Monday, 13 May 2024

తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వర్షాలు..!

        


 తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. మే 18 అంటే శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మెదక్ మినహా మిగతా జిల్లాల్లో వానలు పడే అకాశం ఉందని వివరించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 16న మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురుస్తాయని ఐఎండి హైదరాబాద్ పేర్కొంది. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు ఏపీపై వారణాశిలో జోస్యం చెప్పిన చంద్రబాబు శనివారం నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెం, భువనగిరి, మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల్, వనపర్తి, ఖానాంబ గద్వాల్, వనపర్తి, ఎన్. కొత్తగూడెంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా.. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. Rains Alert.. రానున్న ఐదు రోజులపాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు | Oneindia Telugu తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లాలో 32.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. హైదరాబాద్, బండ్లగూడలో గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. IMD హైదరాబాద్ అంచనా వేసిన వర్షపాతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతను మరింత తగ్గించే అవకాశం ఉందని తెలిపింది.

No comments:

Post a Comment