శ్రీవారి భక్తులకు అలర్ట్, అలా చేస్తే ?, ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
దర్శనానికి ఎన్నిగంటలు పట్టిందా అనేది కాదు సమస్య, స్వామి దర్శనం అయ్యిందా లేదా అనేదే లెక్క అని శ్రీవారి భక్తులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని శ్రీవారి భక్తులు ప్రతినిత్యం తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజల కోసం రూ. 300 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
మామూలుగా సర్వదర్శనం టోకన్లు కూడా తిరుపతిలో భక్తులు ఇస్తుంటారు. సర్వదర్శరం టోకన్లు లేని భక్తులు తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంఫ్లెక్స్ లో గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారిని త్వరగా దర్శనం చేసుకోవాలి అనుకుంటున్న భక్తులను తిరుమలలో కొందరు దళారులు శ్రీవారి భుక్తులను బయటే నిలువుదోపిడీ చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేయిస్తామని నమ్మించి నిలువు దోపిడీలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన శివరామక్రిష్ణ అనే వ్యక్తి తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాలని ప్రయత్నించారు. ఆ సమయంలో తిరుపతికి చెందిన దళారులు అమరనాథ్, వినోద్ కుమార్, పూలశేఖర్ అనే ముగ్గురు శివరామక్రిష్ణను సంప్రధించారు. తిరుమలలో మీకు త్వరగా స్వామి దర్శనం చేయిస్తామని నమ్మించి శివరామక్రిష్ణ దగ్గర రూ. 20 వేలు తీసుకుని అక్కడి నుంచి మాయం అయ్యారు.మోసం జరిగిందని గుర్తించిన భక్తులు శివరామక్రిష్ణ తిరుమల విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తిరుమల టూటౌన్ పోలీసులు దళారులు అమరనాథ్, వినోద్ కుమార్, పూలశేఖర్ ను గురువారం రాత్రి అరెస్టు చేశారు. నిందితులు తిరుమలలోని లక్ష్మీశ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారని, ఇప్పటి వరకు నిందితులు వందలాది మంది శ్రీవారి భక్తులను మోసం చేశారని పోలీసు అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment