రోజూ బీరు తాగుతున్నారా?.. అవి బలంగా మారతాయి
By Garikapati Rajesh
: నాన్ వెజ్ ఎక్కువగా తినేవారికి ప్రతిరోజు ముక్క ఉండాల్సిందే. ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాగే మందుబాబులకు కూడా చుక్క పడందే నిద్ర పట్టదు. కొందరు బాధలను మర్చిపోవడానికి తాగుతుంటారు. మరికొందరు మాత్రం ప్రతిరోజు ఆరోగ్యానికి మంచిదని బీరు తాగుతుంటారు. అయితే రోజూ బీరు తాగడంవల్ల ఎటువంటి లాభాలున్నాయి.. ఎటువంటి నష్టాలున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఎముకల సాంద్రత పెరుగుతుంది ప్రతిరోజు బీరు తీసుకుంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది. స్త్రీ, పురుషులిద్దరికీ మేలు చేస్తుంది. బీరు తాగడంవల్ల ఎముకలు బలంగా మారతాయి అయితే ప్రతిరోజు తీసుకోకుండా వారానికి ఒకసారో లేదంటే రెండుసార్లో తీసుకోవాలి. రోజూ తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ డైటింగ్ చేస్తుంటారు. అయితే వీరు బీరు తీసుకుంటే ఆ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ప్రతిరోజు బీరు తాగితే నిద్రలేమి వస్తుంది.
:నిద్రలేమి కలుగుతుంది చాలామంది బీరు తీసుకోవడంవల్ల నిద్ర పడుతుందని భావిస్తారు. కానీ అది రివర్స్ లో జరుగుతుంది. నిద్రలేమి సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంటుంది. మెదడు సరిగా పనిచేయదు. పనితీరు మందగిస్తుంది. పేగులకు నష్టం వాటిల్లుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వారానికి ఒకసారే తాగాలని చెబుతున్నారు. యూరోపియన్ దేశాల్లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం మితమైన బీరు తీసుకోవడమనేది గుండె జబ్బుల ప్రమాదాన్ని 31 శాతం తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు మద్యపానం చేసేవారు కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం నుంచి ఉత్పన్నమయ్యే అతి పెద్ద సమస్యల్లో ఇది కూడా ఒకటి. మితమైన మద్యపానం తర్వాత జీవితంలో టైప్-2 మధుమేహ అభివృద్ధిని నిరోధించవచ్చు
No comments:
Post a Comment