Sunday, 5 May 2024

100 కోట్లతో ట్రస్ట్, ఉచిత కోచింగ్ సెంటర్లు, ఫ్రీ ఫంక్షన్ హాల్స్-బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హామీలు

 

మెదక్ లోక్ సభ స్థానంలో విజయం సాధించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డి హామీల వర్షం కురిపిస్తున్నారు. రూ.100 కోట్ల ట్రస్ట్ ఏర్పాటు, నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్లు, బీఆర్ఎస్ కేడర్ కు ఉచిత ఫంక్షన్ హాల్స్ కట్టిస్తామని హామీలు ఇచ్చేశారు.

                :


 మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి.వెంకట్రామి రెడ్డి(P Venkatrami Reddy), తనను ఎంపీగా గెలిపిస్తే సొంతంగా రూ 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే నియోజకవర్గ ప్రజలు మాత్రం తాను నిజంగా వందకోట్లు తో ట్రస్ట్ ఏర్పాటు చేస్తాడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వందకోట్లు(100 Crore Trust) వెంకట్రామి రెడ్డి ఎక్కడి నుంచి తెస్తారనే సందేహం కూడా ప్రజల్లో ఉంది. తన ప్రచారంలో భాగంగా, వెంకట్రామి రెడ్డి తన కుటుంబ వ్యాపారం (తన కుటుంబానికి రాజపుష్ప(Rajapushpa) అనే పెద్ద నిర్మాణ సంస్థ ఉంది) నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వంద కోట్లు తప్పకుండా ఖర్చు పెడతానని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలో(Elections) బరిలో ఉన్న, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు(Neelam Madhu), రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో, ప్రభుత్వ సహాయంతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడతానని హామీలు గుప్పిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి, మాధవనేని రఘునందన్ రావు(Raghunandhan Rao) మాత్రం మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేయటం కోసం తనను గెలిపించాలని కోరుతున్నారు.

ఉచిత కోచింగ్- యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం

ఎక్కడ అధికారంలో లేని బీఆర్ఎస్(BRS) పార్టీ హామీలు ఇవ్వలేని పరిస్థితిల్లో, వెంకట్రామిరెడ్డి సొంతంగా వంద కోట్లు ఖర్చు పెడతానని హామీ ఇచ్చి ఓటర్లను ఆకర్షిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్(Govt Jobs Preparation) అవుతున్న యువతకు మెదక్(Medak Lok Sabha Constituency) లోక్ సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత కోచింగ్ సెంటర్ లు పెట్టి నిపుణలచే కోచింగ్(Coaching) ఇప్పిస్తాని ప్రచారం చేస్తూ యువ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యువతను ఆకట్టుకోవాలనే లక్ష్యంతోనే ఈ హామీ ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో ఊపు తేవడానికి, మెదక్ లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు ఫంక్షన్ హాల్స్ ను కట్టించి, కేడర్ కు ఉచితంగా ఫంక్షన్స్ చేసుకునే ఏర్పాటు చేస్తానని వెంకట్రామిరెడ్డి హామీలు ఇస్తున్నారు.

ఫంక్షన్ హాల్స్ కట్టిస్తా

ఒక్క ఫంక్షన్ హాల్(Function Halls), సకల హంగులతో సుమారు రెండు కోట్ల వ్యయంతో కట్టిస్తానని వెంకట్రామిరెడ్డి(Venkatrami Reddy) ప్రకటించారు. తాను ఇంతకు ముందు అధికారిగా, వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు, పేదకుటుంబాలను ఆదుకోవటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాననేది కూడా వివరిస్తూ, తాను తప్పకుండా ఈ హామీలు నెరవేరుస్తానని వెంకట్రామి రెడ్డి ఓటర్లను నమ్మబలుకుతున్నాడు. తాను సంపాదించుకోవడం కోసం, రాజకీయాల్లోకి రావటంలేదని, ప్రజలకు సేవ చేయటంకోసమే వస్తున్నానని వివరిస్తూ అన్నివర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ (Medak)నియోజకవర్గంలో వెంకట్రామి రెడ్డి హామీలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

No comments:

Post a Comment