Monday, 13 May 2024

రాష్ట్రంలో 70 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందన్న వికాస్ రాజ్..!

 రాష్ట్రంలో 70 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందన్న వికాస్ రాజ్..! 


:                    { తెలంగాణలో జరుగుతూన్న లోక్ సభ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ అంచనా వేశారు. ఆయన ఎస్ఆర్ నగర్ లోని ఆదర్శ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఓటర్లు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నట్లు చెప్పారు. ఓటు హక్కు ఉన్నవారు బాధ్యతగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్లలో భారీ సంఖ్యలో క్యూలైన్లు ఉన్నట్లు చెప్పారు. ఓటర్లు భారీగా తరలొచ్చు ఓటు వేస్తున్నట్లు వివరించారు. ఆదివారం మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కాస్త లేట్ అయినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారని చెప్పారు. అనంతరం మెయిన్ పోలింగ్ ప్రారంభమైందిని పేర్కొన్నారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు నగిరిలో నగరానా, రోజా చెవిలో పువ్వులు పెట్టిన సొంత పార్టీ క్యాడర్ ?, ఎక్కడ చూసినా అదే టాపిక్ ! ఎక్కడైనా సమస్య ఉంటే 1950కి ఫిర్యాదు చేయాలన్నారు. మాదాపూర్ లోని వేంకటేశ్వర ఫైన్ ఆర్ట్ కాలేజ్ పోలింగ్ స్టేషన్ నంబర్ 431 లో హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ కుటుంబ సభ్యుల తో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మొఘల్ పుర హరిబౌలి రైఫాయం స్కూల్ 5 పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది.

No comments:

Post a Comment