: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రస్తుతం నిశ్శబ్ద యుద్ధం కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 144సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇక ఇదే సమయంలో జూన్ 1వతేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఏపీలో 175అసెంబ్లీ స్థానాలతో పాటు 25లోక్సభ స్థానాలకు మే 13న జరగనున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన తెలిపారు. తెలంగాణలో పట్టుబడిన నగదు కంటే ఏపీలో పట్టుబడిన తక్కువ నగదు ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పట్టుబడిన నగదు వివరాలను వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో పట్టుబడిన నగదు కంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ నగదు పట్టుబట్టడం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కేవలం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు రెండు కొనసాగుతున్నాయి. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు గెలవాలంటే అలా చెయ్యాలి.. ఇప్పుడు అన్ని రాజకీయపార్టీల ఫోకస్ పోల్ మేనేజ్మెంట్ పైనే!! ఏపీలో ఇప్పటివరకు 269. 28 కోట్ల రూపాయల నగదు స్వాధీనం ఏపీ రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలలో మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 269. 28 కోట్ల రూపాయల నగదు, నగలు, మద్యం, ఉచితాలు తదితరాలు పట్టుబడినట్లు ఆంధ్రప్రదేశ్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలోనూ 216. 34 కోట్లు నగదు, నగలు, మద్యం, ఉచితాలు పట్టుకున్నట్టు ఈసీ ప్రకటించింది. తెలంగాణాలో 320 కోట్ల రూపాయల నగదు స్వాధీనం 2014 ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల సందర్భంగా పట్టుబడుతున్న నగదు పెరుగుతూనే వస్తుంది.ఇదిలా ఉంటే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కేవలం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొత్తం సుమారు 320 కోట్ల రూపాయల నగదు, నగలు, మద్యం, ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఏపీలో జోరుగా ధన ప్రవాహం ఉందన్న చర్చ .. కానీ పట్టుబడిన తక్కువ నగదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ నియోజకవర్గానికి 75 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టు, ధన ప్రవాహం జోరుగా సాగుతుందని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రం కంటే ఏపీలో తక్కువ మొత్తంలో నగదు పట్టుబట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
No comments:
Post a Comment