algonda: ముగ్గురు తహసీల్దార్లు అరెస్టు! అసైన్డ్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని నల్లగొండ జిల్లా నిడమనూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు, ఓ వీఆర్‌వోను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్‌మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే గతంలో పలువురికి పట్టాలు చేశారు.నల్లగొండ జిల్లాలో అసైన్డ్ కేటాయింపులో అక్రమాలు
అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్.. తర్వాత రిమాండ్
నిడమనూరు, మే 29: అసైన్డ్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని నల్లగొండ జిల్లా నిడమనూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు, ఓ వీఆర్‌వోను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్‌మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే గతంలో పలువురికి పట్టాలు చేశారు. ఇందులో అప్పటి వీఆర్వో వద్ద బినామీగా ఉన్న వ్యక్తి భార్య, తండ్రి పేరిట అక్రమంగా పట్టా చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. మార్తివారిగూడేనికి చెందిన పలువురు ప్రభుత్వ భూములను పట్టాలు చేయించుకున్నారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో మార్తివారిగూడెం వాసి, న్యాయవాది మార్తి వెంకట్‌రెడ్డి రెండేళ్ల క్రితం హైకోర్టులో పిల్ వేశారు.
స్పందించిన కోర్టు సమగ్ర విచారణ చేసి వివరాలు సమర్పించాలని కోరింది. కాగా, అప్పటి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ విచారణకు ఆదేశించారు. 2022లో నిడమనూరు పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం నల్లగొండకు బదిలీ చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సమగ్రంగా విచారించా రు. నిడమనూరులో అప్పట్లో పనిచేసిన మందడి నాగార్జునరెడ్డి (ప్రస్తుతం హుజూర్‌నగర్ తహసీల్దార్), గుగులోతు దేశ్యానాయక్, ఏఆర్ నాగరాజు అనే ముగ్గురు తహసీల్దార్లతో పాటు తుమ్మడం వీఆర్‌వోగా ఉన్న ముదిగొండ సుమన్, అక్రమంగా భూములు పొందిన నలుగురిని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది
No comments:
Post a Comment