Thursday, 30 May 2024

10లోగా రుతుపవనాలు.. 11 నాటికి తెలంగాణ అంతటా నైరుతి విస్తరణ

 


 10లోగా రుతుపవనాలు.. 11 నాటికి తెలంగాణ అంతటా నైరుతి విస్తరణ

 

నైరుతీ రుతుపవనాలు ముందే వచ్చాయి. గురువారం ఉదయం మాన్‌సూన్‌ లక్షద్వీప్‌ మీదుగా కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. జూన్‌ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది.

  • చల్లని కబురు చెప్పిన భారత వాతావరణశాఖ
  • జూన్‌ 1 -3 మధ్య వివిధ జిల్లాలకు వర్షసూచన

            నైరుతీ రుతుపవనాలు ముందే వచ్చాయి. గురువారం ఉదయం మాన్‌సూన్‌ లక్షద్వీప్‌ మీదుగా కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. జూన్‌ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. అంతకుముందే జూన్‌ 1 నుంచి మూడు రోజులపాటు పలుజిల్లాల్లో వర్షాలు పడుతాయని తెలిపింది.

                         హైదరాబాద్‌,: రాష్ట్ర రైతులకు, ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్‌ 10లోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొన్నది. నైరుతి రుతుపవనాలు గురువారం ఉదయం కేరళ తీరాన్ని తాకాయని వాతావరణ కేంద్రం తెలిపింది. లక్షద్వీప్‌ మీదుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని చెప్పింది. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, నైరుతి, మధ్య బంగాళాఖాతం,పశ్చిమ బెంగాల్‌, సికింలోని పలు ప్రాంతాల్లోకి రాబోయే రెండు మూడు రోజుల్లోనే విస్తరిస్తాయని వాతావరణశాఖ పేర్కొన్నది. నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు, జూన్‌ 10 లోగా తెలంగాణకు రుతుపవనాలు చేరుకుంటాయని వాతావరణశాఖ అధికారి డాక్టర్‌ శ్రావణి తెలిపారు. జూన్‌ 11 వరకు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో జూన్‌ 1 నుంచి మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొన్నారు.

కేరళతో పాటు ఈశాన్య రాష్ర్టాలకూ…

కేరళతో పాటు ఈశాన్య రాష్ర్టాలకు కూడా రుతుపవనాలు విస్తరించాయి. సాధారణంగా జూన్‌ 1న కేరళను రుతుపవనాలు తాకుతాయి. తర్వాత జూన్‌ 5న ఈశాన్య రాష్ర్టాలకు విస్తరిస్తాయి. అయితే, రుతుపవనాలు వచ్చే సమయంలోనే బంగాళాఖాతంలో ఏర్పడ్డ రెమాల్‌ తుఫాను ప్రభావంతో ఈశాన్య రాష్ర్టాలకు ముందుగానే రుతుపవనాలు చేరాయి. ఇలా ఒకేసారి కేరళకు, ఈశాన్యానికి రుతుపవనాలు రావడం అరుదుగా జరుగుతుంది. ఇంతకుముందు 1991, 1995, 1997, 2017లో ఇలా జరిగింది.

No comments:

Post a Comment