Thursday, 2 May 2024

మేం మీకు వ్యతిరేకం కాదు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

          

మేం మీకు వ్యతిరేకం కాదు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, పథకాల విషయంలో అందరరూ సమానమేనని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

                     బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, పథకాల విషయంలో అందరరూ సమానమేనని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ.. ట్రాక్టర్ నడుపుతున్న ఓ ముస్లిం వ్యక్తిని ఆప్యాయంగా పలకరించారు. ఆయన మాట్లాడుతూ.. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. మేము ప్రవేశపెట్టిన ఏ పథకంలోనైనా అందరినీ సమానంగా పరిగణిస్తామని చెప్పారు.

అది ఉచిత రేషన్ ఇచ్చినా, బ్యాంకు ఖాతాలు ఇచ్చినా, బాత్ రూంలు ఇచ్చినా అందరికీ సమానంగానే ఇచ్చామని, ఉత్తరప్రదేశ్‌లో 40 లక్షల మందికి ఇళ్లు ఇస్తే అందులో 31% ముస్లింలకు కేటాయించబడ్డాయని, అలాగే 20 వేల నుంచి 20 లక్షల వరకు అవసరమైన వారికి ముద్ర రుణాలు అందించబడ్డాయని అందులో కూడా 36% రుణాలు ముస్లింలకు ఇవ్వబడ్డాయని తెలియజేశారు. మేం వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ వాళ్లు మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటే బీజేపీ ముస్లింలను ఆదుకుంటుందని తెలిపారు. ఈ విషయాలు మీ మిత్రులకు కూడా చెప్పాలని, మోడీ మళ్లీ వస్తారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. 

No comments:

Post a Comment