రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన 144 సెక్షన్..
:నాలుగో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో భాగంగా తెలంగాణలో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. దీంతో రాష్ట్రంలో మైకులు మూగబోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో 144 సెక్షన్ తో పాటు మద్యం షాపులు కూడా బంద్ అయ్యాయి. మద్యం షాపులు సోమవారం సాయంత్రం తిరిగి ఓపెన్ అవుతాయి. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, న్ 1న చివరి విడత పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4 ప్రకటించనున్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ సోమవారం నిర్వహించనున్నారు. 35,809 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు జగన్, చంద్రబాబు, పవన్ ఓటు వేసేది ఎక్కడ..!! 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. లోక్ సభ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా చెప్పారు. ఎన్నికల భద్రత కోసం 73 వేల 414 సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు, 164 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, తమిళనాడుకు చెందిన మూడు స్పెషల్ ఆర్మ్ ఫోర్స్, 7000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం రవాణాను నిరోధించడానికి ప్రత్యేకంగా మొబైల్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక జరిపిన తనిఖిల్లో 184 కోట్ల విలువైన నగదు మద్యం డ్రగ్ పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment