత్రం వెల్లడించడానికి అన్ని సర్వే సంస్థలు వెనకాడుతున్నాయి.
ఇతర రాష్ట్రాలకు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది.ఏపీలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. వ్యక్తిగత కక్షలు, రాజకీయ దాడులు ఎక్కువ కనిపించాయి.దీంతో సర్వే సంస్థలు కూడా కాస్త ఆలోచనలు పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే జనాల నాడి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో సర్వే సంస్థలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి.మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్త చేస్తున్నాయి.గతంలో వచ్చిన 151 స్థానాలకు మించి స్థానాలు దక్కుతాయని వైసీపీ ధీమాగా చెబుతుండగా, కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు మెజార్టీ సీట్లు తామే దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. మరి ఎవరి అంచనాలు నిజం అవుతాయో జూన్ 4న చూడాలి.
No comments:
Post a Comment